|
అమెరికాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో మార్చి 26న తెలుగు ఆచార్యపీఠం ప్రారంభమవనున్నది. విశ్వేశ్వర రావుగారి కోరిక మేరకు ఆయన కుటుంబం ఈ పీఠాన్ని స్థాపించేందుకు సంకల్పించడం తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం. ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీలో తెలుగు ఆచార్య పదవికై మూలధనం ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు.
తెలుగు సాహిత్యానికి, పశ్చిమగోదావరి జిల్లాలో చిన్న ఊరు వసంతవాడకి, ఈనాటికీ వాడకంలో ఉన్న కేన్సర్ ఔషధం మిత్రమైసీన్‌కి, అమెరికాలో ఎమరీ విశ్వవిద్యాలయానికీ ఒక విచిత్రమైన అనుబంధం ఉంది. ఆ అనుబంధం తెలుసు కోవాలంటే, కొప్పాక విశ్వేశ్వరరావు గారి జీవిత చరిత్ర తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే, ఆయన జీవితం ఒక అద్భుత కాల్పనిక కథలా కనిపిస్తుంది.
కొప్పాక సీతాపతి, విజయలక్ష్మి గార్ల రెండవ కుమారుడు విశ్వేశ్వరరావు (1925-1998) విశ్వేశ్వర రావు. వాళ్ళది వసంతవాడలో ఒక పేద కుటుంబం. విశ్వేశ్వరరావు గారు వారాలు చేసుకొని చదువుకున్నారు. క్రమంగా ఆయన ఇరవైమూడేళ్ళ వయసులో ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రసాయనశాస్త్రంలో డాక్టరేట్ పట్టా పుచ్చుకొని, తరవాత అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్శిటీ లో బయోకెమిస్ర్టీలో మరొక డాక్టరేట్ డిగ్రీ తెచ్చుకున్నారు. 1954 లో ఆయన, భార్య సీత గారితో సహా అమెరికాకి వలస వెళ్ళారు. అక్కడ ఫైజర్ కంపెనీలో పరిశోధకుడిగా చేరారు. సహజంగా ప్రకృతిలో దొరికే పదార్థాలను కేన్సర్ నివారణకి ఔషధాలుగా ఉపయోగించే విషయమై కొప్పాక వారు పరిశోధన చేసారు. ఆ పరిశోధన ఆయనకి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చింది. ఆయన కనిపెట్టిన ‘మిత్రమైసీన్,’ అనే మందు ఇప్పటికీ కేన్సర్ నివారణకి వాడుతున్నారు.
విశ్వేశ్వర రావు గారికీ, సీతగారికీ ప్రాచీన తెలుగు సాహిత్యం అన్నా, సంగీతం అన్నా, వల్లమాలిన ఇష్టం. ఆయన తిక్కన్ననీ, పోతననీ తన పిల్లలకీ ఆప్యాయంగా వినిపించేవారు. ఆయన జీవితం చివరి రెండు సంవత్సరాలలో తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్ర, సంప్రదాయం – అమెరికాలో పెరుగుతున్న భారతీయులకీ, అమెరికనులకీ చెప్పవలసిన అవసరం ఉన్నదని గ్రహించి, ఆ పని చెయ్యడానికి విశ్వవిద్యాలయాలే తగిన స్థానాలని గుర్తించి అమెరికాలో ఏదయినా ఒక పెద్ద విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నారు. కాని, అది ఆయన బతికి ఉండగా చెయ్యలేకపోయారు. ఆయన కోరిక తీర్చడానికి వారి సతీమణి సీత గారు, పిల్లలు వెంకటరామారావు, జయ రావు 2000 సంవత్సరంలో కొప్పాక ఫామిలీ ఫౌండేషన్ స్థాపించారు.
అట్లాంటాలో ప్రసిద్ధికెక్కిన ఎమరీ యూనివర్శిటీలో తెలుగు పీఠం ఏర్పాటు చెయ్యడానికి పదిహేను లక్షల డాలర్లు (సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు) కావాలి. అందులో సగం, అంటే 750,000 డాలర్లు (దాదాపు నాలుగున్నర కోట్ల రూపాయలు) ఇచ్చి, మిగతా సగం ఎమరీ యూనివర్సిటీని ఇతర దాతల సహాయంతో కూడబెట్టుకోమని చెప్పారు. కాని గత ఐదు సంవత్సరాలలో, దేశవ్యాప్తంగావున్న తెలుగు సాంస్కృతిక సంస్థలు, తెలుగు దేశపు ప్రభుత్వాధికారులు, ఇక్కడి తెలుగు ధనవంతులూ – ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో, ఈ ఆచార్య పదవి ఏర్పడదనే అనుమానం వచ్చింది. అప్పుడు, కొప్పాక ఫామిలీ ఫౌన్‌డేషన్ వారే కల్పించుకొని, ఆ రెండవ భాగం, తామే ఇస్తామని వాగ్దానం చేసారు.
ఇప్పుడు, మార్చి 26, 2015న ఎమరీ యూనివర్శిటీలో తెలుగు ఆచార్యపదవి నెలకొల్పబడబోతున్నది. దాని పేరు ఆధికారికంగా ‘ఖీజ్ఛి ఠిజీటఠ్ఛీటఠ్చీట్చ ఖ్చౌ ్చుఽఛీ టజ్ట్చీ జుౌఞఞ్చజ్చు ్కటౌజ్ఛటటౌటటజిజీఞ జీుఽ ఖ్ఛీజూఠజఠ ఇఠజూఠ్టఠట్ఛ, ఔజ్ట్ఛీట్చ్టఠట్ఛ, ్చుఽఛీ ఏజీట్టౌటడ్ విశ్వేశ్వర రావుగారి కోరిక తీర్చడానికి వారి పిల్లలు ముందుకు వచ్చి, మాటలతో కాకండా, చేతలద్వారా మార్గదర్శకత్వం వహించడం అందరు తెలుగువాళ్ళూ గర్వించదగ్గ విషయం. ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీ లో తెలుగు ఆచార్య పదవికై మూలధనం ఇవ్వడం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. ఇది కాక కొప్పాక ఫౌండేషన్ వారు, ఇంకా చాలా జనహిత కార్యక్రమాలకి అమెరికాలోను, తెలుగునాట విరాళాలు ఇస్తున్నారు.
1998లో విశ్వేశ్వర రావు గారి గుండెకి శస్త్ర చికిత్స జరిగింది. ఆయన వైద్యశాలలో ఉండగా, వారి పిల్లల – ఇద్దరూ వైద్యులే!- వైద్య వ్యవస్థలో ఉన్న లోపం చాలా బాధ కలిగించింది. డాక్టర్లకీ, రోగులకీ, వారి కుటుంబ సభ్యులకీ మధ్యన అన్యోన్యత పెంపొందించడం చాలా అవసరమని, ప్రస్తుతం వైద్యవిద్యాలయాలలో పరిస్థితులు అందుకు అనుకూలంగా మారేటట్టు చెయ్యాలని వారు అనుకున్నారు. అందుకోసం ఇప్పటివరకూ, పదిహేడు వైద్యవిద్యాలయాలలో ఇరవై ఆరు సందర్శకాచార్య పదవుల కోసం విరాళాలు ఇచ్చారు. వర్జీనియా వైద్యవిద్యాలయంలో ఉపన్యాసక పదవికి శాశ్వత నిధి నెలకొల్పారు. (ఈ కార్యక్రమానికి ప్రేరణ అయిన సందర్బాలని చర్చిస్తూ డా. వెంకటరమణ రావు, డా. జయ రావు గారు కలిసి రాసిన వ్యాసం, ‘‘శాంతి’’ అన్న మకుటంతో ప్రసిద్ధ వైద్య శాఖ పత్రిక (అుఽుఽ్చజూట ౌజ ఐుఽ్ట్ఛటుఽ్చజూ క్ఛఛీజీఛిజీుఽ్ఛ, ఠిౌజూఠఝ్ఛ 137, ూఠఝఛ్ఛట 2002) లో ప్రచురితమయ్యింది. అంతే కాకుండా, ఆర్థికంగా, సాంఘికంగా వెనుకబడిన విద్యార్థులకి ప్రత్యేక సహకారం కోసం కొప్పాక ఫౌండేషన్ నిధులు కేటాయించడానికి ప్రయత్నిస్తున్నారు. కొప్పాక ఫౌండేషన్ పేరుతో తెలుగు భాషకి అమెరికాలో చేసిన ఉపకారం, ఇంతకు పదింతలై పదిమందికి మార్గదర్శకం కాగలదని ఆశిద్దాం. తెలుగు భాష ప్రపంచ భాష అవడానికి నిజమైన దారి ఏర్పడుతుందని నమ్ముదాం.
– వేలూరి వేంకటేశ్వరరావు
ప్రవాస భారతీయులు, రచయిత
|

