నా దారి తీరు -92 చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక

నా దారి తీరు -92

చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక

సాధారణం గా అప్ లాండ్ అనబడే పశ్చిమ కృష్ణాలో పని చేసే మేస్టార్లు ఉద్యోగులు శనివారం నాడు ఒక గంటా అరగంటా ముందే స్వంత ఊళ్లకు వెళ్ళటానికి హెడ్ మాస్తారినో పై అధికారినో పర్మిషన్ అడిగి లేక రాత పూర్వకం గా కాగితం రాసిచ్చి సిద్ధమై లాస్ట్ పీరియడ్ లో ‘’చెక్కేస్తారు ‘’నేనూ అందుకు మినహాయింపు కాదు .గండ్రాయిలో ఉండగా మరీ .మా హెడ్ గారు మా కంటే ఆయనే తొందర పెట్టి ‘’మేస్టారూ !మీరు చాలా దూరం వెళ్ళాలి కదా .చివరిపీరియడ్ లోక్లాసులుంటే ఎవరికో ఒకరికి అడ్జస్ట్ చేస్తా .మీరు వెళ్ళిరండి ‘’అనే వారు అది బాగా అడ్వాంటేజ్ గా తీసుకొని వాడుకోన్నాము నేనూ అక్కడి డ్రాయింగ్ ప్రసాద్ .ఇప్పుడు నేను హెడ్ మాస్టార్ని కదా వత్సవాయిలో .వెళ్ళే టీచర్లకు పర్మిషన్ ఇచ్చి పంపేవాడిని.వాళ్లకు చివరిపిరియాద్ క్లాసులుంటే నేనో లేక ఇంకెవరో తీసుకొనే వాళ్ళం. ఈ వెళ్ళే బాచ్ లో క్రాఫ్ట్ వెంకటేశ్వర రావు ,నేనే ఉండేవాళ్ళం  .అక్కడ నాలుగున్నర దాకా ఉండి బయల్దేరితే ఉయ్యూరు అంచలంచెల మీద చేరే సరికి రాత్రి ఎనిమిది దాటేది అందుకని మూడుమ్ముప్పావు కే బయల్దేరేవాళ్ళం .ఇంచార్జ్ కి స్కూల్ అప్పగించి వెళ్ళేవాడిని .అదీ మొత్తం మీద చాలా కొద్ది సార్లే వాడుకొన్నాను .లారీలమీడా ఎక్స్ప్రెస్ బస్సుల్లో ,చిన్నకార్లలో ఏది దొరికితే వాటిలో ప్రయాణం చేయాల్సి వచ్చేది .కన్నెవీడు హైస్కూల్ కు వెళ్లి వాలీబాల్ బాద్ మింటన్ ఫ్రెండ్లీ మాచేస్ ఆడి వచ్చేవాళ్ళం అక్కడిహేడ్ మాస్టారు కపిలేశ్వర పురం లో పని చేసిన చలపతిరావుగారే మంచివాడు నిదానస్తుడు

ఒక శనివారం క్రాఫ్ట్ మేష్టారు నేనూ చివరి పిరియడ్ లో చేక్కేసే ఏర్పాటులో ఉన్నాం .ఇంతలో  డి ఇ వొ గారు అకస్మాత్తుగా స్కూల్ విజిట్ కు వచ్చారు .గుండేలాగిపోయాయి .గబగబా ఆయనకు స్వాగతం చెప్పి ,అడిగిన రికార్డ్ లన్నీ చూపించాము .అంతాపర్ఫెక్ట్ గా ఉందని సంతోషించి సంతృప్తి చెందారు .ప్రతిక్లాసుకూ తీసుకొని వెళ్లి చూపించాను .అన్నీ బాగా అబ్సర్వ్ చేశారు .స్కూల్ పెర్ఫెక్ట్ లైన్ లోనే నడుస్తోంది అనే ఇంప్రెషన్ వచ్చింది ఆయనకు .మంచి రిమార్క్ విజిట్ బుక్ లో రాసి వెళ్ళారు .ఆయన వెళ్ళేదాకా లాంగ్ బెల్ కొట్టలేదు అయిదింటి దాకా ఉండి వెళ్ళారు అప్పుడు బెల్ కొట్టి పిల్లల్ని పంపాము .చివరి పీరియడ్ కు పది నిమిషాలముందు ప్రతి రోజూలాగే అసెంబ్లీ ఏర్పాటు చేసి ఆయనతో మాట్లాడించి జనగణమన పాడించి పంపాము .మేము ముందే వెళ్లి ఉంటె మా పరిస్తితి ఏమిటో భగవంతుడికే ఎరిక ఇలా మొదటి  హేడ్మాస్టారి అనుభవం రుచి చూశాను .దేవుడు నా యెడల ఉన్నాడనిపించింది లేకపోతె అభాసుపాలయ్యేవాడిని .

పిఆర్.సి-కొత్త స్కేళ్ళలో ఫిక్సేషన్లు

నేను వత్సవాయి హెడ్ మాస్టారుగా ఉండగానే కొత్త వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చాయి .అందరికి ఆప్షన్లు కోరుకోవటం దానిప్రకారం స్కెల్ లో ఫిక్సేషన్ చేయటం బకాయీలను తయారు చేయటం చాలా పెద్దపనే .మా గుమాస్తా లగడపాటి కృష్ణ మూర్తి బాగా సర్వీస్ ఉన్నవాడేకాని ఎందుకో ఫిక్సేషన్ చేయటానికి కొంత జంకాడు .దాన్ని పోగొట్టటానికి నేనూ ఆయన గండ్రాయి వెళ్లాం. అక్కడ హేడ్మాస్టార్ శ్రీ పి వి సుబ్రహ్మణ్యం గారికి ఇవన్నీ నల్లేరుపై బండినడక.ఆయన దగ్గర కూర్చుని విధానం అంతా ఇద్దరం తెలుసుకొన్నాం .అప్పుడు కృష్ణమూర్తి ‘’సార్ –ఇంతేనా అయితే ఇంక ఎవరి సహాయం సలహా మనకు వద్దు మనమే చేసేద్దాం ‘’అన్నాడు తిరిగి వత్సవాయి వచ్చి అందరి ఫిక్సేషన్లు పూర్తీ చేసి జిల్లాపరిషత్  కు పంపం వెంటనే సాంక్షన్ అయి వచ్చాయి ఎరియర్ లు కూడా బాగా ముట్టాయి .ఇందులో కొంత వసూలు చేసి జిల్లాపరిషత్ గుమాస్తాలకు ‘,ఆడిట్ వాళ్లకు’’ ఆమ్యామ్యా’’ సమర్పించాలి మేమూ అలానే చేశాం .’’భూత తృప్తి’’ అన్నమాట .నాఫిక్సేషన్ గండ్రాయిలోనే హెడ్ మాస్టారు చేసి పంపారు .మేము ఇక్కడ నాన్ ద్రాయల్ సర్టిఫికేట్ రాసి జిల్లా పరిషద్ కు పంపి సాంక్షన్ చేయిన్చుకోన్నాం .నాకు అనుకోకుండా ఒక స్టేజ్ బెనిఫిట్ వచ్చి జీతం బాగా పెరిగింది .

హాఫ్ పే లీవ్ –బదిలీ

ఉయ్యూరులో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం పనులకు గాను రెండు సార్లు హాఫ్ పే లీవ్ పెట్టాను. హెడ్ మాస్టారి లీవ్ జిల్లా పరిషత్ పి ఇ వొ గారు సాంక్షన్ చేయాలి .15-6-88నుండి 26-6-88 వరకు సెలవుపెట్టాను మొదటిసారి .ఆలయ పునః ప్రతిష్ట చేశాము .ఇక గండ్రాయి లో ఉండాలని పించలేదు ఇదివరకే రాసినట్లు లాంగ్ లీవ్ పెట్టి ప్రయత్నం చేయాలి అందుకని 5-8-88 నుండి 34 రోజులు 7-9-88 వరకు లీవ్ పెట్టాను .జిల్లా పరిషద్ చైర్మన్ ను వీలైనప్పుడల్లా కలుస్తూనే ఉన్నాను .వత్సవాయి లో అన్ని పోస్ట్ లను నేను చైర్మన్ కోటేశ్వర రావు గారి దృష్టికి తీసుకొని వెళ్లి భర్తీ చేయించాను ఇది ఒక రికార్డ్ .ఎవరూ పట్టించుకోని స్కూల్ ను నేను పట్టించుకోని నేను వచ్చేనాటికి ఒక్క ఖాళీ కూడా లేకుండా ఫిలప్ చేయి౦చ గాలిగాను. నా గొప్పతనం కంటే చైర్మన్ కోటేశ్వర రావు గారి చొరవ బాగా కలిసొచ్చింది .’’మేస్టారూ !మీరక్కడ ఉండాలని లేదంటూనే పోస్ట్ భర్తీ గురించి మీకెందుకు అంట ఆరాటం ?’’అన్నారొకసారి అప్పుడు నేను ‘’సార్ ! అసలే దూరపు ప్రాంతం మన ప్రాంతం నుండి వెళ్ళిన వాళ్ళు అక్కడెవరూ ఉండటం లేదు .పోస్టులు ఉంటె ఉండాలన్న తపన ఉంటుంది ‘’అంటే నవ్వి అన్నీ భర్తీ చేశారు అదినాకు గొప్ప సంతృప్తి నిచ్చింది .

స్పాట్ వాల్యు ఏషన్ కు బందర్ వేస్తె హాయిగా ఉయ్యూరు నుండి వెళ్లి వచ్చేవాడిని .అప్పుడు ఆఫీసులోచైర్మన్  గారుంటే కలిసి అర్జీ ఇచ్చి బదిలీ కోరేవాడిని. ఒక సారి నేనూ అడ్డాడ హెడ్మాస్టారు శ్రీ వై .దేవేంద్ర రావు పెదముత్తేవి హెడ్ శ్రీ కోసూరి ఆదినారాయణ జమ్మవరం హెచ్ ఏం శ్రీ పి ఆంజనేయ శాస్త్రి ,మొదలైన వాళ్ళం చైర్మన్ గారిని కలిశాం నేను నా ట్రాన్స్ ఫర్ సంగతి చెప్పా . ఎక్కడా ఖాళీలు లేవు .మంగళాపురం ఖాళీ అవుతోంది అక్కడికి వెయ్యమంటే వేస్తానన్నారు .సరే దూరం తగ్గుతుంది కదా అని ఓకే చెప్పి గుమాస్తా శేషగిరి రాకు తెలియ జేసి ‘’చేపాల్సింది ‘’చేపి లాంగ్ లీవ్ 13-7-89-1-9-89 వరకు 51 రోజులు పెట్టా .అప్పుడు పి ఇ వొ పరమ హం(హిం)స గారు .పైకి స్ట్రిక్ట్ ,లోన లొటారం .నన్ను చల్లపల్లి దగ్గర మంగళాపురం .హైస్కూల్ కు అక్కడి హెడ్మాస్టారు శ్రీ జోశ్యులు గారు రిటైర్ అయితే అందులో వేశారు .పెనం మీదనుంచి పొయ్యిలోకి కాకపోయినా పొయ్యి రాళ్ళమీద పడినట్లయింది నా పరిస్తితి .ఆర్డర్ వచ్చేదాకా ఎవరికీ చెప్పలేదు .బందరు వెళ్లి తీసుకొని మంగళాపురం హైస్కూల్ లో చేరాను ఈ రికార్డ్ అంతా సర్వీస్ రిజిస్టర్ లో జిల్లాపరిషత్ మెయింటేన్ చేస్తుంది .అందులో నేను వత్సవాయిలో రిలీవ్ అయిన తేది మంగళాపురం లో చేరిన తేదీ వాళ్ళే నమోదు చేస్తారు. నాదగ్గర ఆ వివరాలు లేవు .గుర్తుకూడాలేదు .

సశేషం

మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -5-2-15- ఉయ్యూరు

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.