ఫిన్ లాండ్ లో ‘’ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ డెవలప్ మెంట్ ‘’అనే సంస్థ ,మూడేళ్ళ కోసారి ప్రపంచ స్థాయి లెక్కలు ,సైన్స్ మొదలైన అంశాలలో విద్యార్ధుల సామర్ధ్యాన్ని పరీక్షించటానికి పోటీ నిర్వహిస్తుంది .నాలుగేళ్ళ క్రితం భారత్ ఆ పోటీలో పాల్గొని చివరి నుంచి ,రెండో స్థానం పొంది ‘’,సిగ్గుతో చిమిడి ‘’మళ్ళీ పోటీలో పాల్గొన లేదు .ఈ పోటీలలో ఫిన్ లాండ్ ఎన్నో ఏళ్ళుగా మొదటి స్థానం పొందుతోంది .అక్కడ తలసరి ఆదాయం లో 7శాతం చదువుపై ఖర్చుచేస్తుంటే మనదేశం 3.3శాతం తో చెయ్యి దులుపుకొంటో౦ది ..అక్కడ స్కూల్ టీచర్ సగటు నెలసారి ఆదాయం రెండున్నర లక్షలు .ఇక్కడ మన పంతుల్ల ళ్ళకు 31వేలు మాత్రమె .అక్కడ నెల రోజుల్లో చెప్పేదాన్ని ఇక్కడ వారం లోనే లాగించేస్తున్నారు .అందుకే అక్కడ విద్యా వ్యవస్థ ఉత్కృష్ట స్థానం లో ఉంది .ఇదంతా మాజిక్ లాగా అబ్రకదబ్ర గా ఒకే సారి వచ్చింది కాదు .
రెండవ ప్రపంచ యుద్ధకాలం లో ఫిన్ లాండ్ భారీగా నష్టపోయి ,విద్యా వ్యవస్థ పరమ చెత్తగా ఉండేది .ఇతర దేశాలతో పోటీపడి ఎదగటానికి ,ప్రగతి పధం లో దూసుకు వెళ్ళటానికి అక్కడి ప్రభుత్వం పౌరులే కీలకం అని గ్రహించిది .డబ్బున్నవాళ్ళు పిల్లల్ని ఖర్చు పెట్టి మంచి స్కూల్ లో చేర్పిస్తుంటే ,డబ్బు లేని సామాన్యుల పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు .దీనితో 80వ దశకం లో సమూల ప్రక్షాళన కు శ్రీకారం చుట్టారు .దేశ విద్యా వ్యవస్థను ప్రభుత్వ అధీనం లోకి తెచ్చుకుని ,ప్రైవేట్ విద్యా సంస్థలను రద్దు చేసేసారు .విద్యార్ధుల ఆర్ధిక పరి స్థితులతో సంబంధం లేకుండా ,అందరికి సమాన మైన ఉచిత నాణ్యమైన విద్య అందించటం ప్రారంభించి౦ది.అంతే ఇక వెనక్కి తిరిగి చూడకుండా గత 45ఏళ్ళ నుండి అప్త్రతిహత౦ గా ముందుకు దూసుకు వెడుతూ ఇతర దేశాలకంటే విద్యా ప్రమాణాలలో ఎన్నో మైలు రాళ్ళు దాటి ,అగ్రరాజ్యాలను వెనక్కి నెట్టేసి అగ్రగామి అయి ఆదర్శమైంది .ప్రభుత్వం, తలిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య చక్కని సమన్వయ౦ ,ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం తోనే మిగతా దేశాలను అభివృద్ధి పోటీలో ఫినిష్ చేసి ఈ లక్ష్యాన్ని చేరుకొంది ఫిన్ లాండ్ .అక్కడ రాంకుల హోరు ,రాంకు సాధన పోరు లేనేలేదు. రాంకుల వేటలో మన విద్యార్ధులు అందమైన బాల్యాన్ని కోల్పోతున్నారు .ఫిన్ లాండ్ లో పిల్లలు ఉత్తమ ప్రమాణాలను ఆడుతూ ,పాడుతూ సాధిస్తున్నారు .పిల్లలపై ఇక్కడ లాగా అక్కడ వత్తిడి లేనేలేదు టెన్షన్ లేదు .ఏటా బోధనా పద్ధతులను అనుగుణంగా మార్చుకొంటోంది .మూడేళ్ళ కోసారి జరిగే ‘’ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎసేస్ మెంట్’’(P.I.S.A )లో అమెరికా చైనా జపాన్ వంటి దిగ్గజ దేశాలను ఈ చిట్టి పొట్టి దేశం పిల్లలు వరుసగా మొదటి స్థానం సాధిస్తున్నారు .విద్యార్ధుల కలలకు, తరగతి గదులకు,పాఠశాల అనుసరించాల్సిన విధానాలకు ,తలిదండ్రులు కూడా పాటించాల్సిన నిబంధనలకు ఫిన్ లాండ్ డ్రీం లాండ్ కావటమే కాదు వాస్తవ భూమిక అయింది . ఫిన్ లాండ్ లో చిన్నారులు బడిలో కాలు పెట్టాలంటే 7 ఏళ్ళు నిండాల్సిందే .అప్పటిదాకా పలకా బలపం బొక్కుల గొడవ ఉండదు డే కేర్ సెంటర్ లలో ఉంటూ మెదడుకు పదును పెట్టుకొంటారు .ఆరు లోపు పిల్లల మెదడు కణాలు 90శాతం విచ్చుకొంటాయి దేనినైనా త్వరగా గ్రహించే శక్తి తేలిగ్గా వస్తుంది .కనుక బుర్రలో సబ్జెక్ట్ లు కుక్కకుండా నేర్చుకొనే సామర్ధ్యం పెంచుకొనే శక్తి పెంచుతారు .అందరితో కలిసి ఆడుకోవటం ,పద్దతిగా తినట౦ ,నిద్ర పోవటం ,ఒకరికొకరు సాయం చేసుకోవటం ,,శుభ్రత పాటించటం ,భావ వ్యక్తీకరణ సామర్ధ్యం పెంచుకోవటం ,జాలీ, దయా, సానుభూతి, సామాజిక స్పృహ వంటి మానవీయ విలువలను తెలుసుకొని పాటించటం ,అన్ని జీవన నైపుణ్యాలు సాధించటం చేస్తారు .మనకూ ప్లే స్కూల్స్ ,డే కేర్ సెంటర్లు ఉన్నాయి కాని ఈ పధ్ధతి విధానం ఉందా అని నాకు అనుమానం .
పిల్లలు బడికి ఎప్పుడైనా వెళ్ళచ్చు .అంటే’’ కేర్ ఫ్రీ’’ చదువు అనుకొనేరు .కానే కాదు కాని మంచి పౌరుడిగా ఎదగాలనేది అక్కడి ప్రభుత్వ లక్ష్యం .కనుక బాల్యం లో తొలి ఆరేళ్ళు దీనికే కేటా ఇస్తారు ‘’నేర్చు కోవాల్సిన వయసు వస్తే ,వాళ్ళే నేర్చుకొంటారు ‘’అనేది వారి సిద్ధాంతం .ఉన్నత విద్యావంతులు ఉత్తమ పౌరులుగా మారుతారని ఆదేశం గోప్పనమ్మకం .కనుక ప్రతి చిన్నారి చదువు బాధ్యతా ప్రభుత్వమే తీసుకొంటుంది .8నెలల వయసులో డే కేర్ లో కాలు పెట్టినదగ్గరనుంచి ,25ఏళ్ళ తర్వాత యూని వర్సిటీ లో పిహెచ్ డి పొందేదాకా ఒక్క రూపాయి సారీ’’ ఒక్క యూరో’’ కూడా ఖర్చు లేకుండా ఉచిత విద్య అందిస్తోంది ఫిన్ లాండ్ ప్రభుత్వం .కార్మికుడి కొడుకు దగ్గరనుంచి దేశాధినేత పిల్లాడి దాకా అందరూ ప్రభుత్వ విద్యాలయాలలో చదువుకొని బయటికి రావాల్సిందే .సంపన్న కుటుంబం లో పుట్టినా చదువు విషయం లో అందరితో సమానంగా నే నేర్వాలి .పల్లెటూరు నుంచి దేశ రాజధాని వరకు ఉన్న స్కూళ్ళల్లో ఒకే తరహా శిక్షణ పిల్లలకు అందించటం ఇక్కడి ప్రత్యేకత .
మన దేశం ఉగ్గు గిన్నెలు స్వెట్టర్లు ఉయ్యాలా వంటివి పసిపిల్లల తలిదండ్రులకు కానుకగా ఇస్తే అక్కడ బిడ్డ ఆస్పత్రిలో బిడ్డ పుట్టి బయటికి తీసుకు వెళ్ళేటప్పుడు డాక్టర్లు ఉపయుక్తమైన మూడు పుస్తకాలు పేరెంట్స్ చేతిలో పెడతారు .పిల్లల్ని చదివిస్తూ ,తలిదండ్రులు పుస్తకాలు చదివే వ్యాసంగం కొన సాగించాలని చెప్పే విధానమే ఇందులో పరమార్ధం .పిల్లల్ని ఆరోగ్యంగా పెంచి సంరక్షి౦చటానికి తల్లికి 8 నెలల ప్రసూతి సెలవ ఇస్తారు .ఆ తర్వాత కూడా ఉద్యోగానికి వెళ్ళలేని పరస్థితి ఉంటె మూడేళ్ళు ‘’డే కేర్ అలవెన్స్’’అందిస్తారు .అయితే ఈ సదుపాయాన్ని అక్కడి తల్లుల్లో 3శాతం మంది మాత్రమేవాడుకొంటున్నారు .అంటే బెవార్స్ గా డబ్బు వస్తోంది కదా దుర్వినియోగం చేయరు .అర్హులకు అందాలని అందరి ఆరాటం . .ఆరేళ్ళ వరకు పిల్లలు ప్రభుత్వ సంరక్షణ కేంద్రాలలోనే హాయిగా పెరగవచ్చు .ఇక్కడ 12మంది పిల్లలకు ఒక టీచర్ ,ఒక నర్సు ఉంటారు .చిన్నారుల ఆలనాపాలనా ,జీవన నైపుణ్యాలు పెంచే బాధ్యత వాళ్ళే తీసుకొంటారు.
ఇక్కడి నుంచి బయటికి వచ్చాక పిల్లలు అయిదేళ్ళ పాటు ఒకే ఉపాధ్యాయుడి దగ్గర 12మంది పిల్లలు పెరుగుతారు .తలిదండ్రుల తర్వాత పిల్లలకు టీచర్ తోనే అత్యంత అనుబంధమేర్పడుతుంది .వాళ్ళ స్వభావం సామర్ధ్యం అర్ధం చేసుకొని టీచర్ వాళ్ళ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుతాడు .ఈ అయిదేళ్ళలో తరగతి పాఠాలు ఉండనే ఉండవు .పరిసరాలైన జంతువులూ వృక్షాలు పక్షులు మనుషుల గురించే నేర్పిస్తారు .సంరక్షణ కేంద్రం లో శిక్షణ పూర్తయ్యాక ,పిల్లల్నిఎక్కడ చేర్పించాలి అనే టెన్షన్ ఉండదు .పల్లెనుంచి ,పట్నం దాకా ప్రతి స్కూల్ కు ప్రభుత్వం నుంచి ఒకే స్థాయి లో నిధులు అందుతాయి .ఒకే తరహా విద్యార్హతలు సామర్ధ్యం ఉన్న ఉపాధ్యాయులు ఉంటారు .కనుక ఏది మంచి స్కూలు అని ఆలోచి౦చనక్కర లేదు .అన్నీ మంచి స్కూళ్ళే.
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -28-12-18-ఉయ్యూరు
—
గబ్బిట దుర్గా ప్రసాద్
https://sarasabharati.wordpress.com
http://sarasabharativuyyuru.wordpress.com
http://suvarchalaanjaneyaswami.wordpress.com


// “ … ప్రైవేట్ విద్యా సంస్థలను రద్దు చేసేసారు.” //
I like that 👌.
LikeLike
Chala manchi information iccharu sir.Thank you.
LikeLike