|
కులబలం, జనబలం, ధనబలం, మంత్రబలం, ఔషధబలం, రసాలబలం, తపోబలం, యోగబలం ఇవి ఏవీ మనిషికి నిజమైన బలాన్ని ఇవ్వవు. ఆత్మబలమే నిజమైనది.. ఆత్మ అంటే ఎవరు? మన శరీరం కాదు. పంచేద్రియాలు కావు. ప్రాణము, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ ఒకొక్కసారి ఒక్కొక్కటిగా ఆత్మ అనిపిస్తూ ఉంటాయి. కానీ అవి కూడా అసలైన ఆత్మ కావు. వాటికున్న బలం నిజమైనది కాదు. వీటిని సమగ్రంగా పరిశీలిద్దాం.
చాలా మంది కులబలం వల్ల తమకు అమితమైన ప్రయోజనం ఉంటుందనుకుంటారు. కానీ దేహం అశాశ్వతమైనది. అది నశిస్తుంది. అందువల్ల కులబలంతో గర్వించేవారు కూడా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోవాల్సిందే. ఇదే విధంగా ధనాన్ని తీసుకుందాం. ఇది చంచల. ఎవరి దగ్గరా ఉండదు. చలామణిలో ఉన్నంత కాలమే దాని ప్రయోజనం. ఉదాహరణకు రూపాయి నోటు ఉందనుకుందాం. అది చలామణిలో ఉన్నంత కాలమే విలువ ఉంటుంది. దానిని చలామణి నుంచి తొలగించారనుకుందాం. అప్పుడు దానికి విలువ ఉండదు. అంతే కాదు. ఆ డబ్బును చూసి చాలామంది నేనే బలవంతుడిని’ అనే భ్రాంతికి గురవుతారు. కానీ ఆ బలం వ్యక్తిది కాదు. ధనానిది. ధనం ఉన్నంత వరకే మనుషులు చేరతారు. లేకపోతే అందరూ అదృశ్యమవుతారు. ఇక జనబలం విషయానికి వద్దాం. వేర్వేరు ప్రయోజనాల కోసం జనాలు ఎవరో ఒకరి పంచన చేరుతూ ఉంటారు. తమ ప్రయోజనాలు సిద్ధిస్తున్నంత కాలం వారు ఉంటారు. ఆ తర్వాత వేరే వ్యక్తి దగ్గరకు చేరతారు. ఇప్పుడు ఔషధ బలం గురించి తెలుసుకుందాం. ఔషధాలు మన శరీరంలో ఉన్న బలానికి ఆలంబనగా మాత్రమే పనిచేస్తాయి. ఇవన్నీ భౌతిక బలాలు. ఇక ఆధ్యాత్మిక బలాలను గమనిద్దాం. మంత్ర బలం కేవలం ఒక భావన. పునశ్చరణ, గురోపదేశం వీటిలో చాలా ముఖ్యమైనవి. ఈ రెండింటి ద్వారా బలం వస్తుంది. ఇవి దూరమైతే ఆ బలం కూడా తగ్గుతూ వస్తుంది. అంతే కాదు. మంత్రానికి బలాన్ని చేకూర్చటంలో మానసిక పరిస్థితి చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. తపస్సు వల్ల ఎన్నో సిద్దులు చేకూరుతాయంటారు. తపస్సు వల్ల బలం చేకూరుతుంది. అయితే ఇది స్థిరమైనది కాదు. చంచలమైన మనసుపై ఆధారపడి ఉంటుంది. మనసు మాయలో పడితే- తపస్సిద్ధి కూడా నశిస్తుంది. చాలా కఠినమైన నియమాలతో ఆచరిస్తే తప్ప తపోబలం వల్ల శ్రేయస్సు కలగదు. యోగబలం పరిపూర్ణమైనదే. కానీ దాని ద్వారా బలాన్ని పొందటం అతి కష్టం. వీటిన్నింటిని విశ్లేషించిన మీదట- ఆత్మబలమే నిజమైదనే విషయం తెలుస్తుంది. ఆత్మ అంటే ఈ దేహం కాదు. ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు. మరి ఏమిటి? అంటే వీటి అన్నింటిని దాటిన తానైన సచ్చిదానందం. అది అన్ని ప్రాణులకు కూడా ఆత్మ అయి ఉంటుంది. దానినే పరమాత్మ అని అంటారు. ఆ పరమాత్మను ఆశ్రయించడమే పరమానందం. దానిని పొందడానికి పూర్వీకులైన శంకర భగవత్పాదుల అద్వైత అమృతాన్ని చెప్పే గురువులను అశ్రయించాలి. ఈ లోకంలో గురువులు అనేకమంది ఉంటారు. పైన చెప్పిన యోగము, మంత్రము ఇత్యాదులు చెప్పవచ్చు. కాని ఆత్మ జ్ఞానం చేత కలగని ఏ బలమైనా వ్యర్థమే. శాశ్వత ఆనందాన్ని కలిగించవు.
స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి
విశాఖ శారదా పీఠాధిపతి
9966669658
|
|
సంప్రదాయం అనే మాట వినగానే కొందరికి ఆదరభావం కలగవచ్చు. మరికొందరికి ఒక చాదస్తమైన మాటలాగ అనిపించవచ్చు. ప్రపంచమంతటా అన్ని సమాజాలలో తమతమ సంప్రదాయాన్ని నిలుపుకోవాలనే తపన ఎల్లప్పుడూ ఉంటుంది. అలా నిలుపుకోవడం ఒక సవాలు. ప్రపంచీకరణ నేపథ్యంలో దీని అవసరాన్ని పరిశీలించాల్సి ఉంది.
సంప్రదాయం అనే పదానికి ‘బాగ అందించడం’ అని అర్థం. ‘సం’ అంటే సంపూర్ణంగా, ‘ప్ర’ అంటే ప్రభావవంతంగా, ‘దాయ’ అంటే ఇవ్వడం. మన పెద్దవాళ్ళు మనకిచ్చిన సంస్కృతిని మన పిల్లలకి అందించడం ఇందులోని ముఖ్య విషయం. ఈ సంస్కృతిలో రెండు విభాగాలు- సాంఘిక జీవితం, విలువలు అనేది మొదటిది, మత సంబంధమైన విశ్వాసాలు రెండవది. విజ్ఞానశాస్త్రం యొక్క ఆవిష్కరణలు సమాజంలో తెస్తున్న మార్పులు పై రెండు అంశాల్నీ తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇది మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో, ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో విజ్ఞానశాస్త్రం మనిషి జీవితాన్ని సులభం చేసింది కాని మానవసంబంధాలు కుటుంబవ్యవస్థపై చాలా ప్రభావం చూపింది. అలాగే మతవిశ్వాసాలపై కూడా ప్రభావం చూపింది.
పాశ్చాత్యదేశాల్ని చూసి మనం జాగ్రత్తపడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ దేశాల్లో నలభై శాతానికి పైగా పిల్లలు పెళ్ళికాని జంటలకు పుట్టేవారు. సింగిల్ పేరెంట్, అంటే తల్లికాని, తండ్రికాని మాత్రమే పిల్లల బాధ్యత చూడటం పరిపాటి. దీన్ని ఆ సమాజాలు అంగీకరించాయి. అలాగే పద్దెనిమిదేళ్లు రాగానే ఇంటిని వదిలి వెళ్ళే యువతను పోషించే బాధ్యత ప్రభుత్వానిదే. అలాగే వృద్దుల్ని పోషించే బాధ్యత ప్రభుత్వానిదే. సమాజ భద్రతకై(టౌఛిజ్చీజూ ట్ఛఛిఠటజ్టీడ) ప్రభుత్వాలు తలకు మించిన భారాన్ని మోస్తున్నాయి. దీనికి తోడు స్వలింగ వివాహాలు ఒక సమస్య. ఎన్నికల సమయంలో ఇదొక ముఖ్య విషయం. మనదేశంలో నాయకులు రాయితీలు ప్రకటించినట్లే ఆ దేశాల్లో స్వలింగవివాహాలు చేసుకున్న వారికి నేతలు రాయితీలు ప్రకటిస్తారు. ప్రభుత్వ పన్నులలో రాయితీలు ఉండటం, కుటుంబాలకు ఇచ్చే రాయితీలన్నీ వీరికి ఇవ్వడం ప్రభుత్వాలకు తలనొప్పి. సమాజ జీవనం ఇలా ఉండగా మత విశ్వాసాలు కూడా క్షీణించడం మరొక తీవ్ర సమస్య. ఈ రెండూ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతూ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కుటుంబవిలువలు నశించడం వల్ల ప్రభుత్వాల ఆర్ధికవ్యవస్థపై తీవ్రప్రభావాన్ని చూపడం గమనించగలం.
మన సమాజంలో మార్పులు ఇంతటి తారాస్థితికి రాలేదు. దాదాపు తల్లిదండ్రులందరూ తమ పిల్లల విద్యకు ప్రాధాన్యమివ్వడం ఒక ప్రశంసనీయమైన విషయం. ఇందులో తల్లుల పాత్ర ఎక్కువగా ఉంది. ప్రతి సీ్త్ర తన పిల్లలు తన భర్తకన్నా ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంటుందని ఒకానొక విశ్లేషకుడు చెప్పాడు. ఈ ఉద్యోగం మా ఆయనకే చాలు, మా పిల్లవాడు పెద్ద ఉద్యోగం చేయాలి అనే భావన ఇల్లాలిది. అలాగే మన వివాహ సంబంధాల్లో తీవ్రమైన ఒడుదుడుకులు రాలేదు. కుటుంబాల్లో పొదుపుచేసి అలవాటు ఉండడం వల్ల కుటుంబ బాధ్యత ప్రభుత్వం తలపై పడడం లేదు.
ఈ రోజుల్లో ఆర్థికశాస్త్రవేత్తలు జాతీయ రుణం గూర్చి చెబుతూ ప్రతి మనిషికీ పుట్టుకతోనే కొన్ని వేల రూపాయల రుణం తలపై ఉంటుందని చెబుతారు. అలాగే మన ప్రాచీనులు పుట్టుకతోనే ప్రతి మనిషి మూడు విధాలైన ఋణాలతో పుడతాడని ఒక సిద్ధాంతం చేశారు. అవి దేవఋణం (అంటే మతవిశ్వాసాల పట్ల ఆదరం కలిగి ఉండటం), పితృఋణం(తల్లిదండ్రులు, పెద్దల్ని గౌరవించడం), ఋషిఋణం(మన సంస్కృతిని రక్షించడం). పై మూడు ఋణాలూ సంప్రదాయం కొనసాగడానికి చెప్పబడినవే. ముఖ్యంగా ఋషిఋణం మన పెద్దలు, గురువులు అందించిన జీవన విధానాన్ని, విలువల్నీ రాబోయే తరాలకు అందించేది. మనం ఆచరిస్తూ, మన తర్వాతి తరంచే ఆచరింపచేయడం. ఇదొక రిలే పరుగుపందెం లాంటిది. రిలే పందెంలో ఒక వ్యక్తి పరిగెడుతూ తన చేతిలో ఉన్న కర్రముక్కను రెండో వ్యక్తికి అందిస్తాడు. రెండోవాడు మూడోవాడికి అందిస్తాడు. ఆ విధంగా పరుగుపందెం సాగుతుంది.
సంప్రదాయాన్ని నిలపడం ఆర్ధిక దృష్టికోణం నుండి కూడా అవసరమైన విషయం అని పైన గమనించాం. పారిశ్రామిక విప్లవం సమాజంలో కొంత మార్పు తెచ్చింది. ఆధునిక విజ్ఞానశాస్త్రం, కంప్యూటర్ రంగం మరింత మార్పు తెచ్చాయి. ప్రపంచీకరణ ప్రపంచ సంస్కృతిలోనే తీవ్రమార్పుల్ని తెస్తూంది. ప్రచార మాధ్యమాలు ముఖ్యంగా పాశ్చాత్య దేశాల అధీనంలో ఉండటం వల్ల ఆ దేశాల సంస్కృతే ప్రపంచమంతటా విస్తరిస్తూంది. ప్రేమికులదినం మొదలైనవి ఉదాహరణలు. ఒక ప్రాంతం యొక్క భాష మరొక ప్రాంతంపై ఎలా ప్రభావం చూపుతుందో, అలాగే ఒక సంస్కృతి మరొక సంస్కృతిపై ప్రభావం చూపుతుంది. దీన్ని ఇటీవలికాలంలో టౌజ్ట ఞౌఠ్ఛీట (దీన్ని మనం సాత్త్వికశక్తి అనవచ్చునేమో) అంటున్నారు. ఒౌట్ఛఞజి ూడ్ఛ అనే రచయిత ఈ పేరిట ఒక పుస్తకం కూడా రాశారు. (ఇంటర్నెట్‌లో దీని గూర్చి తెలుసుకోగలం). సైన్యాల్ని పంపి యుద్ధం ద్వారా ఒక సంస్కృతిని వ్యాప్తి చేయడం అనేది జ్చిటఛీ ఞౌఠ్ఛీట. దీని వల్ల అనేక నష్టాలు ఉంటాయి. శతృత్వం పెరిగి ఉగ్రవాద ప్రతీకారచర్యలకు దారితీయవచ్చు. పాశ్చాత్యదేశాలు దీన్ని బాగ గ్రహించాయి. అందువల్ల అన్ని విధాల ప్రచార మాధ్యమాల ద్వారా తమ టౌజ్ట ఞౌఠ్ఛీట ను బలపరుచుకుంటూ ప్రపంచదేశాల మీడియాలని నియంత్రించే వ్యూహాల్లో ఉన్నాయి. దండోపాయం కన్నా సామం మంచిదనే అభిప్రాయంలో ఉన్నాయి.
పై సవాళ్ళను భారతీయ సంస్కృతి ఎలా ఎదుర్కొంటోంది? ఇటీవల అనే ఆంగ్ల వ్యాసాల సంపుటిని రామకృష్ణ మిషన్ వారు ప్రచురించారు. వివిధ సంస్కృతులవారు తమతమ సంస్కృతుల విషయంలో ఎలాంటి వ్యూహాల్ని అనుసరిస్తున్నారు అన్నది ఇందులో విషయం. ఇతర సంస్కృతులు ప్రపంచాన్ని వ్యాపించే వ్యూహంలో ఉండగా భారతీయ సంస్కృతి తనను రక్షించుకునే వ్యూహాన్ని కూడా రచించడం లేదని ఇందులో చూడగలం. దీనికి సంబంధించిన వ్యాసాన్ని కూడా ఒక భారతీయ సంస్కృతిని అభిమానించే పాశ్చాత్య రచయిత వ్రాశాడు. భారతదేశంలోని మధ్యతరగతి ప్రజల్లో మిగిలి ఉన్న సంస్కారం కూడా కొంతవరకూ మన సంస్కృతిని నిలబెట్టి ఉంది. సంప్రదాయం అంటే పిలక, విభూతి పెట్టుకుని చాదస్తంగా ఉండాలని కాదు. మతవిశ్వాసాలకు అతీతంగా ఉన్న సిద్ధాంతం మన వేదాంత గ్రంథాల్లో ఉంది. మన ధర్మంలోని విలువలు రామాయణం, భారతం, సుభాషితాలు లాంటి పుస్తకాల్లో ఉన్నాయి. ఇటీవలికాలంలో కొన్ని మీడియా వర్గాల్లో ఈ అవగాహన రావడం సంతోషించదగిన పరిణామం. అలాగే తమ పిల్లలకూ, మనుషులకూ వేమనశతకం, సుమతిశతకం, భర్తృహరి సుభాషితాలు, భగవద్గీతలోని శ్లోకాలు నేర్పిస్తున్న తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు ఈ సంస్కృతిని నిలబెడుతున్నారనడంలో సందేహం లేదు. ఈ పద్యాలు, శ్లోకాలు చిన్న పిల్లల మనస్సుల్లో నాటే విత్తనాలలాంటివి. ఇవి ఎప్పుడో, ఎన్నో ఏళ్ళ తర్వాత ఫలాల్ని ఇవ్వవచ్చు. ఇవి దేశ భవిష్యత్తుకు పెట్టుబడిలాంటివి.
మన ప్రాచీనులు పుట్టుకతోనే ప్రతి మనిషి మూడు విధాలైన ఋణాలతో పుడతాడని ఒక సిద్ధాంతం చేశారు. అవి దేవఋణం (అంటే మతవిశ్వాసాల పట్ల ఆదరం కలిగి ఉండటం), పితృఋణం(తల్లిదండ్రులు, పెద్దల్ని గౌరవించడం), ఋషిఋణం(మన సంస్కృతిని రక్షించడం). పై మూడు ఋణాలూ సంప్రదాయం కొనసాగడానికి చెప్పబడినవే.
డాక్టర్ కె. అరవిందరావు
రిటైర్డు డీజీపీ
ఈ వ్యాసంపై మీ
అభిప్రాయాలను
navya@andhrajyothi.com కు పంపండి
|


