అఘోరీ బాబా -2
రెండు గంటలు అఘోరీ బాబా వద్ద ధ్యానం చేశాక స్వామిరామా ఆయనతో మాట్లాడటం ప్రారంభించాడు .బాబా అత్యున్నత మేధావి అని అర్ధమయింది .ఆయన సంస్కృత భాష సంక్షిప్తంగా కఠినంగా ఉండేది అందుకని ఆగి ఆగి వివరించేవాడు .మహాజ్ఞాని అని తెలిసింది .తాను చూసిన సాధువులలో విచక్షణ సాధువని పించాడు ..అధర్వ వేదం లో అఘోర మార్గం ఉన్నది కానీ ఏ శాస్త్రం లోను మనిషి మాంసం తినమని లేదు .మీరు ఎందుకు ఇలాంటి జీవితం గడుపుతున్నారు ”అని రామా ప్రశ్నిస్తే ”అది మృత శరీరం అని ఎందుకు అనుకొంటున్నావు ?అది పనికి రాదని పార వేయబడిన పదార్ధం మాత్రమే .మీరు దాన్ని మనుషులకు ఆపాదిస్తున్నారు .ఎవరూ దాని జోలికి పోరుకానుక నేను ఉపయోగిస్తున్నాను .నేను ప్రయోగాలు చేసే శాస్త్ర వేత్తను ..పదార్ధం దాని శక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలుసుకొనే ప్రయోగం చేస్తున్నాను ఒక రూపం లో ఉన్న పదార్ధాన్ని మరొక రూపం లోకి మారుస్తున్నాను ,నాకు ప్రకృతే మాత .ఆమె అనేక రూపాలు సృష్టిస్తుంది .నేను రూపాలను మార్చే ప్రయోగాలు చేస్తూ ఆమె బాటలోనే నడుస్తున్నాను .దీన్ని ఇందాక ఎందుకు చేశానంటే పండిట్ వెళ్లి ఊళ్ళో వాళ్ళని ఇక్కడికి రాకుండా హెచ్చరిస్తాడని మాత్రమే .ఈ గుహలో 21 ఏళ్ళనుంచి ఉంటున్నాను .ఇంతవరకు ఎవ్వరూ వచ్చి నన్ను చూడలేదు. నా రూపం చూసి ప్రజలు భయపడతారు .నేను మురికి పంది నని మృత కళేబరాలను పీక్కు తింటానని అనుకొంటారు .నేనెవరికీ అపకారం చేయలేదు గులకరాళ్ళతో బెదిరించానే కానీ ఎవ్వర్నీ గాయ పరచలేదు” .అన్నాడు
బాబా బాహ్య రూపం భయంకరం అంతర రూపం సౌందర్యమయం అని పించింది .తనదగ్గరికి వచ్చి ప్రశాంతతకు భంగం కలిగించకుండా అలా ప్రవర్తిస్తాడు .ఆయన స్వాస్థ్యము తప్పినవాడు కాదు .ఎవరిపైనా ఆధారపడకుండా జీవించే స్వతంత్రేచ్ఛ ఉన్నవాడు .ఆ రోజు రాత్రంతా బాబా అఘోర మార్గాన్ని స్వామి రామాకు వివరించి చెప్పాడు .పదార్ధాన్ని అనేక రూపాలలోకి మార్చే సమర్ధుడు ఆయన .రాయిని పంచదార స్పటికం చేయగలడు .మర్నాటి ఉదయం ఇలాంటి అద్భుతాలెన్నో చేసి చూపించాడు .అక్కడ ఉన్న ఇసుకను తాకమన్నాడు తాకితే జీడిపప్పు బాదం పప్పుగా మారింది .ఇందులో శాస్త్రీయ సిద్ధాంతాలున్నాయన్నది కాదనలేని సత్యం .
మధ్యాహ్నం మళ్ళీ నిన్నటి పదార్ధం కాకుండా కుండ లో నుంచి మరొక తీపిపదార్ధం బయటికి తీసి తినిపించాడు .ఈ తంత్ర విద్య గురించి అడిగితె ”ఈ శాస్త్రం నశించిపోతొ0ది .పండితులు దీన్ని అభ్యాసం చేయటం లేదు . కొద్దికాలానికి ఇదికాలగతి లో కలిసి పోతుంది ”అని నిర్వేదం ప్రకటించాడు అఘోరీబాబా ..
”ఇలాంటి ప్రయోగాలవలన ఉపయోగం ఏమిటి ?”అని అడిగితే ”ఉపయోగం అంటే ?అని ప్రశ్నించి ”ఇది సైన్స్ .ఈ సైన్స్ తెలిసిన సైన్టిస్ట్ ఈ విజ్ఞానాన్ని రోగ నివారణకు ఉపయోగిస్తాడు .ఇతర సైన్టిస్ట్ లకు పదార్ధాన్ని శక్తిగా శక్తిని పదార్థంగా మార్చవచ్చునని తెలియ జేయాలి ..ఈ రెండిటికి ఉన్నది ఒకే సూత్రం .అన్ని పేర్లు రూపాలకు అంతర్గతం గా ఏకీకృత సిద్ధాంతం ఉన్నది ,దీన్ని ఆధునిక శాస్త్ర వేత్తలు ఇంకా కనిపెట్టలేక పోయారు ..ఈ అంతర్గత జీవిత సిద్ధాంతాన్ని ప్రాచీన సైన్స్ అయిన వేదాంతం స్పష్టంగా చెప్పింది .ఉన్నది ఒకే ఒక ప్రాణ శక్తి అన్ని నామాలు రూపాలు దాని విభిన్న శక్తులే .రెండుపదార్ధాలమధ్య సంబంధం తెలుసుకోవటం కష్టమేమీ కాదు కారణం వాటిలోమూల ద్రవ్య రాసి ఒక్కటే కనుక ..నీరు గడ్డకట్టి మంచు అవటం వేడిచేస్తే ఆవిరి అవటం లాంటిదే ..చిన్నపిల్లలకు ఇవి వేర్వేరు పదార్ధాలనిపిస్తాయి .కానీ వాటిలోని కూర్పు -కంపొజిషన్ ఒకటే ..రూప భేదమే.ఇవాళ్టి సైన్టిస్ట్ లు అలాంటి పిల్లలే .వాళ్లకు పదార్ధం వెనుక ఉన్న ఐక్యత అర్ధం కాదు .వాటిని ఒకదానిలోనుంచి మరొక దానిలోకి మార్చే సూత్రాలూ తెలియవు . ” స్వామి రామాకు తెలుసుకోదగిన పదార్ధమంతా తెలిసింది .ఆయన దగ్గర సెలవు తీసుకొని దగ్గర గ్రామానికి చేరి పండిట్ భయం పోగొట్టాలని అనుకోని ఆయన్ను కలిస్తే పండిట్ తానూ అఘోరీ బాబా మార్గదర్శనం నచ్చి, ఆయన శిష్యుడనవుతున్నానని చెప్పగా స్వామి రామా అవాక్కయ్యాడు .
అఘోరీల కుల దేవత ”హింగ్లా జీ మాత ”వీరి ముఖ్యకేంద్రం వారణాసి లోని కీనా రామ్ ఆశ్రమం .దీనిపూర్తిపేరు బాబా కీనారం స్థలం .వీరి విశ్వాసం ప్రకారం బాబా సిద్దార్ధ నాధ గౌతమ్ మళ్ళీ కీనారామ్ గా జన్మించాడని .వీరు సాధారణంగా స్మశానం లో సంచరిస్తారు .శవాల చితాభస్మాన్ని ఒంటినిండా పూసుకొంటారు చనిపోయిన మానవ శరీరం లోని ఎముకలను కాపాలాలనుసేకరిస్తారు .కపాల మాల ధరిస్తారు .వీరి సంఖ్య 70 అని గణాంక శాస్త్ర వేత్తలు లెక్కించి చెప్పారు
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -1-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

—

