తప్పని సరి పరిస్థితులలో – రసభారతి 3పుస్తకాల ఆవిష్కరణ
సాహితీ బంధువులకు శుభకామనలు ,మరియు శ్రీశార్వరి ఉగాది శుభాకాంక్షలు .ప్రపంచమంతా కరోనా మహమ్మారి వ్యాపించి తీవ్ర అల్లకల్లోలం చేస్తూడటం ,సెకండ్ ఫేజ్ దాటి మూడవ ఫేజ్ లోనూ విజ్రు౦భి౦చటం దేశాలన్నీ స్వయం కర్ఫ్యూ విధించుకొని జాగ్రత్త పడుతూ౦డటం ,మనరాస్ట్రం లోనూ కరోనా కోరలు సాచి భయానక పరిస్థితులు కల్పించటం ,ప్రజలు ఇంటి నుంచి కదిలి బయటికి వెళ్ళే ధైర్యం లేకపోవటం ,విద్యా సంస్థలు మూతపడటం ,పదవతరగతి పరీక్షలు ఈ నెల 31 నుంచి జరుగ బోతూ౦డటం,స్థానిక ఎన్నికలు వాయిదా పడటం తో, గందరగోళ పరిస్థితి ఏర్పడి ,ఎప్పటికి మామూలు వాతావరణం నెలకొంటుందో చెప్పలేక పోతున్నారు .ఇలాంటి ఆపత్కర పరిస్థితులలో ఈ రోజు అంటే మార్చి 22ఆదివారం సరసభారతి 150వ కార్యక్రమ౦గా నిర్వహించాల్సిన శ్రీ శార్వరి ఉగాది వేడుకలను వాయిదా వేయక తప్పలేదని మీకు తెలుసు .
1- ఐతే ఇద్దరు ముగ్గురు అతిధులు ఇప్పటికే ఉయ్యూరు వచ్చి ఉండటం మళ్ళీ ,ఇంత పెద్ద కార్యక్రమం సమీప భవిష్యత్తులో నిర్వ హించటం కూడా చాలా కస్టమవటం, ఆవిష్కరి౦పబడే 3పుస్తకాలు ముద్రణ పొంది నిన్న సాయంత్రమే అందటం తో, తప్పని సరి పరిస్థితులలో నిన్ననే 21-3-20 శనివారం రాత్రి శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వారల పాదాల చెంత పై మూడు పుస్తకాలు ఉంచి ,పూజ చేయించి ,ఉన్న అతిదులతోనే స్వామివార్ల సన్నిధానం లో ఆవిష్కరణ జరిపించి నట్లు భావించాం .
2-కొత్తగా అందిస్తున్న’’ శ్రమశక్తి’’ పురస్కారగ్రహీతలు ,ఎక్కువమంది’’ స్వయం సిద్ధ ‘’పురస్కార గ్రహీతలు స్థానికులే అవటం తో ,వారికి కూడా పురస్కారాలు అందజేస్తున్నాం .
3-కరోనా భయం ఇప్పుడప్పుడే పోయే సూచనలు లేనందున ‘’మా వూరు –మా మా వాళ్ళు ‘’అంశం పై జరపాల్సిన ఉగాది కవి సమ్మేళనం సమయం దాటాక చేస్తే బాగుండదని భావించాం .దీనివలన కవిమిత్రులకు అసౌకర్యం కలిగినందుకు చింతిస్తున్నాం .ఐతే మీరు రాసిన కవితలను నాకు మెయిల్ లో కాని, పోస్ట్ లో కాని ఉగాది దాటాక పంపమని కోరుతున్నాను .వాటిని ఇదివరకు లాగానే సరసభారతి అంతర్జాలం , ఫేస్ బుక్ ,వాట్సాప్ లలో పెట్టి, అందరికి అందు బాటులోకి తెస్తామని తెలియజేస్తున్నాను . వీలుని బట్టి కవితలు పుస్తకరూపం లో తెచ్చే ప్రయత్నం చేస్తాము .
పై విషయాలను అతిధులు ,పురస్కార గ్రహీతలు ,కవి మిత్రులు,సాహిత్యాభిమానులు సహృదయం తో అర్ధం చేసుకొంటారని భావిస్తూ ,మరొక్క సారి శ్రీ శార్వరి ఉగాది శుభా కాంక్షలు తెలియ జేస్తూ –సెలవ్ –మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-3-20-ఉయ్యూరు .
from our blog
శార్వరి ఉగాది వేడుకలలో వెలువడనున్న పుస్తకాలు
వరుస | పుస్తకం పేరు | వివరాలు |
23 | ఊసుల్లో ఉయ్యూరు | ఉయ్యూరుతో ,అక్కడి వ్యక్తులు,సంస్థలు మొదలైనవాటితో నాకున్న 75ఏళ్ళ అనుబంధం ,జ్ఞాపకాలు అనుభవాల నాస్టాల్జియా |
24 | సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా | (2002 నుంచి 2015 వరకు -6 రాష్ట్రాలలో మా క్షేత్ర సందర్శన విశేషాల యాత్రా సాహిత్యం) |
25 | ఆధునిక ఆంద్ర శాస్త్ర మాణిక్యాలు | (వివిధ రంగాలకు చెందిన 62 మంది ఆంధ్ర శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, చేసిన కృషి ) |