ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -219
81-ప్రపంచ ప్రసిద్ధ నవ్వుల రేడు –చార్లీ చాప్లిన్ –3
మరొక విచిత్రమైన కేసులో ప్రతివాదిగా మారాడు చాప్లిన్ .జోన్ బెర్రీ అనే స్టేజి సహాయ నటి తన బిడ్డకు చాప్లిన్ తండ్రి అని కోర్టుకెక్కింది .తర్వాత కొంతకాలాని చాప్లిన్ ఆమెతో కాంట్రాక్ట్ కుదుర్చుకొని జర్మన్ డైరెక్టర్ మాక్స్ రీన్ హార్స్ట్ దగ్గరకు పంపాడని తెలిసింది .ఒక ఏడాదిలోనే ఆమె విపరీతమైన కోరికలకు విసిగి పోయాడు .ఆమె నెమ్మదిగా చాప్లిన్ ఇంట్లో ప్రవేశించి చంపేస్తానని .ఆత్మ హత్య చేసుకొంటానని బెదిరించింది .ఆమె దేశదిమ్మరితనానికి అరెస్ట్ అయింది .ఆమెకు పిల్లాడు పుట్టాక రక్త పరీక్షలలో ఆమె ఆరోపించినట్లు చాప్లిన్ కొడుకు కాదని రుజువైంది .కాని ఆమెతో ఆయనకున్న సాన్నిహిత్యం వలన కోర్టు ఆ పిల్లాడి పోషణ భారం చాప్లిన్ దేనని తీర్పు ఇచ్చింది .
బారీ కేసు మధ్యలో ఉండగా చాప్లిన్ నాలుగో పెళ్లి అభిమానులను కలవర పరచింది .నాలుగో పెళ్లి కూతురూ బాగా చిన్న పిల్లే.ఆమె ఎవరో కాదు ప్రముఖ నాటక కర్త యూజీన్ ఓ నీల్ 18 ఏళ్ళ కూతురు .ఈ పెళ్లి ని తండ్రి ఒప్పుకోలేదు .పైగా తనకూ కూతురుకు సంబంధమే లేదు పొమ్మన్నాడు. అల్లుడు చాప్లిన్ మామ నీల్ వయసు వాడు .1943 లో జూన్ నాలుగున జరిగిన పెళ్లి నాటికి చాప్లిన్ వయసు 54 ,కొత్త పెళ్లి కూతురు ఊనా వయసు కేవలం 18 ఏళ్ళు .ఆమెలో చాప్లిన్ మంచి జీవిత భాగస్వామిని చూడటమేకాక దాంపత్య సౌఖ్యాన్ని బాగా అనుభవించాడు .ఈ పెళ్లి తర్వత ఆయనపై స్కా౦డల్స్ ఆగిపోయాయి .ఇప్పటిదాకా పడిన అపనిందల సుడి గుండాల నుంచి బయట పడి సిటిజన్ షిప్ రాని లోటు దీనితో తీరి,సుఖమయ ఆనందమయ జీవితం గడుపుతున్నాడు .ఈ ఇద్దరికి ఒక కొడుకు యూరప్ లో ఉండగా పుట్టాడు .
వివాదాలను శత్రువులను చాప్లిన్ సృష్టించు కొంటున్నాడు తన ప్రవర్తన, పనికి రాని ఎమోషన్ ,రాజకీయాలతో .పూర్వపు పనులన్నీ గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయి. లండన్ వీధుల్లో గూడు లేక కూడు లేక తిరిగిన రోజుల్ని మర్చిపోలేదు. 1922 తర్వాత ఈ అధోజగత్ సహోదరుల గురించి డాక్యు మెంటరీలు తీశాడు .ఇందులో మొదటిది ‘’వుమెన్ ఆఫ్ పారిస్ ‘’ఇందులో తానుకనిపించడు కాని ఇతివృత్తం బలీయంగా దర్శనమిస్తుంది .’’ది గోల్డ్ రష్ ‘’ను స్వయంగా దర్శకత్వం వహించాడు .ఇది ఆయన మేగ్నం ఓపస్ అన్నారు .అందులో విషాదాన్ని హాస్యం తో జోడించాడు .ఈ కధను ఎందుకూ పనికిరాని ఒక క్లౌన్ తో అసంబధంగా వ్యంగ్య భరితంగా సస్పెన్స్ తో చెప్పించాడు ..’’సిటి లైట్స్ ‘’అన్ని లెక్కల్నీ తారు మారు చేసింది .మాట్లాడే సినిమాలు తీశాక మూడేళ్ళకు మళ్ళీ మూకీ లు తీసి అయిదుమిలియన్ డాలర్లు లాభం పొందాడు .మళ్ళీ సంప్రదాయాన్ని మార్చి హాస్యానికి ట్రాజేడి కలిపాడు .సిటీ లైట్స్ లో ఒక గుడ్డి పిల్ల ఒక తాగుబోతు ,డిప్రెషన్ తో ఉన్న మిలియనీర్ దగ్గరుండే ఒక సంచారిని ప్రేమిస్తుంది .ఆమెకు చూపు తెప్పించటం కోసం అతడు ప్రయత్నించి సాధించి ఆమెకు చూపురాగానే ఆమెను కోల్పోతాడు .ముగింపు సందిగ్ధంగా ,తప్పనిసరిఅనిపిస్తుంది .తీవ్రమైన స్వీయ సానుభూతి ఎక్కడా తగ్గకుండా తర్వాత వచ్చే కామిక్ సీన్లు నిలబెట్టాయి .
ఇప్పుడు చాప్లిన్ అనేక రకాల సృజన శీలి అయ్యాడు ..సీనరిస్ట్ ,డైరెక్టర్ ,నటుడూ గా ఉన్నాడు .సంగీత దర్శకుడూ అయ్యాడు .సిటి లైట్స్ తర్వాత వాటికి కదా సంగీతం ఆయనే కూర్చాడు .సీరియస్ విషయం డామినేట్ చేయకుండా ఆచార వ్యవహారాలపై వ్యంగ్య విమర్శలతో తీశాడు .మళ్ళీ ‘’మోడరన్ టైమ్స్ ‘’మూకీ తీశాడు ..ఇది పారిశ్రామిక వేత్తల మితి మీరిన వస్తు ఉత్పత్తి ,విపరీత చేస్టలపై గొప్ప సెటైర్ …ది గ్రేట్ డిక్టేటర్ ‘’లో హిట్లర్ వేషం ధరించి అతని ఆయుధ పిచ్చిని ,క్రౌర్యాన్ని ఎండగట్టాడు .జ్యూయిష్ బార్బర్ గా తానుతీసిన అన్నిసినిమాలకు భిన్నంగా మొదటి సారి నోరు విప్పి మాట్లాడాడు .కొందరు చాలా ఎక్కువగా వాగాడు అన్నారు .చివరికి వచ్చే మోనోలాగ్ ను తీవ్రంగా విమర్శించారు .క్లౌన్ క్లౌన్ గానే ఉండాలికాని ఈ హిత బోద ఏమిటి అన్నారు .దీనికి సమాధానం గాచాప్లిన్ ‘’I am a human being who wants to see this country a real democracy ,free from the infernal regimentation which is crawling over the rest of the world ‘’అని సమాధానం చెప్పి నోరు మూయించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -22-7-16 –ఉయ్యూరు .