శ్రీ శంకరం లోక శంకరం -3(చివరి భాగం )
శ్రీ శంకరులు కాశీ లో ‘’మనీషా పంచకం ‘’రాశారు .మనీషా అంటే బుద్ధి .’’ఏక శ్లోకి ‘’లో రెండు మహా వాక్యాల భావం పొదిగారు .విష్ణు మూర్తి ణి పాదాది కేశాంతం 50శ్లోకాలో వర్ణించారు .అంబాష్టకం ,శివపరాద స్తోత్రం కాలభైరవాస్టకం ,మానస పూజా స్తోత్రం ,భజగోవింద శ్లోకాలు ,,లక్ష్మీనృసింహ స్తోత్రం దక్షిణా మూర్తి ,అన్నపూర్ణాష్టకం ,చిన్నప్పుడే ‘’ పేద విధవరాలి దరిద్రాన్ని పోగొట్టి కాపాడమని లక్ష్మీదేవిని ‘’కనకధారా స్తోత్రం ‘’తో ప్రసన్నురాలిని చేసుకొని ఆమె ఇంట బంగారు ఉసిరికాయలు కురిపించిన సంగతి మనకు తెలిసిందే .శ్రీశైలం లో ‘’శివానంద లహరి ‘’రాశారు .దేశం లోని అన్ని పుణ్య క్షేత్రాలను దర్శించి అవసరమైన చోట్ల అమ్మవార్ల ఉగ్రత్వాన్ని తగ్గించటానికి శ్రీ చక్ర యంత్ర స్థాపన చేశారు .కర్నాటక లోని గోకర్ణం లో హరి శంకర మఠం ఏర్పాటు చేసి , కొల్లూరులో మూకాంబికా దేవిని ప్రతిష్టించారు .శృంగేరిలో శారదాదేవిని ప్రతిష్టించారు .బదరీ కేదార్ నాద లను దర్శించి అక్కడి స్వాములపై స్తోత్ర రచన చేశారు .పాండురంగాష్టకం రాశారు .కేరళలో పర్యటించారు గుజరాత్ లో ద్వారక కృష్ణుని సోమనాధ జ్యోతిర్లిన్గాన్నీ దర్శించారు .గణేశ ,సుబ్రహ్మణ్య ,ఉమామహేశ్వర ,కృష్ణా ,అచ్యుత ,హనుమత్కావచం ,జగన్నాధ విష్ణు భుజంగ స్తోత్రాలు చేశారు .
ఆధ్యాత్మికంగా ప్రాతస్మరణ ,ఉపదేశ ,యతి ,మాయా పంచకం ,నిర్వాణ షట్కం ,అద్వైత,,కాశీ పంచ రత్నం ,ప్రశ్నోత్తర మాలికా ,బ్రహ్మజ్ఞానావళీ మాలా ,లఘు వాక్య వ్రుత్తి ,అనాత్మ శ్రీ విగర్హణం,బ్రహాను చింతనం ,యోగ తారావాలీ ,దశ శ్లోకి ,షట్పదీ స్తోత్రం ,మోహ ముద్గరం ,తోటకాస్టకంవంటివి రాశారు .దేవీ స్తుతులుగా గౌరీ దశకం ,భవానీ భుజంగ స్తోత్రం ,త్రిపురసుందరీ ,దేవీ భుజంగ ,స్తోత్రాలు ,అన్నపూర్ణాష్టకం భ్రమరాంబా ,శారదా భుజంగ ,స్తోత్రాలు ,మీనాక్షీ ,లలితా పంచరత్న స్తోత్రాలతో పాటు గంగ ,యమునా ,మణికర్ణిక నర్మదాస్టకాలటో మరెన్నో చెప్పారు .ఇవి వింటేనే పుణ్యం చదివి అర్ధం చేసుకొని అనుసరిస్తే కైలాసమే .
ఆ నాటికి సంప్రదాయాలుగా ఉన్న కీట వార ,భోగ వార ,ఆనంద వార ,భూరి వార అనే నాలుగు సంప్రదాయాల ను ప్రమాణంగా తీసుకొని నాలుగు ఆమ్నాయ పీఠాలను నెలకొల్పారు శంకర యతీంద్రులు .పూరీకి హస్తమలక ,శృంగేరికి సురేశ్వర ,ద్వారకకు పద్మ పాద ,బడరికి తోటకాచార్యులను పీఠాది పటులుగా నియమించి అద్వైత సేవ చేయమని ఆదేశించారు .శ్రీ శంకరులు కాశ్మీర్ వెళ్లి అక్కడ సర్నోన్నత శారదా పీఠాన్ని అది రోహించాతానికి ముందు అక్కడున్న అన్ని మతాల అధిపతులను వాదం లో గెలిచి యెక్క బోతుండగా సరస్వతీ దేవి ప్రత్యక్షమై ‘’నువ్వు కామశృంగారాలలో మునిగి తేలావు యతీశ్వరునికి ఇవి నిషిద్ధం ఈ పీఠం ఎక్కే అర్హత లేదు ‘’అన్నది .’’అమ్మా ! నా కామవాసన అమరుక దేహం లో ఉన్నప్పుడే .ఇప్పుడా దేహం లేడునేను మామూలు యతినే ‘’అనగానే సంతోషించి ‘’నిన్ను మించిన వారెవ్వరూ లేరు సర్వ అర్హతలు నీకున్నాయి నువ్వే దీన్ని అధిరోహించాతానికి సర్వ విధాలా సమర్దుడివి ‘’అనగానే అందరూ శంకరుని వెంట బెట్టుకొని వెళ్లి పీఠం పై సగౌరవంగా కూర్చో బెట్టి అభినందించారు దీనితో శంకర యతీంద్రులు ‘’యోగి మహా రాజ్ ‘’అయ్యారు .తల్లికి జబ్బు చేసి మనసులో తలచుకొంటే కాలడి వెళ్లి ,12మంది నంబూద్రీ కుటుంబాలలో రెండు కుటుంబాలవారు మాత్రమె సహకరించగా శ్మశానం లో కాకుండా స్వంత ఇంటిలో దహన క్రియలు నిర్వహించి తల్లికిచ్చిన మాట నిల బెట్టుకొన్నారు .ఆ రెండు కుటుంబాలవారికి అక్కడ తమ పేరా ఉన్న వన్నీ అప్పగించిమల్లీ కాలినడకన దేశపర్యటన ప్రారంభించారు .కేదార్ నాద లో శ్రీ శంకర భగవత్పాదుల వారు మహా నిర్యాణం చెందినట్లు తెలుస్తోంది అక్కడే ఆయన సమాధి ఉంది .రెండేళ్ళ క్రితం వరదలలో అది కొట్టుకు పోయింది .
వేద ధర్మ పునరుద్ధరణకు ఇంతగా శ్రమించిన ఆ 32ఏళ్ళ యువ యతికి మనం ఏం చేశాం అని ఆలోచిస్తే సిగ్గు పడాల్సి ఉంటుంది .ఆయన మనవాళ్ళ లెక్క ప్రకారం క్రీ శ.820లో మరణించినా 1906వరకు అంటే సుమారు 1,086సంవత్సరాల వరకు అసలు ఆయన జన్మించిన స్థలం ఏది అని నిర్ధారించలేక పోయాం .అప్పటికి తిరువాన్కూర్ మహా రాజు అధీనం లో ఉన్న కేరళ రాష్ట్రం లోని శృంగేరీ మఠంపీఠాధిపతి 1906లో సుప్రసిద్ధ చారిత్రిక పరిశోధకుడు పురాశాస్త్ర వేత్త అయిన శ్రీ నడుకావేరి శ్రీనివాస శాస్త్రి గారినికేరళ లోని ఎర్నాకులం జిల్లాలో ఉన్న కాలడి ని సందర్శించి ప్రభుత్వ రికార్డులు ,కైఫీయత్తుల సహాయం తోఖచ్చితంగా శంకరుల జన్మ ప్రదేశాన్ని నిర్ధారించమని పంపారు .శాస్త్రి గారు కాలడి వచ్చి అక్కడి రికార్డులన్నీ పరిశీలించగా అది అంతా’’కపిల్లమన ‘’అనే ఆధీనం లో ఉన్నాడని తేల్చి ,శంకరులు జన్మించిన స్థలాన్ని నిశిత పరిశోధనలతో నిగ్గు తేల్చి ఇప్పుడు కాలడిలో శంకరాలయం ఉన్న చోటే ఆది శంకరుల జన్మస్తలి అని రుజువులతో సహా శృంగేరి మతానికి నివేదిక ఇచ్చారు ,పీతాదిపతులు తిరువాన్కూర్ మహా రాజాను సందర్శించి విషయమంతా తెలియ జేసి నివేదిక అందించి ఆస్తలాన్ని కబ్జా దారుడి నుండి తీసుకొని తమ మతానికి అప్పగిస్తే అక్కడ శంకరాలయం కదతామన్నారు .రాజు గారు పరమానందం పడి కపిల్ల మన స్వాధీనం లో ఉన్నదాన్ని అంతటినీ ప్రభుత్వ పరం చేసుకొని శృంగేరి మతానికి రాసిచ్చారు .ఆ తర్వాత నాలుగేళ్ళకు అక్కడ శృంగేరి మఠం శ్రీ శంకరాలయాన్ని 1910లో నిర్మించి ,నిత్య పూజాదికాలు చేయిస్తున్నారు .శంకరాచార్య దివ్య విగ్రహం ప్రతిష్టించారు అఖండ జ్యోతి ఆ రోజు నుండి వెలిగే ఏర్పాటు చేశారు 2010లో ఆలయానికి శాత జయంతి ఉత్సవాన్ని మహా ఘనంగా నిర్వహించారు ఈ ప్రదేశం లోనే తల్లి ఆర్యాంబ కు కుమారుడు శంకరులు శవ సంస్కారం నిర్వహించారు . కాలడికి దగ్గరలో ‘’మాణిక్య మంగళం ‘’అనే చోట శ్రీ కాత్యాయినీ మాత దేవాలయం ఉంది .నిత్యం ఉదయాన తండ్రి శివ గురువు అమ్మవారికి క్షీరాన్ని నైవేద్యంగా సమర్పించేవారు ఒక రోజు ఊరికి వెడుతూ ఆ బాధ్యతను బాల శంకరునికి అప్పగించారు .అమ్మవారి దగ్గర పాల చెంబు పెట్టి తాగమని గోల చేశారు .ఎంతకీ తాగాక పోయేసరికి ఏడుపు మొదలు పెట్టాడు .అమ్మ అనుగ్రహించి దర్శనమిచ్చి పాలు తాగేసింది అమ్మవారి దివ్య దర్హనం టో పులకించి ఆమె దివ్య సుందరాకారాన్ని ‘’సౌందర్య లహరి ‘’రాసి నిక్షిప్తం చేశారు .పూర్ణానది ఒడ్డునే శంకరాచార్య శ్రీ కృష్ణ విగ్రహాన్ని తల్లి కోరికపై ప్రతిష్టించి అక్కడే కూర్చుని 243పంక్తుల ‘’ప్రబోధ చంద్రోదయం ‘’రాశారు .తమిళనాడు లోని కంచి మఠంవారు కాలడి సెంటర్ లో కీర్తిస్తంభం ‘’అనే 8 అంతస్తుల భవనం నిర్మించి శ్రీ శంకరులకు సంబంధించిన సర్వవిషయాలను అందులో ఉంచారు .
కాలడికి రెండు కిలో మీటర్ల దూరం లో ‘’మట్టూరు తిరువేలు మాన్ శివాలయం ‘’ఉంది .ఈ లింగాన్నిశంకరుల తండ్రి శివగురువు ప్రతిష్టించారు రోజూ భార్యా భర్తలు ఇంట దూరం వచ్చి పూజాదికాలు చేయటం కష్టమైంది అడవి ప్రాంతం శివుని ప్రార్ధిస్తే నాట్యం చేసే తెల్ల జింక కనిపిస్తుందని అది ఆలయానికి దారి చూపిస్తుందని చెప్పాడు అలాగే వెళ్లి శివార్చన చేసేవారు అందుకనే ఆ ప్రదేశాన్ని ‘’తిరువేల్లమాన్ మల్లి ‘’అన్తెనాత్య మాదే తెల్ల జింక అని పిలుస్తారు .
కాలడికి మూడు కిలో మీటర్ల దూరం లో ‘’నయ తోడు శంకర నారాయణ కోవెల’’ ఉంది .ఈ శివాలయం లో శంకరాచార్య కూర్చుని విష్ణు మూర్తి ణి ప్రార్ధిస్తే శ్రీ హరి ప్రత్యక్షమై శివునిలోకలిసి పోయి హరి హర భేదం లేదని చాటాడు అందుకే ఈ దేవాలయం అద్వైత అర్చనకు గొప్ప స్థానంగా ప్రసిద్ధి చెందింది .మున్డుశివుడికి తర్వాత విష్ణువుకు ఇక్కడ అర్చన చేస్టారు .ఇక్కడి నదిలో మూతల నడవు ‘’అంటే మొసలి ఘాట్ (క్రోకడైల్ ఘాట్ )ఉంది .ఇందులో స్నానం చేస్తుంటేనే బాల శంకరుని మొసలి పట్టుకోగా తల్లి అనుమతితో ఆపద్ధర్మ సన్యాసం తీసుకొన్న రేవు అన్నమాట .
శ్రీశంకరుల గురించి యెంత చెప్పినా తనివి తీరదు .సౌందర్య లహరిలో భగవత్పాదుల శ్లోకం తో సమాప్తి చేస్తాను –
‘’ప్రదీప్త జ్వాలాభిర్దివస కర నీరాజన విధి –స్సుదా సూతే శ్చ౦ద్రో పల జలల వైరర్ఘ్య రచనా –స్వకీయై రంభోభి స్సలిలనిది సౌహిత్య కరణం –త్వదీయాభిర్వా గ్భిస్తవ జనని వాచాం స్తుతి రియం ‘’
శంకరాచార్య కీర్తి స్తంభ మండపం

