గాంధీజీ –ఆధునికత -4
గాంధీ హేతువు ,సైన్స్ లపై ఆధారమైన వాటిని నమ్మలేదు .అవి కొంతవరకే దారి చూపిస్తాయికాని పూర్తిగా కాదు అన్నాడు .ఈ రెండిటి వలన నైతికత ,మానవీయ గుణాలు దెబ్బతింటాయనిభావించాడు .ఆయుధాలన్నీ హేతువు, సైన్స్ జన్యాలే ,ఫలితాలే .సామూహిక హననం చేసే ఆయుధాలు అనైతికం .ఆయన దృష్టిలో నైతికత ఆధి భౌతికం(మెటాఫిజికల్ )కాదు.అది మానవ శ్రేయస్సుతో ముడి పడి ఉంటుం..కనుక ఈ రెండు బలసంపంన్నుడి,దోపిడీ దారుకు చెందినవి .కాలనీ ప్రభుత్వ అణచి వేత విదాన్నాలపై ఆయన ప్రతి స్పందనా వీటి చెడ్డాను గురించే ఉండేది .పరిమితి లేని వీటి ఉపయోగం వినాశహేతువే అవుతుంది .భౌతిక, బౌద్ధిక ఆలోచన,ఆయుధం అణచి వేతకు దారి చూపిస్తాయి.అప్పుడు మనిషి బానిస ఔతాడు .అంటే ఆయన ఉద్దేశ్యం లో ఎవరి కో లాభం చేకూర్చే వాటిలో తనప్రమేయంలేకుండా బందీ అయి బానిసలా జీవిస్తాడు .అమానవీయత సైన్స్ హేతువు లచేతిలో ఆయుధమౌతుంది .కనుక ఈ రెండిటి విషయం లో ఆయన పాశ్చాత్య సైన్స్ ,రీజన్ ల దుష్ప్రభావం పైనే గురిపెట్టి మాట్లాడాడు .అంతమాత్రాన ఆయన మానవ ఉన్నతి అభి వృద్ధికి సైన్స్, ,హేతుబద్ధత ల పాత్ర లను తిరస్కరించలేదు . తరచుగా ఆయన ప్రయోగం ,అనుభవాలను గురించే చెప్పాడు .ఆరోగ్యం ,మందులు విషయం లో సైన్స్ ప్రయోగాలను ఆహ్వానించాడు .అలాగే రాజకీయ విధానం లో చర్చలకు ప్రాదాన్యమిచ్చాడు .ప్రతి విషయం మీద ఆయన రెండు విధానాలు అవలంబించాడు .ఒకటి బహిరంగంగా చర్చించటం ,రెండు అవతలి వారితో సంభాషణ ..ఈ డిబేట్ ,డైలాగ్ లు తార్కికత ,ఆలోచనలనే ,నిర్దుష్ట ఛట్రంలో జరగాలని కోరాడు.ప్రత్యక్షైక వాద౦ (పాజిటి విస్ట్ రీజనింగ్ ) కు దీనిపై పెత్తనాన్ని నిరసించాడు .సైన్స్ పరిశ్రమలను ఆయన పూర్తిగా వ్యతిరేకించలేదు .సహజ విషయాలు (నేచురల్ ఫి నామినా )కు హడ్డులు౦టాయని ఆయనకు తెలుసు .కాని మానవ వనరులను వీటికి ఉపయోగించాలన్నది ఆయన అభిప్రాయం .లేకపోతే ఆయన సత్యాన్వేషణకు అర్ధం ఏమిటి ?క్రమబద్దీకరణమైన జ్ఞానమైన సైన్స్ ను ఆయన అంగీకరించాడు .సైంటిఫిక్ డిస్కవరీ విముక్తి హేతువు అవుతుంది .సింగర్ కుట్టు మిషన్ వచ్చిన కొత్తలో అది గృహిణి చాకిరీనిఎంతబాగా తగ్గించిందో స్పష్టంగా చెప్పి ,స్త్రీలకు అదొక వరమైంది అన్నాడు 1924లో .కనుక యంత్రం అనవసర శ్రమను తగ్గిస్తుంది .ప్రేమ ఆధారంగా సైన్స్ పని చేస్తే మానవాళికి ముక్తిహేతువే అవుతుంది .ప్రేమ ,కరుణ కలిసి సైన్స్ కు విముక్తికలిగించవచ్చు అంటాడు .ఆధునిక సైన్స్ లాభార్జనే ధ్యేయంగా నడుస్తోందికనుక అసహ్యి౦చు కొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -19-9-19-ఉయ్యూరు

