ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -23

11-     లిటరరీ రియలిజం కు ఆద్యుడు గుస్టేవ్ ఫ్లాబర్ట్ -3

ఫ్లాబర్ట్ ను మేడం బోవరీ పాత్ర ఎవరు అని అడిగితె నిర్మొహమాటం గా ‘’Madame Bovary is me’’అని స్పష్టంగా చెప్పాడు .ఆ పాత్రలో ఉన్న అన్ని మంచి చెడు లక్షణాలన్నీ ఫ్లాబర్ట్ వే నన్నమాట .ఫ్లాబర్ట్ జీవితంపై రాసిన హేన్రీజేమ్స్ ‘’ఫ్లాబర్ట్ జీవితం ముత్యపు వేటగాని జీవితమే .అంతులేని నిధికోసం ఊపిరి సలపకుండా సాగే కార్యక్రమమే .ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ స్పస్టతనిస్తూ ,పునరుక్తిని పరిత్యజిస్తూ రచనకు అందం తెచ్చాడు ‘’అన్నాడు .తగిన మంచి మాట దొరికే వరకూ ఆలోచిస్తూనే ఉండేవాడు .ఒక సారి రెండు దిద్దుబాట్లకు మూడు రోజుల సమయం తీసుకొన్నానని స్వయం గా ఫ్లాబర్ట్ చెప్పాడు .ఏంతో  గొప్పగా రెండు లైన్లు చెప్పాలని పరితపించి సాధించాడు .బోవరీ నవల లేటెస్ట్ దే అయినా అదే అతని ప్రధమ ముద్రణ రచన అయింది .45 వయసులో దీనివిషయమే కోర్టు కేసు నడిచింది .అందులోని కొన్ని చాప్టర్లు అసంబద్ధం అని తొలగించాలని ప్రభుత్వం వాదించింది .ఎమ్మా బోవరి మరణ దృశ్యాలు మరీ ఇబ్బందికరం గా ఉన్నాయన్నారు .దీనికి ఫ్లాబర్ట్ లాటిన్ లో ఉన్న ఒకే ఒక్క పేజీని ఫ్రెంచ్ భాషలో రాశానే తప్ప తానేమీ అసంబద్దం గా రాయలేదన్నాడు .బోవరి రాసి ప్రచురించిన మూడు నెలలకు బాడేలేర్ రాసిన ఫ్లూర్స్ డూ మాల్ ప్రచురింపబడింది .

బోవరి లోని రచనా శైలికి చదువరి పెద్దగా అబ్బురపడ లేదుకాని  దానిపై వచ్చిన దుమారం తో బాగా పాప్యులర్ అయిన్దినవల .జనం నాలుకల మీద ఫ్లాబర్ట్ పేరే నర్తించింది పాప్యులారిటీ విపరీతంగా పెరిగింది ఈ ఊపులో ‘’సలమ్మ్బో ‘’నవల ప్రారంభించాడు .దీని ప్లాట్ కోసం ఆఫ్రికా సందర్శించాడు ఇందులో మొదటి ప్యూనిక్ యుద్ధం కద ఉంది .తాను రాయబోయే సబ్జెక్ట్ పై తీవ్ర పరిశోధన చేశాడు వందలాది పుస్తకాలు చదివి అర్ధం చేసుకొన్నాడు .ప్లినీ ,దియోడరాస్, హెర డోటస్ ,పసానియాస్ ,ఫిలస్త్రాటాస్ మొదలైన క్లాసికల్ రచయితల రచనలన్నీ ఆకళింపు చేసుకొన్నాడు .’’నా మనసులో యేవో అస్పస్టభావనలున్నాయి అవి స్పష్టమైన రూపం లోకి రావటానికి చాలాకాలం నిరీక్షిం చాను ‘’అన్నాడు .

సెంటిమెంటల్ ఎడ్యు కేషన్ పుస్తకాన్ని రాశాడు ఇరవై ఏళ్ళనుంచి ఆ సబ్జెక్ట్ మనసులో ఉంది .వయసు నలభై లో ఉండగా పబ్లిష్ చేశాడు .ఇందులో ‘’సైంటిఫిక్ రియలిజం ‘’లోకి మళ్ళీ ప్రవేశించాడు పార్శియన్ ఉన్నత ,మధ్యతరగతి జీవుల కద ఇది .క్రమంగా ఫ్లాబర్ట్ జీవితం లోకి దురదృష్టం దొంగచాటుగా ప్రవేశించిది.యాభై వ పదడిలో స్వంత దేశాన్ని ప్రష్యన్లు ఆక్రమించారు   .ఫ్రాన్స్ పరాజయాన్ని ప్రపంచ పరాజయం గా భావించాడు .ప్రపంచం అంతమై పోతోందని వ్యధ చెందాడు .అతని దృష్టిలో పగానిజం ,క్రిష్టియానిటి , కాంప్లసేన్సి(సంతృప్తి )అనేవి మానవ చరిత్రలో మూడు పరిణామాలు .(ఇవల్యూషన్స్).1869లో స్నేహితుడు బౌల్హేట్ మరణించాడు .’’నా ఆలోచనలను నా కంటే విస్పష్టం గా అర్ధం చేసుకొన్నవాడు బౌల్హేట్ ‘’అన్నాడు అతనిమరణం ఆశనిపాతమే అయింది .ఇంతలో తల్లి చనిపోయింది మరీ  కుంగిపోయాడు .విధి క్రూర పిశాచం అన్నాడు .ఎలీషా శ్లీసిన్గర్ మానసిక వ్యాధితో శరణాలయం లో ఉంటె ఫ్లాబర్ట్ ను అతని నీస్ దగ్గరుండి సపర్యలు చేసింది .ఎమిలీజోలా టర్గనీవ్ ,మపాసాలు వచ్చి చూసి వెళ్ళారు .

పుస్తకాలలోనే కూరుకు పోయి ఉతర ప్రత్యుత్తరాలు జరుపుతూ ఉన్నాడు ఫ్లాబర్ట్ .55 వయసులో ‘’ఏ సింపుల్ హార్ట్ ‘’అనే చిన్న కద రాశాడు .ఇతరులకోసం జీవిస్తూ ,విశ్వాసం ,మంచితనం ,ప్రేమ గుణం మూర్తీభవించిన వాడి కదఇది .బావార్డ్ అండ్ పెకూచేట్ అనే రచన పై తీవ్రం గా కృషి చేస్తున్నాడు .కాని పూర్తీ చేసే లోపే మరణించాడు .ఇందులో సగం ఫార్స్ సగం సెటైర్ ఉంది .56 వయసులో పాత జబ్బులు తిరగ బెట్టాయి .నిత్యం నరకమే అనుభవించాడు .అయినా రచనలో శైలికోసం ఆరాటం మాత్రం మానలేదు .బోవార్డ్ నవల సగం పూర్తీ అయింది ,’’అపాప్లేక్సీ ‘’జబ్బు వచ్చి ఒక రోజు పనిమనిషి ఆహారం తీసుకోచ్చేసరికి లైబ్రరీలో ఆఖరి శ్వాస పీలుస్తూ ఉన్నాడు .ఏరకమైన సహాయం అందించే అవకాశం లేకుండాపోయింది.  యాభై తొమ్మిదేళ్ళ వయసులో 8-5-1880 వాస్తవ సాహిత్య సృష్టికర్త గుస్టేవ్ ఫ్లాబర్ట్ వాస్తవం గా ఇహలోకాన్ని వీడాడు .పన్నెండు రచనలు చేసి కీర్తిపొండాడు

సంపూర్ణమైన శైలి కి ఫ్లాబర్ట్ ఉదాహరణ గ నిలిచాడు .అతని రచనలో రోమాన్స్ తో బాటు వాస్తవికత కూడా ఉన్నది చనిపోయిన తర్వాత అతని సాహిత్య కీర్తి మరీ విస్తరించింది .ఫ్రాంజ్  కాఫ్కా కొట్జీ , నేబకోవ్ వంటి ఇరవైవ శతాబ్దపు రచయితలపై ఫ్లాబర్ట్ ప్రభావం బాగా ఎక్కువ .ముఖ్యం గా  ఫ్లాబర్ట్  వారసుడు ఫ్రాంజ్ కాఫ్కా అని చెప్పటం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు .అందరూ ఒప్పుకొన్న సత్యమే ఇది ..’’సింగ్యులర్ పోఎటిక్ ఎఫెక్ట్ ‘’అనేది ఫ్లాబర్ట్ సాధించిన ఘన విజయం .మేడం బోవరి నవలను మొదట్లో ఎవరూ సరిగ్గా అర్ధం చేసుకోలేదు .చనిపోయే నాటికి ‘’ఫ్రెంచ్ రియలిస్ట్ రైటర్ ‘’గా ప్రసిద్ధి పొందాడు ఫ్లాబర్ట్ .ఇరవైవ శతాబ్దపు అన్నిరంగాలలోని మేధావులు ఫ్లాబర్ట్ ను పొగడకుండా ఉండలేక పోయారు. అదీ తను సాధించిన అద్భుత విజయం .

 

Novelists should thank Flaubert the way poets thank spring; it all begins again with him. There really is a time before Flaubert and a time after him. Flaubert decisively established what most readers and writers think of as modern realist narration, and his influence is almost too familiar to be visible. We hardly remark of good prose that it favors the telling of brilliant detail; that it privileges a high degree of visual noticing; that it maintains an unsentimental composure and knows how to withdraw, like a good valet, from superfluous commentary; that it judges good and bad neutrally; that it seeks out the truth, even at the cost of repelling us; and that the author’s fingerprints on all this are paradoxically, traceable but not visible. You can find some of this inDefoe or Austen or Balzac, but not all of it until Flaubert.’’అన్నాడు జేమ్స్ వుడ్ అనే విమర్శకుడు ‘’హౌ ఫిక్షన్ వర్క్స్ ‘’గ్రంధం లో .

Inline image 1 Inline image 2

మరో ప్రముఖునితో కలుద్దాం

సశేషం

మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -23-3-15 ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.