గౌతమీ మాహాత్మ్యం -49
65-చక్రతీర్ధం
స్మరణం చేతనే పుణ్యం ముక్తికలిగించేది చక్రతీర్ధం .వసిస్టాది మునులు ఒకప్పుడు గౌతేమీ తీరం లో ఆశ్రమం నిర్మించుకొని సత్ర యజ్ఞం చేశారు .దానవులు దారుణంగా విఘ్న ధ్వంసం చేస్తుంటే బ్రహ్మ దగ్గర మొరపెట్టుకోగా దానవ వినాశనం కోసం ఒక స్త్రీని సృష్టింఛి మునులకు అందజేశాడు .జన్మరాహిత్యం కలిగి కృష్ణవర్ణం రక్తవర్ణం కలిసిన రంగుతో ఉన్న ఆస్త్రీ ముల్లోకాలను సంమోహితపరచే మాయా రూపిణి.మునులు స్వస్తమనస్కులై యజ్ఞ దీక్ష చేబట్టారు .రాక్షసులు యధాప్రకారం విఘ్న ధ్వంసానికి వచ్చారు .అక్కడున్న అతిలోక సౌందర్యవతి అయిన మాయా రూపిణిని చూసి ,అతిగర్వం తో నాట్యం చేశారు ,ఆడారు ,పాడారు నవ్వారు ఏడ్చారు .అందులో శంబరుడు అనే రాక్షసరాజు ఆమెను అమాంతం తినేశాడు .మళ్ళీ యజ్ఞ విధ్వం జరిగినందున మునులు విష్ణువుకు చెప్పుకొన్నారు .ఆయన సుదర్శన చక్రప్రయోగం చేసి ,దనుజ రాక్షస సంహారం చేశాడు .మునుల యజ్ఞ౦ పరిసమాప్తమైంది .విష్ణువు తన సుదర్శన చక్రాన్ని గంగానదిలో కడిగాడు .అదే చక్రతీర్ధం .ఇక్కడ స్నానం సత్రయాగ ఫలితమిస్తుంది అని బ్రహ్మనారడుడికి చెప్పాడు .
66-వాణీ సంగమ తీర్ధం
హరుడు వాగీశ్వరుడైన తీర్ధమే వాణీ సంగమ తీర్ధం .ఒకప్పుడు బ్రహ్మా విష్ణువుల మధ్యఆధిపత్యం కోసం తీవ్ర వాదోపవాదాలు జరుగగా శివుడు జ్యోతిస్వరూపుడుగా అవతరించాడు .అప్పుడొక ఆశరీరవాక్కు ‘’ఎవరు ఆక్కడున్న జ్యోతిస్వరూపం యొక్క అంతాన్ని చూస్తారో అతడే గొప్పవాడు’’అని వినిపించింది .బ్రహ్మపైభాగానికి విష్ణువు కి౦దిభాగానికి వెళ్ళారు . .విష్ణువు అతిత్వరగా తిరిగి వచ్చిజ్యోతి దగ్గర కూర్చున్నాడు .బ్రహ్మ ఎంతదూరం వెళ్ళినా అంతం దొరకక అలసిపోయి ,చూడలేదని అంటే తనకు జ్యే స్టత్వం దక్కదేమో నని ,మరీ అబద్దం ఆడటానికి సాహసించలేక అయిదవముఖమైన గార్ధభ ముఖం పొంది అక్కడే కూర్చున్న విష్ణువుతో అంతాన్ని చూశానని,కనుక జ్యేస్టత్వం తనదే అని చెప్పించాడు .అప్పుడు హరిహరులిద్దరూ ఒకే దివ్య తేజస్సు తో ఉండటం చూసి విస్మితుడై వారిద్దరిని స్తుతి చేశాడు .
కాని వారు శాంతించక కృద్ధులై గార్ధభ వాక్కుతో ‘’పాపాత్మురాలా అసత్యం కంటే దోషం లేదు .నువ్వు నదిగా మారిపో ‘’అనగా బ్రహ్మ తప్పు తెలుసుకొని ఆమెను అదృశ్యం కమ్మన్నాడు .ఆమె వారిద్దరిని ప్రార్ధిస్తే గంగానదితో సంగమం పొందినప్పుడు మళ్ళీ పవిత్ర శరీరం పొండుతావని అభయమిచ్చారు .ఆనదినే వాణీ లేక సరస్వతి నది అంటారు .గంగా వాణీ సంగమం ముక్తి హేతువు అని నారదునికి బ్రహ్మ చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-19-ఉయ్యూరు
.
—
గబ్బిట దుర్గా ప్రసాద్

