నాలుగవ గీర్వాణం
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4
15-ఉపమాక వెంకటేశ్వర (1850)
1850కి చెందిన ఉపమాక వెంకటేశ్వర కవి విశ్వనాధ ,కామాంబ లకుమారుడు .నిట్టల ఇంటి పేరు .విజయ నగరం జిల్లా వాడు .కవిత్వం లో అఖండుడు .ఆశ్చర్య పరచే కవితా ప్రాభవం ఉన్నవాడని గుర్తింప బడ్డాడు .’’రామాయణ సంగ్రహం ‘’కావ్యం 29సర్గలలో 1866లో రాశాడు .ఒకేపంక్తి లో అక్షరాల మార్పు వలన నాలుగు రకాల అర్ధాలు వచ్చే గర్భ కవిత్వం రాశాడు .అందుకని ఈ రామాయణానికి ‘’చతుశ్చిత్ర గర్భ రామాయణం ‘’అనేపేరోచ్చింది .
బాలకాండలోనే తన వంశ చరిత్రను రెండవ పాదం మొదటి అక్షరాలలో చెప్పాడు .-
‘’అదస్య కాండస్యాద్యపాద ద్వితీయ పాదాదిమ వర్ణ మారభ్యా న్త్యపాద ద్వితీయ పాదాది వర్ణ పర్యంతం తైర్వర్నోరూదితాచిత్రణి’’అని క్లూ ఇచ్చాడు .’’శ్రీ నిట్టలోపమాశర్మణా విశ్వనాధ తయేన కమామ్బాలతా ప్రసవేన జయద్వాయ జాత సూరవిశ్వనాధ రామ భద్ర రామది పుత్రా వతాచ రామ పాద కమల యుగ సచ్చా రాలోమానసేన విబుధా చరణకన్జసేవినా భవ తమో రుణోయంశ్రీ రామాయణ సంగ్రహే నామభూతకాల (చరి)తే బభూవ ‘’
దీని లో కవిచేప్పినదాన్ని బట్టి ఆయనకిద్దరు భార్యలని కుమారులపేర్లుసూర ,విశ్వనాధ ,రామ భద్ర ,రామ అని తెలుస్తోంది .
ఉపమాకవిఈ కావ్యం లో కవిత్వం తోఎన్నో ఫీట్లు చేశాడు .ఇందులో నాలుగు లఘు కావ్యాలు ఉన్నాయి . అవి1- గౌరీ వివాహం . ఇది శివ పార్వతి కల్యాణం .అయోధ్య కాండ నుంచి యుద్ధ కా౦డవరకు శ్లోకాలలోని మొదటి అక్షరాలలో ఈ కద వస్తుంది .2-శ్రీ రంగాది క్షేత్రం మాహాత్మ్యం –అయోధ్య నుండి ,యుద్ధకాండం వరకు ప్రతి శ్లోకం లోని రెండవ పాదం లో 63 శ్లోకాలలో శ్రీరంగం పురుషోత్తమం ,రామేశ్వరం ,అవి ముక్తం ,సింహా చలం ,కంచి ,సాకేతం ,ద్వారక ,మధుర ,శేషాచలం ,ప్రయాగ ,గౌతమి భద్రాచల క్షేత్రాల చరిత్ర ను నిక్షిప్తం చేశాడు .3-భగవదవతార చరిత్రం –ఇది విష్ణు అవతార చరిత్ర .ఇది శ్లోకం లోని మూడవ మూడవ పాదాలను కలిపితే వస్తుంది .ఇదివచనం .4-ద్రౌపదీ కల్యాణం –అయోధ్య నుండి యుద్ధ కా౦డవరకు ఉన్న శ్లోకాలలో నాలుగవ పాదాలన్నీ కలిస్తే ఈ కావ్య రూపం దర్శన మౌతుంది
ఈ మహా కావ్యం లో చివరి గొప్ప ప్రదర్శన మరీ ఆశ్చర్య పరుస్తుంది – బాల కాండ లోని ప్రతి శ్లోకం మొదటి అక్షరాల సముదాయం శ్రీ రామ కవచం ‘’గా రూపు దాలుస్తుంది .దీన్నిదర్శిద్దాం –
‘’రామ సదా పాహి శిరో మామక మగజే –శమానస నందకర ఫాల తలం త్వం మమ చ
క్షేత్ర యుగళ మాగమాంతర శ్రిత పద నయన యుగం –సీతాప్రియ మదీయం చ నాసికాం వాలిహర ‘
చివర్లో కవి –
సీతా కర సారస యుగ పాతాతి విశద మణివిరాజిత మౌళిం-సీతా యుత మరుణామణి ప్రోతసనగం భజే శుభే రామం ‘’శ్లోకం చెప్పి ముగించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -22-11 -15 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
—

