‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-10

‘’కెమోటాలజి పిత’’ కొలచల సీతా రామయ్య-10

కేమ్మోటాలజీకి  బీజం

లాబ్ పరిశోధనా ఫలితాలు ఉత్సాహాన్నిస్తున్నాయి .మోటార్ ఆయిల్ కి ఉన్న తుప్పు పట్టింఛి తినేసే  గుణం (కరోసివ్ యాక్షన్ )వలన వచ్చే సమస్యలను పరిష్కరించే అతి పెద్ద బాధ్యత ను రామయ్య గారి బృందానికి హేంక్ అప్పగించాడు .దీనిపై ద్రుష్టి పెట్టి పని చేస్తున్నారు రామయ్య గారు .మోటారు వివిధమైన పని  చోట్ల వివిధ రకాల ఘర్షణకు గురి అవుతుంది అన్న విషయం గమనించారు .ఈ లక్షణం వివిధ స్థాయిల్లో ఉంటుంది .మోటార్ ఆయిల్ లో ఉపయోగించే పదార్ధాలు  వాటి శాతం (ఇన్ గ్రీడిఎంట్స్  )వలన మంచి రన్నింగ్ రాబట్టవచ్చు అనే ఐడియా వచ్చింది రామయ్య గారికి .ఇది అంత తేలిక విషయం కాకపోయినా ఆ విషయం పైనే కేంద్రీకరణ జరిపారు .పని చేసే నియమాలను మార్చటం వలన మోటారు లో జరిగే షేకింగ్ (ఊపుడుగుణం )తగ్గించ గలిగారు .దీనికోసం లూబ్రికంట్స్(కందెన నూనె )లో ఉండే పదార్ధాలను మార్చి మార్చి ప్రయోగాలు చేశారు .హేంక్ కోరిక ప్రకారం  మోటార్ నిర్మాణం లో ఒక కొత్త శకమే ఆవిష్కరించ బడాలి .దీనికోసం హేంక్ ‘’వేల్వేరి లూబ్రికంట్ ‘’అనే పదాన్ని కాయినేజ్ చేశాడు .

‘’ వేల్వేరి కిట్టెన్’’ మోటార్  సృష్టి

లూబ్రికంట్స్ లో వాడే పదార్ధాల లలో స్వల్ప  మార్పులు చేశారు .మోటారు లోడ్ మారినప్పుడు ఆయిల్ పైన ఏర్పడే పలుచని పొర లో వచ్చే మార్పుల్ని అధ్యయనం చేశారు .అతి తక్కువ సమయం లో రొటేషన్ ల సంఖ్య ను పెంచితే ఒక’’ క్రిటికల్ కండిషన్ ‘’ఏర్పడింది .కాని లూబ్రికంట్ దానంతట అదే ఈ కొత్త వేగానికి మార్పు చెందలేక పోతోందని అర్ధమయింది .అందువలననే పూర్వపు మోటార్ లలో కరోసన్ ఏర్పడి యంత్ర భాగాలని తినేసేదని  తెలుసుకొన్నారు .కనుక ఒక కొత్త యంత్ర సృష్టి జరగాలి అని నిర్ణయానికి వచ్చారు .ఈ యంత్రం లో ఆటోమాటిక్ గా రొటేషన్ ల ను బట్టి  ఆ మార్పులు జరిగి మోటార్ సమర్ధం గా పని చేస్తుంది .దీనికోసం వేర్వేరు లూబ్రికంట్ ల ను పోశారు .సృష్టింప బడే కొత్త యంత్రానికి ‘’వేల్వరి కిట్టేన్ ‘’అని పేరూ పెట్టారు  కాని హేంక్ ఈ ఐడియా మీద నీళ్ళు కుమ్మరించాడు .అలా కొత్త మోటారు తయారు చేయటానికి చాలా డబ్బు ఖర్చవుతుందని అభ్యంతర పెట్టాడు .కాని రామయ్య గారు చేతిలో ఉన్న ఖచ్చితమైన లెక్కల ప్రకారం అలాంటి యంత్రం ఎక్కువ కాలం పని చేస్తుందని మొహమాటం లేకుండా చెప్పారు .దీనివల్ల  కారు’’,కారు చౌకగా’’ తయారు చేయవచ్చని వివరించారు .ఒక నవ్వు నవ్వి హేంక్ ‘’రామయ్యా !నువ్వు గొప్ప’’ దీరిటిషియన్’’వే ,దానికేమీ అనుమానం లేదు  కాని ప్రాక్టికల్ మనిషివి కావు .మనకు కావలసింది మనకు పోటీగా ఉన్న కంపెనీల మోటార్ ల కంటే బాగా పని చేసేవికావాలి  కాని శాశ్వతమైన నడక ఉన్న మోటారు కాదు .శాశ్వత మైన మోటారు నువ్వు  సృష్టి  చేస్తే అది మన పరిశ్రమనే చంపేస్తుంది .’’అన్నాడు .ఈ వితండ, విడ్డూర, వింత వాదన రామయ్య గారికి నచ్చలేదు .కనుక స్వస్తి చెప్పాల్సి వచ్చింది .

కనుక ఇప్పుడు ఆలోచనలన్నీ కొత్త లూబ్రికంట్ తయారు చేయటం మీదనే పెట్టారు .ఆ లూబ్రికంట్ దానంతటకి అదే రెగ్యులేట్ చేసుకొంటూ ‘’,విపత్కర వింత పరిస్తితులలో ‘’అనువుగా పని చేస్తూ ఉండాలని కృషి చేస్తున్నారు .ఈ విషయం తెలుసుకొన్న హేంక్ ‘’బ్రహ్మాండం గా ఉంది మీ ఐడియా .మన మేనేజ్ మెంట్ కు ఈ విషయం వెంటనే తెలియ జేస్తాను .ఈ రహస్యం అంత దాకా మన ఇద్దరి మధ్యే ఉండిపోవాలి .బయటికి పొక్క నీయద్దు. నాఅనుమతి లేకుండా ఇంకెవరూ  ఈ ఐడియా పై  కృషి చేయ రాదు .’’అని ఆనందం గా భరోసా ఇస్తూ హెచ్చరికా  ఇచ్చాడు .

బఫర్ ఆఫర్లు

కంపెనీకి డిఫెన్స్ సర్వీస్ నుండి బఫర్ ఆఫర్లు వచ్చాయి .నౌకాదళాదికారి వచ్చి చూసి వెళ్ళాడు . ఈ సంస్థ  బాగు  కోసం ఇందులో పని చేసే కొందరిని డిఫెన్స్ సర్వీస్ లో కి  పంపించే ఉద్దేశ్యం   ఉన్నట్లు హేంక్  చెప్పాడు .వెళ్ళే వారిలో  టిండర్మాన్స్ నార్వేజియన్  లున్నారు .దీనితో రిసెర్చ్ లో టెంపో తగ్గి పోయింది .ఒక రోజు రామయ్య గారు ఆఫీస్ కు వెళ్లి తన తో పాటు పని చేస్తున్న అత్యంత సమర్ధులను ఎందుకు దూరం చేశారని అడిగారు .దేవాంతకుడు హేంక్ చిరునవ్వు చిద్విలాసం గా కనపరుస్తూ బాధ పడాల్సిన దేమీ లేదని ,వారికి ప్రత్యామ్నాయం గా కొత్త వారిని ఎంపిక చేసి వేస్తామని అన్నాడు .ఇక మాట్లాడాల్సింది దీనిమీద ఏదీ లేదన్నట్లుగా హేంక్ లేచి పోయాడు .బుర్ర తిరిగి పోయింది రామయ్యగారికి . తనతో నడిచి వస్తూ ఆపి రామయ్యగారితో హేంక్ ‘’నీకు ఒక విషయం రహస్యంగా చెప్పాలను కొంటున్నాను .నిన్ను నేనెలా చూస్తున్నానో నీకు తెలుసు .అందుకే నా మాటల్ని సీరియస్ గా తీసుకో .నువ్వు ఎక్కడెక్కడ ఎవరెవరితో తిరుగుతున్నావో మన మేనేజి మెంట్ దృష్టిలో కి వచ్చేసింది  .అయినా మనది స్వేచ్చా  స్వాతంత్రాలున్న దేశం  ఎవరి ఇష్టం వారిది .ఎవరూ అభ్యంతరం పెట్టరు .నీపనులకు అడ్డుకూడా పడరు .కాని ఇది నీ అభివృద్ధికి మంచిది కాదు అని చెబుతున్నాను .నేను నీకు అత్యంత ఆత్మీయ మిత్రుడిని కనుక ఇంత దూరం చెప్పాల్సి వస్తోంది .నిన్ను’’ లాల్ ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడు’’ అని ఇప్పటిదాకా నన్ను అడిగిన మన బాస్ ‘’మన ఎర్రాయన ఎలా ఉన్నాడు’’ ?’’అని అడుగుతున్నాడు  అంటే, ఇక నువ్వే అర్ధం చేసుకో ‘’అని హేంక్  ‘’కమ్మీలతో’’పూసుకు తిరగటం మేనేజి మెంట్ దృష్టిలో పడింది అని హెచ్చరిక లాంటి సలహా ఇచ్చాడు .

సశేషం

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -29-4-15 –ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.