గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

19-వసుచరిత్ర నాటక కర్త –సుసర్ల కామ శాస్త్రి

బొబ్బిలిలో సుసర్ల చాయాంబ ,సుబ్రహ్మణ్య లకు కామ శాస్త్రి జన్మించాడు .బొబ్బిలి రాజు రంగారావు బహద్దూర్,వెంకట గిరి రాజా  ఆస్థానకవి .వెంకట గిరిలో వెలుగోటి వెంకట కృష్ణ యాచేంద్ర కు ప్రీతిపాత్రుడై ,ఆయన సలహాతో ‘’గిరికా కళ్యాణం ‘’అనే అయిదు అంకాల నాటకం రాశాడు .దీని మాతృక తెలుగు లో రామ రాజ భూషణుడు రాసిన ‘’వసు చరిత్ర ‘’ప్రబంధం .వసుచరిత్రను ముందుగా సంస్కృతం లో అనువాదం చేసినవాడు కాళహస్తి కవి అని మనకు తెలుసు .శ్రీధర పేరి సూరి దీనినే ‘’వసుమంగళనాటకం ‘’గా రాశాడు .బాబానృపాలుడూ ఇదే పని చేశాడు .కామ శాస్త్రి ఆ కోవలో మూడవ వాడయ్యాడు .

కామ శాస్త్రి ఈ నాటకం లో కొన్ని కొత్త పాత్రలను ప్రవేశ పెట్టాడు కొన్ని మార్పులూ చేశాడు .నాటక శాస్త్ర మర్యాదలనన్నిటి కి సమాధానం గా కోత్త  సా౦కేతికతో దీన్ని చేశాడు .కాని టెక్నాలజీ యే మిగిలింది కానీ నాటక కళ  దెబ్బతిని పోయింది .నాందీవాక్యం –‘’శ్రేయసే భూయసే భూయా ద్రాజ చూడామణి గిరావః –గిరిజా వదనా౦ భోజ చంచరీక ద్రుగస్చలః .’’

అయిదు అన్కాలకు 1-గిరికా దర్శనం 2 అమరావతి ప్రస్తానం 3 మహేంద్ర కృత ప్రతిజ్ఞ 4-కోలాహల కన్యాదాన ప్రతిజ్ఞా 5 –గిరిక కల్యాణం అని పేర్లు పెట్టాడు .రామరాజకవి వాడిన శ్లేషలను  సంస్కృతం లోకి దింపే ప్రయత్నం చేశాడు .వసురాజును చూసి గిరిక లేవ బోతుటే వద్దని మర్యాదగా చెప్పిన శ్లోకం

‘’గుణాల నాలాధిక సౌకుమార్యకా –న్యనయద్రుగంబా పానల చుమ్బితానిచ –క్షామాణితన్వంగి మద్విదేషు తే మ్రుదూని గాన్నాన్యుప చార కర్మణి ‘’అని మర్యాద ఇస్తాడు .

అయిదవ ఆకం లో వసు గిరిక కల్యాణం వర్ణించాడు .అచ్చమైన తెలుగు ఇంటి పెళ్ళిలా మన పద్ధతిలోనే చేయి౦ చేశాడు పెళ్లి .ఫలశ్రుతి చెప్పాడు

‘’శ్రీ వెంకట గిరి నిలయః కరుణా రాసా వృష్టి శమిత జన తాపః –పాయాన్నః కృష్ణ ధనః సమవర్ధిత సుకృతి జన కడంబో యం ‘’

20 – మిశ్రమ భాణం రాసిన –కాశీపతి(17 20

కౌండిన్య గోత్రీకుడు ఉమాపతి పుత్రుడు కాశీపతి .1734లో మైసూరు రాజు సైన్యాధ్యక్షుడైన ఆంధ్రుడైన కలులే నాగ రాజు పోషణలో ఉండేవాడు .విలువైన 1- తన పోషకుడు నంజరాజు రాసిన ‘’సంగీత గంగాధరం ‘’ శ్రావణ నందిని అనే వ్యాఖ్యానాన్నిరాశాడు .2 –ముకున్దనందన భాణం రాశాడు .రెండింటిలోను గణపతిని ఒకే విధంగా స్తుతించాడు

‘’వందే వందారు మందార మిందు చూడస్య నందనం –అమందానంద సందోహ బంధురం సి౦ధు రాననం ‘’

వ్యాఖ్యానం లో కొన్ని చారిత్రిక విశేషాలు తెలియజేశాడు .రెండవది అయిన భాణం భద్రగిరి చూదేశ్వర ఉత్సవాలలో ప్రదర్శించేవారు .ఈ ముకుంద నందం విషయం  లో, వివరణలో వినూత్నమైనదిగా కనిపిస్తుంది .ఇది మిశ్రభాణం. .ఆ రోజుల్లో వినూత్నమైనది అరుదైనదికూడా .సంస్కృత ప్రాక్రుతాలను కలిపి రాశాడు .రాజు భుజంగ  శేఖరుడి క్రీడలు శ్రీ కృష్ణ గోపికా క్రీడల్లాగా ఉంటాయి ..తర్కం లో దిట్ట ఐన కవి కవిత్వం లో అదే పదును చూపాడు .సూత్రధారుడు కవి ప్రతిభను చక్కగా వివరించాడు –

‘’తర్క కర్కశ వక్ర వాక్య గహనే యా నిష్టురా భారతీ –సా కావ్యే మ్రుదులోక్తి సార సురభౌ స్యాదేవ మే కోమలా ‘’

కవి ఊహకూ సరల కవిత్వానికి మరో ఉదాహరణ

‘’భూయో నిపీయ లావణ్యా౦బుధి మప్రభాత౦ –పుంజీభవన్నుదయతే త పంచ్చలేన

ఔర్వీ గ్నిరంభార పయోనిది మత్చ్య పాతుం –నీలో దుబుద్ధద కడంబమితి ప్రతీమః ‘’’

కాశీపతి కవిత్వం లో కాళిదాస, జయ దేవ, లీలాశుకుల కవిత్వం మిశ్రితమై కనిపిస్తుంది

‘’తప్తాంబురుహం తదూరు యుగళం తాద్రుక్ నితంబ స్థలం –తన్మధ్యం స గభీర నాభి వలయస్తా వాను రోజ క్రమః

తదంకం తదపాంగ ముగ్ధ వలనం తే నీల నీలాలాలకాః-సా తన్వీతి తదంక కేషు హృదయం దావన్న విశ్రామ్యతి ‘’

ఇది ముకుందుడైన శ్రీకృష్ణుని గురించి రాసినదే అయినాకాదంబినీ అంటే మబ్బు కుమార్తె  సౌదామిని అంటే మెరుపు ,కళానిధి కళత్ర చంద్రికా మొదలైన పేర్లు కూడా వస్తాయి కనుక ఇది పూర్తిగా భాణ  లక్షణాలను కలిగి లేదు కొన్ని సామెతలనూ పనిలో పనిగా కవి చెప్పాడు. ఆ నాటి కాలం లో శృంగార వీరవిహారం గురించి వర్ణించాడు. తనకు ఇష్టమైనవి ,అయిస్ట మైనవీ చెప్పాడు. గూర్జరులను గూర్జర స్త్రీ లను  విమర్శించాడు .ఇలా యే భాణం లోనూ లేదు ,

ఆంద్ర దేశం లో ఈ బాణం విస్తృత ప్రచారం లో ఉండేది .దీని చాలామంది కవులు అనుఅరించారు అనుసరించారు .కొందరు అందులోని వాక్యాలను ప్రేరణగా తీసుకొన్నారు .అందులో ముఖ్యమైనది –‘’మద్యం విష్ణు పదం కుచౌ శివపదం వక్త్రం విధాతుః పదం ‘’వంటివి .చిలకపాటి రామానుజ శర్మ దీన్ని పూర్తిగా అనువదించాడు .మరో సూక్తి ‘’చౌర్యేనైవ కృతం హికుక్షి భరణం జన్మ ప్రభూ  ‘’ ను అవధానకవులు తిరుపతికవులు తమ ‘’పాణిగ్రహీత ‘’లో అనువాదం చేసి రాశారు .కనుక ఎందరికో ప్రేరణ నిచ్చి కొత్తమార్గం తోక్కించింది కాశీపతి రాసిన ‘’ముకున్దానంద భాణం  ‘’

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25 11- 15 –కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.