గీర్వాణ కవుల కవితా గీర్వాణం సాహిత్య సేవలో సరసభారతి –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం

సాహిత్య సేవలో సరసభారతి –శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి

సాహిత్యాభిమానులందరికీ ఉగాది శుభా కాంక్షలు ,అభినందనలు .సరసభారతి –సాహిత్య సంస్కృతీ సంస్థ 24-11-2009 నప్రారంభమైనది . అయిదేళ్లుగా సాహితీ సేవ చేస్తూ  అరవ ఏడాది లోకి అడుగుపెట్టింది అని తెలియ జేయటానికి సంతోషం గా ఉంది .సరసభారతి ప్రచురించిన ‘’సిద్ధ యోగి పుం గవులు ‘’,మహిళా మాణిక్యాలు ‘’పుస్తకాలలో మొదటి నుంచి అప్పటిదాకా అంటే అరవై వ సమావేశం దాకా జరిగిన ప్రగతిని వివరం గా తెలియ జేశాం .ఆ తర్వాత చేసిన కార్యక్రమాలను ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను .

21-5-2014  బుధవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్ర్రీ మతి కొమాండూరి కృష్ణ గారిచే 61 సమావేశం గ ‘’దాస్య భక్తీ-శ్రీ ఆంజనేయ స్వామి ‘’అనే అంశం పై ధార్మిక ప్రసంగం ఏర్పాటు చేశాం .శ్రీమతిక్రిష్ణ ఏంతో భావ గర్భితం గా ప్రసంగించి అందర్నీ భక్తీ భావనలో తేల్చారు .యధోచిత సత్కారం చేశాం .62  సమావేశం 22-5-14 గురువారం మచిలీపట్నం సోదరులు ఛి వీరుభోట్ల పవన్ కుమార్,ఛి వరప్రసాద్ లచే ‘’ఏక పాత్రాభినయం ‘’ఏర్పాటు చేయగా ,సోదరులు ఏంతో హుషారుగా ,చలాకీగా ఆయా పాత్రలలో తన్మయులై ధారాళం గా సంభాషణలు చెప్పి ,గొప్ప అభినయాన్ని ప్రదర్శించి ,జీవించి  ఆకట్టుకొన్నారు .వారి తండ్రిగారు మూర్తిగారు వీరిని తీర్చి దిద్దిన తీరు ప్రశంసనీయం .సరసభారతి ఈ ముగ్గురిని ఘనం గా సత్కరించి సంస్కృతీ సేవ చేసింది .వర్దిష్ణులైన  ఆ చిర౦ జీవులను అందరూ అభినందించారు .

తెలుగు విద్యార్ధి మాస పత్రికను సమర్ధం గా అరవై ఏళ్ళు  నిర్వహించిన ఆ పత్రిక సంపాదకులు ,శాసన మండలి మాజీ సభ్యులు ,విద్యా రంగం లో ఉపాధ్యాయుల సేవలో తరించిన శ్రీ కొల్లూరి కోటేశ్వరరావు గారి మరణానికి సంతాప సభగా 23-6-14 సోమవారం ఏ. సి .గ్రంధాలయం లో సంతాప సభను 63 వ సమావేశం గా జరిపి శ్రద్ధాంజలి ఘటించాం .శ్రావణ మాసం లో ‘’శ్రావణ మాసం –నోములు –విశిష్టత ‘’పై మన దేవాలయం లో 64 వ సమావేశం 29-7-14 సాయంత్రం శ్రీమతి వేదాంతం శోభాశ్రీ ప్రసంగం ఏర్పాటు చేశాం . .65 వ సమావేశం శ్రీ కృష్ణాష్టమి వేడుకలను 17-8-14 ఆదివారం నిర్వహించి చిన్నపిల్లలకు కృష్ణ గోపికా వేషాలలో పోటీ నిర్వహించి బహుమతులను అందించాం .

సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి శ్రీమైనేని గోపాల కృష్ణ గారు స్పాన్సర్ చేసి , డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ ఏం డి గారికి అంకితమిచ్చిన ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గ్రంధా విష్కరణ సభను స్థానిక ఏ జి అండ్ ఎస్ జి సిద్ధార్ధ డిగ్రీ కళాశాలలో కాలేజి ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ వారి సౌజన్యం తో  డిగ్రీ విద్యార్ధుల సమక్షం లో 66వ సమావేశం గా 28-8-14గురువారం  శ్రీ రాచకొండ శర్మగారి 90 వ జన్మ దినోత్సవం సందర్భం గా నిర్వహిం చాం సభాధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారు –కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ,.శాసనమండలి మాజీ సభ్యులు శ్రీ యలమంచిలి వెంకట బాబూ రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిధిగా విచ్చేసి  గ్రంధా విష్కరణ చేసి తోలి కాపీని విశాఖ పట్నం నుండి విచ్చేసిన   ప్రముఖ రచయిత స్వర్గీయ రా.వి .శాస్త్రి గారికుమారులు శ్రీ రాచకొండ లక్ష్మీ నరసింహ ప్రసాద్ గారికి అందజేశారు. కాలేజి ప్రిన్సిపాల్ శ్రీ కొడాలి సత్యనారాయణ ,శ్రీ డా జి వి పూర్ణ చంద్ శ్రీ చలపాక ప్రకాష్ ,శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ఆత్మీయ అతిధులుగా విచ్చేసి వేదికను సుసంపన్నం చేశారు .ఉదయం అల్పాహార విందును కాలేజి వారు ఏర్పాటు చేయగా అతిధులకు మధ్యాహ్న భోజనం సరసభారతి ఏర్పాటు చేసింది .ఇంగ్లీష్ లెక్చరర్ శ్రీమతి జి సోని పుస్తకాన్ని సంక్షిప్తం గా సమీక్షించారు .గ్రంధ కర్తను మైనేని గోపాల కృష్ణగారు ఏర్పాటు చేసిన  బంగారు   బ్రేస్ లెట్ ‘ను శ్రీ సుబ్బారావు గారు రచయితచేతికి అలంకరించారు .సరసభారతి అతిదులందరికి ‘’ఆధునిక ఆంగ్ల కవితాపిత ‘’జియోఫ్రీ చాసర్  చిత్రం ఉన్న  జ్ఞాపిలను అందజేసి శాలువాలతో సత్కరించింది .కార్య దర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి,ఆంగ్ల లెక్చరర్ శ్రీ మతి  అరుణ కుమారి  కార్యక్రమాన్ని పర్యవేక్షించారు .సాహిత్యం విద్యార్ధులకు చేరువ అవ్వాలన్న సరసభారతి సంకల్పం ఇలా నేర వేరింది .

కవులు ,కళాకారులు జన్మించిన గ్రామాలలో వారి సభలు జరపాలని నిర్ణయించి శ్రీ పింగళి లక్ష్మీకాంతం గారి జయంతి వర్ధంతిని చిట్టూర్పు లో వారి స్వగ్రామం లో జనవరి పన్నెండు న నిర్వహించిన  సంగతి మీకు తెలుసు .ప్రముఖ సినీ సంగీత దర్శకుడు స్వర్గీయ శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు గారి 30 వ వర్ధంతిని 67 వ సమావేశం గా వారి స్వగ్రామం కాటూరు లో శాఖా గ్రంధాలయం లో కాటూరు గ్రామ పెద్దల సహకారం తో 31-8-14 ఆదివారం సాయంత్రం జరిపి ఈ తరానికి పరిచయం చేసి కాటూరి ప్రజల మన్ననలు అందుకోన్నాం . శ్రీ వేమూరికోతెశ్వరరావు శ్రీ బాబ్జీ గారు  లైబ్రేరియన్ గారు సహకరించారు 68వ సమావేశం గా ప్రముఖ చిత్రకారులు సినీ దర్శకులు స్వర్గీయ బాపు గారికి బాష్పాంజలి ని ఉయ్యూరు శాఖా గ్రంధాలయం లో 6-9-14సాయంత్రం  నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించాం .

విజయ వాడ రమ్య భారతి ,ఉయ్యూరు సరసభారతి సంయుక్త ఆధ్వర్యం లో ప్రముఖ రచయిత పాల గుమ్మి పద్మ రాజు గారి శతజయంతిని విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 14-9-14- ఆదివారం ఉదయం నిర్వహించాం .ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ కదా రచయిత శ్రీ వేదగిరి రాం బాబు గారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిన ‘’బాపు –రమణ ‘’ల స్మారక పురస్కారం అయిదు వేల రూపాయలను సరసభారతి ద్వారా అ౦ద జేశాం .మొదటి సారిగా ఆపురస్కారాన్ని ఆంధ్ర దేశం లో ఏర్పాటు చేసిన ఘనతను శ్రీ గోపాల కృష్ణ గారు ,అందజేసిన ఘనత సరసభారతి ,మొదటిసారిగా అందుకొన్న ఖ్యాతి శ్రీ రాం బాబు గారికి దక్కింది .ఇది సరసభారతి 69 వ సమావేశం .ఒక వారం వ్యవధిలో మచిలీపట్నం మహతి కళా వేదిక పై 21-9-14 ఆదివారం సాయంత్రం 70వ సమావేశాన్ని కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారం తో జరిపాం .ప్రముఖ చిత్రకారులు కవి నవలా రచయితా శ్రీ శీలా వీర్రాజుగారికి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిన బాపు-రమణ ల స్మారక పురస్కారం 10,౦౦౦రూపాయలు అందించాం .జిల్లా ఒకటవ అదనపు  న్యాయ మూర్తి జస్టిస్ శ్రీ యం రామ శేషగిరిరావు ముఖ్య అతిధిగా విచ్చేసి పురస్కారాన్ని జ్ఞాపికను వీర్రాజు దంపతులకు అందజేయటం శాలువా తో సత్కరించటం  చారిత్రాత్మక విషయం .వారం వ్యవధిలో ఈ పురస్కారాన్ని ఇద్దరు ప్రముఖులకు అందజేసిన ఘనత సరసభారతికి శ్రీ మైనేని వారి వలన దక్కింది. వారి వితరణ శీలతకు కృతజ్ఞతలు .శ్రీ గుత్తికొండ సుబ్బారావు డా శ్రీ జి వి పూర్ణ చంద్ గార్లు ఆత్మీయ అతిధులుగా వేదికకు నిండుదనం తెచ్చారు .ఈ సభా నిర్వహణ బాధ్యతా ఖర్చు అంతా కృష్ణా జిల్లా రచయితల సంఘమే భరిం చింది శ్రీ సుబ్బారావు గారు తీసుకొన్న ప్రత్యెక శ్రద్ధకు ధన్యవాదాలు అందజేస్తున్నాం .నెల రోజులలో 5 కార్యక్రమాలు నిర్వహించి రికార్డ్ నెలకొల్పింది సరసభారతి .

71 వ సమావేశం గా కవిసమ్రాట్ విశ్వనాధ సత్య నారాయణ గారి 38 వ వర్ధంతిని వారి స్వగ్రామం నందమూరులో వారి తండ్రిగారు శోభనాద్రి గారు నిర్మించిన శ్రీ గంగా అన్న పూర్ణా సమేత కాశీ విశ్వేశ్వరాలయం లో 19-10-14 ఆదివారంసాయంత్రం  ఘనం గా నిర్వహించాం .గ్రామస్తులు విశేషం గా పాల్గొని విశ్వనాధ వారి కీర్తిని ప్రస్తుతించారు శ్రీ వల్లభనేని రమేష్ చంద్ విశ్వనాధ తో ఉన్న అనుబంధాన్ని జ్ఞప్తికి తెచ్చుకొన్నారు .విశ్వనాధ వారి మనుమలు విశ్వనాధ సత్యనారాయణ  సోదరులు కూడా పాల్గొని నిండుదనం తెచ్చారు .22-11-14 శనివారం శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో 72వ సమావేశాన్ని కార్తీక మాసం సందర్భం గా ధార్మిక ప్రసంగం  ఏర్పాటు చేశాం .రిటైర్డ్ తెలుగు లెక్చరర్ శ్రీ నౌడూరి రమేష్ గారు ‘’తెలుగు కావ్యాలలో శివ పార్వతి వర్ణన ‘’పై అద్భుత ప్రసంగం చేసి శ్రోతలను భక్తి ప్రవాహం లో తన్మయులను చేశారు .నెల రోజులలో 5 సమావేశాలను నిర్వహించి రికార్డ్ నెల కోల్పింది సరసభారతి .  సాహిత్యం విద్యార్ధులకు అందుబాటు లోకి తేవాలన్న లక్ష్యం 27-12-14 శుక్రవారం సాయంత్రం 73వ సమావేశం లో తీరింది .మా తెనుగుతల్లికి గేయ రచయిత స్వర్గీయ శంకరంబాడి సుందరాచారి గారి శత జయంతి సభను ఫ్లోరా విద్యాలయం లో జరిపాం .మచిలీపట్నం నుండి శ్రీ పి వెంకటేశ్వర రావు ,శ్రీ దండిభోట్ల దత్తాత్రేయ శర్మ గార్లు వచ్చి సుందరాచారిగారి కవిత్వాన్ని సాహిత్య ధోరణులను చక్కగా విద్యార్ధులకు అర్ధమయ్యేట్లు వివరించి వారి ఆదరాభిమానాలకు పాత్రులయ్యారు .

–   గ్రంధాలయోద్యమ సారధి ,బాల సాహిత్యరచయిత,.గ్రంధాలయ శాస్త్రం పై అనేక సాధికారిక గ్రంధాలు రచించిన వారు ఉయ్యూరు ఏ సి లైబ్రరీ నిర్మాణం లో పూర్తీ సహకారం అందించిన వారు శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి మరణానికి ,ఉయ్యూరు సాహితీ మండలి సంస్థాపక సభ్యులు, ప్రస్తుతనిర్వాహకులు సాహిత్యోపజీవి శ్రీ గూడపాటి కోటేశ్వర రావుగారి  మృతికి సంతాప సభను  గా ప్రత్యెక సమావేశాన్ని31-12-14 బుధవారం సాయంత్రం ఏ సి లైబ్రరీలోనిర్వహించి వారి సేవను శ్లాఘించి నివాళులర్పించాం .

మైనేని వారి గురుభక్తికి నిదర్శనం గాఏర్పాటు చేసిన  వారి చిన్ననాటి గురువుగారు స్వర్గీయ కోట సూర్య నారాయణ గారి స్మారక నగదు పురస్కారం 10,000 రూపాయల ను సరసభారతిద్వారా శాంతినికేతన్ లో పదవ తరగతి చదువుతున్న ప్రతిభ ఉన్న పేద విద్యార్ధిని ఛి లంకె లావణ్య కు ఆ స్కూల్ లో సభ జరిపి అందించాం .భగవద్గీత లో రాణిస్తున్న అనేక జాతీయ అంతర్జాతీయ వేదికలపై గీతను వినిపించిన కుమారి మాదిరాజు బిందు దత్త శ్రీ కి ఉన్నత విద్యాభ్యాసం ప్రోత్సాహక  నగదు బహుమతి 15,౦౦౦ రూపాయలనుశ్రీ గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిపంపగా సరస భారతి తరఫున  శ్రీ సువర్చలా౦జనేయ స్వామి సన్నిధిలో అందించాం .ఉయ్యూరు హిందూ స్మశాన వాటికను ఆధునిక రీతిలో అభివృద్ధి చేస్తున్న ఉయ్యూరు రోటరీక్లబ్ వారికి సహాయం గా పెద్దమనసుతో శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు పంపిన 25000  ల రూపాయలను శ్రీ సువర్చలా౦జనేయ స్వామి సన్నిధిలో రోటరీక్లబ్ ప్రెసిడెంట్ శ్రీ యార్ల గడ్డ నాగేశ్వరరావు గారికి సరసభారతిద్వారా అంద జేశాం .ఇన్నిరకాల వితరణలను సరసభారతి ద్వారా అంద జేయించిన శ్రీ గోపాల కృష్ణగారి ధార్మిక సేవను యెంత ప్రస్తుతించినా సరిపోదు .సరసభారతిపై వారికి ఉన్న నమ్మకానికి కైమోడ్పులు .ఒక రకం గా మైనేనివారు మా సరసభారతికి ‘’చీఫ్ పాట్ర‘న్ ‘’’ .అందుకు మాకు గర్వం గా ఉంది .

11-1-15 ఆదివారం సాయంత్రం  ఆర్య వైశ్య కళ్యాణ మందిరం లో 74వ సమావేశం గా శ్రీ మైనేని గోపాల కృష్ణగారి 80 వ జన్మ దినోత్సవం సందర్భం గా నిర్వహించాం .సాయంత్రం అయిదు గంటలకు సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం సందర్భం గా శ్రీ పి ఇంద్ర కీలాద్రి శర్మ బృందం చే సంగీత కచేరి నిర్వహించాం .తర్వాత శ్రీ దుర్గా ప్రసాద్ రచించిన ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’గ్రంధాన్ని నది మాస పత్రిక సంపాదకులు శ్రీ జలదంకి ప్రభాకర్ ఆవిష్కరించి మొదటి కాపీని గ్రంధాన్ని అంకితం పొందిన మైనేని వారి మెంటార్ –కపట మెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి శ్ర్రీ కోగంటి సుబ్బారావు గారికి అందజేశారు .ఈ పుస్తకానికి ,ఆ రోజు మొత్తం ఖర్చుకు స్పాన్సర్ గోపాల కృష్ణ గారే .దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేసి దేశ విదేశాలలో కంప్యూటర్ ఉన్న వారందరూ చూసే ఏర్పాటు చేశాం .ఒక సాహిత్య సంస్థ ఇలా లైవ్ ప్రోగ్రాం నిర్వహించటం ఇదే మొదలు దీన్ని వీక్షించిన మైనేని గోపాలకృష్ణ  దంపతులు  పులకించిపోయారు . తన ఆత్మీయులు ,స్నేహితులు మార్గ దర్శిఎనభై అయిదేళ్ళ జ్ఞాన వయో వృద్దు  శ్రీ సుబ్బారావు గారికి ,సరసభారతి చేత పట్టుబట్టలు శాలువా ,బంగారు శ్రీ లక్ష్మీ నరసింహ కాయిన్  తెనాలిరామాలయం తో సంక్రాంతి వేడుక ఉన్న ప్రత్యెక జ్ఞాపిక ,సరసభారతి గ్రంధాలు అంద జేశారు .కోగంటి వారి కుటుంబ సభ్యులు హితులు సన్నిహితులు తెనాలి నుండి తరలి వచ్చిపాల్గొని ఏంతో నిండు దనం తెచ్చారు .గోపాల కృష్ణగారి బావ గారు శ్రీ అన్నే హనుమంతరావు  చెల్లెలు శ్రీమతి హేమలత ,కోగంటి వారి అల్లుడు శ్రీ రామినేని భాస్కరేంద్ర రావు వారి కుమార్తె శ్రీమతి  శ్రీదేవి,కోగంటివారి పెద్ద కుమారుడు శ్రీ శివప్రసాద్ కోడలు శ్రీమతి పుష్పలత ,స్నేహితుడు శ్రీ అన్నే వెంకటేశ్వర్లు దంపతులు ,కోగంటివారి మనుమలు  వారి శ్రీమతులు మనుమరాళ్ళు అందరూ హాజరై పెళ్లి వేడుకను చేశారు .వచ్చిన వారందరితో బాటు సరసభారతి కోశాధికారి ఈ కార్య క్రమం ఇంత ఘనం గ జరగటానికి కృషి చేసిన  శ్రీ గబ్బిట వెంకటరమణ శ్రీమతి మహేశ్వరి దంపతులకు మైనేని గారు అందజేసిన నూతన వస్త్రాలు శాలువా ,జ్ఞాపిక అందజేశాం .అందరికీ ఆత్మీయ సత్కారం జరిపాం .గ్రంధ కర్త శ్రీ దుర్గాప్రసాద్ శ్రీమతి ప్రభావతి దంపతులకు శ్రీ ప్రభాకర్, శ్రీ సుబ్బారావు గార్లు ఘన సత్కారం చేసి నూతన పట్టు వస్త్రాలు శాలువా జ్ఞాపికలను మైనేని వారి తరఫున  అంద జేశారు.  .శ్రీ చలపాక ప్రకాష్ ఆత్మీయ అతిధిగా పాల్గొన్నారు .500 పుస్తకాలను సభకు వచ్చినవారికి, తెనాలివారికి, మదన పల్లివారికి అందజేశాం .శ్రీ దుర్గాప్రసాద్ గారి గురువుగారు మాజీ డ్రిల్ మాస్టారు శ్రీ ఎస్. వి .సుబ్బారావు గారు శిష్యవాత్సల్యంగా  దుర్గాప్రసాద్ గారికి నూతన వస్త్రాలు శాలువా బహూకరించి సాహితీసేవను ప్రస్తుతించి ఆశీర్వ దించారు .కన్నుల పండువుగా జరిగిన ఈ సమావేశం చరిత్రాత్మకం గా నిలిచింది .

సభ ప్రారంభానికి ముందు అందరికి స్వీటు హాట్ అందజేసి టీ ఇచ్చాం .మధ్యలో బిస్కట్లు మళ్ళీ తేనేరు అందించాం సభానంతరం అందరికి షడ్రసోపేతమైన విందు ఏర్పాటు చేశాం .వచ్చిన వారందరూ సంతృప్తిగా భోజనం చేసి ఆనందించి అభినందించారు .ఇంత గొప్ప సభకు నూటపాతికమందికి పైగా సాహిత్యాభిమానులు పాల్గొని విజయ వంతం చేశారు .కార్యక్రమ నిర్వహణలో శ్రీ వీరమాచనేని బాలగంగాధర రావు గారు శ్రీమతి  శివలక్ష్మి శ్రీ గబ్బిట వెంకట రమణ గారు ,శ్రీ వెంట్రప్రగడ ఆంజనేయులుగారు ఏంతోతోడ్పడ్డారు .వీరందరికీ శాలువా  జ్ఞాపిక ,పుష్పహారం చందన తాంబూలాలతో సత్కరించాం .ఇందరి సమిష్టి కృషియే ఈ విజయానికి కారణం .సరసభారతిపై ఉన్న అభిమానానికి నిదర్శనం అందరికి కృతజ్ఞతలు .

75 వ సమావేశం గా భావ కవి ,ఆంధ్రా షెల్లీ స్వర్గీయ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారిని ఈ తరం విద్యార్ధులకు పరిచయం చేసే కార్యక్రమం అమరావాణీ హైస్కూల్ లో 25-2-15 బుధవారం జరిపాం . శ్రీ దుర్గాప్రసాద్ –కృష్ణ శాస్త్రి గారితో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని ,మద్రాస్ లో వారింటికి నాలుగైదు సార్లు వెళ్ళిన విషయమూ వారితోవారి కుటుంబం తో మద్రాస్ లో ఉన్న వారి పెద్దక్కయ్య పెద్దబవ గారు కీ .శే.  గాడేపల్లి లోపాముద్ర ,కృపానిధి గారల   బంధుత్వమూ ,వారు తనను తన మేనకోడలు సత్యకళను కారు లో త్యాగరాజనగర్ ,పాండీబజార్ లలో త్రిప్పిన మధురమైన రోజులను గుర్తు చేసుకొన్నారు .కృష్ణశాస్త్రి గారు కాటూరి వెంకటేశ్వర రావు గారు తమ చిన్న తనం లో ఉయ్యూరు లో వారింటికి వచ్చి రెండు గంటలు తమ తలిదండ్రుల తో మాట్లాడిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొన్నారు . శ్రీమతి మందరపు హైమవతి చక్కని ప్రసంగం చేసి విద్యార్ధులకు కృష్ణ శాస్త్రి గారి జీవితం వ్యక్తిత్వం రచనలను సుబోధకం గా వివరించారు .’’కృష్ణ శాస్త్రి గారిని చూసి మాట్లాడిన దుర్గాప్రసాద్ గారు ధన్య జీవులు .వీరింటికి వారు వారింటికి వీరు వెళ్లి ణ బాంధవ్యం గొప్పది దుర్గాప్రసాద్ గారికి నా పాదాభి వందనాలు ‘’అని ఉద్వేగం తో  ఆనంద  పులకంకి తం గా  చెప్పారు .వారికి ప్రిన్సిపాల్ శ్రీ  పి. నాగ రాజు , ఉపాధ్యాయ బృదం గొప్ప సహకారం అందజేశారు .కృష్ణ శాస్త్రి గారి జీవితం సాహిత్యం పై పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందించాం .శ్రీ మాదిరాజు శ్రీనివాస శర్మ శ్రీ జాన్సన్ గార్లు కృష్ణ శాస్త్రి సినీ సన్ గీతాలను మధురాతి మధురంగా గానం చేసి రస డోలికలో ఊపేశారు . శాస్త్రి గారి గీతం ‘’జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి ‘’గానం చేసిన విద్యార్ధులందరికీ సరసభారతి బహుమతులను అందించింది .విద్యార్ధులకు సాహిత్యం చేరువ చేయాలన్న మా సంస్థ ఆశయం ఇలా మళ్ళీ నెరవేరింది .

శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుకలుగా 76 వ సమావేశాన్ని 15-3-15 ఆదివారం నిర్వహిస్తున్నాం . శ్రీ మంగళ గిరి ఆదిత్య ప్రసాద్ ,డా.శ్రీ శలాక రఘునాధ శర్మ ,డా.శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ ,శ్రీ గుత్తికొండ సుబ్బారావు ,ఆచార్య మన్నవ సత్యనారాయణ గార్లకు సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా  ప్రసాద్ గారు తమ  తలిదండ్రులు స్వర్గీయశ్రీమతి  గబ్బిట భవానమ్మ ,శ్రీ మృత్యుంజయ శాస్త్రి గారల స్మారక ఉగాది పురస్కారాలను  అందజేస్తున్నారు  .ప్రోత్సాహక పురస్కారులుగా శ్రీ కళాసాగర్ శ్రీమతి చలపాక -,శ్రీ బాషా (ఈనాడు ) ,శ్రీ రాజా ,(మనచానల్) శ్రీగూడవల్లి రామారావు (పోస్ట్ మాస్టర్ –ఉయ్యూరు ) శ్రీ ఫజులుల్ మొయిద్ (జాగృతి పొదుపు సహకార సంస్థ ఉయ్యూరు)కు అలాగే’’ స్వయం సిద్ధ ‘’ప్రత్యెక పురస్కారాన్ని శ్రీమతి పెద్ది భొట్ల సౌభాగ్య లక్ష్మి-(తెలుగు పండిట్ –ఉయ్యూరు) గారికి శ్రీ దుర్గా ప్రసాద్ దంపతులు  అందిస్తున్నారు .

శ్రీ దుర్గాప్రసాద్ రచాన ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’గ్రంధాన్ని శ్రీ  మంగళ గిరి ఆదిత్య ప్రసాద్                       ఆవిష్కరిస్తారు . ఈ గ్రంధ అంకిత  స్వీకర్త శ్రీ మైనేని  గోపాల కృష్ణ గారికి ,దీన్ని స్పాన్సర్ చేసి సరసభారతి తరఫున ముద్రిస్తున్న శ్రీ మైనేని వారి మేనకోడలు డా శ్రీమతి జ్యోతిగారికి ,వారి సోదర సోదరీ మణులకు (అమెరికా)ధన్యవాదాలు ,కృతజ్ఞతలు .సరస భారతి మిత్రులు ప్రముఖ హాస్య రచయిత శ్రీ తాడిమేటి సత్యనారాయణ రచన ‘’ త్యాగి పే రెడీలు+ పుస్తకాన్ని ‘’ను సరసభారతి తరఫున ముద్రించి ఈ సభలో శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ గారిచే  ఆవిష్కరింప జేస్తున్నందుకు ధన్యవాదాలు .దీనితో సరసభారతి ప్రచురణలు 16 ,అందులో శ్రీ దుర్గా ప్రసాద్ గారి రచనలు 10.

80 మంది  ప్రముఖ కవులతో ‘’ నవ్యాంద్ర ప్రదేశ్ ‘’అనే అంశం పై కవి సమ్మేళనం నిర్వహిస్తున్నాం . ముఖ్య అతిదిది గా  విచ్చేసిన శాసన మండలి మాజీ సభ్యులు శ్రీ వై . వి .బి .రాజేంద్ర ప్రసాద్ ,ఆత్మీయ అతిధులు  శ్రీ జంపాన పూర్ణ చంద్ర రావు ,(ఉయ్యూరు నగర పంచాయితీ చైర్మన్ ) శ్రీ చలసాని రాజేంద్ర ప్రసాద్ (ఆంధ్ర జ్యోతి ఇంచార్జ్ –విజయవాడ )డా.శ్రీ జి వి పూర్ణ చంద్  శ్రీ కలిమిశ్రీ (మల్లెతీగ మాస పత్రిక సంపాదకులు ) మొదలైన వారికి ధన్యవాదాలు ..సరసభారతిఅధ్యక్షులు నితోత్సాహి శ్రీ దుర్గాప్రసాద్ సరసభారతి  ,శ్రీ సువర్చలాంజనేయ స్వామి అనే రెండు బ్లాగులను నిర్వహిస్తున్నారు . .వీటి వీక్షకుల సంఖ్య మూడు లక్షల పాతిక వేలు అంటే అందరికీ ఆశ్చర్యమేస్తోంది .మా గౌర్వాధ్యక్షులు ,శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి ,కోశాధికారి శ్రీ గబ్బిట వెంకట రమణ ,సాంకేతిక నిపుణులు శ్రీ వి బి జి రావు ,మిగిలిన కార్య వర్గ సభ్యులకు వారందిస్తున్న సహకారానికి సేవకు సరస భారతి  కృతజ్ఞతాభి వందనాలందిస్తోంది . సరసభారతి కార్య క్రమాలకు హాజరౌతూ ప్రోత్సహిస్తున్న సాహిత్యాభిమానులకు ,కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేర్చి సహకరిస్తున్న మీడియా మిత్రులకు సదా కృతజ్ఞతలు .మా కార్య వర్గ సభ్యుల సహకారం మరువలేనిది అందరికీ శ్రీ మన్మధ ఉగాది శుభాకాంక్షలతో కృతజ్ఞతాభినందన వందనాలు .

 

మాదిరాజు శివ లక్ష్మి –సరసభారతి కార్య దర్శి

 

గీర్వాణ కవుల కవితా గీర్వాణం


నా మనసు లోని మాట –కృతి స్వీకర్త –శ్రీ మైనేని గోపాల కృష్ణ

ఇలా మొదలైంది–“సిద్ధయోగిపుంగవులు” మొదలుకొని , “మహిళామాణిక్యాలు” ,

“పుర్వాంగ్లకవుల ముచ్చట్లు”, “దర్శనీయ దైవక్షేత్రాలు” ఒకొక్కటీ ఎప్పటి కప్పుడు
శ్రీ దుర్గాప్రసాద్ గారు నాకు అంకితమివ్వాలనుకో వటo , నేను వాటి
స్వీకర్తులుగా సరియైనవారిని సూచించటం , వారు దానికి అంగీకరించటం
జరిగిపోయాయి . ఇప్పుడు “గీర్వాణకవుల కవితా గీర్వాణం” అంతర్జాలంలో
ధారావాహికంగా ప్రచురించిన దానిని నా ప్రమేయం లేకుండానే నాకు అంకిత
మివ్వటo నన్ను అమితాశ్చర్యాలకు గురిచేసింది . ఇంతటి పవిత్రమైన అమృతంలాoటి
రచనకు స్వీకర్త గా నాకున్న అర్హత శ్రీ దుర్గాప్రసాద్ గారికి నాయందున్న
అభిమానం మాత్రమే నని నా నిశ్చితాభిప్రాయం  .
తదుపరి , ఈవిషయాన్ని గురించి మేనకోడలు జ్యోతి తో సంభాషిస్తున్న సందర్భంలో
, జ్యోతి ఉత్సాహానికి నా ప్రోత్సాహం తోడై ఈ మహోన్నత విలువైన రచనను
పుస్తకరూపంగా ప్రచురిoచాలని, అందుకు జ్యోతి తoడ్రి గా రైన , మా పెద్దబావగారు
డా :  రాచకొండ నరసింహశర్మ గారి ఆశీస్సులతో ,అన్న సుధాకర్ , తమ్ముడు రమేష్,
చెల్లెలు సంధ్య(అంతా అమెరికా వాసులు ) లను కలుపుకొని సమిష్టిగా
ప్రాయోజకత్వం (స్పాన్సర్షిప్) వహించాలనుకొవటo , ఈసూచనకు శ్రీ
దుర్గాప్రసాద్ గారు  పచ్చజెండా ఊపటం ఒకదానివెంట ఒకటి దైవనిర్ణ యాలు గా
జరిగిపోయాయి.  వీరందరికీ నా ధన్యవాదాలు .

–మైనేని గోపాలకృష్ణ-  హన్ట్స్ హిల్  -అలబామా -అమెరికా  

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-

మనవి మాటలు

–                   రచన –గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

సాహితీ బంధువులకు శుభ కామనలు-సంస్కృత౦  లేక అమరభాష లేక గీర్వాణ బాషా కవుల సంక్షిప్త జీవితాన్ని వారి కవితా అమరత్వాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తులను ఈ తరం వారికి  పరిచయం చేయటానికి  ‘’గీర్వాణ కవుల కవితా  గీర్వాణం’’శీర్షకతో sసంస్కృత  కవుల పరిచయాన్ని చేయటానికి సాహసిస్తున్నానని సవినయం గా మనవి చేస్తున్నాను .146  మంది గీర్వాణ కవుల కవితా గీర్వాణమే ఇది .

శ్రీ చిలుకూరి నారాయణ రావు గారు రాసిన ‘’సంస్కృత కవుల చరిత్ర ‘’ ఎప్పుడో చదివిన గుర్తు మాత్రమె ఉంది .శీర్షిక మొదలు పెట్టి నాలుగైదు ఎపిసోడ్ లు రాసిన తర్వాత లైబ్రరీలో దానికోసం ప్రయత్నిస్తే లభించలేదు .వీకీపీడియా ఆధారం గానే మొదలు పెట్టాను .తర్వాత శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డి గారు పరిశోధన చేసి సంస్క్రుతకవి జీవితాలపై ఒక గ్రంధం రాశారని తెలిసి  మిత్రుడు శ్రీ కట్టుకోలు సుబ్బా రెడ్డి గారి దగ్గర ఉంటుందేమోనని వాకబు చేస్తే, ఉందని చెప్పి నాకు పంపించారు .కనుక ఈ వ్యాస పరంపరకు డాక్టర్ ముదిగంటి గోపాల రెడ్డి ,డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి గార్లు రచించిన ‘’సంస్కృత సాహిత్య చరిత్ర ‘’ముఖ్య ఆధారం అని మనవి చేస్తున్నాను .కాని ఇంకా కొత్త సంగతులేమైనా ఉన్నాయేమోనని గూగుల్ ను, తెలుగు వీకీ పీడయాలు వెతికి సేకరించి పొందుపరచాను .ముఖ్యం గా ఇంగ్లీష్ లో ఆయా గ్రంధాలను రాసిన వారు ఇంకా లోతుగా చర్చించి అనర్ఘ మణి రత్నాలను వెలువరించారు .వాటిని సేకరించి రాశాను  .యెంత చెప్పినా ఇంకా చెప్పాల్సింది ఉంది అనే అసంతృప్తి నాకు ఉంది .దాదాపుగా కవుల కాలాన్నిబట్టి మొదలుపెట్టి రాశాను .    ఆధునిక యుగం లో కూడా ప్రసిద్ధులైన సంస్కృతకవులున్నారు. గొప్ప గ్రంధాలే రాశారు ..వారిని గురించి కూడా రాశాను.

సాహితీ బంధువులకు శుభ కామనలు .‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’గా ఇంగ్లాండ్ ,అమెరికా దేశపు 125 మంది పూర్వకవుల పై రాసి ప్రచురించిన తర్వాత ,నా మనసులో ఒక బాధ పీడిస్తూనే ఉంది .మన దేశ పూర్వ కవులపై ఇంతవరకు రాయలేక పోయానే అనేది మనసులో తొలుస్తూనే ఉంది .ముఖ్యం గా మన సాహిత్యానికి మూలం సంస్కృతం కనుక పూర్వ సంస్కృత కవులపై రాసి ఆ లోటు భర్తీ చేయాలని పించింది .శీర్షిక కోసం రెండు మూడు రోజులు ఆలోచిస్తే ఫ్లాష్ గా ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’పేరు స్పురించింది .వెంటనే రాయటం మొదలు పెట్టాను .అది పెరిగి పెరిగి విస్తృత రూపం దాల్చింది .మధ్యలో కొద్ది రోజులు విరామం తర్వాత కొన సాగించి ఈ రోజుకు 95 ఎపి సోడ్ లలో ,146మంది సంస్కృత కవుల గురించి రాశాను .నా అంతర్జాల రాత ప్రయత్నాలలో ఇది చాలా బృహత్తరమైనదే .నేను రాసినవి చాలా ప్రాధమిక విషయాలే .వారిగురించి తెలుసుకోవాల్సింది చాలా ఉండి ఉంటుంది నాకు లభించిన సోర్సు ల నుండి గ్రహించిణ సమాచారాన్ని  మీ కు తెలియ జేశాను అంతే .ఇంకా ఎందరో నా దృష్టికి రాని వారు ఉండవచ్చు .

ఇంత మంది సంస్కృత  మహా కవులు, రచయితలను సంస్మరించగలిగాను .వారి గురు పరంపరను స్పృశించి ధన్యమయ్యాను .ఇది నా అదృష్టం గా భావిస్తున్నాను .ఇంకా నా దృష్టికి రాని వారిగురించి తెలుసుకొని వారినీ చేర్చే ప్రయత్నం చేస్తాను .అంత వరకు ఈ శీర్షిక కు ‘’మరొక కామా లేక మరో విరామం ‘’గా భావించండి .ఆదరించిన వారందరికీ ధన్యవాదాతో కూడిన కృతజ్ఞతలు .

మరొక ముఖ్య విషయం –నేను ఎప్పటికప్పుడు తనకు అంకితం ఇద్దామను కొన్న నాలుగు పుస్తకాలను ఒకటి ‘’సిద్ద యోగి పుంగవులు’’ను  తమ తల్లిగారు  కీ శే .మైనేని సౌభాగ్యమ్మగారికి ,రెండవది’’మహిళా మాణిక్యాలు ‘’ను  తన అర్ధాంగి శ్రీమతి సత్య వతి గారికి ,మూడవది ‘’పూర్వాం గ్ల కవుల ముచ్చట్లు ‘’ను తన బావ గారు డాక్టర్  శ్రీ రాచకొండ నరసింహ శర్మ –ఏం డి గారికి కి  నాల్గవది ‘’దర్శనీయ దైవ క్షేత్రాలు ‘’ను తన జీవితానికి మార్గ దర్శి అయిన ‘’కపటమెరుగని సౌజన్య సౌశీల్య మూర్తి’’ శ్రీ కోగంటి సుబ్బారావు గారికి అంకితం ఇవ్వమని చెప్పి ,ఇప్పించిన  స్పాన్సర్ గా ఉన్న ఉదార హృదయులు నాకు బహు ఆత్మీయులు ,సరసభారతి కి అత్యంత శ్రేయోభిలాషులు ,,మార్గ దర్శి శ్రీ మైనేని  గోపాల కృష్ణ –(అమెరికా )గారికి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అనే ఈ అంతర్జాల గ్రంధం ,అంతర్జాల సాక్షిగా –రూపాయి కూడా వారికీ నాకు ఖర్చు లేని విధం గా  వారి సాహిత్యాభి లాషకు ,సరస హృదయానికి ,సౌశీల్యతకు  స్నేహ ధర్మానికి మాతృ దేశాభిమానానికి మాతృభాషా భిమానానికి ,భారతీయ అధ్యాత్మకత పై ఉన్న గౌరవానికి ,  గుర్తింపు గా   10-1-2015న శ్రీ గోపాల కృష్ణ గారి 80 వ జన్మ దినోత్సవం సందర్భం గా ఇప్పుడే కృతజ్ఞతా పూర్వకం గా , చిరుకానుక గా ఈ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’అంతర్జాల గ్రంధాన్ని  అంకితమిస్తున్నాను  .      ఇదేదో వారిని మభ్య పెట్టి గ్రంధ రూపం లో దీనిని తీసుకు రావానే ఆలోచన తో మాత్రం కాదని ,వారు ‘’ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న అంకిత విషయం ‘’పై నా  నిర్ణయమే నని సవినయం గా మనవి చేస్తున్నాను .వారికి తెలియ బరచ కుండా నే  నేను చేసిన ఈ సాహసానికి గోపాల కృష్ణ గారు సహృదయం తో అర్ధం చేసుకొంటారని భావిస్తున్నాను .

ఇది రాసిన సుమారు ఇరవై రోజులకు ఒక రోజు రాత్రి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు అమెరికా నుండి ఫోన్ చేసి ‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’ను పుస్తకం గా తీసుకొని రావటానికి తన మేన కోడలు ,తన బావ గారు డా .రాచకొండ నరసింహ శర్మ –ఏం. డి .గారి కుమార్తె  శ్రీమతి డాక్టర్ జ్యోతి ఉత్సాహం గా ఉందని  నేను ఒప్పుకొంటే వెంటనే ఆ పని ప్రారంభిద్దా౦  అన్నారు  .సంతోషం గా అంగీకరించాను .దీన్ని మార్చి 15 వ తేదీ సరసభారతి నిర్వహించే శ్రీ మన్మధ ఉగాది సంబరాలలోఆవిష్కరించాలని భావించాం .మర్నాడు ఉదయం శ్రీ చలపాక ప్రకాష్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పా .మీరందరూ అంత ఉత్సాహం గా ఉంటె సమయం రెండు నెలలే ఉన్నా ప్రయత్నించి గ్రంధాన్ని తెద్దాం .అన్నారు .ఏంతో ఆనందమేసింది ,ఇక పని ప్రారంభించాం ..ఇంతమంది సాహితీ మూర్తుల సహకారం లభించింది .అందుకే పుస్తకం ఈ రూపం దాల్చింది .దీనికి శ్రీమతి జ్యోతిగారినకి వారి సోదరే సోదరీమణులకు (అమెరికా) ,అంకితం తీసుకుంటున్న ఆత్మీయులు శ్రీ మైనేని గోపాలకృష్ణ గారికి ,ముద్రణ బాధ్యతలను మా తరఫున స్వీకరించిన శ్రీ చలపాక ప్రకాష్ గారికి కృతజ్ఞతలు .అడిగిందే తడవుగా పెద్ద మనసు తో అంగీకరించి గ్రంధానికి స్పూర్తి దాయక మైన ముందు మాట’’అంతరింద్రజాలం ‘’ రాసిన సహృదయ ఆత్మీయ సాహితీ మూర్తి డా.శ్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారికి కృతజ్ఞతాపూర్వక సహృదయ ప్రణామాలు  అందజేస్తున్నాను .సరసభారతి వీరందరికీ ఆత్మీయ ధన్యవాదాలు తెలియ జేస్తోంది

ఈ పుస్తకం సరసభారతి ప్రచురించిన 15 వ గ్రంధం నేను రాసిన 10 వ గ్రంధం .అంతర్జాలం లో నేను రాసిన ఆరవ పుస్తకం .ఇదంతా సరస్వతీ దేవికరుణా , మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి వారల అనుగ్రహం ,మా కుటుంబ సభ్యుల అందునా ముఖ్యం గా నా సతీమణి శ్రీమతి ప్రభావతి సహకారమే   అని సవినయం గా  మనవి చేస్తున్నాను ..

ఎందరో మహాను భావులు. అందరికి వందనములు

‘’గీర్వాణ కవుల కవితా గీర్వాణం ‘’గ్రంధ రచనకు సహకరించిన పుస్తకాలు

1-డా.శ్రీ ముదిగంటి గోపాల రెడ్డి ,డా.శ్రీమతి ముదిగంటి సుజాతాదేవి రాసిన ‘’సంస్కృత సాహిత్య చరిత్ర ‘’‘’

2- తెలుగు విజ్ఞాన సర్వస్వం  ,

3–20 వ శతాబ్ది తెలుగు వెలుగులు (1,2 భాగాలు )-పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం ప్రచురణ

4-వీకీ పీడియా

మొదలైనవి

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ –ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.