ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -66
28-మానవత్వాన్ని మాత్రమే చిత్రించిన మహోన్నత చిత్రకారుడు -విన్సెంట్ వాన్ గో(Vincent Van Gogh-3(చివరి భాగం )
పారిస్ లో తను ఊహించిన దాని కంటే కొత్త ప్రపంచాన్ని చూసాడు. ఫ్రెంచ్ ఇంప్రెష నిస్టూల స్వర్గం లాగా కనిపించింది. పిసారో, హ్యురేట్, సిగ్న్స్, గగాల్న్, లేట్రేస్ మొదలయిన వారి కాన్వాసుల ముందు నిలబడి గమనించాడు. అంతా కొత్త పోకడలు కన్పించాయి. సంప్రదాయానికి భిన్నంగా వారు చిత్రాలు గీస్తున్నట్టుగా గమనించాడు. సరిహద్దులను చెరిపేసి రంగులను విడదీసి కాంతితో ఆడుకున్నట్టుగా ఉన్నాయి వారి చిత్రాలు. జపనీస్ ప్రింట్ల షో చూసి వాళ్ళ ధైర్యానికి ఆకర్షితుడయ్యాడు. అందులో అవాస్తవికత ,వర్ణ సమ్మేళనం కన్పించాయి. సమతలంగా ఉండే రంగు విస్తరించి వాటిని కాపీ చేయకుండానే తన ఆవిష్కరణలతో వాటిని మించి చిత్రించాడు. భారమైన రిథం ను ఉత్తరపు ధృడత్వాన్ని వదిలిపెట్టలేదు. దీనితో అతని చిత్రాలకు శక్తి, ప్రభావం పెరిగాయి. డచ్ సాలిడి కి ఇది వ్యతిరేకం. అతని పాలెట్ చాల తేలిక. రంగుల కలయిక మరీ సున్నితం. బ్రష్ స్ట్రోక్ లు విశాలం, విచ్చేదకరం. డాట్ లు, డాష్ లు , డాన్సింగ్ పాయింట్లతో అంతా సంమిశ్రం చేసాడు. కాంతివంతమైన చిన్న డిజైన్లను అసలు వస్తువులో ఒదిగేటట్లు చేయగలిగాడు. అతని చిత్రాలు జీవంతో కళకళలాడుతాయని అన్నారు. ఒకదాని తరువాత ఒకటి విభిన్న ప్రయోగాలతో రూపొందించాడు. మామూలువే అయినా టేబులు, కుర్చీ, బెడ్రూము, యువతీ జపనీస్ బొమ్మలలాగా ఉన్న అను భూతిని కలిగించాయి. కూర్చున్న పోస్ట్ మెన్, అపస్మారక శక్తితో ఊగిపోతున్నట్లుగా కన్పిస్తాయి.
ఎంత చేసినా విన్సెంట్ పనితనానికి ఎక్కడా ఆదరణ రాలేదు. కాని తోటి ఆర్టిస్టులు ముఖ్యంగా గాగిన్ విన్సెంట్ అంటే అభిమానం చూపాడు. వాళ్ళ ప్రోత్సాహం, పోషకత్వం విన్సెంట్ ఆశించలేదు. థియో కొన్ని బొమ్మల్ని అమ్మే ప్రయత్నం చేసాడు కానీ ఎవరూ ఏ డీలరూ కొనటానికి ముందుకు రాలేదు. ఒక్క సారిగా పారిస్ అంటే అసహ్యం పుట్టింది. శైలి, టెక్నిక్కుల గురించి విని విని విసిగిపోయాడు. తాను మొదలు పెట్టిన పనిని పూర్తీ చేయటానికి చాలాసమయం ఉంది అనుకున్నాడు. అంత కొత్తగా ప్రారంభించాలి అన్పించింది. తాను చాలా కిందికి దిగి భూమి పుత్రుడుగా నగ్నంగా పని చేయాలనిపించింది. తనకింకా 3,4 ఏళ్ళు మాత్రమే ఉందనుకున్నాడు. మళ్ళీ ఒక గొప్ప ప్రయత్నం చేయాలని అనిపించింది. ఎక్కడో ఆకాశం కింద తాను వెతుకుతున్నది కన్పిస్తుంది అనుకున్నాడు. అక్కడి గాలిని అనుభవించాలని అన్పించింది. అది తన శరీరానికి తాకాలని పారిస్ లో తన వస్తు జ్ఞానం అంతా నశించిందని తన చర్మం కొద్దికొద్దిగా క్షయమై పోతోందని అనిపించింది. తను కోరుకున్న కళా స్వర్గం దక్షిణ దేశం వైపు ఉన్నట్లుగా భావించాడు. తన చిత్రాలను గోడలకు తమ్ముడు థియో కోసం తగిలించి వదిలి, అపార్ట్మెంట్ ఖాళీ చేసి ఎరీస్ కు వెళ్ళాడు.
దక్షిణ దేశంలో తన కాన్వాసులతో సహా నదీస్నానం చేసాడు. పూర్వం కంటే శక్తి, ఉత్సాహం వచ్చాయి. కనిపించిన ప్రతి దానినీ చిత్రించాడు. నదిలో బట్టలు ఉతికే చాకలిని, నదిపై బ్రిడ్జిని నీటి ఊటలను, సన్ ఫ్లవర్ లను , తన చిత్రాలను ,అన్ని రకాల మనుషుల చిత్రాలను వేశాడు. పది రోజులు ఏక దీక్షగా పుష్ప ఉద్యానవనాలను చిత్రీకరించాడు. మొదట్లో ఇవన్నీ కళాభివ్రుద్ధిగా కనపడేవి. అతని రూపాలకు మరింత జీవకళ అబ్బింది. అతని జీవిత చరిత రాసిన మీర్ గ్రేస్వీ అతనొక రోమాన్౦టి స్టని అతని వికసనంలో తుఫాన్లు ఉన్నాయని రాశాడు. అతని చూపు ప్రతి దానిలోకి చొచ్చుకు పోతుందని చెట్టు, మట్టి ,గొడ్డలి కూడా అతనికి ప్రత్యేకంగా కన్పిస్తాయని గాలిని కూడా ఒక ఘనపదార్తంగా మార్చే శక్తి కలవాడని అన్నారు. పసుపు రంగుతో కనిపించేదంతా అదే రంగుతో చిత్రీకరించాడు. వాటిని చూస్తే రంగు, రుచి వాసన స్పర్శ కన్పిస్తాయి. రాళ్ళను చిత్రిస్తే అవి మనతో మాట్లాడుతున్నంత గొప్పగా ఉంటాయి. క్రమంగా చెట్లను వదిలేసి వాటి ఎదుగుదలను అస్తిత్వాన్ని చిత్రించాడు. అవి విచ్చుకున్నట్లు కాదు వికసిస్తున్నట్లుగా కన్పిస్తాయి. అతని బ్రష్ స్ట్రోక్ లో నిర్ణయాత్మక శక్తి కనిపిస్తుంది. ఒక సజీవ తాదాత్మ్యం గోచరిస్తుంది. అతని పాలెట్ నుండి అగ్ని శిఖలు సృష్టించాడు. అతని పెయింటింగ్ లలో గుడ్డి వెలుగు గొప్పగా ఉంటుంది. అవి అతని గత కాలపు జీవితానికి గుర్తులు.
విన్సెంట్ కలర్ సింబాలిజం ను అభివృద్ధి చేసాడు. “ది నైట్స్ కేఫ్” అనే చిత్రం గురించి చెబుతూ అతను దానిని “To express the terrible passions of humanity by means of red and green. I have tried to express the ideas that the café is a place where one can ruin one’s self, run mad or commit a crime. So I have attempted as it were to show the powers of darkness in a low drink –shop by a soft Louis XV green and malachite, contrasting with a yellow green and hard blue greens- all this in an atmosphere like a devil’s furnace of pale sulphur” అని వివరించాడు. ఎరిస్ లో గాగిన్ వచ్చి తనతో చేరతాడని తెలిసి సంతోషించాడు. అతని ఆర్ట్ కాలనీ లో వీరిద్దరే ఉన్నప్పటికీ మిగిలినవారకు చోటు ఉన్నదని చెప్పేవారు. వాన్ గో గాగిన్ యొక్క నమ్మకాన్ని సహకారాన్ని అనుభవించాడు. తానకంటే అతనను కంటే తక్కువ స్థాయి ఆరిస్ట్ తెలుసుకోలేదు. గాగిన్ శిష్యుడినే అని అనుకునేవాడు. కొద్ది కాలం తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చి కలసి ఉండలేక పోయారు.
గాగిన్ డబ్బు పెట్టుబడి పెట్టె మనిషి. గొప్ప స్టాక్ బ్రోకర్. పెయింటింగ్ ను హాబీగా చేసుకున్నాడు. వాన్ గో బీదరికంలో జీవిస్తూ గాగిన్ ప్రవర్తనకు అభిరుచులకు విసిగి పోయాడు. గాగిన్ బోహీమియన్ లాగా ఉంటే వాన్ గో భయపడుతున్నట్లుగా ఉండేవాడు. గాగిన్ సాటి కళాకారులను చులకనగా చూసేవాడు. వాటిని బహిర్గితము చేసే వాడు. వాన్ గో సెంటిమెంటల్ ఫెలో . తరచు పోట్లాడుకునే వారు ఇద్దరూ. గాగిన్ తీవ్ర స్వభావానికి వాన్ గో అల్లల్లాడి పోయేవాడు. రోజు రోజుకూ నిరుత్సాహం పెరిగే పోయేది. అతని విపరీత చేష్టలకు విసిగి ఒకరోజు ఒక గ్లాసు అతనిపై విసిరివేసాడు. దాన్ని చేత్తో పట్టుకున్న గాగిన్ కఫే లోంచి ఇతన్ని బయటకు లాక్కొచ్చాడు. తననెవరో వెంబ డిస్తున్నారని గాగిన్ అనుకునే వాడు. ఒక రోజు వాన్ గో కత్తితో తన వెంట ఉండటం గాగిన్ చూసాడు. భయపడిన వాన్గో పరిగెత్తి తన రూముకు చేరి అపస్మారకంగా పడిపోయాడు. అతని తలకు రక్తపు మరకలున్న టవల్ చుట్టబడింది. తన చెవిని ఒకదాని కోసి అతనికి పరిచయమున్న వేశ్యకు పంపాడు. అది క్రిస్టమస్ కానుక అని చెప్పాడు. ఈ విధంగా వాన్గో విపరీత ప్రవర్తనలో ఉండిపోయాడు. తమ్ముడు థియో వచ్చి అన్న విన్సెంట్ ను హాస్పటల్ లో చేర్చాడు. అప్పుడప్పుడు అపస్మారకంలో పడుతూ కొద్ది కాలానికి ఆరోగ్యం చేకూర్చుకున్నాడు. మళ్ళీ తన ఎల్లో హౌస్ కు చేరి దానినే సింబల్ హోమ్ గా భావించాడు. అతన్ని చూసి జనం కూడా భయపడుతున్నారు. నిఘా ఉంచారు. పిల్లలు గేలి చేసే వారు. పెద్దలు కిటికీ లోనుంచి తొంగి చూసేవారు. ఒకరోజు ఇంటి ముందు చాల మంది చేరితే కిటికీ లోంచి వాళ్లకు ఉపదేశం చేసాడు. తర్వాత అరుపులు, కేకలు పెడుతూ ఉండగా తాళం వేసిన గదిలో గొలుసులతో ఇనప మంచంమీద బంధించారు. ఒంటరి గదిలోకి తర్వాత మార్చారు. తనను ఒక ప్రశాంత ప్రదేశానికి తీసుకు వెళ్ళమని అర్థించాడు. ఒక శరణాలయంలో తన భ్రమలకు నివారణ లభిస్తుందని చెప్పాడు. 1889 మే లో అతను పిచ్చివాడని సెయంట్ రెమీ హాస్పటల్ వాళ్ళు సర్టిఫికేటు ఇచ్చారు. ఈ హాస్పటల్ లోనే మూర్చతో బాధపడ్డాడు. స్కిజోఫ్రేనియా వచ్చి ఇబ్బంది పడ్డాడు. గొప్ప పెయింటర్ గా ఉన్న వాన్ గో కు ఈ స్థితి కలిగింది. ఈ స్థితి లోనూ పెయింటింగ్ లు వేస్తూనే ఉన్నాడు. అవి బాగా కదిలించేవిగా ఉండేవి. ఒంటరి గదిలో చెక్క బొమ్మలు, లితోగ్రాఫ్లు చేస్తూ ఉండేవాడు. ఇదివరకంటే ఇప్పటి పెయింటింగ్ లలో మరింత శక్తి కన్పించేది. అతని అపూర్వ సృష్టికి ఇవి గొప్ప ఉదాహరణ. అతని’’ది స్టార్రి నైట్’’ చిత్రం పెయింటింగ్ గా చెప్పుకోలేనప్పటికి గొప్ప వైభవంగా కన్పిస్తుంది. దీనిలో అతనికి స్వర్గాలు కనిపించాయి. నక్షత్రాలు స్థిరంగా ఉండవు, ప్రకాశించవు, మినుకు మనవు, కానీ అవి మండుతూ భ్రమణం చెందుతూ అంతరిక్షంలో కన్పిస్తాయి. ఆకాశమంతా వాటి కోసం పరిగెత్తుతున్నట్లు అనిపిస్తాయి. మేఘాలు సుళ్ళు తిరిగే జల ప్రవాహాలుగా కాంతి వంతమైన పదార్థంగా గోచరిస్తాయి ఆందోళనన తో కూడిన గాలి నుంచి ఆకుపచ్చని ఫౌంటెన్లు ఎగ జిమ్ముతున్నట్లు కన్పిస్తాయి. రాత్రివేళ కనిపించని శక్తులన్నీ బహిర్గమవుతాయి. అవన్నీ విపరీతమైన వేగం తో చరిస్తున్నట్లు అన్పిస్తాయి.
అతని మూర్చలు పెరుగుతూనే ఉన్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుందని అన్నదమ్ములు భావించారు. ప్రదేశం మారిస్తే మంచిదని అయిస్ నది ఒడ్డున ఆవేర్స్ కు మకాం మార్చారు. కొంత నయం. పారిస్ లో ఉన్న థియో కు ఇరవయ మైళ్ళ దూరంలో మాత్రమే ఇది ఉన్నది. విన్సెంట్ డాక్టర్’’ గాచచేట్ ‘’గొప్ప కళాభిమాని. అతనిపై సానుభూతి బాగా చూపించేవాడు. అతని ప్రతి సృజనను మెచ్చుకున్నాడు. వాన్ గో తన డాక్టరును విచార వివర్ణ వదనంతో చిత్రించాడు. అతనిది కాని అతని చూపును అందులో ఒదిగాడు. అందులో “The heart broken expression of our time” ఉందని అందరూ భావించారు. చివరి చివరికి వేసిన చిత్రాలన్నీ ఒంటరి తనాన్ని, చీకటిని, విషాదాన్ని చూపాయి. అతనిలో విషాదం పెరిగి పోయింది. తాను ఇక ఏమాత్రం తమ్ముడికి భారంగా ఉండకూడదని భావించి తన బాధను తనలోనే అణచుకున్నాడు. కాకుల్ని చంపటానికి ఒక రివాల్వర్ తీసుకుని పొట్టలో కాల్చుకున్నాడు. విషయం తెల్సిన తమ్ముడు పరిగెత్తుకు వచ్చాడు. అతనితో “మనందరి మంఛి కోసం ఈ పని చేసాను” అని చెప్పి 29 -7-189౦ న 37 వ ఏట వినేంట్ వాన్ గో మరణించాడు. ఈ విషాదాన్ని తమ్ముడు భరించలేక పోయాడు. 6 నెలల తర్వాత థియో కూడా మతి స్థిమితం లేక హాలండ్ లో చనిపోయాడు. అన్న దమ్ములిద్దరినీ అయిస్ అవేర్స్ చర్చిలో ఖననం చేసారు.
వాన్ గో జీవిత కాలంలో ఒకే ఒక సానుకూలమయిన వ్యాసం చూడగాల్గాడు. రెండే రెండు పెయింటింగులను అమ్మడు. వాటికి కొన్ని వందల ఫ్రాంకులు మాత్రమే వచ్చాయి. అతని మరణాంనంతరం అరవై ఏళ్ల తర్వాత పదేళ్ళలో అతను వేసిన డ్రాయింగులు, చిత్రాల విలువ 30 మిలియన్ డాలర్ల విలువ ఉంటుందని నిర్ణయించారు. సంప్రదాయానికి భిన్నంగా అతను చిత్రించిన చిత్రాలు పిగ్మెంట్స్ ద్వారా ఎంత బలంగా శక్తివంతంగా భావాలు తెలియచేయవచ్చో తెలియచేస్తాయి. అవి “Those terrible things, men;s passions “కు దృష్టాంతాలు . చూసేవాని చూపే కాక అతని భాగస్వామ్యం కూడా చిత్రాలలో కన్పిస్తుంది. “He lifts emotions to a pitch of almost unbearable excitement and communicates the intensity which brought him to the breaking point” అని అతని చిత్రాలకు భాష్యం చెప్పారు. “Instead of driving to reproduce exactly what I have before my eyes, I use color more arbitrarily so as to express myself more forcibly” అని విన్సెంట్ తన చిత్రాలగురించి చెప్పుకున్నాడు. అతని చిత్రాలు అబద్దాలుగా కన్పించినా అందులో యదార్థ ఉందనిపిస్తాయి. అంతకు ముందు ఏ చిత్రకారుడూ చేయని ప్రయోగాలు చేసాడు విన్సెంట్. సామాన్య వస్తువులలో కాంతి పుంజాలను ,రేడియేషన్ ను చూపగల్గిన అత్యంత ప్రతిభావంతుడు విన్సెంట్. ఇది ఎవరికీ లభించని అసాధారణ శక్తి. మనిషి టెన్షన్ ల మధ్య అవాస్తవాల మధ్య జీవిస్తున్నాడుఅనటానికి సజీవ ఉదాహరణలు అతని చిత్రాలు. దాస్తోవిస్కీ, కాఫ్కా ప్రాఫెట్ల తర్వాత కళను ఆదిశలో నడిపించినవాడు “To a confused world his vital images have what he desired above all else the power to reveal and to console “
రేమ్బాంట్, అల్గ్రికో లను వదిలేస్తే వాన్గో గొప్ప డ్రమాటిక్ పెయంటర్. అంతటివాడు పుట్టలేదు, పుట్టబోడు. రేమ్బాంట్ సాధారణ వెలుగుతో డ్రామాను నిరంతరంగా నాటకంగా మారిస్తే అల్గ్రికో దాన్ని అణచబడిన హింసతో సాధించాడు. కానీ వాన్గాన్ ప్రతి స్పర్శలో డ్రామా కన్పిస్తుంది. అందులో గీతలు నిండి సుళ్ళు తిరిగే రంగుల ప్రవాహంగా ఉన్నతోన్నతంగా దర్శనమిస్తాయి. “Van Gogh seized to be concerned with the troubled human comedy, even in his paroxysms he responded to its moral force. Every thing he did was another attempt to add moral passion and pity to the immortal humanity of Art.”
.
మరో ప్రముఖునితో కలుద్దాం
సశేషం
మీ-గబ్బిటదుర్గాప్రసాద్-4-8-15 ఉయ్యూరు

