గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 24-కృష్ణ మూర్తి కుమార

-నాలుగవ గీర్వాణం

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4

24-కృష్ణ మూర్తి కుమార

మంజులాచార్య అనే కృష్ణ మూర్తి కుమార  వశిష్ట గోత్రీకుడైన సర్వజ్ఞపండితుని కుమారుడు .’’వల్లవీ పల్లవోల్లాస భాణ’’కర్త .పల్లవ శేఖర ,రస లాలితల మధ్య ప్రేమ సంబంధాన్ని తెలియ జెప్పేది ఇదే పేరు మరో భాణం రాశాడు శిస్టుకృష్ణమూర్తి కూడా ..క్రిష్ణమూర్తిభాణాన్ని సింహాచల వరాహ నరసింహ స్వామి వస౦ త ఋతు ఉత్సవాలలో ఆడేవారు .కవికూడా విశాఖ జిల్లా లేక గోదావరి జిల్లా  వాడై ఉంటాడు .శిస్టుకవికంటే ముందువాడు అయి ఉండాలి .

కృష్ణ మూర్తి కవి తన భాణ రచనను ‘’శ్రీకాంతా తవ జీవితం ఖలు తతో వక్షః స్తలే లక్ష్యతే –నై కాంతా మయి చిత్త వ్రుత్తి రిహ బుద్వోతిముగ్దా గతిః’’అనే శ్లోకం తో ప్రారంభించాడు .ఇందులో ఉన్న  భావోద్వేగాలను నాందీ వాక్యానంతరం తెలియ జేశాడు .-‘’అద్రుత స్థన మండలం స్వ వపుషా ముచ్చూ వాస లీలా పుషా –మున్మీల ద్రతి లాభ మీలిత దృశా ముత్దాన నభేద స్ప్రుశం ‘

తన వంశం గురించి ఆరు శ్లోకాలలో కవి చెప్పుకొన్నాడు .సూర్య పండితునికి బుచ్చయా చార్య ,వెంకట పండిత ,సర్వజ్ఞపండిత కుమారులని ,,సర్వజ్నుని కొడుకు మంజులాచార్య అంటే తానేనని చెప్పాడు .తన రచనా వైభవాన్ని ,శైలిని గురించి ఘనంగా చెప్పుకొన్నాడు –‘’క్కచిత్ ప్రసూన కేసర ప్రసూన వల్లరీ లల-న్మాదూలికా నిరర్లక్షర జ్జ్హారీ సహోదరీ

కచిత్ప్రభిన్న దంత దాన మారుతా విల –భ్రమాత్కరాభ్రదంత దంభ బుమ్హితో రువైశ్వరీ ‘’ రసలాలతిక అనే నాయిక గురించి వచనం లో వర్ణించాడు .-‘’సంప్రతి సకల వారచకోర లోచనా జన మాస్ట కన్యస్తు మణిః-కుఛ వసుంధరా ధర సముల్లల ద్వదు రాజ్ఞాన శంకః కారణాచసరస రముక్త మణిః-కటీ తటసమారూఢ సారశన చారుతహీర ఘంటికసరద్రుణిః-కామన జన మోహపారావార రసలాలతికాయా యవీయసీ ‘’.ఈ ప్రేమ కదా నాగ పురం అనే కల్పిత నగరం లో జరిగినట్లు,ఆపుర వర్ణనా చేశాడు .

25-తడకమళ్ళ కృష్ణ మార్య(18 వ శతాబ్దం )

18 వ శతాబ్దానికి చెందిన తడక మల్ళకృష్ణ మార్య కవి ‘’తారావళి ‘’అనే లఘుకావ్యం రాశాడు .27శ్లోకాలలో ఉన్న శ్రీరామ స్తుతి ఇది .  1879లో రాసిన ‘’ద్రుగ్గణితం’’లో కవి వివరాలున్నాయి .రంగరాయ ,కనకా౦బలు పెంపుడు తలిదండ్రులు .అసలు తలిదండ్రులు కుట్టిమాంబ ,రంగ రాయలు .సోదరుడు వెంకన్న పండితుడుచిత్తూర్ జిల్లా  కార్వేటినగరం పాలకుడు  బొమ్మ రాజు ఆస్థాన మంత్రి .కవి తెలుగు సంస్కృత ఆంగ్ల మళయాళ భాషలలో మహా పండితుడు .నుంగం బాకం కేలండర్ తయారు చేయటానికి ప్రోత్సహించాడు .ఇప్పుడు కవి గారి రెండు శ్లోకాలు చూద్దాం –

‘’శ్రీవాస వత్స చిహ్నా౦చిత వక్షస్థల ధారా సుతా జానే –త్వమహి దయా దృష్ట్యా మందాక్రాంతం రక్షమాం దయాశరదే ‘’

రత్న కిరీట ధరా చ్యుత రామానంత ముకుంద దయాశరదే –కిమసౌ శనిరివ కిం కురుతే మాం పరిపాలయ దాశరధే ‘’’

శ్రీరాముని దయా ,కృపా వుంటే శని కూడా ఏమీ చేయలేడు అనే నిశ్చల మనస్సును ఆవిష్కరించాడు .

26-రంగ రాజు కేశవ రావు (—1904)

రంగ రాజు కేశవరావు జననం ఎప్పుడో తెలియదుకాని మరణం 1904..వరంగల్ జిల్లా ఖిలశాపురం వాసి .ఈత తప్ప సకల కళా ప్రపూర్ణుడు..పర్షియన్ ఆరబిక్ లతో బాటు చాలా భాషలలో లోతైన పాండిత్యం ఉంది .గొప్ప వీణా వాదనా నిపుణుడు..మంచి చిత్రకారుడు కూడా .సంగీతం పై వివిధ భాషలలో పుస్తకాలు రాశాడు .నవాబ్ ఇఖాబలుద్దౌలా బహదూర్ ఈయనకున్న పార్సీ భాషా పాండిత్యానికి కవిత్వానికి మెచ్చి  ‘’కవి శిరోమణి ‘’బిరుదునిచ్చి సత్కరించాడు .కవి వైష్ణవుడు .వివిధ దేవతలపై స్తోత్రాలు సంస్కృతం లో రాశాడు .అందులో ‘’శఠ కోప స్తుతి ‘’ఒకటి వేదాంత దేశికుని పై 62శ్లోకాలు రచించాడు .తన గురువు హనుమకొండ నివాసి అయిన  నృసింహా చార్య పై 24 శ్లోకాలు చెప్పాడు .భుజంగ ప్రయాత వృత్తం లో 12శ్లోకాలో గురు స్తుతి చేశాడు .సంస్కృతం లో చాలా పెద్ద గ్రంధాలు రాశాడు .కాని అచ్చుకాలేదు .భుజంగ ప్రయాతం లో నృసింహ గురు స్తుతి –

‘’పయోజాసనస్తం క్రుతాన్జల్యుపేతం స్ఫురద్రను భాసం స్ఫుటాబ్జ చ్చాద దక్షం

స్తితంవక్త్రుకామో వివ్రుత్యేవ వక్త్రం హనుమద్గిరీశం భజే భాష్యకారం .’’

27-ఇంద్రకంటి కొండయ

ఇంద్రకంటి నారాయణ అంచమ  పుత్రుడు కొండయ .పుట్టిన తేదీ కాలం అలభ్యం .కాశ్యప గోత్రం .నెల్లూరు తూర్పు గోదావరి జిల్లాలో ఇంద్రకంటి  వారున్నారు. బహ్వ్రచ శాఖకు చెందినవాడు ‘’మహేశ్వర మానస మహోత్సవం ‘’,శృంగార రస భ్రున్గారం అనే ఉద్గ్రంధాలు రాశాడు  మొదటిది శివాలయాలలో అర్చన విధానమంతా వర్ణించి చెప్పాడు .దీని నకలును కొడుకు లింగభట్టు రాశాడు

‘’తత్పుత్రేణైవ లిఖితా లింగ భట్టేన సూరిణా  –తాద్రుశేన  మహేశస్య పూజా మానసికీ శుభా ‘’అని కొడుకు చెప్పుకొన్నాడు

రెండవ రచన ‘’శృంగార రస భ్రున్గారం ‘’భాణం.శ్రీశైల ఉత్సవాలలో ప్రదర్శించేవారు .నాందీ ప్రస్తావన లో మల్లికార్జున స్వామి స్తుతి –

‘’కైలాసం పరిహృత్య శైల సుతయా సాకం గణేశ్చస్వయం –శ్రీ శైలేత్ర హి మల్లికార్జున ఇతి ఖ్యాతో స్తి సర్వేశ్వరః ‘’

శృంగార రస భ్రున్గార నామకం రూపకం సతాం –ఏషామభి నినీషామిరిరి౦జయిషయా హృదః ‘’

28-కోదండ రామయ్య

ఎక్కడ ఎప్పుడు పుట్టాడో కోదండ రామయ్య ఎవరికీ తెలియదు. బొబ్బిలి లో నివసించాడని భావిస్తారు .’సూర్య శతక ‘’కర్త గా గుర్తుండి పోయాడు

‘’శ్రియా సమేతం శ్రిత పారిజాతం వియత్ప్రదీపం వితత ప్రతాపం –నయ ప్రచారం నగ రాజ ధీరం దయా సముద్రం తపనం నమామి ‘’

తేజో మయే మండల మధ్య భాగే సి౦హా సనే రత్న మయేబ్జపీఠే-ఆశీ నము గ్రాయుధ దీప్ర హస్తం చాయాపతిం చండకరం  నమామి ‘’

సూర్య శతకాన్ని ముగిస్తూ చెప్పిన శ్లోకం –

‘’కోదండ రామార్య కృత స్తుతిం యేపఠింత శ్రుణ వంతిచ భక్తీ యుక్తాః-తేషాం శ్రియం పుత్రా కళత్ర సౌఖ్యం ,స్వర్గం చ మోక్షం దిననాద దేహి ‘’అని దీన్ని రాసినవారికిభక్తిగా  చదివినవారికి భార్యా బిడ్డలతో కలకాలం సౌఖ్యం పొంది చివరకు మోక్షం  ప్రసాదించమని సూర్య దేవుడిని వేడుకొన్నాడు .

సశేషం

మీ-గబ్బిటదుర్గా ప్రసాద్ -29-11-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.