ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -81
36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్
హాస్యం అంటే మొదటినుంచి అమితాసక్తికలిగి ,లెక్కలేనన్ని హాస్య కధలు రాసిన రష్యన్ రచయిత అంటోన్ పాల్వోవిచ్ చెకోవ్ ను ఇవాళ ప్రపంచం అంతా ఆయన కొత్త సాహిత్య సృష్టికర్త గా ,మనిషి సంతోషరహిత ఏకాంతాన్ని ఆవిష్కరించిన వాడిగా ,సమ కాలీనులను అర్ధం చేసుకోలేక పోయిన వాడిగాభావిస్తున్నారు .
16-1-1860లో రష్యాలో సి ఆఫ్ అజోవ్ పై ఉన్న టాగన్ రాగ్ పట్నం లో చెకోవ్ జన్మించాడు .వీళ్ళ పూర్వీకులు ప్లేబియన్ లకంటే తక్కువ స్థాయి వారు .తాత ఒక బానిస .అయినా డబ్బు సంపాదించి తెలివి తేటలతో స్వేచ్చ కొనుక్కొని బానిసత్వం నుండి విముక్తి చెందాడు .తండ్రి పావెల్ డబ్బు లేని దుకాణాదారుడు .గర్వం ,సంకుచిత స్వభావంగల ,క్రూరుడైన తండ్రి .తల్లి వస్త్ర వ్యాపారి కూతురు .ఆరుగురు సంతానం లో చెకోవ్ మూడో కొడుకు .గృహ జీవితం సంతోషకరం గా లేదు .చిన్నతనం అంతా అణచివేత దౌష్ట్యం కింద నలిగిపోయిందని జ్వరం లాగా అవి పీల్చి పిప్పి చేశాయని చెకోవ్ వాపోయాడు .మత వ్యవహారలలోపిల్లలు ఏమాత్రం అతిక్రమించినా తండ్రి సహి౦చేవాడుకాడు .కఠిన దండన కు గురి చేసేవాడు . ఇరవై తొమ్మిదవ ఏట చెకోవ్ తన బాల్యం గురించి రాస్తూ ‘’దయ అనేది నాకు చాలా దూరమైన విషయంగా ఉండేది .ఎవరైనా దయ చూపిస్తే ఏంతో కొత్తగా పరమ సంతోషంగా ఉండేది .అందుకే ఇతరులపై దయ చూపాలనే సంకల్పం నాకు స్థిరంగా కలిగింది .కాని ఎలా దాన్ని చూపాలో తెలియటం లేదు ‘’అన్నాడు .
యవ్వనం లోకి రాకుండానే అన్నలు అలేక్సాండర్ ,నికొలాస్ ఇద్దరూ పూటుగా తాగి ,గాంబ్లింగ్ లో మునిగి ఇల్లు వదిలి బాధ్యతలు మరచి పారిపోయారు .కుటుంబ బాధ్యత అంటోన్ పైన పడింది .8ఏళ్ళకే ఫామిలీ స్టోర్స్ లో పని చేయాల్సి వచ్చింది .కాని అతనిది తేలికగా తీసుకొనే స్వభావం ,సంతోషం తో ఉండేరకం .అందంగా ఉండటం తో అందర్నీ ఆకర్షించేవాడు ముఖ్యంగా మహిళలను .దీనితో 13వ ఏటికే ‘’ప్రేమ రహస్యాలు ‘’అన్నీ తెలిసిపోయాయి .పదహారవ ఏట ,తండ్రి వ్యాపారం దివాలాతీసి ,అప్పుల వాళ్లకు అందకుండా ఇంటి నుంచి పరారైపోయాడు .తండ్రితో బాటు కుటుంబం వెళ్లి పోయింది. చెకోవ్ ఒక్కడే అక్కడే ఉందడి కుటుంబ స్నేహితుడి ఇంట్లో ఉంటూ,తింటూ వాళ్ళబ్బాయికి ట్యూషన్ చెబుతూ కృతజ్ఞతగా బదులు తీర్చుకొంటూ స్కూల్ చదువు పూర్తీ చేశాడు .చదువులో పెద్దగా అభి వృద్ధి ఉండేదికాదు. తప్పాడు .అందుకని ట్రేడ్ స్కూల్ లో చేరి టైలరింగ్ నేర్చాడు .కస్టపడి ఇంకా ఎక్కువ ట్యూషన్లు చెబుతూ కొంత డబ్బు వెనకేసుకొన్నాడు .ఈ డబ్బును దాదాపు పస్తులతో బతుకుతున్న తన కుటుంబానికి పంపేవాడు .17వ ఏట తీవ్రంగా జబ్బుపడ్డాడు .అప్పటినుంచి మెడిసిన్ చదివి డాక్టర్ కావాలనుకొన్నాడు .చెణుకులు ,హాస్య గుళికలు ,జోకులు రాసి మాస్కో లో కామిక్ ప్రెస్ లో పని చేస్తున్నన్న అన్న అలేక్సాండర్ కు పంపేవాడు.అందులో కొన్ని ప్రచురితమై మరిన్ని రూబుళ్ళు చేతిలో పడేవి .
19వ ఏట పరీక్ష పాసై మెడికల్ స్కూల్ లో చేరటానికి స్కాలర్ షిప్ పొందాడు .పుట్టిన ఊరి నుంచి మరో ఇద్దరు విద్యార్ధుల్ని తన వారితో ఉండమని చెప్పి మాస్కో వెళ్ళాడు .అందరూ చేరటం తో ఇల్లు ఇరుకై మురికివాడలో ఒక ఫ్లాట్ లోకి మారాల్సి వచ్చింది .బతకటానికి పోరాటమే చెయ్యాల్సి వచ్చేది .చిన్న తమ్ముడు మైకేల్ చాలా డామినేంట్ గా ఉండేవాడని చెకోవ్ అన్నాడు .అతనికి డబ్బు సంపాదించటం జాగ్రత్తగా ఖర్చు చేయటం తెలుసు .కుటుంబానికి నైతిక బలం అతనే .మెడిసిన్ లో చేరి చదువుతూ ,తేలికపాటి హాస్య రచనలు చేస్తూ ఉండేవాడు .21వ ఏట మొదటిసారిగా అమ్మి ,తర్వాత వాటికేమీ సాహిత్య విలువలు లేవని గ్రహించి వాటిపై ‘’ఆంతోష్ చేకాంటే ‘’’అనే కలం పేరు తో సంతకం పెట్టాడు .
క్రమంగా రచనలో పుష్టి ,పక్వత చోటు చేసుకొన్నాయి .ప్లాట్ కంటే ప్రొటెస్ట్ డామినేట్ చేసేవి .కాని నాన్ స్టాప్ గా రాస్తూనే ఉండేవాడు .27 ఏళ్ళకే 600 చిన్న కధలు రాసిన చేయి తిరిగిన కధకుదయ్యాడు .అప్పటికి ఆరడుగుల అందగాడు .కాని ఇరవై వ ఏట క్షయ వ్యాధి సోకింది.లక్షణాలను బట్టి గ్రహించాడుకాని కుటుంబం వారికి చెప్పకుండా రహస్యం గా ఉంచాడు .దీని నివారణకు చాలా ఖరీదైన మందులు చాలాకాలం వాడాలి .కనుక అది తన మేడిసన్ చదువుకు ,రచనకు అడ్డంకి అవుతుందని దాచుకొన్నాడు .
మెడిసిన్ పాసై 24వ ఏట ప్రైవేట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు .పరిస్తితులకు అనుకూలం గా ఉంటూ,సైన్స్ ఆర్ట్ లకు ప్రాధ్యాన్యతనిస్తూ ,జీవితం లో హాస్యానికి సముచిత ప్రాధాన్యమిస్తూ గడిపాడు సాహిత్యాన్ని ,డాక్టరీ ని సమంగా ఆదరించాడు ఇది ఎలా సాధ్యం అని ప్రశ్నిస్తే వైద్య పరిభాషలోనే చమత్కారంగా ‘’వైద్యం నా లీగల్ వైఫ్ అని ,సాహిత్యం నా మిస్ట్రెస్-ఒకామేతో విసుగొస్తే రాత్రి అంతా రెండవ ఆమెతో హాయిగా గడిపేస్తా ‘’అనేవాడు . ఇది మర్యాదకాడుకదా అని ఒక పబ్లిషర్ అంటే ‘’తప్పదు .అది బోర్డం నుంచి తప్పిస్తుంది .నేను ఒకసారి ఒకరితో ఉండటం వల్ల,ఆ ఇద్దరిలో ఏ ఒక్కరికి అసౌకర్యం ,నష్టం లేదు నేను వారికి అవిశ్వాసం గా ఉన్నాను అనటానికి అవకాశమే లేదు ‘’అనేవాడు .
చెకోవ్ కంటే పాతికేళ్ళ సీనియర్ సవోరిన్ చెకోవ్ కు మిత్రుడు ఫిలాసఫర్ ,మార్గ దర్శి అయ్యాడు .అతని ప్రభావం తో చెకోవ్ రచనా శైలి మారింది .26ఏళ్ళకే చెకోవ్ తన మొదటి కదా సంపుటిని ప్రచురించాడు. ప్రేక్షకులంటే ఏమిటో అర్ధమైంది .ఒక ఆర్టిస్ట్ గా చెకోవ్ బాధ్యత ఏమిటో ఎరుక పరచాడు సవోరిన్ .రష్యన్ సంప్రదాయం లో ఒక నవల పాఠకులను ,జనన వంతుల్ని చేయటం కంటే వినోద పరచటం కోసం రాద్దామనుకొన్నాడు .కాని అందులో చరిత్ర ,ఫిలాసఫీ ,సోషియాలజీ కలపాల్సి వస్తుందని అది అంతగా ఆకర్షణీయం కాదని భావించి వెనక్కి తగ్గాడు .దీనికి బదులు ‘’ఇవానోవ్ ‘’అనే నాటకం రాశాడు .ఇది బాగా క్లిక్ అయి ‘’పుష్కిన్ ప్రైజ్ ‘’కొట్టేశాడు ఇరవైలలోనే .ఇది అతి చిన్న వయసులో ఆ యువ రచయితకు దక్కిన అరుదైన గౌరవం అయింది .దీనితో ఆత్మ స్తైర్యం ఏర్పడి రాబోయే కాలం లో తానొక ప్రముఖ రచయితను అవుతానని సాహిత్యం లో తనకొక ప్రత్యేక స్థానం ఏర్పడుతుందని గొప్ప ఆత్మ విశ్వాసం ఏర్పడింది .ఈ విషయం లో ఆయన ‘’చేకాంటే చాలా రాశాడు కాని చెకోవ్ దాన్ని అంగీకరించతానికి ఇబ్బంది పడుతున్నాడు ‘’అన్నాడు నిస్పృహగా
.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-15-ఉయ్యూరు

