వీక్షకులు
- 981,074 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: November 2019
సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం
సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమద్వ్రత కార్యక్రమం ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో 9-12-19 సోమవారం మార్గశిర శుద్ధ త్రయోదశి శ్రీ హనుమద్వృతం త్రయాహ్నికంగా 7వతేదీనుండి నిర్వహింపబడును .భక్తులు విశేషంగా స్వామివార్ల పూజాకార్యక్రమం లో పాల్గొని,తీర్ధ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాము . కార్యక్రమ వివరాలు 7-12-19 … Continue reading
తెలుగుకు బదులు (నవ్వుతాలకి )
తెలుగుకు బదులు (నవ్వుతాలకి ) ‘’ప్రాధమిక స్థాయిలో ప్రభుత్వం తెలుగు రద్దు చేసిందని గగ్గోలు పెట్టగా ,ప్రభుత్వం నా ఆధ్వర్యం లో ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించమని వారం గడువిచ్చి ,గంటకు లక్ష జీతం నాతం లలో నన్ను డైరెక్టర్ గా మరో పదిమంది ని రోజుకు లక్షజీతం తో ఏర్పాటు చేసింది .విషయాలన్నీ సాకల్యంగా పరిశీలించి … Continue reading
మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ
మహా భక్త శిఖామణులు3-శ్రీమతి కర్మాబాయీజీ పరిపక్వ పవిత్ర స్వాధీన మనసుగల కర్మాబాయి మహారాష్ట్ర స్త్రీ .20-1-1615న నాగూర్ జిల్లా కల్వాగ్రామంలో జివాన్జీ దూది వంశం లో జన్మించింది .మహా కృష్ణ భక్తురాలు జగన్నాథ స్వామి భక్తురాలు .జగన్నాథ క్షేత్రం లోనే జీవితం గడిపింది .ఆచార వ్యవహారాలేమీ తెలీవు .కాలకృత్యాలు స్నానం పూర్తికాగానే జగన్నాథుని ప్రసాదం చేసే … Continue reading
మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు
మహా భక్త శిఖామణులు2-యవన హరి దాసు క్రీ.శ. 1314లో బెంగాల్ లోని నదియ జిల్లా బుడాన్ గ్రామంలో గౌరీ సుమతీ ఠాకూర్ లకు యవన హరి దాసు జన్మించాడు .ఆరేళ్ళ కే తండ్రి గతించాడు .తల్లి సహగమనం చేసింది .దిక్కులేని వాడై తురకలకు దొరికాడు .మతం లో చేర్చారు. మహమ్మదీయ మతఃగ్రందాలన్నీ బాగా చదివాడు .ధర్మం … Continue reading
మహా భక్త శిఖామణులు1-చోక మేల
మహా భక్త శిఖామణులు1-చోక మేల మహా రాష్ట్ర ధ్యాన దేవుడు తనకులం నుంచి బహిష్కరిప బడినతర్వాత పన్ధర్పురానికి వెళ్లి మతోద్యమ విప్లవం విస్తృతం చేశాడు .బ్రాహ్మణుల అధికారాన్ని ఎదిరించాడు .జనసామాన్యానికి భగవద్గీత అర్ధమయేట్లు మరాటీ భాషలో రాసి జన వ్యాప్తికలిగించాడు .జంతు హి౦స మాన్పించి ,విశ్వాసం తోనే భగవంతుని చేరవచ్చునని బోధించాడు .జనంలో మంచి పేరు … Continue reading
మనమెరుగని మరో’’ జొన్నలగడ్డ
జొన్నలగడ్డ అంటే విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో ఇంగ్లీష్ లెక్చరర్,బహుభాషా వేత్త గొప్ప ఆరేటర్, అనేకగ్రందకర్త ,అనువాదం చేయించటానికి రష్యాకు ఆహ్వానిపబడిన తత్వ వేత్త రష్యా వెడుతూ ‘’ఆమంచు గడ్డలో ఈ జొన్నలగడ్డ ఏమౌతాడో’’అని వీడ్కోలు సమావేశం లో మాతో చమత్కరించిన జొన్నలగడ్డ సత్యనా రాయణ మూర్తిగారు గుర్తుకు వస్తారు .ఇదే పేరుతొ మరొక … Continue reading
కార్తీక మాసం ఆఖరి 5వ మంగళ వారం రాత్రి ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో అఖండ దీపోత్సవ శోభ
కార్తీక మాసం ఆఖరి 5వ మంగళ వారం రాత్రి ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయస్వామి దేవాలయం లో అఖండ దీపోత్సవ శోభ
అదొక్కటే మందు అన్నిటికి
అదొక్కటే మందు అన్నిటికి వార్ రూమ్ లో పార్టీ అగ్ర నేతలు భేటీ అయ్యారు .ఎజెండా ఏమిటో ఎవరికీ తెలీదు ఆ ఇద్దరికీ తప్ప .టీ సరఫరా నిరంతరంగా జరుగుతోంది. తాగి శీతాకాలపు చలికి కొంచెం ఉపశమనం కలిగించుకొంటున్నారు .ఇంతలో ‘’జోడీ ‘’వస్తే ,లేచి నిలబడి అభివాదం చేశారు .నంబర్ 2మొదలు పెట్టాడు ‘’మనం ఏది … Continue reading
అంతేగా,అంతేమరి
అంతేగా,అంతేమరి ”ఏమండీ !కాకినాడ నుంచి వనజాక్షి గారు వారానికోసారిఫోన్ చేసి ,మనబ్బాయి ఫోటో వాళ్లమ్మాయికి ,అందరికి నచ్చిందని, జాతకాలుకూడా భేషుగ్గా కలిశాయనివాళ్ళ పురోహితుడు చెప్పాడని ,ఎప్పుడు వస్తే అప్పుడు అమ్మాయిని పెళ్లి చూపులు చూపిస్తామని చెబుతోంది .ఒకసారి వెళ్లి చూసొద్దామండీ ‘’అంది మా ఆవిడ కామం అదేకామాక్షి ,’’మనవాడికి సెలవలు దొరకటం లేదంటున్నాడు ఈఆదివారం బాగుంది … Continue reading
మాతృశ్రీ జిల్లెళ్ళమూడి ‘’అమ్మ’’తనం
దువ్వూరి వారికి రెండవ సారి అకస్మాత్తుగా మాట నోట రానందున ,విషయంతెలిసిన ఆచార్య బిరుదు రాజు రామరాజు గారు శాస్త్రి గారికి జాబు రాసి ‘’మీరొకసారి జిల్లెళ్ల మూడి వెళ్లి అమ్మను చూసివస్తే మంచిది ‘’అని సలహా ఇచ్చారు.ఈవిషయం చాలాకాలం మనసులో ఉన్నా వెళ్లలేకపోయారు అప్పటి వరకు .గుంటూరు వెళ్లి శిష్యుడు ఆచార్య ఎస్వీ. జోగారావు … Continue reading
ఈ నాటి అనుబంధ మేనాటిదో ?
ఈ నాటి అనుబంధ మేనాటిదో ? దువ్వూరి వారు విశాఖయూనివర్సిటీ లో తెలుగు లెక్చరర్ గా 1941 లో చేరాక ,రెండవ ప్రపంచ యుద్ధకాల౦ లో బాంబుల భయం వలన యూని వర్సిటీని గుంటూరుకు మార్చారు .అంత పెద్ద కాంపస్ దొరక్క అక్కడా అక్కడా సర్దుకొన్నారు .లెక్చరర్లు ఇక్కడ పెంచిన అద్దె ఇళ్ళల్లో ఉండలేక సతమతమయ్యారు … Continue reading
బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి
బ్రహ్మశ్రీ తాతా రాయుడు శాస్త్రిగారి ప్రతిభా శేముషి విజయనగరం అంటే శ్రీ మదజ్జాడఆదిభట్ల నారాయణ దాసు గారే ముందు గుర్తుకొస్తారు .తాతా రాయుడు శాస్త్రిగారు విజయనగరం రాజావారిసంస్కృత కాలేజిలో వ్యాకరణ అధ్యాపకులు .ఈ ఇద్దరికీ ఆబాల్య మైత్రి ఉంది .శాస్త్రిగారు రోజూ కాలేజీకి కానుకుర్తి వారి వీధిలో ఉన్న దాసు గారింటి మీదనుంచే వెళ్ళేవారు .మేడపై … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
డజనున్నర కథల్లో మణుగున్నర హాస్యం’’ పన్’’డించిన మాడుగుల
డజనున్నర కథల్లో మణుగున్నర హాస్యం’’ పన్’’డించిన మాడుగుల చక్కని వాచికం ,స్వరం లో అన్ని భేదాలు ,రసాలు పండించే చాతుర్యం ,సుమనస్కత ,మూర్తీభవించిన సౌజన్యం ,సంస్కారం ,సకలకళా రహస్య వేతృత్వం ,నిష్పక్షపాత నిర్ణయ సాహసత్వం ,నిజాయితీ ,భేషజం లేని నడవడి,చిరునవ్వుకు చిరునామా అయిన ముఖం ,కలుపుకోలు తనం ,సోషియాలజీ ,జర్నలిజ౦ లో స్నాతకోత్తర పాండిత్యం ,విజయవాడ ఆకాశ … Continue reading
గౌతమీ మహాత్మ్యం—74(చివరి భాగం ) 106-తీర్దానాం చతుర్విధాది నిరూపణం
గౌతమీ మహాత్మ్యం—74(చివరి భాగం ) 106-తీర్దానాం చతుర్విధాది నిరూపణం నారద మహర్షి బ్రహ్మ దేవుని పావన గౌతమీ నది గురించి సంక్షిప్తంగా మళ్ళీ చెప్పమని కోరాడు .పూర్వం కమండలం లో ఉన్న గంగ ,తర్వాత విష్ణుమూర్తి పాదాలనుంచి ఉద్భవించి ,మహేశ్వరుని జటాజూటం చేరి ,గౌతమమహర్షి తపో ఫలం చేత బ్రహ్మగిరి చేరి,అక్కడి నుంచి పూర్వ సముద్రం … Continue reading
షార్లెట్ సాహితీ మైత్రీ బంధం
నేను రాసిన ,సరసభారతి ప్రచురించిన ”షార్లెట్ సాహితీ మైత్రీ బంధం ”పుస్తకం దేశం లో ప్రముఖమైన మూడు లైబ్రరీలు 1-కన్నెమెరా లైబ్రరి -చెన్నై 2-సెంట్రల్ లైబ్రరి -ముంబాయ్ 3-ఢిల్లీ పబ్లిక్ లైబ్రరి -ఢిల్లీ లకు అందాయని కొలకత్తా లోని ప్రభుత్వ సంస్థ నేషనల్ లైబరీ వారి నుంచి ఈ రోజు లెటర్ వచ్చిందని తెలియ జేయటానికి … Continue reading
గౌతమీ మహాత్మ్యం—73-104-భీమేశ్వరతీర్ధం
ఋషి సత్రం అని ప్రసిద్ధి చెందిన భీమేశ్వర తీర్ధం గురించి నారదుని బ్రహ్మ వివరించాడు .గంగను సప్తరుషులు ఏడుపాయలుగా విభజించారు.దక్షిణ దిక్కులో వాషిస్టీ,ఉత్తరాన వైశ్వా మిత్రీ , దీనికి ఉత్తరాన కామ దేవీ ,మధ్యలో శుభప్రద గౌతమీ ఏర్పడ్డాయి .తర్వాత భరద్వాజీ ,ఇంకోటి ఆత్రేయి ఏర్పడ్డాయి .చివరది జామదగ్ని ..త్రికాల దర్శులైన ఆ సప్తర్షులు మహా … Continue reading
లైబ్రరీ వారోత్సవాల రెండవ రోజు15-11-19 బెజవాడ లో ‘జ్ఞానజ్యోతి ”అవార్డ్ ఇచ్చి సత్కరిస్తే ,చివరి రోజు 20-11-19నఉయ్యూరు లైబ్రరీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లో లైబ్రేరియన్ మొదలైనవారు సత్కరించారు
లైబ్రరీ వారోత్సవాల రెండవ రోజు15-11-19 బెజవాడ లో ‘జ్ఞానజ్యోతి ”అవార్డ్ ఇచ్చి సత్కరిస్తే ,చివరి రోజు 20-11-19నఉయ్యూరు లైబ్రరీలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యం లో లైబ్రేరియన్ మొదలైనవారు సత్కరించారు https://photos.google.com/share/AF1QipPvMCKDQwMPZhs053erx4TAr9hdurSm7guWNeHMNGTdm4fquO8mO_x87VeM5v08Xg/photo/AF1QipOowrb9lKlZmj2Jcthc7IP5UVRtE1Q5K3vaRWgK?key=VVo4YkFmY011d2N5QzNmVUJkZnNHc3F2LTFmVS1R గ్రంధాలయ వారోత్సవాల రెండవరోజు15-11-19 శుక్రవారం విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం ”జ్ఞానజ్యోతి ”అవార్డు కృష్ణాజిల్లాజాయింట్ కలెక్టర్ … Continue reading
నిరతాన్న దాత అపరఅన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మకు కు పంచప్రక్రియ కవితామృత నైవేద్యం
నిరతాన్న దాత అపరఅన్నపూర్ణమ్మ డొక్కాసీతమ్మకు కు పంచప్రక్రియ కవితామృత నైవేద్యం గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు చి శిస్టుసత్యరాజేష్ పని రాక్షసుడు .ఆలోచనాపరుడు .భిన్నత్వం నవీనత్వం కోరేవాడు .అందుకే డొక్కా సీతమ్మ గారిపై గజల్ ,మణిపూసలు ,ఇస్ట పదులు , కైతికాలు ,వచనకవిత్వం అనే పంచ ప్రక్రియలతో 80మంది వివిధ ప్రాంతకవులతో రాయించి ముద్రించి విజయవాడ … Continue reading
గౌతమీ మహాత్మ్యం—72-102- ఊర్వశీ తీర్ధం
గౌతమీ మహాత్మ్యం—72-102- ఊర్వశీ తీర్ధం శార్గ్జ్న ధారుడైన హరి కొలువై ఉన్నదే ఊర్వశీ తీర్ధం .ప్రమతి సార్వభౌముడు శత్రుజయం చేసిసురలతో ఇంద్రలోకం చేరి,పాశుహస్తుడైన ఇంద్రుని చూసి నవ్వగా సురలోకం లో మరుద్గణాలతో క్రీడిస్తే చాలు .నాతొ అనుభవించు’’అన్నాడు .ప్రమతి ‘’దేన్నీ పణంగా పెడతావు ‘’ని అడిగితె ‘’సకల యాగ ఫలం, ఊర్వశిని ‘’అన్నాడు .గర్వంతో ఉన్న … Continue reading
దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం
దక్కదు అనుకొన్న లెక్చరర్ పోస్ట్ ఇద్దరు ఆంగ్ల అధికారుల నిష్పక్షపాతం వలన దువ్వూరి వారికి దక్కిన వైనం ప్రౌఢ వ్యాకరణ కర్త శ్రీ వఝల చిన సీతారామ శాస్త్రిగారు తెలుగు లెక్చరర్ గా ఆంద్ర విశ్వవిద్యాలయం లో 1941 లో రిటైరయ్యారు .ఈ పోస్ట్ ను నింపటానికి యూనివర్సిటి ఒక పండితుడుకావాలని ఆయన ఛందో వ్యాకరణాది … Continue reading
గౌతమీ మహాత్మ్యం—71 101- చక్షుస్తీర్ధం
గౌతమీ మహాత్మ్యం—71 101- చక్షుస్తీర్ధం గౌతమికి దక్షిణాన చక్షుస్తీర్ధం ఉంది. అక్కడ దేవదేవుడైన యోగీశ్వరుడు కొలువై ఉంటాడు .పర్వత శిఖరం పై ‘’భౌవనం ‘’అనే పురం ఉంది. దాని రాజు భౌవనుడు క్షాత్ర ధర్మ పరాయణుడు .ఆపురం లో కౌశికుడనే బ్రాహ్మణుడు ,అతని కొడుకు వేదపండితుడైన గౌతముడు ఉన్నారు .తల్లి మనో దోషం చేత యితడు … Continue reading
వినమ్ర కృతజ్ఞతాంజలి
వినమ్ర కృతజ్ఞతాంజలి నా దోవలో నేనేదో రాసుకుంటూ,చేసుకొంటూ పోతూంటే ,ఆంద్ర ప్రదేశ్ రచయితల సంఘం అనే రాష్ట్ర స్థాయి సాహిత్య సంస్థ దుర్భిణీ వేసి గుర్తించి ,ఒక కొత్త ‘’జ్ఞాన జ్యోతి’’పురస్కారం మొదటి సారిగా ఏర్పరచి ,దానిని ప్రప్రథమంగా నాకు అందజేయటం వారి సౌజన్యానికి నిలువెత్తు ఉదాహరణ .వారందరికీ కృతజ్ఞతలు .ఇది నా అదృష్టమే .సరస భారతి సాహిత్య … Continue reading
గౌతమీ మహాత్మ్యం—70 100-భిల్ల తీర్ధం
గౌతమీ మహాత్మ్యం—70 100-భిల్ల తీర్ధం సింధు ద్వీపముని,సోదరుడు వేదుడు పరమ ధార్మికులు . వేదుడు ఒక రోజు భిక్షాటనకు వెళ్ళగా ,వ్యాధుడు అనే ధార్మికుడైన వేటగాడు వేటకు వచ్ఛి వేటాడి ,శివునికి అభిషేకం చేయటానికి నోటితో నీళ్ళు తెచ్చి , వేట మాంసాన్ని ధనుస్సు చివర ఉంచి పూజించాడు .అప్పటికే వేదుడు పూజించిన దాన్ని కాలితో … Continue reading
గౌతమీ మహాత్మ్యం-69 99-భాను తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-69 99-భాను తీర్ధం భాను తీర్ధం త్వాస్ట్రం ,మాహేశ్వరం ,ఐంద్రం ,యామ్యం ,ఆగ్నేయం గా ప్రసిద్ధం .అభిస్టుడుఅనే రాజు మంచి సుందరాకారుడు. దేవప్రీతికోసం అశ్వమేధయాగం సంకల్పించాడు .వసిష్ట అత్రి మున్నగు రుషి శ్రేస్టులు ఋత్విక్కులు .అక్కడ ‘’క్షత్రియుడే యజమానిగా ఉంటె యజ్ఞభూమి ఎలాఉంటుంది ?బ్రాహ్మణుడే దీక్షితుడైతే రాజు యజ్ఞ సంబంధ భూమిని ఇవ్వగలడు.మరి రాజే … Continue reading
జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -వార్త-
జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -వార్త-
ఉసిరి చెట్టుకింద అభిషేకం సత్యనారాయణ వ్రతం వనభోజనం చిత్రాలు
17-11-19కార్తీక బహుళ పంచమి ఆదివారం ఉయ్యూరు మా పెరటి ఉసిరి చెట్టుకింద ఉదయం 9గం.నుండి 1.30వరకు నాలుగు న్నర గంటల సేపు మహన్యాస పూర్వక రుద్రాభిషేకం ,శివ అష్టోత్తర సహస్రనామ ,బిల్వాస్తోత్తర పూజ అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,కార్తీక వనభోజనం చిత్రాలు
’జ్ఞానజ్యోతి ‘’పురస్కార ప్రదానం
‘’జ్ఞానజ్యోతి ‘’పురస్కార ప్రదానం ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి ఆత్మీయుడు శ్రీ చలపాక ప్రకాష్ సుమారు 15 రోజులముందు ఫోన్ చేసి’’ సంఘం కొత్తగా మొదటిసారిగా జ్ఞాన జ్యోతి పురస్కారం ఏర్పాటు చేస్తోంది.మొదటిపురస్కారం మీకే నవంబర్ 15విజయవాడ టాగూర్ గ్రంధాలయం లో గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ప్రదానం చేయాలని ,అధ్యక్షులు మిగాతాకార్యవర్గం నిర్ణయించి మీకు … Continue reading
జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -ఈనాడు వార్త-
జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం -ఈనాడు వార్త-
గౌతమీ మహాత్మ్యం-68 97-పతత్రి తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-68 97-పతత్రి తీర్ధం కశ్యప ప్రజాపతి అరుణుడు ,గరుత్మంతుడు కుమారులు .ఈవంశం లోని వారే జటాయువు సంపాతి .ఈ ఇద్దరు బలగర్వం తో స్పర్ధతో ఆకాశానికి యెగిరి సూర్య దర్శనం చేయాలనుకొన్నారు .సూర్యతాపానికి తట్టుకోలేక ఇద్దరూ అలసిపోయి ఒక పర్వత శిఖరం పై పడిపోయారు .వీరిద్దరిని అరుణుడు చూసి విచారించి సూర్యునితో ఆ ఇద్దరినీ … Continue reading
దువ్వూరి వారి ‘’రమణీయం‘’పై రమణీయ భావనలు
దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు అంటే చిన్నయ సూరి బాలవ్యాకరణం ,ఆతర్వాత ‘’రమణీయం ‘’గుర్తుకొస్తాయి .దువ్వూరివారు సంస్కృత వ్యాకరణాన్ని మూడేళ్ళపాటు ఆసాంతం చదివి హస్త, మేధోగతం చేసుకొన్నారు .1914విజయనగరం మహారాజాకాలేజిలో విద్వాన్ కోర్సు చదవటానికి చేరారు .అప్పుడు చిన్నయ సూరి బాలవ్యాకరణ౦ లో సంజ్ఞాపరిచ్చేదం,చదివి’’ సంధి ‘’ప్రారంభించే సరికి ‘’ఇదేదో బింకంగా ఉందే.తెలుగు వ్యాకరణాలు చప్పచప్పగా … Continue reading
గౌతమీ మహాత్మ్యం-67 96-భద్ర తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-67 96-భద్ర తీర్ధం త్వష్ట ప్రజాపతి కూతురు ఉష సూర్యుని భార్య .ఛాయ రెండవ భార్య.ఈమె కొడుకే శని .ఇతని సోదరి విస్టి భయంకరాకార కురూపి . ఈమెను ఎవరికిచ్ఛి పెళ్లి చేయాలా అని ఆలోచిస్తున్నాడు తండ్రి .అప్పుడు విస్టి తండ్రితో ‘’కన్యను తగిన వాడికిచ్చి పెళ్లి చేస్తే తండ్రి కృతార్దుడౌతాడు .కన్యకు పదేళ్ళు … Continue reading
సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి కి ప్రధమ జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం
సరసభారతి అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ గారికి కి ప్రధమ జ్ఞానజ్యోతి పురస్కార ప్రదానం 15.11.2019 5:30PM ప్రత్యక్ష ప్రసారం https://sarasabharathivuyyuru.blogspot.com/
గౌతమీ మహాత్మ్యం-6695-చిచ్చిక తీర్ధం
సర్వ శాంతి కలిగించే ‘’చిచ్చిక తీర్ధం ‘’గోదావరి ఉత్తర తీరాన ఉన్నది .చిచ్చుక అనే పక్షిరాజును గండ భేరుండం గా,శ్వేత పర్వతం పై ఉంటూ ప్రసిద్ధి చెందింది .అక్కడ మహర్షులు ప్రశాంతంగా తపస్సు చేసుకొంటారు .సర్వవిధ వృక్షాలు అక్కడ ఉంటాయి .రోగాలు రొస్టులు ఉండవు .ధర్మ నిరతుడైనతూర్పు దేశ క్షత్రియరాజు పవమానుడు మంత్రి సామంత పురోహిత … Continue reading
కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం
కూతురుకాని కూతురే తల్లికాని తల్లి-2(చివరిభాగం డా .కామేశ్వరికి ట్రాన్స్ ఫర్ అయి విశాఖనుంచి హైదరాబాద్ వెళ్ళింది .తర్వాత ఆమెను మిలిటరీ సర్వీస్ లోకి తీసుకొన్నారు మద్రాస్ ,కలకత్తా ,జలంధర్ ,ఆర్మీలో పనిచేస్తూ 1970-74లో రూర్కీ లో మేజర్ అయింది .ఎక్కడ ఉద్యోగం లో ఉన్నా ఏడాదికో మాటు విశాఖ, గోదావరి లకు రావటం ‘’దువ్వూరి’నాన్న’’ ఉన్న … Continue reading
గౌతమీ మహాత్మ్యం-65 94-సరస్వతీ తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-65 94-సరస్వతీ తీర్ధం పుష్పోత్మటం తూర్పున ,గౌతమికి దక్షిణాన ‘’శుభ్రం ‘’అనే పర్వతం బాగా ప్రసిద్ధి చెందింది .దానిపై శాకల్యుడు అనే ముని తపస్సు చేస్తు౦డగా,సమస్త ప్రాణికోటి అతనిన్ని స్తుతిస్తూ ,నమస్కరి౦చేది . అక్కడే ‘’పరశువు ‘’అనే రాక్షసుడు కామ రూపియై బ్రాహ్మణ ,పులి ,స్త్రీ ,బాలరూపాలు ధరించి రోజూ శాకల్యముని తపో భంగం … Continue reading
ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక మాసం 3వ మంగళవారం రాత్రి దీపాలంకర శోభ
ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో కార్తీక మాసం 3వ మంగళవారం రాత్రి దీపాలంకర శోభ https://photos.google.com/share/AF1QipOcfbRFpBr-1xi0Rp62XmadyCBHAMmiPUrBxPC9NQ_uMOhTfgayK4ctH25pp9HCHw?key=Z3hmcXRnVTJyZ3FkNEVfT2ZIWktLMVhvYTF6TTlB
9-11-19 శనివారం రాత్రి హైదరాబాద్ మియాపూర్ మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం దంపతుల ఇంట్లో మేము
9-11-19 శనివారం రాత్రి హైదరాబాద్ మియాపూర్ మా తోడల్లుడిగారబ్బాయి సూర్యం దంపతుల ఇంట్లో మేము
9-11-19శనివారం హైదరాబాద్ బాచుపల్లిలో మా అబ్బాయి శర్మ ఇంట్లో ఉదయం 7-30నుంచి 11-15వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తరువాత 11-30నుంచి 2-30వరకు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక
9-11-19శనివారం హైదరాబాద్ బాచుపల్లిలో మా అబ్బాయి శర్మ ఇంట్లో ఉదయం 7-30నుంచి 11-15వరకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తరువాత 11-30నుంచి 2-30వరకు శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం చిత్రమాలిక https://photos.google.com/share/AF1QipO5Bo4itslgr2B5Ab2o9Ron_UO0E8t3ISWsmz0PWBPQLYcl9qcz1dlp-CjrKHIPjg/photo/AF1QipN8agkq8RWVcu8v4tXWIc_JURr7769mINe8OIsB?key=MG53VVdMUTFRTHpHcFBnR3VGZS1DM2JrdS1xdVJB
జ్ఞాన జ్యోతి పురస్కార ప్రదానం
సాహితీ బంధువులకు శుభ కామనలు -ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం మొదటి సారిగా ఏర్పాటు చేసిన ”జ్ఞానజ్యోతి ”పురస్కారం మొట్టమొదటి సారిగా నాకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 15-11-19 శుక్రవారం సాయంత్రం ప్రదానం చేస్తున్నందుకు ,,వారికి కృతజ్ఞతలు తెలియ జేస్తూ ,వినమ్రంగా స్వీకరి0చటానికి అంగీకరిస్తున్నామని సాహితీ బంధువులకు తెలియ జేస్తున్నాను –
కూతురుకాని కూతురే తల్లికాని తల్లి
కూతురుకాని కూతురే తల్లికాని తల్లికొన్ని బంధాలు తమాషాగా యేర్పడి శాశ్వత బంధాలౌతాయి .చిరస్మరణీయాలౌతాయి .మధుర భావ బంధురాలౌతాయి ..ఎన్నో జన్మల అనుబంధాలేమో అనిపిస్తాయి .ఆ బంధానికి రెండు వైపులవారి స్పందనలు మరింత బలీయమైతే ఇక వాటిని గురించి చెప్పటానికి మాటలే ఉండవు . .ఆనందాను నుభవమే అయి మనసునమల్లెలై విరబూసి దిగంత వ్యాప్త పరిమళీ భూతాలౌతాయి … Continue reading
‘నూక వప్పెచిమాః-క్రమాత్ ”
‘నూక వప్పెచిమాః-క్రమాత్ ” ఇదేమిటి తలా తోకా లేని శ్లోకం తెచ్చి హడల గొడుతున్నావని అనుకోకండి .”స్టేషన్సు బెబ0 శాఖాయా0 -నూ క్రా శ్యాది నిర్ణయహ ” అని -పూర్తిశ్లోకం శ్లోకం మొదటి పాదానికే కంపరమొస్తే శేషం యేమిటి స్వామీ అనకండి . దీనికో కధ ఉంది .చెబుతా వినండి సారీ చదవండి . దువ్వూరి … Continue reading
అపార అన్నపూర్ణమ్మకు ”గొరసం ”వారి అక్షర నీరాజనం
అపార అన్నపూర్ణమ్మకు ”గొరసం ”వారి అక్షర నీరాజనం
దిగ్విజయంగా జరిగిన 11వ అమెరికాతెలుగు సాహితీ సదస్సు
దిగ్విజయంగా జరిగిన 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు నవంబర్ 23, 2019, ఓర్లాండో మహా నగరం, ఫ్లారిడా ఓర్లాండో మహా నగరం లో 11వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు విజయవంతంగా ముగిసింది. ముందు చెప్పవలసిన నా మాట ఆఖర్న చెప్తాను….అంత వరకూ ఓపికగా ఈ సదస్సు సమీక్ష చదవండి. ఫొటోలు చూడండి. వీడియోలు వీక్షించండి…. ఇక ఫ్లారిడా … Continue reading