గౌతమీ మాహాత్మ్యం -48
64- శుక్ల తీర్ధం
భరద్వాజముని భార్య’’ పైఠీనసి’’ఒకరోజు యజ్ఞానికి పురోడాశం తయారు చేస్తుండగా ,ఆపోగానుంచి మూడులోకాలను భయపెట్టే రాక్షసుడు ఏర్పడి పురోడాశం తినేశాడు .కోపించినముని అతడిని ప్రశ్నిస్తే తను సంధ్యా ,ప్రాచీన బర్హి లకుమారుడనని ,స్వేచ్చగా యజ్ఞాన్ని భుజి౦చమని బ్రహ్మవరమిచ్చాడని చెప్పగా తన యజ్ఞాన్ని రక్షించమని ముని కోరగా ‘’పూర్వం బ్రహ్మనన్నునల్లగా మారిపోతావని శపిస్తే ,నేను ప్రాధేయపడగా మునులు నన్ను అమృతదారతో అభిషేకిస్తే శాపవిమోచనం కలుగుతుందన్నాడు ‘’అని వివరించాడు భారద్వాజముని ‘’నువ్వు నా మిత్రుడవు యజ్ఞ సంరక్షణం ఎలా జరుగుతుందో చెప్పు .లేక సులభోపాయం ఉంటె తెలియజేయి ‘’అని ప్రాధేయపడ్డాడు ..వాడు తనను అమృతప్రాయమైన బంగారం ,ఆవునెయ్యి ,సోమరసం లలో ఒకదానితో అభిషే కి౦చ మన్నాడు .కుదరకపోతే గోదావరి జలమే అమృతం కనుక దానితో అభిషేకి౦చ మని ఉపాయం చెప్పాడు .
భరద్వాజ మహర్షి గంగాతీరం చేరి గంగాజలం చేతిలోకి తీసుకొని యజ్ఞం లో ఆ రాక్షసునికి అభిషేకం చేశాడు .యజ్ఞం లోని యూపస్తంభం యజ్ఞ పశువు, రుత్విక్కులపైనా ఆజలాన్ని చల్లాడు .నల్లని వాడైన ఆ రాక్షసుడు తెల్లనివాడుగా మారిపోయాడు .యజ్ఞం నిర్విఘ్నంగా సమాప్త మైంది .అందర్నీ సత్కరించి పంపేసి ముని యూప స్తంభాన్ని గోదావరిలో పడేశాడు .ఇప్పటికీ అది కనిపిస్తుంది .రాక్షసుడు భారద్వాజునితో ‘’మహర్షీ !నల్లని నన్ను తెల్లనివాడిగా చేశావు .ఈ శుక్ల తీర్ధం లో స్నాని౦చిన వారి అభీష్టాలు సిద్ధిస్తాయి ‘’అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక్కడ 7వేల తీర్దాలేర్పడినాయని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-2-19-ఉయ్యూరు

