నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం
16-చంద్రాభట్ట-ఈశ్వ రప్ప(16 వ శతాబ్దం )
శాండిల్య గోత్రానికి చెందినలక్కమా౦బా రామేశ్వరుల పుత్రుడు ఈశ్వరప్ప .సదాశివుని శిష్యుడు .’’పార్వతీపరిణయచంపు’’రాశాడు. 16 వశతాబ్దం వాడు .ఈయన వారసుడు సుబ్బన్న ఈవ్రాత ప్రతిని సిద్దార్దినామ సంవత్సర భాద్రపద బహుళ తదియగురువారం -16-9-1619కాపీచేశాడు .కనుక కవి కాలం 16శతాబ్దికి పూర్వం అని భావించవచ్చు.
ఇందులోఅవతారిక లో 44శ్లోకాలున్నాయి . 223 శ్లోకాలు గద్యాలు అయిదు ‘’సన్నాహాలు ‘’ఉన్నాయి .మొదటి అయిదు శ్లోకాలు వివిధదేవతలపై,తనగురువు పై చెప్పినవి .గురువు కవి రెండవ అన్నగారు కావచ్చు.ఎనిమిది నుండినలభై మూడవ శ్లోకంవరకు కవివంశ వర్ణన ఉంది .మూడవదానిలో అన్నసుబ్రహ్మణ్యం గీర్వాణ ఆంధ్రాలలో గొప్పకవి అనిచెప్పాదు .ఈకావ్య రచనకు హేతువు గురించిచేప్పు కొన్నాడు .’’ప్రాచ్యం రోహిత పట్ట కందుక రుచిం జిత్వా నిశానాయకే –జాతే వంచిత హేమ మంజుల రుచో జంబీర రససేచ్చయా ‘’
మొదటికాండ లోహిమ వంతుడికి ,మేనక కు మైనాక ,పార్వతి ల జననం వర్ణించాడు రెండవ దానిలో నారదుని రాక ,సంధ్యా ,చీకటి ,రాత్రి వర్ణనం నక్షత్ర చంద్ర ,సూర్యోదయ వర్ణన ,పార్వతి చెలులతో ఆటలు ,హిమ వంతుడి రాక ఉన్నాయి మూడులో భద్ర తీర్ధం లో శివునితపస్సు ,పార్వతిశివునికి చేసే సేవలు ,ఇంద్రాది దేవతలు వచ్చితారకాసురుని ఆగడాలు చెప్పి రక్షణ కోరటం ,బ్రహ్మ హితవుపై మన్మధుని సాయం కోరటం ,మన్మధుడు శివుడు తపస్సు చేసే చోటుకు రావటం ఉన్నాయి నాలుగులో మన్మదుడుశివునిపై బాణం వేయటం మసి కావటం ,రతీ విలాపం ,శివుడి అభయం ,నిరాశ తో పార్వతి తండ్రి ఇంటికి వెళ్ళటం ,పార్వతి తపస్సు ,బ్రాహ్మణ బ్రహ్మచారి వేషం లోశివుడు వచ్చి మనసు మార్చుకోమనటం ,ఆమెనిరాకరణ,నిజ రూపం లో శివుని ప్రత్యక్షం ,శివుడు పార్వతీ కల్యాణానికి ఒప్పుకోవటం సప్తర్షులరాయబారం ,చివరికి సకల దేవత సమక్షం లోశివపార్వతీ కళ్యాణం వర్ణించ బడ్డాయి .
ఈశ్వరప్ప కాళిదాస కుమార సంభవాన్ని అనుసరించాడు .కావ్యం హిమాలయ వర్ణన తో ప్రారంభ మైంది .
‘’శ్రీ మనస్త్రి సమస్త పర్వత పతిర్నమ్నాహిమాద్రిర్మహాన్ –కస్చిద్రద్ర వ్యపతే ర్దిశ ప్రకట యన్నాత్మీయ విస్తారతాం ‘’
పార్వతీదేవి పాద ముఖ వర్ణన –‘’రాత్రీ శుదాంశురిపురేత్య విజ్రుమ్భణం మే –హన్తీతి పర్వత సుతాంప్రతి సాదు జప్వా
పధం తదీయ చరనావతారం ప్రపద్య –తత్సంజ్నయా విజయతే కిము నిత్య ఝ్రుమ్భం ‘’
శివుడు బ్రహ్మ చారి వేషం లో వచ్చి పార్వతి తో సంభాషించటం –‘’జానామి జానామి తవానుభావం తస్యాన్న విస్టన్విజ్రుతానూ ప్రవేశ్యే
మాలికా రూప కపాళీ కాళీ ధర ,రాశాభ మురూ యదు శ్పాలి కా భీస్టేదః –అంగార గీభవ ద్రూతి కర స్శూలికీ కిం వ్రుతస్సత్వయా భీకరచేస్టయా ‘’అని పార్వతిని శివుదివిక్రుతవేశం వివరించి బెదర గొట్టేప్రయట్నం చేశాడు .
వివాహ సమయంలో పెండ్లికోడుకైన శివుడేలాఉన్నాడు?
‘’జటా జూటా రాశంభో స్సపాది హరి తోష్నీశ వసనం –సుధాంశు స్తత్రత్యః ప్రభావతి మహా భాషిక మపి ‘’చివరలోశివ పార్వతులశృంగార క్రీడా వర్ణనం చేశాడు
‘’కళ్యాణ ప్రదాయే స్తాయో స్త్రిజగతా మాస్వాదితా మూల్యత్ –త్తంభూలాది ర్యయొః కృత బహిర్జాత వ్య వా యా స్థయొః’’
ఆస్వాతంతగాద్యం –‘’ఇతి శ్రీ మదీశ్వర ప్పాభిదాన బుధ విరచిత పార్వతీ పరిణయ నామ దేయ చంపూ ప్రబందే పంచామాస్సంనాహః ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ – 21-11-15-కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్

