తెలుగువారికి శ్రీరామచంద్రుడు ఇలవేలుపు. రామనామ స్మరణంతో తెలుగుపల్లెలు నిద్ర లేస్తాయి. ప్రజల్లో రామభక్తి బాగా నాటుకుని పోవడానికి భద్రాచల రామదాసు కీర్తనలే కారణం. రామదాసు కీర్తనలు నోటికి రాని తెలుగువారు లేరంటే అతిశయోక్తి కాదు. భద్రాచల రామదాసుగా పేరొందిన కంచర్ల గోపన్న తెలుగువారిపై వేసిన ముద్ర మరే వాగ్గేయకారుడు వేయలేదు.
త్యాగరాజస్వామి తెలుగువారైనా,ఆయన తమిళ నాడులోని తిరువాయూర్‌లోనే పెరగడం వల్ల ఆయన కీర్తనలు తెలుగువారిలోనే కాక,తమిళుల్లో ప్రాచుర్యాన్ని పొందాయి. భద్రాచల రామదాసు కీర్తనల్లో తెలుగు తనం ఉట్టిపడుతుంది. సామాన్యుల భాషలో ఈ కీర్తనల్లో మనకు కనిపిస్తుంది.ఉదాహరణకు అబ్బ,ఈ దెబ్బల కు ఓర్వలేనంటూ రామదాసు ఆలపించిన కీర్తనలో ఎంతో సహజత్వం ఉంది.
అలాగే, మనం ఎవరి నుంచైనా ప్రత్యుపకారాన్ని ఆశించి భంగపడినప్పుడు పాత విషయాలను గుర్తు చేయడం,ఒక విధంగా దెప్పిపొడవడం చేస్తుంటాం. రామదాసు కూడా తానీషా భటులు తనను కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు తాను చేయించిన చింతాకు పతకంతో సహా నగలను అలంకరించుకుని కులుకు తున్న ఓ రామచంద్రా ఈ దెబ్బలను భరించ లేకున్నానయ్యా అంటూ రామదాసు కీర్తనల్లో శ్రీరామ చంద్రుణ్ణి ఎత్తిపొడవడంలో ఎంతో సహజత్వం ఉంది. అలాగే, శ్రీరాముడు తన మొర ఎంతకీ ఆల కించడం లేదని సీతమ్మతల్లికి రామదాసు మొరపెట్టుకునే కీర్తన
కూడా తెలుగునాట ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందింది. ననుబోవమని చెప్పవే సీతమ్మతల్లి అనే కీర్తనలో ఎంతో ఆర్తి ఉంది.
సాధారణంగా తల్లి హృద యం వెంటనే కరుగు తుందనీ వెంటనే స్పంది స్తుందని మన నమ్మకం, అందుకే శ్రీరాముని కన్నా, సీతమ్మతల్లికి మొర పెట్టు కుంటేనే ఫలితం ఉంటుందని భావించి రామ దాసు ఈ కీర్తన ఆలపించి నట్టుగా అను కోవడంలో తప్పులేదు. ఇందులో కూడా ఎంతో సహ జత్వం ఉంది. అంతా రామ మయం, జగ మంతా రామ మయం అనే కీర్తనలో కూడా ఎంతో సహజత్వం ఉంది. శ్రీరామ నవమికి ఊరూ, వాడా అంతా రామ
క ల్యాణోత్స వాలతో ప్రతి గ్రామం, పట్టణం కళకళలా డాయి. వీధులను మూసివేసి చలువ పందిళ్ళు వేసి పెద్ద వేదికలపై శ్రీసీతారామ చంద్రస్వామి వారి పట్టాభిషేక మహోత్సవ తైలవర్ణ చిత్రాలు అలంకరించి ఆ వేదికలపై కల్యాణోత్సవాలను జరిపించి ఆనందించారు ప్రజలు. చిన్న,పెద్దా తేడా లేకుండా పానకం,వడపప్పు కోసం పోటీపడ్డారు. మండు టెండలను సైతం లెక్క చేయ కుండా రామ కల్యాణోత్సవాన్ని వీక్షించేందుకు ఆరుప దులు దాటిన వృద్ధుల నుంచి ఆరేళ్ళ వయసుగల బాల బాలికల వరకూ తరలి వచ్చారు. సీతా రామ కల్యా ణాన్ని తమ ఇంట్లో జరిగే పెళ్ళిలా సంభా వించడం తరతరాలుగా తెలుగువారికి అలవాటు అయింది. సీతా రామ కల్యాణాన్ని నిర్వహించక పోతే అరిష్టం కలుగు తుందన్న బెదురు, సెంటిమెంట్ బలంగా నాటు కునిపోవడమే ఇందుకు కారణం.మిగిలిన పర్వదినా లకూ,సీతారామ కల్యాణానికీ మధ్యతేడా ఉంది. మన ఇళ్ళలో జరిగే పెళ్ళిళ్ళకు శుభలేఖలపై సీతారాములు తలంబ్రాలు పోసుకుంటున్న చిత్రాన్ని ముద్రించడం, జానక్యాకమలాంజలిపుటే అనే శ్లోకంతో శుభలేఖ రాయడం తరతరాలుగా మనకు అలవాటు.తెలుగువారి జీవితాలతో సీతారామచంద్రుల కల్యాణోత్సవం ఎంతగా పెనవేసుకుని పోయిందోఈ శుభలేఖ ప్రచురణ సంకేతం. సీతారామచంద్రుల ప్రభావంతెలుగు వారిపై ఎంత ఉందో తెలియజేసేదే అంతా రామ మయం,జగమంతారామమయం అనే కీర్తన సారాంశం.
భవతరణం, పాపహరణం : నేడు కామద ఏకాదశి
చైత్ర శుద్ధ ఏకాదశి నాడు కామద ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం చేస్తారు. దీనినే సౌమ్య ఏకాదశి, దమన ఏకాదశి అని కూడా వ్యవహరిస్తారు. ‘ధర్మసింధు’ను అనుసరించి కామద ఏకాదశి నాడు విష్ణుపూజ, ఉపవాసం, జాగరణ ఆచరిస్తే శుభం చేకూరుతుంది. పాపాలు హరిస్తాయి. పాపాలను భస్మీపటలం చేస్తుంది కనుక దీనిని పాపవిమోచన ఏకాదశి అని కూడా పిలుస్తారు. స్త్రీలు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వైధవ్యదోషం ఉండదని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈతిథినాడే శ్రీకృష్ణునిని ఆందోళికోత్సవం కూడా జరుపుతారు. ఊయలలోని చిన్ని కృష్ణుని దర్శించినంత మాత్రాన్నే కలిదోషాలు హరిస్తాయి. కృష్ణ ప్రతిమను ఉయ్యాలలో ఉంచి ఊచితే జన్మజన్మల పాపాలు తొలగడమే కాక విష్ణు సాయుజ్యం సైతం లభిస్తుంది.

