ఇంత నాటకమా ?అని ప్రశ్నిస్తా ఉన్నా
‘’పోలవరం కట్టాడంటా అదంతా మనం నమ్మాలంటా.అక్కడ డయాఫ్రం వాల్ గురించి బాబుగారు పెద్ద బిల్డప్ ఇస్తున్నాడు .అసలు డయాఫ్రం అంటే ఏంటండీ ?పలుచని పొర అని సైన్స్ లో మనం సదూకో నుండ్లా .చెవిలో ఉంటుంది .స్పీకర్ లో ఉంటాది .అదీ డయాఫ్రం .ఉఫ్ఫని ఊదితే పగిలి పోతుంది .అలాంటి దానికి ఇంతప్రచారమా ?ఇన్ని కోట్లు ఖర్చా అని అడుగుతా ఉన్నా .అందులోనూ డయాఫ్రం ఒకటిన్నర మీటర్ల వెడల్పంట .ఎవరి చెవిలో పువ్వు పెడతాడు బాబు .జనం నవ్వు తారనీ సిగ్గూ శరం కూడా లేదనీ అనాల్సోస్తోంది .ఎక్కడో నాలుగు అంగుళాల జాగాలో ప్రాజెక్ట్ కట్టి ,ప్రపంచం లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అనీ వాయిస్తున్నాడు ఆయన. మోడీ గారు ధనకనక వర్షం కురిపిస్తున్నా ,ఈ చిన్నప్రాజేక్ట్ పూర్తి కావటానికి ఇంత కాలం పడుతుందా ?ఏ ఖజానాలో దాచారు ఈ డబ్బంతా అని నాలాగా అడిగే వారు లేరా ?పైగా మోడీ గారు డబ్బు ఇవ్వటం లేదని యాగీ .మహా మాయనాడులో కేంద్రం పై దుమ్మెత్తి పోయటం నామీదవిరుచుకు పడటం తప్ప అక్కడ సాధించింది ఏమైనా ఉన్నదా అని సూటిగా అడుగుతున్నా .వీటికి జవాబు ఇచ్చుకొనే స్థితి బాబు అండ్ కొ కు లేనేలేదు .దీనికి తోడు ఆయన కొడుకు ఒక బచ్చా .ఆయనకు మంత్రి వర్గం లో స్థానం ఇచ్చి కుక్కను ఉసి గొల్పి నట్లు జనం మీదికి ముఖ్యంగా మా ఫాన్ పార్టీ మీదకు ఉసి గొల్పుతున్నాడు .ఆయనగారేమో తెగ రెచ్చి పోతున్నాడు. వీళ్ళకు పగ్గాలు వేసే వాళ్ళు లేరా అని మిమ్మల్ని ప్రశ్నిస్తాఉన్నా .
‘’ పట్టి సీమ ప్రాజెక్ట్ తో కోస్తా జిల్లాలలన్నీ మూడేళ్ళ నుంచి సస్య శ్యామలం అయ్యాయని వేలాది ఎకరాలు సాగు లోకి వచ్చి ఎకరాకు నలభై బస్తాల వరి దిగుబడి జరుగుతో౦దని బడా ప్రచారం .డబ్బా కొట్టుకుంటున్నారు .అసలు మా కడపకు నీళ్ళు ఇచ్చామని విషప్రచారం .నిజమేనని మావాళ్ళు కూడా డూడూ బసవన్నల్లాగా తానా అంటే తందానా అంటున్నారు ఆయనెవరో ‘’పోలవరం చూశారా ?’’అని అడుగుతున్నాడు నన్ను .వెళ్ళా కాని నిజాలు చూసి తట్టుకోలేనేమో నని కనిపించని నల్లకళ్ళ అద్దాలు పెట్టుకున్నా అందరికీ నేను చూసినట్లే అనిపిస్తుస్తుంది నాకేమో అసలు అక్కడేమీ కనిపి౦చదు.ఇదీ కిటుకు ..మరి దీని గురించి ఎలామాట్లాడుతున్నారు అని అదిగో ఆ తల్లి ఎవరో ప్రశ్నిస్తాఉన్నాది .అమ్మా నాకు విజయసాయి రెడ్డి స్క్రిప్ట్ రైటర్ .లేకపోతే అమిత్ షా అర్జెంట్ గా ఏం మాట్లాలో వాట్సాఫ్ పంపిస్తాడు. అవే ఆధారం .మా వాళ్ళు నాతోనే ఉంటూ నాకే గోతులు తవ్వుతున్నారు . ఇదెక్కడి న్యాయం అని అడుగుతా ఉన్నా .ఏదో కడపజిల్లాకు నీళ్ళిచ్చారు బానే ఉంది .వాటిని బీహార్ కు పంపించక్కర్లేదా ?అస్సాం కు ఎక్కిం చక్కర్లేదా ?ఉత్తరాది రాష్ట్రాలవాళ్ళు మనవాళ్ళు కారా ?ఇదేమి బాబు గారూ ?పోనీ బీహార్ కు కాక పొతే ఉత్తరాఖండ్ కో కాశ్మీర్ కో గోదావరి నీళ్ళు పంపకూడదా !ఇదేమీ చెయ్యకుండా ఏదో అద్భుతాలు అంటూ ఈ రెండు ప్రాజెక్ట్ లగురించి మీడియాలో యాడ్స్ .డబ్బు వీటికే ఖర్చు చేస్తే ఇక ప్రాజెక్ట్ లకేం ఖర్చు పెడతాడు బాబు !అందుకే పాదయాత్ర చేస్తూ మీ కష్టాలకు గోదారిలా కన్నీళ్లు కారుస్తూ మిమ్మల్ని పట్టుకుని కుదిపి కుదిపి ఓదారుస్తూ రాబోయే ఎన్నికలలో నేనే ముఖ్యమంత్రినని హామీ ఇస్తున్నాను .అప్పుడు అన్నీ మవ ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు .అడ్డూ ఆపు ఉండదు. అడిగే వాడు అసలు ఉండరు. అడిగితే రోజూనేను బాబును అన్నట్లే బంగాళాఖాతం లో పారేయిస్తా .నో డౌట్.ట్రస్ట్ మి .దేవాలయాలు మసీదులు చర్చి లు తిరిగి తిరిగి కాళ్ళు వాచి పోతున్నాయి .వాగ్దానాలు చేసి చేసీ ఉబ్బి పోతాఉన్నా. పాద యాత్ర చేసిననవాళ్ళంతా సిఎం లో, పిఎం లో అయిపోతా ఉన్నారు .నాకే చాన్స్ వచ్చిచావటం లేదు .నాచుట్టూ కోటరీ ఉన్నా, వాళ్ళు నాకు ‘’టెంటకిల్స్ ‘’లా తయారై నాకే ఉచ్చు బిగిస్తున్నారు .రెండేళ్ళ నుంచి రాజీనామా రాజీనామా అని ఊరిస్తున్నాం .ఇప్పుడు మళ్ళీ ఇమ్మంటే మావాళ్ళు ఇచ్చారు . ఇదో డ్రామా అంటున్నాయి విపక్షాలు .’’నామాలు ‘’తీసుకుని మాకు నామాలు పెట్టి స్పీకర్ గారు విదేశాలకు చెక్కేశారు .ఆవిడ వచ్చేదాకా మళ్ళీ సస్పెన్స్ .సస్పెన్స్ ఏముంది లెండి .ఆమోదించినా ఏడాదిలోపుఎన్నికలు రావు గందా .మైనారిటీలో పడిన మోడీ గారికి దీనివలన మెజార్టీ సాధించిపెట్టి ఆయన’’ ఉప్పు’’ తిన్నపాపానికి ఈ మాత్రం సాయం చేశాం . అయినా ఎన్ని నాటకాలు ఆడకపోతే రాజకీయం రక్తి కడుతుంది బాబూ !నీ లాగా స్ట్రెయిట్ ఫార్వార్డ్ అయితే గంగలో దూకాలి . నీపైన కేసుల్లేవు .పెట్టినా నిలవవు .నాపై అన్నీ కేసులే .కోర్టు చుట్టూనే తిరగనా , అసెంబ్లీకే వెళ్ళనా .నా బాధ మీకు అర్ధంకాదు .ఇంతకీ ఎవరిని అని ఏం లాభం ?మా’’ బాబు’’ అధికారం లో ఉండగానే నన్ను చంకన ఎక్కి౦చు కోకుండా దూరం పెట్టాడు .ఇప్పుడు ఆయన భజన చేస్స్తున్నా కనికరం లేకుండాపోయింది .పాపం కొంగు చాటు బిడ్డలా మా నాయన సంపాదించిన దానికంటే చాలా రెట్లు నొక్కేశా .పాపం బాబుకు ఈ తెలివి తేటలు లేవు . చచ్చు దద్దమ్మ .నన్ను చూసి ఇదైనా నేర్చుకోడు .ఎవరినైనా కొంటా ,ఎవరి పాదాలన్నా పట్టుకుంటా .ఏదో రాల్చేదాకా వదిలి పెట్టను .ఇంత నమ్మకస్తుడు ఏపార్టీ కి ఊతంగా దొరుకుతారు .అయినా నన్ను నమ్మలేక పోతున్నారు .ముఝే మాలూం నై . పోలవరం ,పోలవరం పోలవరం ‘’
‘’ఒరేయ్ అబ్బాయ్ జగనూ ! ఏమిట్రా పోలవరం పోలవరం అని కలవరిస్తున్నావు .అక్కడికి వెళ్లి అంతా చూసోచ్చావా ?నిజం తెలిసిందా .బుకాయింపులు ఎల్లకాలం చెల్లవు .మేము అడ్డం వస్తున్నామని నన్నూ మీ చెల్లినీ దూరం చేశావ్ .మాకు కనువిప్పు కలిగిందికాని నీకు జ్ఞానోదయం కాలేదు . ఇప్పటికైనా నామాట విని పులివెందలలో గుడికట్టి గోదావరి దేవిని ప్రతిష్టించి ఋణం తీర్చుకో .అప్పుడు నీ వదరు బోతుమాటలకు ప్రాయశ్చిత్తం జరుగుతుంది లే నాయనా లేలే. పాదయాత్రకు టైం అయింది .వందిమాగధులు వచ్చేశారు ‘’అని వాళ్ళమ్మ చెవిలో ఇల్లు కట్టుకుని పోరగా ,పోరగా జగన్ పోరడు అమాంతం లేచి ఉరికిండు .
ఊకే నవ్వుతాలకి
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -13-6-18 –ఉయ్యూరు
—