వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -50
మల్లినాథుని వ్యాఖ్యాన విధానం -2
న్యాయ నిర్ణయం లో మల్లినాథుని ప్రతిభ అద్వితీయం .జడ్జిమెంట్ చాలా క్లుప్తంగా ,అర్ధవంతమైన వాక్యాలలో ఉంటుంది ..ఈ విధాననైపుణ్యం అన్ని గ్రంధాల వ్యాఖలలోనూ అలాగే ఉండేట్లు జాగ్రత్తపడ్డాడు సూరి .సూరి నిర్ణయం రూప లావణ్య శోభితం (గ్రేస్ ).సాధారణ సంస్కృత వ్యాఖ్యాతల శిల్పం ఇదే .వ్యాఖ్యానాలతో టీకా ,భాష్యం లేక వార్తిక0 లు కూడా తాత్విక గ్రంధాల విషయం లోనూ అలాగే ఉంటుంది .భాష్యాలలో చాలా విస్తృత విశ్లేషణ భాష్యకారులు లేక ఆచార్యులు సూత్రాన్ని స్ప్రింగ్ బోర్డు లాగా తీసుకొని లోతైన ఊహా గానాలతో విహరిస్తారు..కావ్య ,నాటక ,స్తోత్ర మొదలైన వాటి విషయం లో వాళ్ళు ముఖ్యంగా వాటి నిర్మాణం ,ఉపయోగించిన పదజాలం పై ద్రుష్టి పెడతారు .మల్లినాథుని వంటి వ్యాఖ్యాతలు నిర్మాణ విశ్లేషణపై ద్రుష్టి ఎక్కువగా సారించారు .ఈ నిర్మాణం నిఘంటు ,వ్యాకరణ గ్రంధాలు ,శబ్ద వ్యుత్పత్తి శాస్త్రాల ఆధారంగా ఉన్నాయో లేదో చూస్తారు .ఇదంతా బాహ్య లేక క్రమబద్ధ విధానం (ఫార్మల్ )
గ్రంధం యొక్క ప్రాముఖ్యం లేక అందులోని ముఖ్య లక్షణాలను కూడా పాఠకుల అవగాహనకోసం తెలియ జేయాలి .దీనికోసం మూల్యా0కణం లేక విశ్లేషణ అవసరం .దీని వలన విషయం పై పాఠకునికి ఒక కీలక అభిప్రాయానికి రావటానికి వీలౌతుంది .ఇదే విశ్లేషణాత్మక వ్యాఖ్యానం ..వ్యాఖ్యాతలు ముందుగా శ్లోకానికి ప్రోజ్ ఆర్డర్ రాసి ,ఒకటి రెండు వాక్యాలలో విశ్లేషిస్తారు .ఇది అభినందించడానికి సాధనమవుతుంది ..ఇప్పుడు చెప్పినదానికి మల్లినాథుని వ్యాఖ్యలను చూస్తే అర్ధమవుతుంది .
కుమార సంభవ0 లో కాళిదాస మహాకవి శివుని దృష్టి పార్వతిపై పడింది అని చెప్పే -’’త్రిభిరపి లోచనైహ్ సాభి లాషామద్రాక్షీ దిత్యర్ధహ్ ‘’-ఏ తేవ భగవానో రతి భావోదయా ఉక్తహ్ ;;..లో కిందిపెదవి బింబ అంటే దొండ పండులా ఉంది అన్నాడు ..ద్రుష్టి పడటం అనేది ప్రతీకాత్మక వర్ణన (సింబాలిక్ డిస్క్రిప్షన్ ). అందులోనే శివుడు బ్రహ్మ చారి వేషం లో పార్వతిని తన శరీరాన్ని ఒక సారి చూసుకోమని చెబుతూ శరీరమాద్యం ఖలు ధర్మసాధనం అంటాడు .దీన్ని మల్లినాథుడు చాలా ఉదాత్తంగా సమర్ధించాడు -’’సతి దేహే ధర్మార్ధ కామ మోక్ష లక్షణాశ్చతు ర్వర్గః సాధ్యంతే -అత ఏవ సతతమాత్మా నమేవ గోపాయీత ఇతి శ్రుతేహ్ -అయిథా బలమారంభో నిదానం క్షయ సమ్మాద0 -ఇతి భావః అని వివరించాడు సూరి ..దిలీప మహారాజును వర్ణిస్తూకాళిదాసకవి అర్ధ కామాలు దిలీపునికి ధర్మం వంటివే అన్నాడు -’’అప్యర్ధ కామో తస్యాస్తమ్ ధర్మ ఏవ మనీషీణాం ‘’ భౌతిక సుఖాలఅనుభవం కూడా దిలీపునికి ధర్మకార్యమే అని పించిందని భావం .న0దార్గికర్ అనే వ్యాఖ్యాత పండితుని వాక్యాలను యధా తధంగా ఉదహరించారు .-దిలీపుని దృష్టిలోధర్మార్ధ కామాలలో రెండిటిని పొందటం మానవ ధర్మం .తాను ప్రభువును కనుక వివాహితుడుకనుక ,మూడవదైన ధర్మాన్ని పొందటానికి మొదటి రెండు కారణ భూతాలౌతాయని మంచిపరిపాలన ,సక్రమ న్యాయ నిర్వహణ వలన ఆ ఫలితం పొందుతానని అర్ధం .ఇక్కడ మల్లినాథుని వ్యాఖ్య స్వీయ వ్యాఖ్యానమే .దిలీపుని ఉత్కృష్ట సమర్ధత ను 1-ఐశ్వర్యం -పరి పాలన -ప్రజాక్షేమ0 ,-ధర్మం
2-సౌఖ్యం -వివాహం -సంతానం -ధర్మం గా విశ్లేషించవచ్చు . ఈ మూడింటిలో ధర్మమే ఉత్రకృష్టమైనది .మిగిలినవి దానికి ఉపకరణాలు లేక సాధనాలు .-’’’అర్ధ కామ సాధన ర్యో దండవివాహ యో ర్లోక స్థాపన ప్రజోత్పాదన రూప-ధర్మార్ధత్వేనా నుష్ట నాదర్ద కామావపి ధర్మ శ్రేష్ఠ తా మపాదయాన్ స రాజా -ధర్మోత్తరో భూదిత్యర్ధహ్ ‘’.
కాళిదాసు పార్వతి తపస్సు ను 5 వ సర్గలో వర్ణిస్తూ ,తొలకరి చినుకులు పార్వతి పై పడి వరుసగా ఎలా కిందికి జారాయాయో తెలియ జేసే శ్లోకం లో మొదటి నీటి బిందువులు ఆమె కను బొమ్మల వెంట్రుకల పైనా తర్వాత కిందిపెదవిపైన ,పిమ్మట పయోధరాలపైనా ,చివరికి నాభిపైనా జారిపడినట్లు చెప్పాడు .దీనిని వ్యాఖ్యానిస్తూ మల్లినాథుడు ప్రతి సందర్భ వర్ణనలో సాధికారతను వివరించి చెప్పాడు .శ్లోకం -’’ప్రదమే ఉద బిన్దవః —’’ప్రధమ అనే పదం అరుదుకు చిహ్నం తరువాతి పదం లోని బహువచనం మరీ అసాధారణమైనది .క్షణం పక్షమసు స్థితాః ‘’లో ఆమె కనుబొమలవెంట్రుకలు ఎంత దట్టంగా ఉన్నాయో చెబుతుంది .అవి వాటికి అంటుకు పోవటాన్ని సూచిస్తుంది ..తాడితా ధరా – ఆమె కింది పెదవి మెత్తదనాన్ని సూచించి నీటి బిందువులు చీలి స్థనాలపై పడటం అంటే వారి బలిష్ఠతకు గుర్తు .తర్వాత అవి తొట్రుపడి శరీరం పై చేరాయి అనటం లో వళుల అసమాన స్థితికి సంకేతం .నాభిం ప్రపేదిరే -లో అక్కడ నీటి బిందువులు బలంగా అడ్డకోబడ్డాయని ,చివరికి నాభి కి చేరి మరింక కిందికి జారలేదని చెప్పటం తో ఆమె నాభి ఎంతో లోతైనది అంతరార్ధం ..
కొన్ని చోట్ల మల్లినాథుని వ్యాఖ్యానం ఇతరుల వ్యాఖ్యానం కంటే చాలా స్పష్టంగా సంతృప్తికరంగా కనిపిస్తుంది .రఘువంశం లో చంద్రుని వర్ణించే శ్లోకం -’’నిద్రా వశేన భవతాప్య నావేక్షమాణా -పర్యుస్త కత్వమబలం నిశి ఖణ్డితేన -లక్ష్మీర్వినోద యతి యేన దిగంత లంబీ -సోపి త్వదానన రుచిం విజహాతి చంద్రహ ‘’పై నన్దర్గికర్ వ్యాఖ్య రాస్తూ లక్ష్మి అజుని భార్యగా వర్ణించ బడింది .అజుడు నిద్ర సుఖం లో ఉ0డి లక్ష్మిని అలక్ష్యం చేశాడు ,అందుకని ఆమె అతన్ని వదిలి వెళ్లాలనుకొంటే చంద్ర బింబం లాంటి అతని ముఖ సౌందర్యం కదలనీయ లేదు .అప్పుడే వైతాళికులు అజుని మేల్కొలుపులతో నిద్ర లేపుతుంటే ఆమెకు ఆనంద సంతోషాలు కలిగాయి అని రాశాడని లాల్యే పండితుడు పేర్కొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-6-17- కాంప్-షార్లెట్ -అమెరికా
—

