‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-2
లాల్ గోవింద్ భవిష్యత్
మధ్యలో ఈ లాల్ గోవింద్ ఎవరు ?అను కుంటున్నారా?ఆయనే సీతారామయ్యగారు .చిన్నప్పుడు తండ్రిగారు పెట్టిన పేరు అది .పుట్ట్టగానే తండ్రిగారు సీతారామయ్యగారి జాతక చక్రం వేయించి ఆయన ఇండియాలో ఉండరని ,బాగా చదివి గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదిస్తారని ,ఎప్పుడో ఒక కసారి మాత్రమె ఇండియాకు వస్తారని ,విదేశీ వనితనే వివాహం చేసుకొని సంతానం పొందుతారని తెలుసుకొన్నారు .అందుకోసం రామయ్య గారు ఏ నిర్ణయం తీసుకొన్నా సమర్ధించారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రత్యక్షంగా పరోక్షం గా సాయమూ చేశారు .ఇంగ్లీష్ వారు మనల్ని చాలా దారుణం గా అణచి వేసి మన స్వాతంత్ర్యాన్ని హరించి భాషా సంస్కృతులకు వినాశం కలిగించారని రామయ్య అభిప్రాయ పడ్డారు .కాని పది శతాబ్దాల క్రితం మనకు గొప్ప విశ్వ విద్యాలయం ఉండేదని అందులో దేశ విదేశాలకు చెందిన వారెందరో విద్య నేర్చి ఉన్నత స్థానాలు పొందారని చెప్పారు .13 వ శతాబ్దం లోనే భారతీయ నవలా సాహిత్యం పతనం చెందటం ప్రారంభించిందని ఆయన తండ్రి చెప్పేవారట .అయినా అద్భుత సాహిత్య సృష్టి జరిగింది అని అప్పటికి ఇంగ్లాండ్ లో సర్ వాల్టర్ స్కాట్ అనే నవలా కారుడు జన్మి౦ చనే లేదు అన్నారు .తన రాష్ట్రం లో కష్టపడితే తప్ప తిండి దొరికేది కాదని ‘చెమట గ్రామ లాండ్ స్కేప్’’ గా ఉండేదన్నారు .
ఒక సారినవాబుగారి రాణీకి పుట్టట గొడుగులు(ముష్రూమ్స్) ఇస్టమని తమ పొలం లో ఉన్న కుక్క గొడుగులు ఏరుకొని వెళ్ళటానికి ఒక రాజ సేవకుడు వస్తే తండ్రి గారు అనుమతినిచ్చి ‘’మేము కుక్క గొడుగులు తినం ‘’అని వ్యంగ్యం గా అన్నారట .తండ్రికి మానవత్వం పై అపార గౌరవం అని చెప్పేవారు .ఆయనంటే ప్రాణం ,ఆరాధనా క్రమంగా పెరిగిందే తప్ప తరగనే లేదు .జీవితం లో ప్రతి దశలోనూ తండ్రి తనకు బాసటగా నిలుస్తున్నారని వెనక ఉండి నడిపిస్తూ ఆశీర్వ దిస్తున్నారని రామయ్యగారు భావించేవారు .అపార జ్ఞాన సంపద సాధించాలని ,కొత్తవాటిని కనుక్కోవాలని నూతన విషయాలను సృష్టించాలని చిన్నప్పటి నుండి అనుకొనేవారు .
కొలచల వారి మూలాలు
కోలచల వారిమూలం మెదక్ జిల్లా లోని కోలచల గ్రామం .మహా వ్యాఖ్యాన కర్త మల్లినాద సూరి ది అదే గ్రామం .కోలా అంటే ఎలుగు బంటి అని అర్ధం .అచలం అంటే కొండ .అక్కడ నుంచి వలస వచ్చి ఉయ్యూరు దగ్గర యాక మూరు లో ఉంటున్నారు .సీతారామయ్యగారు 15-7-1899 న జన్మించారు .7 గురు సంతానం లో ఈయన చివరివాడు .తండ్రి వెంకట కృష్ణ శాస్త్రి పురోహితులు . తల్లి మూర్తమ్మ .ఉయ్యూరులో ప్రాధమిక విద్య నేర్చి ,మచిలీపట్నం లో సెకండరీ విద్య అభ్యసించారు .తండ్రి గారు పౌరోహిత్యం చేస్తున్నా ఆధునిక భావాలున్నవారు .గ్రామం లో పెద్దమనిషిగా తగాదాలు పరిష్కరించేవారు .జ్ఞాన బోధ చేసేవారు .వంశానుగతంగా వచ్చిన వేద విద్య రామయ్యగారి దాకా నిలబడింది .కాని బ్రాహ్మణులు ఉద్యోగం చేయటానికి ఇష్టపడేవారు కాదు .ఎవరైనా ఈ విషయమై ప్రశ్నిస్తే నవ్వి ఊరుకోనేవారు .హరిజనుల విషయమై ఆయన అభిప్రాయం గొప్పగా ఉండేది .’’మనమంతా నిజాం నవాబుకు, బేగం కు హరిజనులమే’ మనం ఇప్పుడు విజ్ఞాన యుగం లో ఉన్నాం .పురాతనకాలం లో మనం ఎవరు ఎవరి దగ్గర ’పడుకోన్నామో మనకు తెలీదు .అనేవారు .దీనిపై కొందరు మండి పడ్డారు . మిగిలిన వారు పెద్దగా పట్టించుకొనే వారుకాదు . అనంతకాల గమనం లో ఎవరు ఎవరికి వారసులో తేల్చటం కష్టం అని అనే భావం ఆయనది .మన మంత్రాలలో ఎక్కడా ఆర్య శబ్దం లేదని చెప్పేవారు .ఈ భావాలన్నీ విన్న సీతారామయ్యగారికి తండ్రిపై ఉన్న ఆరాధనాభావం రెట్టింపు అయింది .
రామయ్య గారి ఉన్నత విద్యాభ్యాసం – నడిచి మద్రాస్ చేరటం
ఆయనకు ఫిజిక్స్ గణితం పై అభిమానం. వాటినే ఎన్నుకొని మద్రాస్ లో చదువుకోవాలనుకొన్నారు .తండ్రిగారికి ఈ విషయం చెప్పారు .తండ్రిగారు పోరోహిత్యం ద్వారా సంపాదించినా కుటుంబ వ్యవహారాలకు దాన్ని జాగ్రత్త చేసేవారు .కాని ఈయన చదువుకోసం దాన్ని ఖర్చు పెట్టె ఆలోచనలో లేరాయన. మంచిదే నని కాని మద్రాస్ కు నడిచి వెళ్లాలని ఒక్కమాటలో చెప్పారు . మారు మాట్లాడకుండా ఇంట్లోనుంచి బయటికి నడిచి దారిపట్టారు రామయ్య గారు .ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని ఆశ్రయిం చాలో తెలీ కుండానే ఈ ప్రయాణం సాగింది .బెజవాడ లో కృష్ణా నదిని చూశారు అది గొప్ప ప్రబోధం చేసినట్లు అనిపించింది . తన దారిలో ఏ అడ్డంకులున్నా వాటిని అధిగమించి దారి చేసుకొని నిరంతరం ప్రవహిస్తూ సముద్రం వైపుకు సాగి పోతున్నానని అవసరాన్ని బట్టి దారి మార్చుకొంతటున్నానని చెప్పినట్లుంది .ఇలా ప్రతి నదీ గమ్యం వైపుకు పరుగులు తీస్తూనే ఉంటుంది అన్న సత్యం గ్రహించారు .తన అనంత గమ్యం లో విజయాలే వరిస్తాయో అపజయాలే చుట్టుముడతాయో తెలీదు లాల్ గోవింద్ కు .ఒక కల కంటున్నాడు .ఆకల సాకారం కోసం ప్రయత్నిస్తున్నాడు .తాను బుద్ధుడిని అని అనుకొన్నాడు .తన తో ఉండే హరిజన పిల్లాడు కుమార్ అంటే గోవింద్ కు అమితమైన ప్రేమ ఇల్లు వదిలి వచ్చేటప్పుడు అతని బాగోగులన్నీ చూసి వచ్చాడు. అది తన కర్తవ్యంగా భావించాడు ..మద్రాస్ కు సగం దారిలో ఉండగా మేనమామ కలిశాడు .తండ్రికి డబ్బు అవసరం కలిగినప్పుడు ఈయనే సాయం చేసేవాడు .కుర్రాడు మద్రాస్ వెడుతున్నట్లు ముందే తెలిసింది అన్నాడు ఆయన .అక్కడ ఒక జమీందార్ కు సిఫార్సు ఉత్తరం రాసిచ్చాడు .ఆ సిఫార్సు ఉత్తరాన్ని నవాబు గారి బేగం నుండి సాధించాడాయన .జమీందార్ అన్నీ చూసుకొంటాడని భరోసా ఇచ్చాడు కూడా .త్వరలో డిగ్రీ సాధించి అందరికి సంతోషాన్ని కలిగించమని ఆశీర్వ దించాడు .నడుచుకొంటూ నడుచుకొంటూ మద్రాస్ చేరారు సీతారామయ్య .అదే ఆయన చూసిన మొదటి సిటీ .దాని చూసిన అనుభూతి జీవితాంతం ఉందంటారు ఆయన .సిఫార్సు ఉత్తరం మీద ఎవర్ని కలవాలో ఉంది. తానుకలవాల్సింది ఒక ఇంగ్లీష్ ఆయన్ను అని తెలిసి కంగారు పడ్డారు .
..అక్కడి నుండి మదన పల్లె చేరి అక్కడ డాక్టర్ అనీబిసెంట్ నేషనల్ యూని వర్సిటి లో 1917 లో చేరి బి ఎస్ సి డిగ్రీ1921లో పొందారు . అక్కడి నుండి మద్రాస్ లోని అడయార్ కు ఆవిద్యాలయం మారింది .తండ్రి గారు చిన్నప్పటి నుండీ చెప్పిన ‘’ఏ పని అయినా అంకితభావం తో చేయాలి .ఇదే అత్యున్నత మైన యోగ .సంపూర్ణతను ప్రతి విషయం లో సాధించాలి పనిపై శక్తి యుక్తులన్నీ కేంద్రీకరించి పని చేయటం ఉత్తమ విధానం .’’యోగః కర్మ సు కౌశలం ‘’అనే గీతావాక్యం ప్రేరణ కావాలి .ఇలా చేస్తేనే మానవులం అని పించుకొంటాం .మనవ జన్మ కు సార్ధకత ఇదే ‘’మాటలు సీతారామయ్యగారికి తారక మంత్రమే అయింది జీవితం లో అన్ని దశలలో దాన్ని పాటించి ఉత్తమ ఫలితాలు సాధించి సర్వోత్తమ మానవులుగా ఎదిగారు మనిషి మనీషి అయ్యారు
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశ పయనం
జ్ఞానం సంపాదించాలి అనేది సీతారామయ్యగారికి స్తిర సంకల్పం అయింది .ఏ పని చేసినా అదే దృష్టితో ఉండేవారు . .
.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -21-4-15-ఉయ్యూరు

