|
ఈ శీర్షిక మనకు ఆశ్చర్యాన్ని కలిగించేదే. అయినా ఇటీవలే ఒక అమెరికన్ రచయిత రాసిన పుస్తకమిది. పేరు అమెరికన్ వేదం. ఈ పుస్తక రచయిత ఫిలిప్ గోల్డ్ బర్గ్ సుమారు సంవత్సరం క్రితం ఉస్మానియా యూనివర్శిటీలో తన పుస్తకం గురించి ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా వచ్చారు. వేదికపై ఉన్న నేను కూడా ఈ పుస్తకం గూర్చి మాట్లాడాను.
ఈ పుస్తకం 18వ శతాబ్దం మొదలుగా యూరోపియన్లు మన దేశ సంస్కృతిని ఎలా అధ్యయనం చేశారు, వారి భాషల్లోకి ఎలా అనువాదాలు చేశారు. వాటి ప్రభావం ఆ దేశాల మేధావులపై ఎలా పడింది అన్న విషయం చాలా వివరంగా చెబుతుంది. యూరప్ నుంచి అమెరికాకు వెళ్ళిన ఉపనిషత్తులు, భగవద్గీత, బౌద్ధగ్రంథాలు, పతంజలి యోగ సూత్రాలు ముఖ్యంగా అమెరికన్ మేధావుల్ని ఆకట్టుకున్నాయి. వివేకానందుడు అమెరికాకు వెళ్లకముందే అమెరికాలోని మహామహులు- ఎమర్సన్ లాంటి వేదాంతులు, థోరో, విట్‌మాన్ లాంటి రచయితలు, థామస్ జెఫర్సన్ లాంటి రాజనీతివేత్తలు వేదాంతాన్ని, భగవద్గీతను గూర్చి తెలుసుకున్నారని ఇందులో చూడగలం. ఎమర్సన్‌ను జ్ఞానయోగిగానూ, ఽథోరోను కర్మయోగిగానూ, విట్‌మాన్‌ను భక్తియోగిగానూ రచయిత ఈ పుస్తకంలో (పేజీ 42) వర్ణించాడు. విట్‌మాన్ రాసిన ‘‘””Leaves of Grass”’’ అనే పద్యసంకలనం భగవద్గీతను, భజనగీతాల్ని పోలి ఉందని చెప్పాడు రచయిత (పేజీలు 41-42). పై మహాకవి మరణించినపుడు భగవద్గీత ఆయన తలదిండు కింద కనిపించిందట. సత్యాన్ని గూర్చి తెలుసుకోవడానికి ఉపనిషత్తుల్ని మించిన పుస్తకాలు లేవనీ, అవి తనకు శాంతిని ఇచ్చిన గ్రంథాలనీ షోపెనార్ అనే జర్మన్ తత్త్వవేత్త చెప్పాడు. ఆయన రాసిన ‘‘ “”The World as Will And Idea”’’ అనే పుస్తకాన్ని మాండూక్య ఉపనిషత్తుతో పోల్చాడు అమెరికన్ వేదాంతి క్యాంప్‌బెల్(పేజీ 98). వివేకానందుడు అమెరికాకు వెళ్ళడం మన సాంస్కృతిక చరిత్రలో ఒక గొప్ప సంఘటన. సర్వమత సమావేశంలో ఆయన మాట్లాడింది కేవలం ఉపనిషత్తులు. గీతలోని సారాంశం మాత్రమే. వైదిక సంస్కృతిలోని మూల సూత్రాలు మొట్టమొదటగా ఒక భారతీయుని ద్వారా ప్రపంచానికి బోధపడ్డాయి. ఆయన తర్వాత విదేశాలకు వెళ్ళిన గురువులందరూ కేవలం వేదాంతాన్నే చెప్పారు. సత్యం ఒక్కటే అనేక విధాలుగా దర్శింపబడింది అనే వేదాంత సూత్రం వారిని ప్రభావితం చేసింది. వేదాంతాన్ని, బౌద్ధ సిద్ధాంతాల్ని ఒక మతంగా కాకుండా తత్త్వశాస్త్రం, మానసిక శాస్త్రం దృష్టికోణంలో పాశ్చాత్యులు చదివారు. వివేకానందుడు అమెరికాకు వెళ్ళడం మన సాంస్కృతిక చరిత్రలో ఒక గొప్ప సంఘటన. సర్వమత సమావేశంలో ఆయన మాట్లాడింది కేవలం ఉపనిషత్తులు. గీతలోని సారాంశం మాత్రమే. వైదిక సంస్కృతిలోని మూల సూత్రాలు మొట్టమొదటగా ఒక భారతీయుని ద్వారా ప్రపంచానికి బోధపడ్డాయి. ఆయన తర్వాత విదేశాలకు వెళ్ళిన గురువులందరూ కేవలం వేదాంతాన్నే చెప్పారు. సత్యం ఒక్కటే అనేక విధాలుగా దర్శింపబడింది అనే వేదాంత సూత్రం వారిని ప్రభావితం చేసింది. వేదాంతాన్ని, బౌద్ధ సిద్ధాంతాల్ని ఒక మతంగా కాకుండా తత్త్వశాస్త్రం, మానసిక శాస్త్రం దృష్టికోణంలో పాశ్చాత్యులు చదివారు. ఆల్డస్ హక్స్ లీ అనే రచయిత జిడ్డు కృష్ణమూర్తి యొక్క గొప్ప స్నేహితుడు. ఆ ప్రభావంతో ‘‘The perennial Philosophy’’ అనే పుస్తకం రాశాడు. సనాతనధర్మం అనే మాటకు ఇంగ్లీషు అనువాదమే పై పేరు. ఈ పుస్తకంలో మొదటి అధ్యాయమే ‘‘That Art Thou’’, అంటే తత్త్వమసి అనే వేదాంతవాక్యం. ఛాందోగ్య ఉపనిషత్తులోని సంభాషణల్ని యథాతథంగా రచయిత అందులో ఉటంకించారు. ఈ పుస్తకంలో వివేకచూడామణి, భగవద్గీతల్లోని అనేక శ్లోకాలు, బౌద్ధుల లంకావతార అనే పుస్తకం నుండి వాక్యాలు అనేకాలు కనిపిస్తాయి. భారతీయులు సృష్టికాలాన్ని లెక్కించిన విధానంపై కార్ల్ సేగన్ అనే ఖగోళశాస్త్రవేత్త ఆశ్చర్యం ప్రకటించారు. శాస్త్రవేత్తలు చెప్పే కాలపరిమితికి సరిగ్గా సరితూగుతుందని అన్నాడు. ‘‘it is the only religion in which the time scales correspond to those of modern scientific cosmology… its cycles run 8.64 billion years long’’ అన్నాడు. అమెరికాలో ప్రారంభమైన దివ్యజ్ఞాన సమాజం (Theosophical society) అక్కడి మేధావులపై చాలా ప్రభావం చూపింది. ఆజ్చూఠ్చ్టిటజుడ రాసిన ‘‘The Secret Doctrine’’ అనే పుస్తకం ఉపనిషత్తుల్లోనూ, బౌద్ధ సిద్ధాంతంలోనూ ఉన్న సాధనా పద్ధతుల్ని తెలిపింది. అదే సమయంలో పరమహంస యోగానంద అనే గురువు చాలామంది మేధావుల్ని ప్రభావితం చేశాడు. ఆయన రాసిన ‘‘Autobiogrphy of a Yog’’ అనే పుస్తకం బెస్ట్ సెల్లర్‌గా మారింది. మహర్షి మహే్‌షయోగి అమెరికన్ సంస్కృతిలో ఒక చరిత్ర సృష్టించాడని చెప్పవచ్చు. ఆయన శిష్యులు ప్రముఖ కళాకారులైన బీటిల్స్. యోగాన్ని, ధ్యానాన్నీ ఎక్కువ ప్రచారంలోకి తెచ్చిన వ్యక్తి మహే్‌షయోగి. మానసికశాస్త్రం కూడా భారతీయ సంప్రదాయం నుండి చాలా నేర్చుకుంది. అమెరికన్ మానసికశాసా్త్రనికి తండ్రి అనబడే విలియమ్ జేమ్స్ వివేకానందుడికి గొప్ప అభిమాని. ఆయన ‘‘The Varieties of Religious Experience’’ అనే పుస్తకాన్ని రాశాడు. ‘‘Vedanta is the paragon of all monastic systems’’ అంటాడు విలియమ్ జేమ్స్(పేజీ79). ప్రముఖ మేధావులు Vedanta Society of America అనే సంస్థను స్థాపించారు. ప్రముఖ చరిత్రకారులు టాయిన్ బీ, విల్‌డ్యురాంట్ మొదలైనవారు ఇందులో ముఖ్యులు. అమెరికాకూ, పాశ్చాత్య దేశాలకూ మొదట్లో వెళ్లిన గురువుల లాగా ఇటీవలి కాలంలో వెళ్తున్న భారతీయ స్వామీజీలు, పండితులు అంత ప్రభావవంతంగా లేరనే సత్యాన్ని రచయిత రాశాడు. ఇటీవల నియోవేదాంత అనే పేరిట చాలామంది అమెరికన్ రచయితలు వేదాంతాన్ని ఆధునిక భాషలో వివరించడం గమనించదగింది. పాశ్చాత్యులే వేదాంత ప్రవచనాలు కూడా చేస్తున్నారు. ఉదాహరణకు రిచర్డ్ అనే అమెరికన్ రాందాస్ అనే గురువుగా మారాడు. డేవిడ్ ఫ్రాలీ అనే అతను వామదేవశాసి్త్రగా మారాడు. రమణమహర్షి బోధనలతో ప్రభావితులైన ఎక్‌హార్ట్ టోలే మొదలైనవారు స్వతంత్రంగా ఎన్నో గ్రంథాలు రాశారు. ఎక్‌హార్ట్ టోలే పుస్తకాలలో వేదాంతాన్నే ఆధునిక భాషలో చెప్పాడంటాడు రచయిత. పాశ్చాత్యులు తమ మతగ్రంథాలనే కొత్తకోణంలో ఎలా వ్యాఖ్యానించాలి అనే మెళకువలు కూడా నేర్చుకున్నట్టుగా గోల్డ్ బర్గ్ చెప్పారు. కొందరు స్వామీజీల బలహీనతలను కూడా రచయిత ఒక అధ్యాయంలో యదార్థ ధోరణిలో వివరించారు. స్వామీజీలు ముఖ్యంగా అమెరికన్ శిషురాండ్రతో శృతిమించి ప్రవర్తించడం ఆ సీ్త్రల భర్తలు ఈ గురువులపై కోర్టుల్లో కేసులు వేయడం మొదలైనవి దురదృష్టకరమైన పరిణామాలు. ఇవి పరమహంస యోగానందతోనే ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కూడా ఒకరిద్దరు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు చివరగా గోల్డ్ బర్గ్ ఇలా రాశారు- ‘‘Vedanta’s spirituality has never been more necessary. In an evershrinking world, pluralism and genuine respect for religious differences within a framework of underlying unity is a needed counterweight to the deadly forces of ethnocentrism’’ (పేజీ 345). అన్ని మతాల్నీ, సంస్కృతుల్నీ గౌరవించే సంస్కృతి భారతీయసంస్కృతి అంటూ ముగిస్తాడు రచయిత. ఈ పుస్తకంపై రచయిత ప్రసంగాన్ని పాఠకులు యూట్యూబ్‌లో కూడా వినగలరు. డాక్టర్ కె. అరవిందరావు రిటైర్డు డీజీపీ |
|
మన దేశం ఈ ప్రపంచానికి అందించిన గొప్ప తత్వవేత్తల్లో జిడ్డు కృష్ణమూర్తి ఒకరు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1939-1945) అమెరికాలో నివసించిన కృష్ణమూర్తి- బహిరంగంగా ఎటువంటి ప్రకటనలు చేయకపోయినా-తన దగ్గరకు వచ్చిన వారికి మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. ఆ సంభాషణలన్నింటినీ ఇటీవల కృష్ణమూర్తి ఫౌండేషన్- ‘ద వరల్డ్ వితిన్’ అనే పేరిట ప్రచురించింది. దానిలోని ఒక ఆసక్తికరమైన భాగం..
బి నా దగ్గరకు వచ్చాడు. తాను సెక్స్ కోరికలకు బానిసనయిపోయానన్నాడు. ఈ కోరికలను తగ్గించుకోవటానికి రకరకాలుగా ప్రయత్నించానని అయినా లాభం లేకపోయిందని వాపోయాడు. అతను ఏం చేయాలి? ఇంతకు ముందు మనం ప్రేమ గురించి మాట్లాడుకున్నాం. ప్రేమ ఒక లైంగిక ఉత్ర్పేరకం కాదు. ఒక ఆలోచన కూడా కాదు. మన బుద్ధి (ఇంటలెక్ట్) నుంచి పుట్టింది కూడా కాదు. నేను అనే భావన పూర్తిగా తొలగిపోయినప్పుడు కలిగే ఒక అనుభూతి. ఇది మనం ఒక పని చేసినందుకు వచ్చే ప్రతిఫలం కాదు. అది ఒక స్వయానుభూతి. జాలి, దయ, కరుణ, క్షమాగుణం మొదలైన భావాలు ఉన్నప్పుడే ఈ ప్రేమ కలుగుతుంది. ప్రేమ ఒక గొప్ప సృజనాత్మక శక్తి. ఈ శక్తి విడుదల కాకుండా సెక్స్ అనుభూతులు విడుదల అయితే అది మోయలేని బరువుగా, పెద్ద సమస్యగా మారుతుంది. అంతే కాదు ఈ సృజనాత్మక శక్తిని అర్థం చేసుకోకుండా సెక్స్ కోరికలను అణిచిపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. చాలాసార్లు ఈ కోరికలు మరింత శక్తిమంతంగా మారతాయి. అవి తమ రూపాన్ని మార్చుకొంటాయి. రకరకాల హింసాపద్ధతులకు, క్రూరత్వానికి కారణమవుతాయి. ఎవరైనా అమితమైన సెక్స్ కోరికల నుంచి బయటపడాలంటే- ముందు వారు ఆ కోరికల మూలాన్ని అర్థం చేసుకోవాలి. సెక్స్ కోరిక తలెత్తినప్పుడు- దానిని విశ్లేషించి వదిలేస్తే చాలదు. దాని ఆనుపానులను, ప్రయాణిస్తున్న మార్గాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం పదే పదే చేస్తూ ఉండాలి. అప్పుడు అతనికి కోరికల మూలం తెలుస్తుంది. ఈ జ్ఞానం వచ్చినప్పుడు- సరైన మార్గం కూడా దానంతట అదే ఆవిష్కృతమవుతుంది. ‘నేను మాత్రమే’ అనే ఆలోచన నుంచి విముక్తి పొందుతాడు. ప్రచురణ: కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ధర: రూ. 295 పేజీలు: 234 ప్రతులు: అన్ని ప్రముఖ పుస్తక షాపుల్లో లభ్యమవుతాయి |


