ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -71 30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన -జార్జి బెర్నార్డ్ షా -3

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -71

30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -3

స్వయం వ్యక్తిత్వంతో షా లెజెండ్ తో పాటు అల్లరి, ఆగం కూడా పెరిగాయి. సంప్రదాయంపైనా వ్యతిరేకంగా ఉన్న భావాల వలన షా కుంభ కోణాలకూ  కేంద్రమయ్యాడు. ఆయన నిజంగా ఉన్నత నైతికతో జీవించాడు. ఆయన ప్లేటానిక్ ప్రేమలు, భావోద్రేకాలు. అన్ని కాగితం  మీదనే నిజ జీవితంలో కాదు. అతనిది  ‘’సెక్స్ లెస్ వాకింగ్ బ్రెయిన్’’ అన్నాడు ఫ్రాంక్ వారిస్. ఈ మాట ముప్పై యేడు వచ్చే వరకు నిజమే . విలియం మారిస్ అనే కవి కూతురు మే మారిస్ పై మోజు పడ్డాడు. ఆధ్యాత్మికంగా ‘’అనీబ్ సెంట్ ‘’కు  దగ్గరగా ఉండేవాడు. ధియాసఫీకు భాష్యకారుడు. ఇరవై తొమ్మిదవ ఏట జెన్ని పీటర్సన్ షాను ముగ్గు లోకి దించింది. షాకు ‘’రతి కార్యం’’ విసుగు అవాస్తకమైనది అని అనిపించేది. ఆమెకు ఆ కోరిక ఎక్కువ. నటీమణులు ముగ్గురికి సుదీర్ఘమైన ప్రేమ లేఖలు రాసేవాడు. అందులో ఫ్లారెన్స్ ఫార్ అనే ఆమె సాధారణ అమెచ్యూర్ రచయిత్రి, గాయకురాలు మరియు ఈజిప్టా లజిస్ట్ తూర్పు దేశపు మార్మిక భావాలకు ఆమె ఆకర్షితమైంది. ఆమె ఇంగ్లండ్ వదలి ఇండియా వచ్చి చనిపోయింది. ఎలాన్ కెర్రీ తో కూడా తొమ్మిదేళ్ళు లేఖాయణం సాగించాడు. ఆమెను కలవటానికి భయపడేవాడు. “షా టేర్రీల లేఖలు”కు ముందుమాట రాసాడు. అందగత్తె మిసెస్ పాట్రిక్ కాంప్ బెల్ తో కూడా చనువుగా ఉత్తరాలు రాసేవాడు.ఇరవై ఎనిమిదేళ్ళు ఈ లేఖా స్రవంతి సాగింది. తన ప్రేమంతా పోస్టు ద్వారా పొంగి పోరలినదని చెప్పుకునేవాడు.’’ పిగ్మాలియన్’’ నాటకం రిహార్సల్స్ జరిగే రోజుల్లో  “one of these days Shaw will eat a breakfast and God help all women”అని గుసగుసలాదేవారు. నలభై ఏడు వచ్చే సరికి పెళ్లి చేసుకోవాలనే తలపు పెరిగింది. అప్పుడు కూడా ప్రేమాయణం సాగించాడు .కానీ తటపటాయించాడు. ఐర్లాండ్ కు చెందిన గొప్ప సంపదకు వారసురాలైన షార్లెట్ పెన్ టౌన్ సెండ్  అనే తెలివి గల అమ్మాయితో గడిపి ఆమె డబ్బు ఈయన అనుమానాలతో అది బెడిసిగోట్టింది.  షార్లెట్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆమెకు టైప్ వచ్చు కనక షా రాసిన షార్ట్ హాండ్ ను టైప్ కొట్టేది. ఇద్దరి మధ్య గొడవలు, పోట్లాటలు జరుగుతూ ఉండేవి. ఎంగేజ్మెంటు రద్దు చేసుకున్నారు. వెబ్స్ తో పాటు షార్లెట్ ప్రపంచ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అధిక శ్రమ వలన షా ఆరోగ్యం దెబ్బ తింది. ఆమె తిరిగి వచ్చి అతను ఉన్న చీకటి ఫ్లాటు నుండి మార్చి ఆరోగ్యం కుదుటపడే దాకా సేవ చేసింది. 1897 లో’’ The Devil’s disciple’’ అమెరికాలో గొప్ప విజయం సాధించి డబ్బు చేతికొచ్చి షార్లెట్ సంపద కంటే ఎక్కువ సాధించాడు. ఇప్పుడు ఈ జంట 1898 జూన్ ఒకటిన పెళ్లి చేసుకున్నారు. నలభై  ఐదేళ్ళు కాపురం చేసారు. హనీమూన్ లో ఉండగా షా ఏంటి రొమాంటిక్ నాటకం’’ సీజర్ అండ్ క్లియోపాత్రా ‘’రాసాడు.

 

మానవ సంబంధాలు ఆనందాన్ని వాయిదా వేసుకోవడం వలన వృద్ధి చెందుతాయని షా భావన. ‘’ది ఆపిల్ కార్ట్’’ అనే నాటకంలో అనైతిక సెక్స్ దట్టించారు. ఏభై ఏళ్ళు వచ్చేసరికి 17 నాటకాల కర్త అయ్యాడు. లెక్కలేనన్ని కరపత్రాలు  వివాదాస్పద వ్యాసాలూ అనేక విమర్శనా వ్యాసాలూ రాసాడు. ఒకసారి దూషణ, మరోసారి భూషణలకు గురయ్యే వాడు. షా అంటే “A dialectician who was a dynamo a storm center   in the theatre and rudely energizing force in all contemporary culture “ అనిపించుకున్నాడు. నలభై మూడవ ఏట’’ సీజర్ అండ్ క్లియోపాత్రా’’ నాటకం రాసి అందులో  భావావేశాన్ని హేతువు మందలిన్చినట్లుగా రాసాడు. ఇది షేక్స్పియర్ యొక్క ‘’ఆంటోని  అండ్ క్లియోపాత్రా’’కు జవాబుగా కన్పిస్తుంది. నలభై నాలుగేళ్ల వయసులో “Captain Brassbound’s conversion”పూర్తీ చేసి బ్రిటిష్ ఇమ్పీరియలిజం ను కళ్ళకు కట్టినట్లు చూపించాడు. నలభై ఐదు లో’’ మాన్ అండ్ సూపర్ మాన్ ‘’అనే  శక్తివంతమైన నాటకం  చేసాడు. ఈ నాటకం చాలా సీరియస్ నాటకం. “Masterpiece of intellectual dramaturgy which broke not only with the English drama but English thinking” అని రుజువు చేసింది. పురుషుడిని “retreating quarry” గా స్త్రీని “Disguised but remorseless pursuer crying to the universe” గా అభివర్ణించాడు. ‘’సూపర్ మాన్ కి పిత’’ అయిన షా ఎంతో మంచి చెప్పినా సంతృప్తి చెందలేదు. నాటకంలో అంతర్నాటకం అతని ప్రత్యేకత. ఆయన పోప్ కవి  చాటుపద్యాలను వాడాడు. అందులో కొన్ని ముఖ్యమైనవి “He who can does. He who can not teaches. Don’t do unto others as you would that they should do unto you”వంటివి చాలా ఉన్నాయి. ‘’స్వేచ్చ అంటే బాధ్యత’’ అంటాడు  షా. అందుకనే ఎక్కువ మంది భయపడతారు అన్నాడు. “Marriage is popular because it combines the maximum of temptation with the maximum of opportunity” అన్నాడు. సంపద అంటే దొంగతనం అనే అర్థం చెప్పాడు. జీవితం అందరి మనుషులను సమానం చేస్తుంది. చావు  ప్రతిభను బయటపెడుతుంది లాంటి  సామెతలను ఎన్నో ప్రయోగించాడు. చెడును అర్హ్తం చేసుకున్నావారు దానిని క్షమిస్తారని దాన్ని కాదన్నవారు నాశనం చేస్తారని చెప్పాడు.

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-15-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.