22 లక్షల గాజుల అలంకరణలో కుంకుళ్లమ్మ అమ్మవారి దర్శనం
- 22/03/2015
ద్వారకాతిరుమల, మార్చి 21: క్షేత్ర దేవతగా విరాజిల్లుతూ శ్రీవారి ఆలయానికి ఉపాలయమైన శ్రీకుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారు 2 లక్షల గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారికి ఉదయం, సాయంత్రం కుంకుమార్చనలతోపాటు గాజుల అలంకరణలో నిండుముత్తయిదువులా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే నిండు సౌభాగ్యం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
ప్రభుత్వానికి ప్రజల దీవెనలు అవసరం
జంగారెడ్డిగూడెం, మార్చి 21: రాష్ట్ర విభజనతో సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకుపోతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల దీవెనలు అవసరమని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత అన్నారు. ఆర్డీఒ ఎస్.లవన్న అధ్యక్షతన ఉగాది సందర్భంగా శనివారం స్థానిక రోటరీ కమ్యూనిటీ హాలులో జరిగిన పంచాంగ శ్రవణం, కవిసమ్మేళనం కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త రాష్ట్రంలో అనేక సవాళ్ళు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి శ్రీ మన్మధనామ సంవత్సరంలో అంతా శుభం కలగాలని ప్రజలు కోరుకోవాలన్నారు. ఉగాది పచ్చడి వలే ప్రతి ఒక్కరి జీవితాల్లో తీపి, చేదువలే సుఖ దుఃఖాలు ఉంటాయన్నారు. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోరాదన్నారు. రాష్ట్రంలో నూతన రాజధాని నిర్మాణం, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం ముఖ్యమంత్రి నిరంతర శ్రమ చేస్తున్నారన్నారు. ఆయనకు అందరూ సహకరిస్తే లక్ష్యాలు చేరువ కాగలవన్నారు. భవిష్యత్‌లో పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ ఉగాది నుండే రాష్ట్రానికి మంచి జరగాలన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఈ సందర్భంగా మంత్రి పీతల సుజాతను ఘనంగా సత్కరించారు. ఆర్డీఒ ఎస్.లవన్న, తహసీల్దార్ జివివి సత్యనారాయణ మహిళా ప్రజాప్రతినిధులతో మంత్రికి సత్కారం జరిపించారు. పంచాంగ శ్రవణం చేసిన గరిమెళ్ళ ప్రభాకరశాస్ర్తీ (్భను), పురోహితులు వెంపరాల ప్రసాదశాస్ర్తీ, రేమెళ్ళ సూర్యనారాయణశాస్ర్తీ, కవి సమ్మేళనం నిర్వహించిన టివి నరసింహారావు, కెఎల్ వీర్రాజు, టి.వి.రామకృష్ణ, వి.అప్పారావు, చావా రమేష్‌బాబు, నాట్యాచారిణి ఎస్.రూపాదేవి, జానపద, పౌరాణిక కళాకారులు ఎల్‌ఆర్ కృష్ణబాబు, నున్న కృష్ణయ్య, జొన్నకూటి వెంకటేశ్వరరావు, బుద్దాల సత్యనారాయణ తదితరులను మంత్రి ఘనంగా సత్కరించారు. పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం ఇఒ పెనె్మత్స విశ్వనాధరాజు (శివ) ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు నల్లూరు రవికుమారాచార్యులు తదితరులు మంత్రి సుజాతకు వేదాశీస్సులు అందజేశారు. తహసీల్దార్ జివివి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ బంగారు శివలక్ష్మి, ఎంపిపి కొడవటి మాణిక్యాంబ, సహకార సంఘ అధ్యక్షుడు వందనపు హరికృష్ణ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ అట్లూరి రామ్మోహనరావు, ఎంపిడిఒ పి.శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ బి.సాల్మన్‌రాజు, పలువురు ప్రజాప్రతినిధులు, టిడిపి నేతలు మండవ లక్ష్మణరావు, దల్లి కృష్ణారెడ్డి, షేక్ ముస్త్ఫా, కొడవటి సత్తిరాజు, రాజాన సత్యనారాయణ(పండు), పెనుమర్తి రామ్‌కుమార్, నంబూరి రామచంద్రరాజు, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్ పాల్గొన్నారు.

