ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -82
36-చిన్న కధకు ప్రాణం పోసిన రష్యన్ కధకుడు అంటోన్ చెకోవ్-2
ఆ రోజుల్లో రచయితలంతా లియో టాల్ స్టాయ్ ప్రభావం పడిన వారే .చెకోవ్ కూ ఆయనంటే అభిమనమేకాని ఆయన మార్మిక భావాలు నచ్చేవి కావు .చెకోవ్ ను రాడికల్ అని అజ్ఞాత వాదిఅనీ అనేవారు .30ఏళ్ళు వచ్చేసరికి సాహిత్యం లో చెకోవ్ లబ్ధ ప్రతిష్టుడైనాడు. మిత్రుడు సవోరిన్ మెడికల్ ప్రాక్టీస్ కు రాం రాం చెప్పమన్నాడు .అప్పటికే ఆరోగ్యం క్షీణించటం మొదవటం తో రెండు వాహికలూ ఉండాలనే అన్నాడు చెకోవ్ .తల్లీ ,తమ్ముల సంరక్షణ తో అతని శక్తి నీరుగారి పోయింది .అదే సమయం లో లిడియా అవేలోవా తో పరిచయం కొంత ఆశా జనకం గా ఉన్నా ఆమెకు అప్పటికే పెళ్లి అయి గర్భ వతిగా ఉండటం తో నిస్పృహకు లోనయ్యాడు .వీటి నుండి కొంత విశ్రాంతి పొందటానికి దూరం గా ఉన్న సఖాలిన్ ఐలాండ్ కు వెళ్ళాడు .మూడు నెలలు ఉండి ఖైదీలతో తన అనుభవాలను రాశాడు .’’భగవంతుని భూమి అందమైనది .అయితే అందులో అందంగా లేనినిది మనం మాత్రమే ‘’అని ముగించాడు .
ఒత్తిడి, వేదనలతో రాయాలన్న ఉత్సాహం జావ గారి పోతోంది .అతని ‘’సి గల్’’కధలోని త్రిగారిన్ మదనే చెకోవ్ మధనం .’’పగలూ రాత్రి రాయటమే రాయటం అయి పోయింది నా జీవితం .రాయి రాయి రాయి అనే ఒత్తిడే ఎక్కువైంది .ఒక పుస్తకం పూర్తీ చేశానని తెలియగానే మరోటి రాయమని పుమాయింపు .ఇలా నిరంతరం రచనా వ్యాసంగం లోనే ఉండిపోయాను .ఓపిక నశి౦ చేదాకా రాస్తూనే ఉన్నా .దీని నుంచి తప్పించుకో లేనిస్థితి నాది .నన్ను రెచ్చ గొట్టి రాయిస్తున్నారు తప్పులు రాస్తున్నాని తెలుసు. కాని గత్యంతరం లేదు .దీనితో అసంతృప్తి .అధైర్యం .చదివిన ప్రతిదాన్నీ అబ్బో అదర గొట్టాడు చి౦ పేశాడు నరికేశాడు దున్నేశాడు విజ్రు౦ భించాడని రాం డోళ్ళ మోత .ఇలా అంటూనే టాల్ స్టాయ్రాసినంత బాగాలేవు అని సన్నాయి నొక్కులు .నేనూ మనిషినే. బాధ్యత గల పౌరరుడినే . వాళ్ళ కస్టాలు కన్నీళ్లు చూసి ఓదార్చార్చాల్సినవాడినే .వారి ప్రతినిధి గా ఉండాల్సిన వాడినే .వారి భవిష్యత్తు ,శాస్త్రీయ అవగాహన ద్రుక్పదాలకు ఆసరాగా ఉండాలి .అందుకే అన్ని విషయాలపై రాశాను అన్ని వైపుల్నించి విమర్శలను ఎదుర్కొన్నాను .’’అని రాసుకొన్నాడు .
అప్పుడప్పుడు చిన్న చిన్న స్ట్రోక్స్ వస్తున్నా రచనలనేమీ ఆపలేదు రాస్తూనే ఉన్నాడు .నిర్లఖ్యం చేశాడు .సన్నిహితులతో తప్ప మిగిలిన వారెవ్వరి తోనూ కలిసే వాడుకాదు .’’తెలియని వారి సమక్షం లోకంటే ఆత్మీయుల దగ్గర చావటం మేలు ‘’అనేవాడు .మొదటినాటకం విజయం పొందిన తర్వాత రెండవది ‘’ది వుడ్ డెమన్’’రాశాడు .ఇది తన్నింది .నిరాశపడకుండా మూడోది ‘’ది సీ గల్’’రాశాడు .మిత్రులకు దీన్ని చదివి వినిపిస్తే పెదవి విరిచారు .నాటకం ఆడితే హాల్లో పిల్లి ,నక్క కూతలు అరుపులు ఆగం .మిత్రుల సలహాతో సి గల్ ను అయిష్టం గానే కొంతమార్చి’’మాస్కో ఆర్ట్ దియేటర్ ‘’లో స్టానిస్ లేవిస్కి నిర్వహణలో ప్రదర్శిస్తే సూపర్ డూపర్ విజయం సాధించింది .ఇది అనూహ్య విజయం ,అత్యంత విశేష విజయం .
నిరాశా ,నిస్పృహలతో ,బతికే ధైర్యం లేని బడుగు జీవులకు చెకోవ్ నాటకాలు మానసికానందాన్నిచ్చేవి .విధానాన్ని మరల్చాడు చెకోవ్ .జీవిత సత్యాలను ,అంతర్భాగమైన హాస్యాన్ని మేళ వించి విజయం సాధించాడు .బడుగు ప్రజలు సామాన్యులతో దూరంగా ఉండటాన్ని ఎద్దేవా చేసి చైతన్య వంతుల్ని చేశాడు .’’the artist should be not the judge of his characters ,but only an un biased witness ‘’అంటాడు. ఇవాళ ఆంధ్ర జ్యోతి ,వాళ్ళ చానల్ ’’ఉయ్ రిపోర్ట్ యు డిసైడ్ ‘’ అని చెప్పినట్లు ఆనాడే చేకోవ్ ‘’నా పని సంఘటనలు సన్ని వేశాలని రిపోర్ట్ చేయటమే .అందులో పాత్రల స్వభావాలను కాంతి వంతం చేయటానికి అవసరమైనవీ అనవరమైనవీ ఉంటాయి .వీటిని నిగ్గు తేల్చి నిర్ణయింఛి తీర్పు చెప్పాల్సిన వారు పాఠకులు మాత్రమె’’అన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-10-15-ఉయ్యూరు

