వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష -54 (చివరి భాగం )
మల్లినాథుని దండాన్వయ విధానం
ఉదాహరణలు అనేకమైనప్పుడు ,మల్లినాథుడు మరొక విచిత్ర విశేష విధానశైలి అవలంభిస్తాడు .ఈ రకమైన అర్ధాన్వ యానికి ‘’దండాన్వయం ‘’అంటారు .దీనిపై ప్రత్యేక కృషి సల్పి ప్రొఫెసర్ ఎన్ .పి .ఉన్నిత్రి రాసిన మ హత్తర వ్యాసం నుండి కొన్ని విషయాలను ప్రొఫెసర్ లాల్యే అందించాడు .ఇందులోని రెండుమాటలను వివరించి చెప్పాడు .ఖండాన్వయ విధానాన్ని మీమాంసకారులు అవలంబించారు .ఇందులో మూల గ్రంధాన్ని వివరించి చెప్పటానికి ప్రశ్నోత్తర విధానం ఉప యోగిస్తారు ..దానిప్రకారం ముందుగా క్రియను తీసుకొ0టారు..తర్వాత విభక్తుల విషయం లో ప్రశ్నలు సంధించి శ్లోకాన్ని ‘’ఆకాంక్ష ‘’ అంటే వచన క్రమం (ప్రోజ్ ఆర్డర్ )లో రాసి తర్వాత పాదాలకు అర్ధ తాత్పర్యాలు వగైరా వివరిస్తారు .
దండాన్వయ విధానం లో నయ్యాయకుల పద్ధతినే ఇంచు మించుగా అవలంభిస్తారు ..కానీ మొదట కర్త ను తీసుకొని దాన్ని బట్టి ప్రోజ్ ఆర్డర్ రాసి అప్పుడు వివరిస్తారు .. పూర్వపు వ్యాఖ్యాతలందరికంటే మల్లినాథుడు దండాన్వయ విధానాన్ని ప్రయోగించి దానికి విస్తుతమైన ప్రఖ్యాతిని కావ్యాలద్వారా కలిగించాడు .
ఇప్పటి దాకా మనం చూసినవాటిని బట్టి మల్లినాథుని వ్యాఖ్యానాలు ఒక ప్రత్యేకవిధానంగా ఉంటాయని నిర్ణయానికి వస్తాము .ఆయన సంస్కృత భాషలోని సూక్ష్మ భేదాలను కూలంకషంగా సాధారణంగాను మహా కావ్య కవుల కవిత్వ సూక్ష్మ భేదాలను ప్రత్యేకంగా వివరించాడని అర్ధమవుతుంది .కవుల కవిత్వ శైలి లాగానే మల్లినాథుని వ్యాఖ్యాన శైలి లో కూడా పాకం లేక శయ్య ఉంటుంది -’’రసాస్వాదనోచితశబ్ద నిష్యన్తి పాకః -పరి వృత్తి వే ముఖ్యం నినిమయసహి ష్ణుత్వం -ఏత దేవ మైత్రీ శయ్యేతి కయ్యతే ‘’. మల్లినాథుని శైలి మార్పును అంగీకరించదు .ఆయన వ్యాఖ్యానాలు పదం యొక్క అర్ధాన్ని స్పష్టం సరళం చేయటమేకాకుండా వాటి నిర్మాణాన్ని కూడా పూర్తిగా సమర్ధిస్తాయి .ఈ ఖచ్చితత్వం వలననే మల్లినాథుడు మిగిలిన వ్యాఖ్యాతలందరికంటే అధిగమించి సమున్నత స్థానం లో ఉండి వెలుగుతున్నాడు ..కావ్యాలు ,ఇతర రచనల అవగాహనకు మల్లినాథ వ్యాఖ్యానమే శరణ్యం తప్పని సరి .మళ్ళీ మల్లినాథుడు లాంటి వ్యాఖ్యాత జన్మించనే లేదు.వ్యాకరణ సూత్రాలను ,అలంకారాలను తెలియ జేయటమే కాదు మల్లినాథుడు ,కవిత్వ వ్యక్తీకరణల ప్రాముఖ్యతలను కూడా తెలియ జేశాడు .కవి లాగానే ఆయన వ్యాఖ్యాన విధానానికి ఒక క్రమ పధ్ధతి ,హుందాతనం ,రూప లావణ్యం ,గతిత్వం ,స్పష్టత ఉన్నాయి .
ఉపసంహారం
మొదట్లోనే వివిధ సంస్కృత రచనలపై మల్లినాథ సూరి వ్యాఖ్యానాలను పేర్కొన్నాం .అనేక గ్రంథాలనుండి మల్లినాథుడు తన వ్యాఖ్యలకు బలంగా ఉదహరించిన వాటిని చూస్తే ఆయన అపార పాండిత్య ప్రకర్ష మనకు స్పష్టంగా తెలుస్తోంది .అందుకే మల్లినాథుడు అసమాన వ్యాఖ్యత (ఏ కామెంటేటర్ పార్ ఎక్స్ లెన్స్ ) వ్యాఖ్యాన చక్రవర్తి అంటారు ఆయనను ..ముఖ్యంగా 7 కావ్యాలపై అనేక కోణాలనుంచి ఆయన రాసిన వ్యాఖ్యానాలు ,వాటిలోని లోతుపాతులు వెలికి తీసిన వైశద్యం దిగ్భ్రమ కలిగిస్తుంది .వ్యాఖ్యానం పదానికున్న నిర్వచనాలు కొన్ని తెలుసుకొందాం -1-’’త0 త్రాతిశయ వర్ణనమితి వ్యాఖ్యానం -విష్ణు ధర్మోత్తర పురాణం 2-వ్యాఖ్యానం నామ సంక్షేపోత్త రస్యార్ధస్య విస్తరేణా ఖ్యానం వ్యాఖ్యానం -నీల మేఘుని తంత్ర యుక్తి విచారః 3- వ్యాఖ్యానం నామ యత్సర్వం బుద్ ద్యావిషయం వ్యాక్రియతే -చరక సంహిత .
వ్యాఖ్యాన కర్త పాఠకుల దృష్టిని ఒక శ్లోకం ,లేక ప్రకరణం లో ఉన్న ముఖ్య విషయాలపై దృష్టిని కేంద్రీకరింప జేస్తాడు ..వాటి వైభవ వివరణ లను తగిన వ్యాకరణ సూత్రాలను వాటి అర్హత న్యాయబద్ధతలను బట్టి బేరీజు వేసి చెప్పి ఒప్పిస్తాడు .అందులోని అతిశయాలను అంటే ఔన్నత్యాలను పాఠకులకు తెలియ జేస్తాడు ..ఈ ప్రత్యేకతలను మనం మల్లినాథుని వ్యాఖ్యానాలు అన్వయిస్తే కవిలోని గొప్పతనాన్ని ఆయన కవితో సమానంగా అనుభవించి చెప్పినట్లు కవికి కావ్యానికి గొప్ప గౌరవాన్ని ఆపాదించినట్లు అర్ధమవుతుంది ..మూలానికి వ్యాఖ్యానానికి మధ్య ఉన్న ఒక రకమైన ‘’సమర్ధ సమర్ధకా భావ 0 ‘’ద్యోతకమవుతుంది .ఈ సమర్ధన వ్యాకరణ స్థాయిలో ఛందస్సులో ,నిఘంటు స్థాయిలో ,దర్శన స్థాయిలో మనకు ప్రత్యక్షమవుతుంది .కవితో మల్లినాథ వ్యాఖ్యాత తాదాత్మ్యం చెందినట్లు భావిస్తాం ..వ్యాఖ్యాత అనేక శాస్త్ర దర్శనాదుల జ్ఞాన విజ్ఞానాలలో ఉద్దండ పండితుడైనప్పుడే సంపూర్ణ వ్యాఖ్యాత కాగలడు.
ఈ చిరు గ్రంధం మల్లినాథుని అనేక శాస్త్ర గ్రంథ పాండిత్య గరిమను విద్యా వేత్తల దృష్టికి తీసుకు రావటానికి చేసిన ప్రయత్నం .ఇది లేకపోతె గ్రంథ స్వారస్యాన్ని అనుభవించటం కష్టం ..వ్యాఖ్యానాలు రాయటమేకాక మల్లినాథుడు స్వయంగా ‘’రఘు వీర చరిత ‘’కావ్యాన్ని వైశ్య వంశ చరిత్ర కావ్యాన్ని రాశాడు .ఏకావలికి ,తార్కిక రక్షా కు సూరి చేసిన వ్యాఖ్యానాలు ఆయన చర్చా సామర్ధ్యానికి ,తార్కిక క్రమంలో తన భావాలను చెప్పటం లోని నైపుణ్యాలకు గొప్ప ఉదాహరణలు ..దీనివలన మల్లినాథుడువిభిన్న శాస్త్ర గ్రంథ అవగాహనలో , బహుముఖ ప్రజ్ఞాశాలి అని అందుకే ఆయన ఉదహరించిన విషయాలు కవి చెప్పినభావానికి వెలుగునివ్వటానికి బహుళంగా తోడ్పడ్డాయని తెలుస్టుంది . మల్లినాథుని మహా కావ్య వ్యాఖ్యానాలు మహాకావ్యాల స్పష్టార్థ గూడార్ధాలను వివరించటం లో సూర్య రశ్మిలాగా ప్రసరించి తేజోమయం చేశాయి .చరకుడు చెప్పిన ‘’తంత్ర యుక్తులు ‘’మల్లినాథుని విషయం లో అన్వర్ధాలు అనిపిస్తాయి .
‘’ కవ చాల్ప విష్యామితిహ్ ‘’ అని రఘువంశం లో చెప్పినట్లు ఈ చిన్న పుస్తకం పరిధి తక్కువే .. మల్లినాథుని వ్యాఖ్యానాలను హేమాద్రి పండితుని ,చరిత్ర వర్ధనుడు మున్నగు వారి వ్యాఖ్యానాలతో పోల్చవచ్చు .వాటిని కూడా శైలి దృష్టిలో చదవ వచ్చు .మిగిలిన వ్యక్తిగత వ్యాఖ్యానాలు విడిగా తెలుసుకో వచ్చు. మల్లినాథుని వ్యాకరణ సూక్ష్మ భేదాలను అధ్యయనం చేయవచ్చు .నేను మాత్రం నాకు అందుబాటులో ఉన్న వ్యాఖ్యానాలను ఆధారంగా మల్లినాథుని వైదుష్యాన్నీ ,మనీష ను అంచనా వేసే ప్రయత్నం చేశాను .సంస్కృతం లో ఉన్న విస్తృత వ్యాఖ్యాన సాహిత్యం లోతైన అధ్యయన0 చేయదగినదే ..ఈ చిరు పొత్తం సంస్కృత విద్యా వేత్తలకు ప్రేరణ ,స్ఫూర్తి, ఆసక్తి కలిగి0చి ,వారిని ఈ మహా వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష ఫై మరింత సమగ్ర, సంపూర్ణ అధ్యయనానికి ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను ‘’అని ముగించాడు డా .ప్రమోద గణేష్ లాల్యే ..
నా మనవి -మేకర్స్ ఆఫ్ ఇండియన్ లిటరేచర్ సిరీస్ లో భాగంగా ఉస్మానియా యుని వర్సటీ రిటైర్డ్ సంస్కృత ప్రొఫెసర్ బహు గ్రంధకర్త ,పూనాలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైక్రో ఫిలిం ప్రాజెక్ట్ సారధి డా ప్రమోద గణేష్ లాల్యేఆంగ్లం లో రచించిన ‘’మల్లినాథ ‘’గ్రంధాన్ని నా అభిమాని ,సాహిత్య ప్రేమికులు సౌజన్య హృదయులు శ్రీ మైనేని గోపాల కృష్ణ (అమెరికా )గారు కొని నేను చదవాలని నాకు 10-10-2016 న పంపారు .మల్లినాథునిపై అప్పటికే కొన్ని పుస్తకాలు తెలుగు ఇంగ్లీష్ లలో చదివాను . కానీ ఇది నన్ను బాగా ఆకర్షించి ఏక బిగిని 128 పేజీల పుస్తకాన్ని 25-10-16 కు కేవలం 15 రోజుల్లో చదివి పూర్తి చేశాను .ఇంత సమగ్రమైన పుస్తకం మల్లినాథునిపై తెలుగు లో లేదే అనే దుగ్ధ కలిగి దీన్ని స్వేఛ్ఛాను వాదం వెంటనే ప్రారంభించి నెట్ లో ‘’వ్యాఖ్యాన చక్రవర్తి మల్లినాథ సూరి మనీష ‘’పేరుతో రాయటం మొదలు పెట్టాను .మైనేనిగారు బాగా వస్తోంది కొనసాగించండి అనిప్రోత్సహించారు . .మధ్య మధ్యలో ఇతర వ్యాపకాలు పుస్తక ప్రచురణల హడావిడిలో ఆగుతూ సాగుతూ ఇదిగో ఇప్పటికి అంటే సుమారు 7 నెలలు పట్టింది పూర్తి చేయటానికి ఇంత శ్రమ కు కారణం మల్లినాథుని వంటి మహా ప్రజ్ఞాని మన తెలుగు వాడు అవటమే .ఆయన గురించి గీర్వాణ కవుల కవితా గీర్వాణం మొదటి భాగం లోనే రాశాను .. అది గుంపులో గోవిందా చందంగా ఉన్నదే.ఇప్పుడుఇది ‘’వ్యాఖ్యాత చుక్కల్లో మల్లినాథ చంద్రుడు’’గా ప్రత్యేకంగా భాసిస్తున్నాడు .దాదాపు అయన సర్వతోముఖ వ్యక్తిత్వ దర్శనం లభించి నా జన్మ చరితార్ధమయ్యిందని విశ్వ శి స్తున్నాను . ఈ జన్మకు నాకు ఇది గొప్ప వరమే . సరస్వతీ దేవి నా వెంట ఉండి నడిపించింది .నాకున్న అత్యల్ప సంస్కృత పరిజ్ఞానం తో నాగరలిపి లోని శ్లోకాలను వ్యాఖ్యలను కస్టపడి ఇష్టపడి చదివి అర్ధం చేసుకొని రాయగలిగటం మా ఇలవేలుపు శ్రీ సువర్చ లాన్జనేయ స్వామి ఆశీర్వాద ఫలితమే ఈ గ్రంధం .తెలుగులో మల్లినాథునిపై సమగ్ర గ్రంధం లేదన్న కొరత తీరిందని నమ్ముతున్నాను ..దీన్ని అంతర్జాలం లో చదివి ఆస్వాదించి,ఆదరించిన సంస్కృత ,ఆంద్ర సాహిత్య బంధువు లందరికి,ముఖ్యంగా నాకు ఈ ఆంగ్లగ్రంధం పంపి చదివించి ,రాయటానికి ప్రోత్సహించిన శ్రీ మైనేని గోపాల కృష్ణ గారికి కృతజ్ఞతలు ..
వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాథ సూరి మనీష’’ సంపూర్ణం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

