గీర్వాణకవుల కవిత గీర్వాణం -3
226-వివిధ ఋషుల పేర్లతో వర్ధిల్లిన –బ్రాహ్మణాలు (బీసీ 900-600 )
శృతి వాగ్మయం లో భాగమైన బ్రాహ్మణాలు మంత్రాలు తంత్రాలు కర్మకాండలు వాతావరణ మార్పుల గురించి తెలియజేసే తాత్విక విషయాలను తెలియజేసేవి .వేదం భాష్యాలు వంటివి బ్రాహ్మణాలు .ఇవి ఒక్కొక్క వేదానికి వేరువేరుగా వివిధ ఋషుల పేర్లతో పిలువబడ్డాయి .వీటిలో ఏక సూత్ర నిర్మాణం కనిపించదు .ఆరణ్యకాల లేక ఉపనిషత్తుల సూత్రాలు కలిసి ఉంటాయి .ఇందులో అతిప్రాచీనమైనదానికాలం క్రీపూ 900 అతి ఆధునికమైనది క్రీ పూ 600 వరకు గా భావిస్తారు ప్రతి వేదం శాఖకు దానికి సంబంధించిన బ్రాహ్మణ ఉంటుంది .పూర్వం బ్రాహ్మణాలు సమాఖ్య చాలా ఉన్నా ఇప్పుడు మిగిలినవి కేవలం 19 మాత్రమే .అగ్నిహోత్ర విధానం వివాహం దంపతులు అనుసరించాల్సిన విధానాలు గర్భిణీ స్త్రీలుమంచి సంతానం కోసం పాటించాల్సిన నియమాలు .మంత్రోచ్చారణ ,దోషాలతో మంత్రాలు చదివితే కలిగే దుష్పరిణామాలు ,స్వాధ్యాయం తో వేదాలను కాపాడుకోవాల్సిన పద్ధతులు అన్నీ వీటిలో ఉంటాయి .వేద సంస్కృతం కంటే బ్రాహ్మణాలు సంస్కృతం వాటికి తరువాత వచ్చాయికనుక భిన్నంగా ఉంటుంది .ఇప్పుడు బ్రాహ్మణాలలో రకాలను తెలుసుకొందాం –
1-ఋగ్వేదం -సకల శాఖ -ఆత్రేయ బ్రాహ్మణం -దీనినే అశ్వలాయన బ్రాహ్మణం అనీ అంటారు .ఇందులో 40 అధ్యాయాలు సోమా హోమం గురించి వివరణ ఉంటుంది -2 భాస్కల లేక ఇక్ష్వాకు శాఖ -కౌశతకి బ్రాహ్మణం లేక సాంఖ్యాయన బ్రాహ్మణం అంటారు . అధ్యయాలు మొదటి అధ్యాయాలలో అన్నహోమం గురించి ,తర్వాత సోమా హోమం గూర్చి ఉంటుంది
2-సామవేదం -ఇందులో 1-కౌతుమా 2-రణయానీయ శాఖలున్నాయి -తాండ్య మహా బ్రాహ్మణ0 లేక పంచ వింశ బ్రాహ్మణం అతి ప్రాచీనమైనది -25 అధ్యాయాలు -కథలు ,వ్రాత్య స్తోమాలు ఉంటాయి. సద్వి0శ బ్రాహ్మణం లో లో 26 ప్రపాఠ కాలున్నాయి .స0వి విధాన బ్రాహ్మణం లో 3 ప్రపాఠకాలు సూత్రం శైలిలో ఉంటాయి .ఆర్షేయ బ్రాహ్మణం సామ వేదానికి సూచిక .దేవతాధ్యాయ బ్రాహ్మణం లో 3 ఖండాలలో 26 ,11 ,25 ఖండికలున్నాయి .చాందోగ్య బ్రాహ్మణం 10 ప్రపంచకాలు .ఒక్కొక్కదానిలో 8 ఖండాలు . నుంచి 10 ప్రపాతకాలు చాందోగ్య ఉపనిషత్ లోనివి .సంహితోపనిషత్ బ్రాహ్మణం లో ఒకే ప్రపథకం 5 ఖండాలుగా ఉంది .వంశ బ్రాహ్మణం చిన్నదే .ఒక్క అధ్యాయంలోనే గురుశిష్య సంబంధ చర్చ ఉంటుంది
జైమినీయ శాఖ -జైమినీయ బ్రాహ్మణం 3 కాండాలు .తాండ్య బ్రాహ్మణం కంటే ప్రాచీనమైనది .మహాబ్రాహ్మణం అంటారు కొద్దిభాగమే లభ్యం .జైమినీయ -ఆర్షేయ బ్రాహ్మణం -ఇదికూడా సామవేద సూచికయే .జైమినీయ ఉపనిషత్ బ్రాహ్మణం -దీనినే తల్వకార ఉపనిషత్ బ్రాహ్మణం అంటారు .ఛాన్దో గ్యానికి సమాంతరంగా ఉంటుంది
2-యజుర్వేదం
1- కృష్ణ యజుర్వేదం లో మైత్రాయని సంహిత ,చరక లేక కథా సంహిత ,కపిస్థల కథా సంహిత ,తైత్తిరీయ సంహితలున్నాయి .
2- శుక్ల యజుర్వేదం -మాధ్యందిన శాఖ లో శతపధ బ్రాహ్మణం ,కాన్వ శాఖలో కూడా అవే ఉంటాయి
3-అధర్వ వేదం లో శౌనక పిప్పలాద శాఖలున్నాయి .పిప్పలాద బ్రాహ్మణం అలభ్యం .కానీ గోపథ బ్రాహ్మణం మాత్రమే ఉంది .దీనిని పిప్పలాద ఆరణ్యకం గా భావిస్తారు
227- అరణ్యాలలో మహర్షులు దర్శించిన -ఆరణ్యకాలు
ఏకాంత వాసం లో దీర్ఘ ఆతపస్సులో అరణ్యవాసం లో మహర్షులు దర్శించినవి లేక ఆరాటంలో పుట్టినవి ఆరణ్యకాలు .ఇవి కర్మకాండలగురించి వ్రతాలు ప్రవర్గ్యలు గురించి తెలియ జేస్తాయి .ఆరణ్యకాలు కర్మకాండ కు సంబంధించినవైతే ఉపనిషత్ లు జ్ఞానకాండకు సంబంధినవి .వేదం మంత్రం భాగాలను సంహితాలని వాటి వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలని ,,వాటిలోకి కర్మకాండను తెలియజేసేవి ఆరణ్యకాలని వేదాలలోని జ్ఞానభాగాన్ని చెప్పేవి ఉపనిషత్ లు వేదాంగాలని అంటారు
ఆరణ్యకాలు కూడా వివిధ ఋషుల పేర్లతో పిలువ బడుతున్నాయి .ఋగ్వేదానికి ఐతరేయ ఆరణ్యకం కౌశిక ఆరణ్యకాలు -యజుర్వేదానికి తైత్తిరీయ ఆరణ్యకం మైత్రాయణీయ ఆరణ్యకం,కేదారణ్యకం ,బృహదారణ్యకం సామవేదానికి తలవకార ఆరణ్యకం ,ఆరణ్యక సంహిత ,అధర్వ వేదానికి ఆరణ్యకం ఆలభ్యం
ఐతరేయాఅరణ్యకం 5 అధ్యాయాలు మొదటి రెండిటిలోప్రాణ విద్య ఉంటుంది 3 లో సంహితోపనిషత్ లో స్వర చర్చ 4 ,5 ల లో మంత్రాల సాంకేతిక వివరణ ఉంటుంది దీన్ని మహానామ్ని అంటారు
తైత్తిరీయ ఆరణ్యకం లో 10 భాగాలు .మొదటి దానిని కథాకాని అంటారు .అగ్ని ఛయన కాండ ఉంటుంది 2వది మహాయజ్ఞాన నిర్వహణ విధానం మిగిలినవి మంత్రం తంత్ర సాంకేతిక వివరాలు
కథారణ్యకం -తైత్తిరీయమే .సాంఖ్యాయన ఆరణ్యకం లో 15 అధ్యాయాలు . ,2 అధ్యాయాలు మహా వ్రతాన్ని 3నుంచి 6 కౌశిక ఉపనిషత్ ను ,7,8 సంహితోపనిషత్ ,9 ప్రాణ విశిష్టత ,10 అగ్నిహోత్ర విధి 11 అంత్య సంస్కారం 12 ప్రార్ధన ఫలితాలు 13 శ్రావణ మనన నిధి ధ్యాస వివరణ 14 అహం బ్రహ్మాస్మి వివరణ 15 బ్రహ్మ నుంచి గుణ సాంఖ్యాన వరకు గురు స్తుతి ఉంటాయి .బృహదారణ్యకం బృహదారణ్యక ఉపనిషత్ ను ,ముఖ్యంగా ‘’పర్వాగ్య ‘’కర్మ కాండను గురించి వివరిస్తుంది .ఆరణ్యకాలను ‘’రహస్య బ్రాహ్మణాలు ‘’అన్నారని నిరుక్తానికి వ్యాఖ్యానం రాసిన దుర్గా చార్య అన్నాడు
228-చైనా యాత్రికుడు హుయాన్ సాంగ్ అనువదించిన యోగాచార్య భూమి శాస్త్రం -(క్రీశ 300-350)
బౌద్ధ ధర్మ యోగుల యోగ విధానాన్ని సంపూర్ణంగా తెలియ జేసే విజ్ఞాన సర్వస్వమే ‘’యోగా చార్య భూమి శాస్త్రం ‘’సంస్కృతం లో చాచింపండిన ఈ ఉద్గ్రంధం క్రీ శ 300-350 కాలపు రచన .ఇందులో 5 ముఖ్య విభాగాలున్నాయి .అందులో మొదటిదైన ‘’విస్తృత భూమిక ‘’అతి పెద్దది ఇందులో బౌద్ధజ్ఞానాన్ని పొందటానికి ఉన్న వివిధ భూమికలు వివరణ ,స్థాయిలు ధ్యాన స్థాయిలు ,వినటం ఆలోచించటం అభ్యాసం చేయటం శ్రావక భూమి ప్రత్యేకబుద్ధభూమి బోధిసత్వ భూమి ఉన్నాయి .రెండవ భాగాన్ని వినిశ్చయా సంగ్రహం అంటారు బహుభుమిలో చెప్పబడిన అనేక విషయాల నిర్వచనం వ్యాఖ్యానాలుంటాయి మొదవదైన వివరణ సంగ్రహం లో విధి విధానాల వివరణాలున్నాయి .నాల్గవది పరన్యా య సంగ్రహం లో ఆగమాలలో చెప్పబడినవాటి వివర్ణన విశ్లేషణ ఉంటాయి చివరిదైన అయిదవది వాస్తు సంగ్రహం -లో సంయుక్తాఆగమా సూత్ర వివరణ ఉంది ఇందులో వినయ సంగ్రహం కూడా కలిసి ఉంటుంది
దీని చైనా ప్రతిలో అభిధర్మ ఉంటె టిబెటన్ ప్రతిలో అది లుప్తమైంది బహుభుమిలోని సంస్కృత భాగాలైన బోధిసత్వ భూమి శ్రావక భూమి ఇప్పటికీ కనిపిస్తాయి .చైనా బౌద్ధం లో అనేక విభేదాలకు కారణం సరైన వ్యాఖ్యానాలు లేకపోవటమేకాక అసలు గ్రంధం లోని భాగాలు లేకపోవటం కూడా కారణమని హుయాన్ సాంగ్ రాశాడు
హుయాన్ సాంగ్ భారత దేశ సందర్శనానికి వచ్చినప్పుడు నలంద విశ్వ విద్యాలయ బౌద్ధాచార్యుడు షీలా భద్రాచార్య హుయాంసాంగ్ కు ‘’యోగా చార్య భూమి శాస్త్రాన్ని ‘’సుమారు 9 నుంచి 15 నెలలో బోధించాడు .దీన్నిహుయాన్ సాంగ్ చైనా భాషలోకి హొంగ్ ఫు మొనాస్టరీ లో 646-648కాలం లో అనువదించాడు అందులో 100భాగాలు లేక’’ జువాన్ ‘’ లున్నాయి .హుయాన్ సాంగ్ కు ముందే 394-468 కాలం లో ధర్మ క్షేత్ర , గుణ భద్ర ,పరమార్ధ లు కొంతభాగం చైనా భాషలోకి అనువదించారు
229-ప్రమాణ వార్తిక కర్త -ధర్మ కృతి (క్రీశ . 600-700 )
నలంద విశ్వ విద్యాలయ బౌద్ధాచార్యుడు ధర్మ కృతి క్రీశ 600-700 కాలం వాడు .యోగాచార్య సూత్రాన్తిక విధానాలలో నిష్ణాతుడు .గొప్ప అణుశాస్త్ర వేత్త .ఆయన రచనలు మీమాంస న్యాయ శైవ హిందూ జైన తత్వశాస్త్రజ్ఞులను బాగా ఆకర్షించాయి .ఆయన రచన ‘’ప్రమాణ వార్తిక’’ బృహద్గ్రంథం .ఇది భారత టిబెట్ దేశాలలో విస్తృత సంచలనం కలిగించింది
ధర్మకృతి దక్షిణ భారత దేశం లో పుట్టిన బ్రాహ్మణుడని ,మహా మీమాంసకారుడు కుమారిలభట్టు మేనల్లుడని అంటారు.ఇతని వస్త్ర ధారణచూసి మేనమామ కుమారుల భట్టు ఒక రోజు తీవ్రం గా ఆక్షేపించి టిఇట్టిపోశాడని అప్పతిల్లప్పుడే ఇల్లువదిలి బౌద్ధం లో చేరాడని ఈశ్వర సేన వద్ద కొంత చదివి నలందా వెళ్లి 6 వ శతాబ్ది ధర్మపాలతో సన్నిహితంగా మెలఁగి బౌద్ధ తర్క వేత్త దిజ్ఞాగుని ప్రభావం తో బౌద్ధ ధర్మావలంబనానికి మార్గదర్శక సూత్రాలు రాశాడని వీటినే టిబెట్ లో కూడా అనుసరించారని నలందలో సామాన్య బౌద్ధుడుగానే ఉన్నాడు ,ఎవరూ ఆయన జ్ఞానాన్ని అర్ధం చేసుకోలేకపోయారని అనుకొన్నాడు
ధర్మ కీర్తి ఏదైనా కార్య కారణం సంబంధంగా హేతు బద్ధంగా తర్క విధానం లో ఉండాలని భావించాడు .పరమార్ధసత్ సంవృత సత్తుతో విభేదిస్తుంది .ప్రత్యభీజ్ఞానంనిశ్చయం లు వాసనలతో ఉద్బుద్ధమై ,ప్రత్యక్షాభాసమౌతాయని అసలు సత్యమైన సంవిత్ ను మరుగుపరుస్తామని,సహజ ప్రభాసమానమైన ప్రభాస్వరను అవిద్య కప్పేస్తుందని అంతర్జ్వాలగా ఉన్న చింతామణి ప్రజ్ఞను మేల్కొల్పితే పూర్ణ ప్రజ్ఞ లభిస్తుందని చెప్పాడు .ఇతనిభావాలు మాధ్యమకా భావాలు .దిజ్ఞాగు ధర్మాకృతి లో బౌద్ధం లో ఒక నూతన ఆలోచనా విధానానికి మార్గ దర్శకులయ్యారు .టిబెట్ లో వీరిద్దర్నీ కారణకారులు అంటారు .ఇప్పటికాలపు ప్రమాణవాదులన్నమాట
ధర్మ కృతి రచనలు -సంబంధ ప్రతీక్ష వృత్తి ,ప్రమాణ వినిశ్చయా ,ప్రమాణ వార్తిక ,ప్రమాణ వార్తికస్వ వృత్తి ,న్యాయ బి0దు ప్రకాశన , హెక్టా బిందూనామ ప్రకారణ ,సంతానాన్తర సిద్ధినినామ ప్రకారణ ,వాడ న్యాయ నామ ప్రకారణ
230-అవధూత గీత కర్త -దత్తా త్త్రేయ స్వామి (900-1000)-
స్వేచ్చాగానం అని పిలువబడే ‘’అవధూత గీత ‘’కర్త క్రీశ 900 -1000 కాలపు దత్తాత్రేయ మహర్షి .ఇది ఎనిమిది అధ్యాయాలతో 298 శ్లోకాల’’నాధ యోగ’’ గ్రంధం .దత్తాత్రేయుడు యోగీశ్వరేశ్వరుడు .ఆత్మజ్ఞాని ఆత్మజ్ఞాన సోపానాలు ఈగ్రంధం వివరిస్తుంది .సహజామ్రుతాన్ని పంచే గ్రంధం .ఇందులో ఒక శ్లోకభావం గ్రహిద్దాం -’’నేనే పరమ శివుడను -అనుమానం వలదు .మిత్రుడా నాకు నేను ఎలా నమస్కారించుకో గలను -ఈశ్వరానుగ్రహ దేవా పుంసా మద్వైతవాసనా -మహాభయ పరిత్రాణ విప్రాణాముపజాయతే
2- ఏనే దం పూరితం సర్వమాత్మనైవా ఆత్మానాత్మని
|
‘’నిరాకారం కదం వందేహ్యభిన్నం 3-పంచ భూతాత్మకం విశ్వం మరీచిజలసన్నిభం -కశ్యాప్యహో నమస్కృత్యఅనాహమేకోనిరంజనః |
-శివ మవ్యయం
|
|
|
-సశేషం మీ-గబ్బిట దుర్గాప్రసాద్-15-6-17-కాంప్-షార్లెట్ -అమెరికా |


మన ప్రాచీన వేదవాజ్మ యానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి అవసరమైన సమాచారం లభ్యమైంది.మళ్ళీమళ్ళీ దర్శించాలని పాటించేలా గుంజి.ధన్యవాదాలు
నమోనమః.
LikeLike