ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -22
11- లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ -2
లూసీ ని ఎలా ఎందుకు ఫ్లాబర్ట్ ప్రేమించాడో అర్ధం కాక అతని మిత్రులు జుట్టు పీక్కున్నారు .ఆమె స్వతం ప్రకటనా చాతుర్యం లో దిట్ట అని ,అందరి దృష్టిని ఆకర్షించటానికే తాపత్రయ పడుతుందని ‘’she had a natural lack of naturalness ‘’అని బల్ల గుద్ది మరీ చెప్పారు .ఇవేమీ మనవాడికి కనిపించలేదు ఆమె అంటే ఒక విపరీతమైన ఫాసినేషన్ మాత్రమే ఉంది..తండ్రిని ,సోదరిని కోల్పోయి శూన్యం లో బతుకుతున్న ఫ్లాబర్ట్ ను ఆమె ‘’he was sexually aroused .as an un tamed buffello from the wild of America ‘’.అయినా ఫ్లాబర్ట్ చాలా జాగ్రత్తగానే వ్యవహరించాడు .మొదటిసారి ఆమెతో ప్రేమ విహార యాత్ర చేసి తిరిగి వచ్చాక ‘’నాకు భౌతిక ప్రేమ రెండవ స్థానం .నేను ఆనందాన్ని కల్గించిన మొదటి స్త్రీవి నువ్వే .ఇంకెవరూ లేరు .చివరిదాకా నన్ను అర్ధం చేసుకొంటావని ఆశిస్తున్నాను .నాదారిలో నిన్ను ప్రేమించే అవకాశం ఇవ్వు .నాకోపాలు తాపాలు ఉద్రేకాలు అన్నీ భరించగలవు అనుకొంటాను .నన్ను బలవంతం గా ఏ పనీ చెయ్య నివ్వద్దు .అప్పుడే నేను ఏదికావాలన్నా చేయగలను ‘’అని కుండ బద్దలు కొట్టి సారీ ‘’గుండె బద్దలు కొట్టి ‘’చెప్పేశాడు..ఇలా పూర్తిగా కొనసాగిందో లేదోకాని ఆమె బలవంత పెట్టినప్పుడు సంకోచించాడు ,ఆమె బాగా అడ్వాన్స్ అయితే వెనక్కి తగ్గాడు .తన తల్లికి ఇబ్బందికలిగించే ఏ పనీ చేయటానికి మాత్రం సాహసించ లేదు ఫ్లాబర్ట్ .ఆమెను తల్లికి తన ‘’లిటరరీ ఫ్రెండ్ ‘’అనే చెప్పాడు .
ప్రేమ వ్యవహారాలను గురించి రాసే విషయం లో ఫ్లాబర్ట్ కొంత ఆత్మ రక్షణ తోనూ కొంత తప్పించుకొనే పద్ధతిలోను రాశాడు .ఎవరు ఎలాంటి వారైనా ఫ్లాబర్ట్ కోరుకొన్నది ఏకాంతమే ‘’ఏ కాంతనూ’’ కాదు .ఎవరొ ఒకరు భార్యగానో మిస్త్రేస్ గానో ఉండటం అతనికి నచ్చనిపని .తనను తానూ పూర్తిగా పుస్తకాలకే అర్పించుకొన్న వ్యక్తీ ఫ్లాబర్ట్ .’’మంచి పరిశుభ్రమైన గది ,వెచ్చదనం ,కావలసినంత విశ్రాంతి అందుబాటులో అనంతమైన సాహిత్యం ఉంటె నాకు ఇంక ఏమీ అక్కరలేద’’న్నాడు .అతన్ని మురిపించటానికి మర్చిపోలేదని తెలియ జేయటానికీ లూసీ అప్పుడప్పుడు కానుకలు ,తన బెడ్ రూమ్ స్లిప్పర్లు అనేక రకాల జుట్టు కత్తిరింపులు పంపేది వీటికి బదులుగా ఫ్లాబర్ట్ ఆమెకు ఏమీ పంపేవాడుకాడు .కొత్త సంవత్సరం గిఫ్ట్ గా ‘’కిస్ ‘’అంద జేస్తున్నట్లు రాసేవాడు .ఆమెలో’’ ప్రేమ త్రాచు’’ బుసలు కొట్టేది .20 మీద పడినా ఫ్లాబర్ట్ ఇంకా ఒక్క పుస్తకమూ ప్రచురించలేదు .ఆతను ప్రాధమికంగా రచయిత ,ఆ తర్వాతే ప్రేమికుడు .సన్నివేశాలు ,సంఘటనలు ,అనుభవాలు ,భావోద్రేకాలు అన్నిటిని జాగ్రత్తగా అక్షర బద్ధం చేశాడు ‘’మేడం బోవరి ‘’నవలలో .ఈ రచనా వ్యాసంగం లో పూర్తిగా అంకితమైపోయి ప్రేమ కు క్రమంగా దూరమైపోయాడు .
రెండు పుస్తకాలు ‘’సెంటిమెంటల్ ఎడ్యుకేషన్ ‘’,టెంప్టేష న్స్ ఆఫ్ సెయింట్ ఆంథోని ‘’అన్న రెండు పుస్తకాల మీద తీవ్రం గా ద్దృష్టిపెట్టాడు .స్నేహితుడు డూకాంప్ తో తూర్పు దేశాలు తిరిగి వచ్చాడు .అలేక్సాండ్రియ ,నైల్ నది ,సిరియా ,కాన్ స్టాంటి నోపుల్ ,రోమ్ మొదలైనవన్నీ తిరిగి చూశారు .తల్లి అనుజ్న ఇచ్చింది .ఈ టూర్ అతని ఆరోగ్యానికి మేలు చేస్తుందని డాక్టర్లు సలహా ఇవ్వగా కొడుకు డిప్రెషన్ లోంచి బయటపడతాడని తల్లి ఆశించింది .చాలాకాలం గడుపుదామనుకొన్నా ఇంటి బెంగ పడి త్వరలోనే తిరిగి వచ్చాడు .నార్మండిలో ఉండగా నైల్ నదిని కలగనేవాడు .ఈపర్యటనకు ముందే డూకాంప్ ను ఇంటికి పిలిపించుకొని తాను రాస్తున్న టెంప్టే షన్స్ చాప్టర్లు చదివి వినిపించాడు .ఇందులో ‘’రోమాం టిజం ‘’ను పీకల్లోతుగా రాశాడు . ఫాంటసీ దట్టించాడు .దీన్నే ‘’ ఫాంట స్మ గోరియా ఆఫ్ మిత్స్ ‘’అన్నారు .ఇందులో దెయ్యం,రుషి కద పురాతనమైనదే ,నరకతీవ్రతలు,ఒలింపస్ దేవతలు ,హిందూ దేవా దేవతలు ,క్రిస్టియన్ మత ప్రీస్టులు ,భవిష్యత్ చెప్పే సూద్ సేయర్స్ ,నాగారాధకులు ,అమరవీరులు ,అద్భుతాలు స్పినిక్స్ వగైరా మసాలా అంతా దట్టించి నూరాడు .ఇదంతా చదివితే’’ ప్రోజ్ పోయెం’’అన్న అనుభూతి కలుగుతుంది .ఇవన్నీ చదివి వినిపించాడు డూకాంప్ కు .చదవటం పూర్తవగానే అంతా నిశ్శబ్దమే రాజ్యం చేసింది .చివరికి డూకాంప్ తల ఊపి షేక్ హాండ్ ఇచ్చి ‘’నువ్వు సంగీతం సృస్టిం చా లనుకోన్నావు .కాని రణగొణ ధ్వని తప్ప ఏమీ సాధించ లేకపోయావు ‘’అన్నాడు .అప్రతిభుడై నాడుకాని దీన్ని ఒప్పుకోలేదు .బౌల్హీట్ కూడా ఇదే అభిప్రాయం చెప్పాడు . ఏకీభవించని ఫ్లాబర్ట్ ఇరవై ఏళ్ళు అతనితో మాట్లాడలేదు ..చివరికి మళ్ళీ తిరగ రాసి ఏడేళ్ళు దాచిపెట్టాడు దాన్ని .1876 మార్పులు చేర్పులు పూర్తీ అయ్యాక ప్రచురించాడు .
ముప్ఫై వయసులో మన్మధ సౌందర్యం తో చుక్కల్లో చంద్రుడిగా వెలిగిపోయాడు ఫ్లాబర్ట్ .లూసీ మళ్ళీ ఊరిస్తూనే ఉంది .అతని తిరస్కారాన్నేమీ లెక్క చెయ్యలేదామే .ముగ్గులో దించే ప్రయత్నం మానలేదు .’’నువ్వు నా హృదయం వెనక గది లో కొలువై ఉన్నావ్.’’అని చెప్పి అతని తల్లి కి దగ్గరై ప్రయత్నాలు చేయ ప్రారంభించింది .ఆమె ఉన్న ఇంటికి వెళ్లగా తలుపు దగ్గరే నిలవరించి ఫ్లాబర్ట్ ఆమెను వెనక్కి పంపేశాడు .ఇంతమాత్రం చేత ఆమెకు ఉత్తరాలు రాయటం మాత్రం మానలేదు ఫ్లాబర్ట్ .టెంప్ టేషన్’’సబ్జెక్ట్ లాంటిదికాక వేరొక ప్రాజెక్ట్ మీద ఆలోచిస్తున్నాడు .ఫ్లాబర్ట్ స్నేహితుడు డాక్టర్ డిలానీ భార్య వలన ఇబ్బందులు పడి ఆత్మ హత్య చేసుకోన్నాడని తెలిసి మనసు కలత చెంది నాలుగేళ్ళు బాధా తప్త హృదయం తో గడిపి మేడం బావరి ‘’రాశాడు. అంతకు ముందెన్నడూ చూడని గొప్ప సాహిత్యానికి సృష్టికర్త అనిపించుకొన్నాడు ప్రపంచం లోనే గొప్ప నవలా రచయిత అని ప్రసిద్ధి చెందాడు .యదార్ధ వాది గా అవతారం ఎత్తాడు ఫ్లాబర్ట్ .దీన్ని చదివి సోమర్సెట్ మాం గొప్పగా స్పందించి ‘’Flaubert created the modern realistic novel and directly or indirectly influenced all writers of fiction since his day .The characters are drawn with consummate skill. It never occurs to us that they are figures in a novel..Homais is a creature as humorous as Mr Micawber as familiar to the French as Micawber is to the English ..అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-15 ఉయ్యూరు

