శ్రీ దాసు శ్రీరాములుగారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారి ఫోన్
స్వర్గీయ శ్రీ దాసు శ్రీరాములు గారి మనవడు శ్రీ దాసు అచ్యుతరావు గారు ఇవాళ ఉదయం 9గంటలకు ఫోన్ చేసి మన సరసభారతి బ్లాగ్ లో దాసు శ్రీరాముల గారి గురించి రాసిన విషయం చదివి ఫోన్ చేస్తున్నాననీ ,తానూ 60 ఏళ్లుగా హైదరాబాద్ లోనే ఉంటున్నానని ,తాతగారిది కృష్ణా జిల్లా ముదినేపల్లిదగ్గర ఉన్న ఊరని దాన్ని దాసువారి అగ్రహారం అంటారనీ ,దాసువారి గ్రంధాలు నాకు రెండు సెట్లు పంపుతానని ఒకటి నన్ను తీసుకోమని రెండవది ఉయ్యూరు లైబ్రరీకి ఇవ్వమని ,దాసుగారి కుమార్తె కూడా గొప్ప రచయిత్రి అనీ ఆమె పుస్తకాలు కూడా పంపుతానని,ఇకనుండి నాతో తరచుగా టచ్ లో ఉంటానని అన్నారు చాలా సంతోషమేసింది -దుర్గాప్రసాద్
—

