ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -147
58 -రేడియో కనిపెట్టిన- గుగ్లీల్మో మార్కొని –3(చివరి భాగం )
ప్రతిఖండం మార్కొనికి కొత్తదిగానే ఉంది. పాత ప్రపంచానికి కు కొత్త ప్రపంచానికి వైర్లెస్ ద్వారా అనుసందానం జరపాలనే ధ్యేయం తో అమెరికా వెళ్ళాడు .చనిపోయే లోపు మార్కొని 89 సార్లు అట్లాంటిక్ దాటాడు .1900 అక్టోబర్ లో అతి పెద్ద ట్రాన్స్ మిటర్ బిల్డింగ్ ను పర్య వేక్షించాడు .అప్పటిదాకా తాను నిర్మించిన దానికంటే ఇది వంద రెట్లు శక్తి వంతమైనది .దీన్ని కార్న్ వాల్ లోని పోలదు లో ఏర్పాటు చేశాడు. ఇది ఇంగ్లాండ్ కు ఆగ్నేయంగా ఉంది .1901లో బీమ్స్ శక్తిని పరీక్షించాడు .ఆరు నెలల తర్వాత వచ్చిన తుఫాను తానేర్పరచిన వ్యవస్థను చిన్నా భిన్నం చేసింది .అన్నీ మళ్ళీ నిర్మించాల్సి వచ్చింది .ఇలాంటి టవర్లె రిసీవింగ్ టవర్ లుగా మాసా చూసేట్స్ లో కేప్ కాడ్ లో ఏర్పాటు చేసి వీటిని పడగోట్టేశారు .తరువాత అమెరికన్ సైట్ ను న్యు ఫౌండ్ లాండ్ లోని సెయింట్ జాన్ కు మార్చాడు .దీనివలన అనేక ఇబ్బందులేర్పడ్డాయి .అప్పుడు వాతావరణం అసలు బాగా లేదు అంటే అనుకూలంగా లేదు .ట్రయల్ గా పంపిన బెలూన్లు దూరంగా కొట్టుకు పోయాయి .కావలసిన ఎత్తుకు సరిపడా నిర్మాణం చేయ లేక పోయాడు ..చివరిసారిగా న్యు ఫౌండ్ లాండ్ లోని ఏరియల్ ఎత్తును 400అడుగులు ఉండేట్లు యా౦టేన్నాను గాలి పటాలు పట్టుకోనేట్లు చేశాడు .
1901డిసెంబర్ 12 న మార్కొని సెయింట్ జాన్ లోని ఒక టవర్ లో కూర్చుని కార్న్ వాల్ నుండీ వచ్చే సిగ్నల్ కోసం ఎదురు చూశాడు .మొదట్లో చాలా బలహీనంగా పోను పోనూ చాలా బలంగా మోర్స్ కోడ్ లోని ‘’ఎస్ ‘’వినిపించింది .సక్సెస్ .సముద్రమేఒక మిరకిల్ గా ఒక వారధిగా వైర్లెస్ కు పని చేసిందని చెప్పాడు .ఈ యువ సైంటిస్ట్ ను ‘’హీరో ఆఫ్ ది అవర్ ‘’గా అభివర్ణించారు .’’నవీన శక ఆవిష్కర్త ‘’అన్నారు మార్కొని ని..’’మాస్టర్ ఆఫ్ స్పేస్ ‘’అనీ శ్లాఘించారు .మార్కొని పేరు మొదటి ఆవిష్కర్తల జాబితాలో చేరింది అని పొగిడారు .’’మార్కొని కార్న్ వాల్ నుంచి ఎస్ సిగ్నల్ పంపటం లో విజయం సాధించగానే ఒక కొత్త శకం మానవ చరిత్రలో ఆవిష్కారమైంది .ఒక వ్రేలి స్పర్శ ఒక ప్రత్యుత్తర స్పందనను ప్రకటించింది .కాని ఈ కుర్రాడు సగం సంతోషం తో,సగం ఆశ్చర్యభయం తో కనిపించాడు తాను ఇప్పుడు అన్నిటినీ తన నియంత్రణ లోకి తెచ్చుకోగలననే ధైర్యమొచ్చింది ‘’అని రాశాడు సైంటిస్ట్ ఆధర్ సర్ ఆలివర్ లాడ్జ్ .
ఈ పరిశోధనా సుడి గుండం లో కొట్టుకొంటున్న మార్కొనికి ఇంతవరకు పెళ్లి కోరిక కలగ లేదు .35దాటాయి. మొదటి పెళ్లి ప్రయత్నం విఫలమైంది .మాంచి ముహూర్తం లోనే ఐరిష్ లార్డ్ ఇంచిక్విన్ కూతురు ఆనరబుల్ బీత్రిస్ ఓ బ్రీన్ తో జరిగింది .19ఏళ్ళు కాపురం చేసి ముగ్గురు పిల్లలను కన్నారు .1924లో వివాహ బంధం విచ్చిన్నమైంది .మూడేళ్ళ తర్వాత మార్కొని 53వ ఏట మరో అందగత్తె కౌన్టేస్ మేరియా క్రిస్టిన బెజ్జి స్కాలి ని పెళ్ళాడాడు .అమెది పాపల్ అరిస్టాక్రసి వంశం .ఈ వివాహం గ్రాండ్ గా యువ రాజు చేతులమీదుగా జరిగింది .కార్డినల్ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించాడు .విలాసవంతంగా జీవితం గడపాలని మార్కొని నిర్ణ యించుకొన్నాడు .ఒక తెరచాప ఉన్న చిన్న పడవ మీద చిన్న ప్రయోగ శాలను నిర్మించుకొని ఎక్కువ కాలం అక్కడే గడిపేవాడు .ఇప్పుడు మార్కొనిని సైంటిస్ట్ గా కంటే నోబుల్ గా చూస్తున్నారు .మళ్ళీ తండ్రి అయ్యాడు .కూతురికి తన పరిశోధనలకు తగిన ‘’ఎలేట్ట్రా ‘’అని పేరు పెట్టుకొన్నాడు .
తన ప్రయోగ రంగాన్ని విస్తృత పరచాడు 1902లో తాను సాధించిన మాగ్నెటిక్ డిటెక్టర్ కు పేటెంట్ పొందాడు .దీనితర్వాత సమా౦తర ఏరియల్ ను నిర్మించి ఆశ్చర్యం కలిగించాడు .అల్ట్రా షార్ట్ వేవ్స్ పై ద్రుష్టి పెట్టాడు .మొదట్లో తాను సాధించిన రెండు వేల మీటర్ల వేవ్ లెంగ్త్ ఉన్నదానికి బదులుగా ఇప్పుడు 15మీటర్ల వేవ్ లెంగ్త్ ను సాధించాడు .షార్ట్ వేవ్స్ లో ఇదొక అద్భుతం .దీన్ని ప్రక్కన పెట్టి తరంగాన్ని12వేల మీటర్ల అతి పొడవైన దానిగా మార్చే కృషి చేశాడు .ఇవి పగటిపూట బలాన్ని కొంత కోల్పోతాయి .ముసలితనం పైబడినకొద్దీ మళ్ళీ షార్ట్ వేవ్స్ పైనే పని చేశాడు .కేంద్రీకరించి ,యే దిశలోనైనా పుంజాలుగా పంపే షార్ట్ వేవ్ ను తయారు చేసే పనిలో పడ్డాడు ..ఈ షార్ట్ వేవ్స్ ను ప్రపంచం లో యే ప్రాంతం పైకి అయినా పంపవచ్చని ,వాటితో మెసేజ్ లను యే ఆటంకం లేకుండా ,పగలు రాత్రి భేదం లేకుండా నిరాటంకంగా బయలు దేరిన చోట ఉన్న శక్తి తోనే రిసీవర్ కు చేరేట్లు పంపవచ్చని రుజువు చేశాడు .
సమాచార వ్యవస్తలో మరో అద్భుతం ఆవిష్కారమైంది .జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ ,లీ డీ ఫారెస్ట్ శాస్త్ర వేత్తలు మేధావి మార్కొని ఫలితాలను మిగిలిన మాధ్యమాల పై ప్రయోగించి వినోదం తో బాటు సమాచార ఆలోచనలకు దారి ఏర్పరచారు .ఫ్లెమింగ్ తయారు చేసిన ధర్మి యానిక్ వాల్వ్ ,డీ ఫారెస్ట్ వాక్యూం ట్యూబ్ కు దారి చూపింది .దీనితో రేడియో ,బొమ్మలు మాట్లాడే వ్యవస్థ ఏర్పడ్డాయి .1909లో మార్కొని రెండు విధాల గౌరవం పొందాడు .ఇటాలియన్ సెనేట్ లో సభ్యునిగా ,గౌరవాన్ని పొందటమే కాక భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి పొందాడు .1919లో ఆస్ట్రియా ,బల్గేరియా దేశాల మధ్య శాంతి ఒడంబడిక సాధించటం లో కృత క్రుత్యుదయ్యాడు .పారిస్ పీస్ కాన్ఫ రెన్స్ కు డెలిగేట్ గా వెళ్ళాడు 1929లో ‘’మార్చేస్ ‘’ను చేసి అరుదైన గౌరవం కలిగించారు .వైర్లెస్ వ్యాప్తిని మరింత విస్తృత పరచే ఆలోచనలో భాగం గా అంతరిక్షం లోకి చంద్రుడు లక్ష్యంగా లేక కుజుడికి వార్త పంపే విధానం గురించి తీవ్రం గా ఆలోచిస్తూ అధిక శ్రమ తో అలసిపోయి కూలిపోయాడు .తనకేం జరిగిందో తెలియదు .కాని ఆ సచేతన మేధావి (డైనమిక్ జీనియస్ )’’బాగా బాగా అలసిపోయాను ‘’అని మాత్రం అంటూ ,వెంటనే ఆక్సిజన్ ఎక్కించినా అందుకొనే శక్తి లేక 20-7-1937న 63 వ ఏట మార్కొని మరణించాడు .నిస్సంకోచంగా మార్కొని స్థానం అత్యున్నతమైనదే .రేడియో ను ‘’ the miracle with world girdling wings ‘’అన్నాడు .అది అభి వృద్ధికి గొప్ప చిహ్నం .’’సైన్స్ కు పరిమితులు లేవు .ప్రతి ముందడుగు అన్వేషణా పరిధిని విస్త రిస్తుంది.’’అనేవాడు మార్కొని .ఆ మాట నిజం ఆయన పరిశోధనలో జీవించిన యాభై ఏళ్ళు నిజంగానే సైన్స్ పరిధిని విస్తరింప జేసింది అంటారు రచయిత లూయీ అంటర్ మేయర్ .
మార్కొని బిజినెస్ మాన్ ,పారిశ్రామిక వేత్త ,’’ది వైర్లెస్ టేలిగ్రాఫ్స్ అండ్ సిగ్నల్ కంపెని ‘’వ్యవస్థాపకుడు .ఇదేతర్వాత’’మార్కొని కంపెని ‘’అయింది .రేడియోకు వాణిజ్య లాభాలను చేకూర్చినవాడు .1912ఏప్రిల్ 15న ‘’టైటానిక్ షిప్ ‘’మునిగినపుడు మార్కొని కంపెనీ బ్రతికి ఉన్నవారి పాలిటి ఆపద్బాందవి గా ఉండి రక్షించింది .’’నేను ప్రపంచానికి మంచి చేశానా ,కీడు చేశానా ?’’అని వితర్కి౦చు కోనేవాడు .మేలే తనవల్ల జరిగిందని సంతృప్తి పడేవాడు .నోబెల్ బహుమతితో పాటు మొత్తం 15అరుదైన అవార్డ్ లు సత్కారాలు అందుకొన్నాడు .మార్కొని పేర అనేక సంస్థలు వెలిసి ఆయనను చిరంజీవిని చేశాయి .మహానుభావుడు మార్కొని మరో లోకం లో సమాచార వ్యవస్త సాగిస్తున్నాడేమో !
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -20-5-16-ఉయ్యూరు

