ప్రపంచ దేశాల సారస్వతం
54-అంగోలా దేశ సాహిత్యం
కరోనా సోకని 13వ దేశం అంగోలా ఆఫ్రికాలో ట్రాపికల్ అట్లాంటిక్ బీచెస్ , నదులు ,సబ్ సహారా ఎడారులతో ఉంటుంది .రాజధాని లువాండా .దీన్ని రక్షించటానికి 1576లో పోర్చుగీస్ పటిష్టమైన కోట కట్టింది .పాలియోలితిక్ కాలం నుంచి జనావాసమున్న దేశం .ఎన్నో ఎత్నిక్ గ్రూపులున్నాయి .అనంతమైనఖనిజం పెట్రోలియం ఉన్నాయి .1975లో స్వతంత్రం పొంది రిపబ్లిక్ అయింది .అత్యధిక వేగంగా అభి వృద్ధి చెందిన దేశంకూడా .జీవనప్రమాణం చాలాతక్కువ .పిల్లలమరణాలు తక్కువే .ఆర్ధికం అంతా కొందరి గుప్పిట్లోనే ఉంటుంది .2008,12లలో ఎన్నికలు జరిగి కొత్తరాజ్యాంగం అమల్లోకి వచ్చింది .దేశఖనిజ సంపదకోసం అనేక అంతర్యుద్ధాలు అంతకు ముందు అనుభవించింది .2016 పాతికేళ్ళలో రాని పెద్దకరువు వచ్చి ఆర్ధికం కుదేలైంది .2017లో కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు .శీతోష్ణస్థితిలో చాలావ్యత్యాసాలు ఉండటం వలన వర్షాకాలం కరువుకాలం ఉంటాయి .సెక్స్ వివక్షత ఎక్కువ .డైమండ్, గోల్డ్ ,కాపర్ ఆయిల్ వన్యమృగాలు ఎకానమికి దోహదం అయినా సివిల్ వార్స్ తో దెబ్బతిన్నది .చైనాతో ట్రేడ్ దోస్తీ ఎక్కువ .పెట్రోల్ గాలన్ 0.37డాలర్లు.2002 తర్వాత స్థిరమైన ఎకానమీ ఏర్పడింది .సౌత్ ఆఫ్రికానుంచి ఆహారపదార్ధాలు దిగుమతి చేసుకొంటుంది .అన్నిరకాల ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి .టెలికమ్యూనికేషన్స్ ,టెక్నాలజీ లో గణనీయం గా ముందుంది .ప్రజలభాష పోర్చుగీసుతోపాటు ఉన్గుమ్బు కిలోమ్బు మొదలైనవెన్నో జాతుల భాషలున్నాయి .క్రైస్తవులు ఎక్కువ .కలరా మలేరియా రేబిస్ మొదలైన జబ్బులెక్కువ
8ఏళ్ళు ప్రాధమిక విద్య ఉచితం అయినా బిల్డింగ్ లు టీచర్స్ లేకపోవటం తో పిల్లలు బడికి రావటం లేదు .ఇటీవలి కాలం లో అక్షరాస్యత పెరిగింది .ఇక్కడి సంస్కృతిపై పోర్చుగీస్ సంస్కృతిప్రభావం ఎక్కువ .1972లో మొదటి సినిమా నిర్మించారు బాస్కెట్ ఫుట్బాల్ ఆటలు బాగాడుతారు .కరెన్సీ –అంగోలన్ క్వాంజా .
అంగోలా సాహిత్యం –అంగోలన్ సాహిత్యం 19వ శతాబ్దిలో మాత్రమె ఆరంభమైంది .రచయితలు పోర్చుగీస్ భాషలోనే రాస్తారు .2006లో లువాన్డియో వీరా అనే రచయిత 1,28000డాలర్ల కొమోజ్ ప్రైజ్ పొందాడు కానీ తీసుకోలేదు. అంగోలా మొదటి ప్రెసిడెంట్ అగస్టినో నెటో కవి కూడా .బాలసాహిత్యరచయిత క్రెమిల్డా డీ లిమా .జో ఎద్యుర్డోఅగాలసా 2017లో ఇంటర్నేషనల్ డూబ్లిన్ లిటరరీ ప్రైజ్ పొందాడు .
కొందరు అంగోలా రచయితలు –హెన్రిక్ అబ్రాన్చేస్ ,ఆన్తెనో అబ్రూ ,ఫెర్మాడోకోస్టా అన్డ్రేడ్,అలేగ్జాండ డస్కలోస్ర్,మోటా ఎకేన్హా మొదలైన 60మందికి పైగానే ఉన్నారు
బెస్ట్ బుక్స్ –అనదర్ డే ఆఫ్ లైఫ్ –రిస్జార్డ్ కా ,గుడ్ మార్నింగ్ కామ్రేడ్స్ –ఒండ్రాజి,ఓస్ ట్రాన్స్పరెంస్ –ఒండ్జకి,మేయోమ్బే –పెపెటాల,దిలాస్ట్ ట్రెయిన్ టు జోనా వెర్డే(ఆఫ్రికన్ సఫారి )-పాల్ థెరాక్స్ వగైరా
అంగోలా లో అక్షరాస్యత తక్కువ డోలాయమానమైన ఎకానమీ ,విపరీత సీతోష్ణస్థితి ఉండటం వలన బయటివారికి ఆవాసయోగ్యం కాదు .కరోనా వైరస్ ను ము౦దేగుర్తించి అన్నిజాగ్రత్తలు తీసుకొని అంగోలా మృత్యుముఖం నుంచి బయట పడింది
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-5-20-ఉయ్యూరు

