ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -13
6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ -3
34 వ ఏట మేల్విల్లీ తన ప్రతిభా సర్వస్వం అయిన ‘’మోబీ డిక్ ‘’నవల రాయటం ప్రారంభించాడు .ప్రసిద్ధ రచయిత నథానియల్ హతారన్ తో గొప్ప స్నేహమేర్పడింది .ఆయన ను ఆదర్శం గా తీసుకొన్నాడు .ఇద్దరు బాగా సన్నిహితులయ్యారు .మేల్విల్లీకి పెద్దన్నగా సలహాలిస్తూ మార్గ దర్శిగా ఉండేవాడు హతారన్ .కస్టపడి రాసిన మోబీ డిక్ నవల 185 లో విడుదలైంది .ఇలాంటి పుస్తకం అమెరికన్ సాహిత్యం లో అంతకు ముందెన్నడూ రాలేదు .ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది.బైబిల్ లోని ‘’call me Ismaaelఅనే వాక్యాన్నిమొదటి వాక్యం గా అర్ధ వంతం గాఉపయోగించాడు .ఇస్మాయిల్ అనే వాడు ప్రపంచం లోని అసంత్రుప్తి అశాంతి లనుండి పారిపోతూ అన్నమాట అది .ఆ ప్రయాణం లో ఆత్మ హననం కూడా ఉంది .ఆహాబ్ అనే పాత్ర తనకాలికి గాయం చేసిందనే పగా ప్రతీకారం తో తెల్ల వేల్ ను చంపటానికి సిద్ధ పడతాడు .కాని ఆ తిమింగిలమే ఆహాబ్ ను చంపేస్తుంది .వాడి నౌక కూడా నాశన మవుతుంది .నౌకలో మిగిలిన ఒకే ఒకడైన ఇస్మాయిల్ ఈ కదా అంతా చెప్పటానికి మిగిలి ఉంటాడు .
చరిత్ర చర్విత చర్వణం అవుతుందనే గొప్ప ఫిలాసఫీ ఈ నవలలో పోదిగాడు .నవలలో లొపాలి అనేకం ఉన్నా ఈ తరహా కదా,కధనం కొత్తది అవటం తో గొప్ప విజయాన్ని సాధించింది .Melvilllle has great genius ,but little telent ‘’అన్నారు కొందరు .కాని మోబీ డిక్ లోని ఎపిక్ లక్షణాన్ని ఎవరూ కాదనలేదు .దానికి అదే సాటి అనిపించింది .మోబీ డిక్ పరమోత్క్రుస్ట ,మరమోన్నత నవల గా చరిత్రలో మిగిలిపోయింది .కొద్ది మంది విమర్శకులు కొందరు అభిమానులకు ఈ నవల నచ్చలేదు .వాళ్ళంతా ‘’టైపీ’’వంటినవలె మళ్ళీ రాస్తే బాగుండు ననిపించింది .న్యు మంత్లీ మేగజైన్ ‘’mad as a March hare .gibbering ,screaming ‘’అని ఈసడించింది .
తన శక్తి సర్వస్వం ఖర్చు చేసి మేల్విల్లీ మోబీ డిక్ రాశాడు .ఇక ఆయనలో ఏమీ మిగలలేదు .శక్తి తో పాటూ ఆరోగ్యమూ తగ్గిపోయింది అప్పులూ వెంబ డి౦చాయి .ఇక తాను బతకటానికి ఆదాయం తెచ్చే ఏ రచనా చేయలేనేమోననే నిరుత్సాహం ఆవరించింది .విధి వెక్కిరిస్తోందని అనిపించి ‘’Dollars damn me and the malicious Devil is forever grinning in upon me ,holding the door ajar ‘’అని బాధ వెల్ల గక్కాడు .బుద్ధి పెట్టి రాస్తే ప్రభుత్వం బాన్ చేస్తోంది అన్నాడు .చేతిలో డబ్బు ఆడటం లేదు డబ్బు అవసరాలు ఎక్కువైనాయి. ఏడోనవల ‘’పియర్రీ ఆర్ ది యామ్బిగ్యుటీస్ ‘’మొదలు పెట్టాడు రెండోకొడుకు పుట్టాడు . ఈ నవలలో ఒక తల్లీ కొడుకు ఉంటారు వారిద్దరూ అక్కా తమ్ముడు లాగా ఉండటం ఇందులో ప్రత్యేకత .ఎవరికీ ఆనలేదు .అప్పు చేసి మామ గారు చెప్పిన చోట ఒక వ్యవసాయ క్షేత్రాన్నిపిట్స్ ఫీల్డ్ దగ్గరే కొని అందులోనే పదహారేళ్ళున్నాడు .ఉన్నత హిమాయ శృంగం లాంటి మోబీ డిక్ నవల ముందు పియర్రీ ఒక పిగ్మాలియన్ అయిన్దిపాపం ఆర్ధికం గా ఏమీ లాభించనూలేదు .దీనితో మెల్వి ఉత్కృష్ట దశ పతనారంభమైంది . తరువాతి నలభై ఏళ్ళూఅసౌకర్యం గా అసంతృప్తిగా అశాంతిగా బతికాడు .ఒంటరి తనం లో ఉండిపోయాడు .
దీనికి తోడూ సయాటిక్ రుమాటిజం వ్యాధి పీల్చేస్తోంది.నరాల బలహీనతా పట్టుకోంది..పెద్ద కొడుకు పద్దేనిమిదేల్లకే ఆత్మా హత్య చేసుకోవటం తో దిగాలు పడిపోయాడు .మేల్విల్లీ సృజన అంతా అతని 26-31 ఏళ్ళ వయసులోనే జరిగి వట్టిపోయింది .’’ది కాన్ఫిడెన్స్ –మాన్ ‘’అనే నవలా కొన్ని చిన్న కధలు రాశాడు .రాయాలనే కోరిక పూర్తిగా నశించింది .మానసికానందం కోసం మామగారిచ్చిన డబ్బుతో గ్రీస్ టర్కీ ఈజిప్ట్ ఇటలీ ఇంగ్లాండ్ లు సందర్శించాడు .లెక్చర్లు ఇచ్చి ఏదైనా’’ఒడుక్కు౦దా’’మను కొని ప్రయతించి విఫలుడైనాడు .వచనం వదిలి అదృష్టాన్ని కవిత్వం లో వెతుక్కోన్నాడు .ఆ ప్రయత్నమూ బెడిసికొట్టింది .అసలైన అవగాహన లేకుండా రాసి అభాసు పాలయ్యాడు .రెండు వందల కవితలు రాశాడు .అందులో వేళ్ళమీద లెక్కించ దగినవి మాత్రం మీరు మిట్లు గొలిపాయి .తన సంత్రుప్తికోసమే కవిత్వం రాసుకొన్నాడు .
47 వయసులో కస్టమ్స్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది .న్యూయార్క్ కు కుటుంబం మార్చాడు.బాగా కష్టమైన పనే .కానీ ఏమీ అనకుకోకుండా చేశాడు .దీనిలో 25 ఏళ్ళు అలాగే బండీ లాగాడు .వయసు అరవై ఏడు వచ్చింది .భార్య అతని పరిస్తితి అర్ధం చేసుకొని ఉద్యోగం మానేసి మళ్ళీ గ్రంధ పఠనం పై ద్రుష్టి పెట్టమని సలహా ఇచ్చింది .మనుమలు పుట్టారు .చరమాంకం లో బెర్మూడా కు యాత్రగా వెళ్ళాడు .’’జాన్ మేరీ అండ్ ఆదర్ పోయెమ్స్’’రాసి ప్రచురించాడు .ఇదే ఆఖరి రచన .గుండె వ్యాకోచం తో మేల్విల్లీ 28-9-1891 న72 వ ఏట మరణించాడు .పేపరు వాళ్ళు ఆయన చావు గురించి ‘’death of a once popular author’’అని మాత్రం రాసి ఇంకు దులుపుకొన్నారు .
మేల్విల్లీ చనిపోయిన పాతిక సంవత్సరాల వరకు ఆయన అభిమానులు తప్ప ఎవరూ ఆయన్ను గుర్తుపెట్టుకోలేదు .1921లో వీవర్ అనే రచయిత ఒక పబ్లిషర్ ను బ్రతిమిలాడి ‘’హీర్మాన్ మేల్విల్లీ –మారినర్ అండ్ మిస్టిక్ ‘’అనే గ్రంధాన్ని వెలువరించాడు .అప్పుడు జనాలకు చురుకు పుట్టింది .ఈ వేడి ఆయన పుట్టిన అమెరికాలో అనుకొంటే తప్పులో సారీ పప్పులో కాలేసినట్లే .అది ఇంగ్లాండ్ లోని లండన్ లో సాగింది .మూడేళ్ళలో పదహారు గ్రంధాలు వెలువడ్డాయి .ఇదే మేల్విల్లీ పునరాగమనానికి అంటే రినైసేన్స్ కు దారి తీసింది .ఆ తర్వాత వరుసగా మూడు దశాబ్దాలు అందరూ మేల్విల్లీ పై అనేక కోణాలలో రచనలు చేసి ఆయన మహోన్నత వ్యక్తిత్వాన్ని రచనా సామర్ధ్యాన్ని లోకానికి తెలియ జేశారు . ఎన్నో జీవిత చర్తిత్రలు వచ్చాయి .ఈచరిత్రలలో అనేక అసందర్భాలు చోటు చేసుకోన్నాయి .అవగాహనలో తేడాలు వచ్చాయి .
మహా రచయితది హెచ్ లారెన్స్ ‘’the whale Moby Dick is the deepest blood being of the white race ,our deepest blood nature and he is hunted hunted and hunted by the maniacal fanatism of our white mental consciousness ‘’అని కుండ పగల కొట్టినట్లు చెప్పి ‘’we get dark races and pale to help us red yellow ,and black ‘’అన్న నిజాన్ని చెప్పాడు .మోబీ డిక్ లో ఆహాబ్ అంటే మనిషే అని ‘’man sentient ,speculative ,religious ,standing his full stature against the immense mystery of creation .’’అని ఎల్లరీసేడ్ విక్ అన్నారు .మోబీ డిక్ చెడుకు సంకేతం అని ఆహాబ్ మోబీ తో పోరాటం మంచికి చెడుకు పోరటమేనని చివరికి మంచి తుడిచి పెట్టుకు పోతుందని ఇంకోఆయన వ్యాఖ్యానించాడు .భగవద్గీత పై ఎన్ని వ్యాఖ్యానాలోచ్చాయో అన్నీ మోబీ డిక్ మీద వచ్చాయి .ఎవరి దృక్పధం వారిది .అయినా ఇంకా మోబీ డిక్ ను చదువుతూనే ఉన్నారు మేల్విల్లీని ఆరాదిస్తూనే ఉన్నారు .
మేల్విల్లీ కి ఉన్న విలువలు ఆయన తరం నాటివికాదు .పేరుకు ,ఖ్యాతికి ఆయన ఇష్ట పడనే లేదు విషాదానికి పో లాంటి వాళ్ళు ఎలాగో మేల్విల్లీ కూడా అంతే .చాలెంజెర్ నంబర్ వన్ గా మిగిలాడు .ఎమర్సన్ ప్రశాంత ఇంద్ర ధనుస్సు కు వ్యతిరేకం గా మేల్విల్లీ పిడుగులు కురిపించాడు .వాల్ట్ విట్మన్ సూర్య దీప్తికి బదులు సాహసవీరోచిత నల్లతనాన్ని ఆహ్వానించాడు .మేల్విల్లీ ప్రతిష్ట,వ్యక్తిత్వం నానాటికీ పెరుగుతూనే ఉంది .Melville not only measures up to the American giants but towers darkly above them ‘’ అన్న లూయీ అంటర్ మేయర్ మాట ముమ్మాటికీ నిజం .
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-2-15 ఉయ్యూరు

