ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -28

 

13-వాస్తవికత పిత ,ఆధునికత కు ఆద్యుడైన నార్వేజియన్ నాటక రచయిత- ఇబ్సెన్-2(చివరిభాగం )

మొదటి రియలిస్టిక్ డ్రామా

 

మొట్టమొదటి రియలిస్టిక్ డ్రామా ‘’పిల్లర్స్ ఆఫ్ సొసైటీ ‘’ఇది ‘’ఐరానిక్  టైటిల్ ‘’.అందులో సమాజం లోని అసహ్యమైన వంచనను బహిర్గతం చేసే కదఉంది . చీకటి వ్యాపారులు ,డబ్బే ప్రధానం గా జీవించేవారు ,అబద్ధాల కోరులు వగైరా నీతిబాహ్యుల బండారం బయట పెట్టాడు .మధ్యతరగతి గౌరవం మీద ఇబ్సెన్ కు గౌరవం లేదు .పై ముఠా ద్రుత రాష్ట్ర కౌగిలిలో గిజ గిజా తన్నుకుంటున్న సామాన్యుడి గురించిన ఆరాటమే ఇబ్సెన్ ది .ఇది ఆనాటి దేశ రాజకీయ పరిస్తితికి ప్రతి బింబమే .సామాన్యుడికి శత్రువైన ప్రభుత్వ తీరు తెన్నులపైనే ఇబ్సెన్ ద్రుష్టి పెట్టాడు .తనకు సంప్రదాయసిద్ధమైన కానుక లేదన్నాడు .స్వేచ్చ అన్నిటికంటే ప్రధమ౦, ఉత్తమం అన్నాడు .’’destroy the false ideal –the State –make willingness and spiritual kinship the only essentials of unity –and you have the beginning of a liberty that has the same value ‘’అని సమాజానికి తెలియ జేశాడు .

తర్వాత రాసిన ‘’ఏ డాల్స్ హౌస్ ‘’,ఘోస్ట్స్ ‘’నాటకాలు రెండూ సమాజం లో పాతుకు పోయిన సంప్రదాయాలను మరింత తీవ్రం గా అధిక్షేపించినవే .’’పెళ్లి ఒక పవిత్ర కార్యం ‘’అన్న భావానికి విరుద్ధమైనవే .డాల్స్  హౌస్ లో హేల్మేర్స్  హాయిగా సెక్స్ సుఖాలను పొండాడు  .  నిజాయితీ ఉన్న లాయరు అయినా ,మంచి కుటుంబం లోను౦చి వచ్చినా భార్య నోరా   ఆదర్శ భార్యగా  కొంచెం చిలిపి గా   చూపాడు.భర్తకు తనమీద కంటే సంప్రదాయం మీదే ఆసక్తి ఎక్కువ అని ఆమె భావించింది .తాను ఇక ఏమాత్రం ‘’వుమన్లీ వుమన్ ‘’గా ఉండ దలచుకోలేదు .’భర్త మనస్తత్వానికి ’అద్భుతాలకే అద్భుతమై’’న విషయమై తన వ్యక్తిత్వాన్ని గుర్తి౦చె దాకా తిరిగి రాను అన్నది . భర్త భార్యను అర్ధం చేసుకొని అన్యోన్యం గా మెలగితేనే దాంపత్య జీవితం ఆనందమయం అనే భావన తెలియ జేశాడు ఇబ్సెన్. మనుష్యులలో పరి వర్తన రావాలని ఆశించాడు ..

రెండవ నాటకం ఘోస్ట్స్ విషాదాంత నాటకం .ఒక భార్య బిడ్డకు తల్లిఅయిన ఒక స్త్రీ ఆల్వింగ్  తన కుటుంబ బంధం సంప్రదాయ ఉక్కు కౌగిలిలో నలిగి నశించటం ఇందులో కద.’’లోకం ఏమనుకొంటుందో ‘’అనే భయం ఆమెను వెంటాడి కొడుకును రక్షించుకోలేక కోల్పోతుంది ..భర్తమీద కుటుంబం మీద ఒక తీవ్రమైన అపనింద మోపితే ,న్యాయం గా కొడుకునైనా రక్షించుకోవాల్సిన ఆమె తండ్రినుండి సంక్రమించే సిఫిలిస్ వ్యాధి తోకొడుకు  బతక రాదనుకోన్నది  .అది ఆనాడు సంఘం లో నిషేధమైనదే .

విమర్శల జడివాన

ఈ రెండు నాటకాలను పత్రికలూ ,ప్రజలూ తీవ్రం గా వ్యతిరేకి౦చినవే .డాల్స్ హౌస్ ను ‘’ఇమ్మోరల్ ‘’అన్నారు .సంఘం లోని అన్ని మర్యాదలను మంట గలిపింది అన్నారు .జర్మనీలో నాటకం తప్పనిసరిగా సుఖాంతం అవ్వాలి . బెర్లిన్ ,హాం బర్గ్ ,వియన్నా లలోని నాటక ప్రియులు ఆ నాటకాన్ని తమకోసమైనా సుఖాంతం చేయమని ప్రాధేయ పడ్డారు .తప్పని సరి పరిస్తితిలో ప్రింట్ లో మార్పు తెచ్చాడు ఇస్బెన్ .విమర్శకులు ఘోస్ట్ నాటకం పైన కురిపించిన విమర్శల జడివాన ,వాడిన అసభ్య పదజాలం భయంకరం గా ఉందని ఇబ్సెన్ జీవిత చరిత్రకారుదు ఇబ్సెన్ కు ఆంగ్ల అనువాదకుడు విలియం ఆర్చేర్  వాటిని సేకరించి వీటిని ‘’dictionary of Abuse ‘’లో చేర్చటానికి దాచిపెట్టాడు .దీనికి ‘’ఘోస్ట్స్ అండ్ గిబ్బరింగ్స్ ‘’అని పేరు పెట్టాడు .ఇది తర్వాత పాల్మాల్ గెజిట్ లో1891 లో అచ్చయింది .

వ్యంగ్య వైభవం

వివాహం  సంప్రదాయ విధానాలు పై తన కున్న అభిప్రాయాలను ఇబ్సెన్  ఖచ్చితంగా చెబుతూనే ‘’యాన్ ఎనిమీ ఆఫ్ ది పీపుల్ ‘’అనే మరో నాటకం రాసి మరికొన్ని సంప్రదాయాలను చీల్చి చెండాడాడు ..శీర్షిక వ్యంగ్య వైభవం తో విషాదం గా ఉన్నది .దీనిపై వాద ప్రతివాదాలు తారా స్తాయిలో జరిగాయి .జార్జ్ బ్రాండ్స్ మెజారిటీప్రజల అభిప్రాయాలు సరైనవి ,వాటినే అనుసరించాలి అని ఇబ్సెన్ కు హితోపదేశం చేస్తే ‘’the minority is always right ‘’ అని ప్రతిగా సమాధానమిచ్చాడు ఇబ్సెన్ .యాభై లో ప్రవేశించాడు .,.ఇబ్సెన్ సాహిత్య ప్రయాణం రొమాంటిక్ మలుపు దాటి రియలిస్టిక్ దారిలో ప్రయాణిస్తోందిప్పుడు .’’వైల్డ్ డక్’’నాటకం రాశాడు .ఇందులో దంపతులు తమ పాత జీవితాలను రోజూ తవ్వుకొని పోట్లాడుకుంటూ జీవితాన్ని దుర్భరం చేసుకొనే ఆలోచనలో ఉంటారు దీనిలోంచి బయటపడి ఐక్యత తో జీవించాలనే సందేశమిచ్చాడు .ఇందులోని స్త్రీ’’most impassioned ,purposeful ,and enigmatic woman ‘’అన్నారు విమర్శకులు .జనం బాగానే రిసీవ్ చేసుకొన్నారు .  మరోనాటకం ‘’ది లేడీ ఫ్రం ది సీ ‘’లో చక్కని సుఖాంతం ఉంది .ఇలా రాసినవి తక్కువ నాటకాలే ఉన్నాయి .’’హెడ్డా గేబ్లెర్ ‘’అనే మరోనాటకం లోని స్త్రీ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది .ఒంటరితనం తో బోర్ కొట్టి ,అసూయ పీడిస్తూ ,పెత్తనం కోసం పాకులాడుతూ ఉండే స్త్రీని గొప్పగా చిత్రించాడు .ఆమె ‘’నార్వీజియన్ లేడీ మేక్ బెత్  .’’అని పిస్తుంది .ఈ నాటకం తో మరింత తీవ్ర విమర్శకు గురయ్యాడు .

ముసలాయనకు దసరా పండగ

ముసలాయనకు అరవై మీద పడ్డాయి .పది హేడేళ్ళపడుచు పిల్ల ఎమిలీ బార్డాక్ తో మొహం లో పడి ముసిలోడికి దసరా పండగ అనిపించుకొన్నాడు .ఆమెను ‘’The May sun of my September life ‘’అని చెప్పుకొని జీవితం లోకి ఆహ్వానించాడు .పెళ్లి ,వెంటనే పెటాకుల్లా విడాకులు  అయిపోయి ముసలాయన ప్రపంచ యాత్రకు బయల్దేరాడు .అక్కడక్కడ ప్రేమ భామలు తగిలినా వెటపడకుండా జాగ్రత్త పడి కొంపకు తిరిగి వచ్చాడు .

ప్రపంచ ప్రసిద్ధి

ఇంకా పదిహేనేళ్ళు బతకాల్సి ఉంది ఇబ్సెన్ .ఈ కాలం లో రాసినవి మూడే మూడు నాటకాలు .’’దిలిటిల్ యియోల్ఫ్ ‘’,జాన్ గేబ్రియల్ బార్క్ మన్ ‘’వెన్ వు డెడ్ అవేకేన్ ‘’.మూడూ ట్రాజేడీలే .మొదటిది దిక్కుమాలిన విరమణ .రెండోది మృత్యు నాట్యం .మూడోది పునరుద్ధానికి ఆశగా కనిపించినా చివరికి విషాదమే ,ఇప్పటికే ఇబ్సెన్ కు ప్రపంచ ప్రసిద్ధ నాటక కర్తగా గుర్తింపు వచ్చేసింది .పంతర్జాతీయంగా అయన నాటకాలు అన్నిభాషల్లోకి అనువాదం పొందాయి .లండన్ లో ఇబ్సెన్ నాటకాలుప్రేక్షకులచేత  క్రోధాగ్ని కురిపించాయి .ఇస్బెన్ ను వెనకేసుకొచ్చి బెర్నార్డ్ షా సుదీర్ఘమైన సమాధానాలు చెప్పి వాటిలోని గొప్పతనాన్ని ఆవిష్కరించాడు .తనకు మించిన ప్రసిద్ధ నాటక కర్త ప్రపంచం లోనే లేడనే తిరుగు లేని నిజాన్ని ఇబ్సెన్ చాలాకాల విన్నాడు .

చరమ దశ

72 వయసులో మొదటిసారి గా గుండె పోటు వచ్చింది .రెండవ సారి స్ట్రోక్ వచ్చినప్పుడు మెదడు ,శరీరమూ దెబ్బ  తిన్నాయి .దేనిపైనా  ద్రుష్టి పెట్టలేక పోయాడు .రోజుకు అయిదారు పేజీలకంటే చదవ లేక పోయాడు .రాయటం అనేది అసాధ్యమే అయింది .అక్షరాలను కూడబలుక్కోవలసి వస్తోంది .మూడవ సారి గుండె పోటు వచ్చి ఇది కూడా దూరమై 78 వ ఏట మే నెల 23 న 1906లో ఇబ్సెన్ మరణించాడు .

నార్వేజియన్ నవలాకారుడు ,విమర్శకుడు కౌంట్ హామ్సేన్ ‘’A book keeper of dramatic art ‘’అన్నాడు .ఇబ్సెన్ మరణానంతరం ఎవరూ ఆయన స్థానాన్ని గురించి కామెంట్ చేయనే లేదు .మానవ అంత రాత్మకు సూటిగా సోకిన నాటకాలు ఇబ్సెన్ రాశాడు .సంఘం లో అప్పటిదాకా గౌరవింప బడ్డ నైతిక విలువలను సంప్రదాయాలను ప్రశ్నించాడు .’’Ibsen disturbed the accepted concepts of conduct ,proposed new moral values ,and in his very dramas of disaster and defeat ,suggested the imperative need as well as the inevitable triumph of truth ‘’ అన్నాడు గ్రంధ కర్త లూయీ అంటర్ మేయర్ .

 

నాటక శాలలో ఆధునికతను ప్రవేశ పెట్టిన మొట్ట మొదటి వాడు ఇబ్సెన్ .షేక్స్ పియర్ నాటకాలు ఆడినంత గొప్పగా ప్రపంచం మొత్తం మీద ఇబ్సెన్ నాటకాలే  ఆడాయి .డాల్స్  హౌస్ నాటకం ఇరవై వ శతాబ్దం లో ప్రపంచం మొత్తం మీద అనేక ప్రదర్శనలు పొంది రికార్డ్ సృష్టించింది .ఐరోపా సంప్రదాయం లో గొప్ప నాటక కర్త గా గుర్తింపు పొందాడు .పీర్ గింట్ నాటకం లో సర్రియలిజ ధోరణి కూడా ఉంది .షేక్స్పియర్ తర్వాత ఇబ్సెన్ కు మాత్రమెప్రసిద్ధ  నాటక రచయితగా గుర్తింపు వచ్చింది .ఇబ్సెన్ ప్రభావం బెర్నార్డ్ షా ,ఆస్కార్ వైల్డ్ ,ఆర్ధర్ మిల్లర్ ,జేమ్స్ జాయిస్ ,యూజీన్ ఒ నీల్ వంటి ప్రసిద్ధ నాటక కర్తలపై అమితం గా ఉంది .1902 ,1903 ,1904  లలో అంటే మూడేళ్ళూ ఇబ్సెన్ పేరు నోబెల్ ప్రైజ్ కోసం నామినేట్ చేయ బడింది .కాని దక్కలేదు .

ఇబ్సెన్ తన రచనలు డేనిష్ భాష అంటే నార్వే ,డెన్మార్క్ దేశాల భాషలోనే రాశాడు .ఆ భాషలోనే ముద్రణ పొందాయి .డ్రామా నిబంధనలను రియలిజం తో తిరగ రాసిన సాహసి ఇబ్సెన్ . దీన్నే చెకోవ్మొదలైన వారు  అనుసరించారు అవే ఇప్పుడు దియేటర్ లో రూల్స్ గా చెలామణీ అవుతున్నాయి వినోదాన్ని మించి సాంఘిక ప్రయోజనాన్ని నాటకాల ద్వారా అందించాలన్న ధ్యేయమే ఇబ్సెన్ కుండేది .జేమ్స్ జాయిస్ పై అమిత ప్రభావం కలిగించాడు .ఇబ్సెన్ నుపాత్ర చేసి జాయిస్ ‘’స్టీఫెన్ హీరో ‘’నవల రాశాడు నార్వే సమాజం లో ప్రముఖ మైన మంచి మార్పులన్నిటికీ ఇబ్సెన్ కారణ భూతుడయ్యాడు . .ఆధునికత నాటక రంగానికే కాదు జీవితం లోను రావటానికి ప్రధాన కారణం ఇబ్సెన్ .

2006 లో ఇబ్సెన్ శత జయంతి జరిగింది దాన్ని ‘’ఇబ్సెన్ యియర్ ‘’గా గౌరవించారు .ఇబ్సెన్ మ్యూజియం మళ్ళీప్రారంభమైంది  .మొత్తం 27 రచనలు చేశాడు .ఎడ్మండ్ గూస్ కు స్వదస్తూరితో ఇంగ్లీష్ లో ఇబ్సెన్ రాసిన ఉత్తరం .

 

 

Letter from Ibsen to his English reviewer and translator Edmund Gosse: “30.8.[18]99. Dear Mr. Edmund Gosse! It was to me a hearty joy to receive your letter. So I will finally personally meet you and your wife. I am at home every day in the morning until 1 o’clock. I am happy and surprised at your excellent Norwegian! Your amicably obliged Henrik Ibsen.”

Inline image 1   Inline image 2  Inline image 3

Inline image 4   

 

మరో ప్రముఖ వ్యక్తితో కలుద్దాం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-4-15- ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.