ప్రపంచ దేశాల సారస్వతం
56- తువాలు దేశ సాహిత్యం
కరోన నీడపడని 15వ దేశం తువాలు దక్షిణ ఫసిఫిక్ లో తొమ్మిది ఐలాండ్ ల సముదాయం .పాం, చేతల్ బీచెస్ రీఫ్ లు ,ప్రకృతి దృశ్యాలు ఆకర్షణ .ఫునఫూటి రాజధాని .అత్యధిక బీద దేశం .జనాభా 11వేలు మాత్రమె .టూరిస్ట్ లకు సేఫెస్ట్ ప్లేస్ ..టెలికమ్యూనికేషన్ ఇంటర్నెట్ సౌకర్యం ఉన్నాయి .షార్ట్ వేవ్ రెడియో స్టేషన్,టేలివిజన్ బ్రాడ్ కాస్టింగ్ కూడా ఉన్నాయి .ప్రపంచ చిన్న దేశాలలో నాలుగవది .తువాలు అంటే ఎనిమిది ఐలాండ్ ల సముదాయం తోమ్మిదోది అతి చిన్నది ,సీలెవెల్ కు పైన ఉంటుంది .సుమారు 3వేల ఏళ్ళ క్రితమే ఇక్కడ జనావాసాలున్నాయి .ఎప్పటికైనా సముద్రం లో కలిసి పోతుందనే నమ్మకం అందుకని ‘’సింకింగ్ ఐలాండ్స్ ‘’అంటారు .
పూర్వం దీన్ని ఎలిస్ ఐలాండ్స్ అనేవారు .1568లో స్పానిష్ వారు వచ్చి ఆక్రమించారు .1820లో రష్యన్ యాత్రికుడు దిగాడు .1861లో బ్రిటిషర్లు చేరారు
1978లో బ్రిటన్ నుండి స్వతంత్రం పొందింది నాలుగేళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయి పార్లమెంట్ ,ప్రధాని మంత్రివర్గం ఉంటాయి .క్వీన్ ఎలిజబెత్ సార్వభౌమాదికారిణి.2019లో కోసియా నటానో ప్రధాని అయ్యాడు .సైన్స్ సంకేతికసాయం ఆస్ట్రేలియ అందిస్తుంది .ఆస్ట్రే లియన్ వాలంటీర్లు ఎకనామిక్ అభివృద్ధికి ,బీదరిక నిర్మూలనకు సాయం చేస్తారు .చేపలవేట ,వ్యవసాయమే ఇక్కడ ఆదాయవనరులు .ప్రభుత్వం తువాలు ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆర్ధిక వడిడుడుకులనుంచి రక్షిస్తుంది .ఆస్ట్రే లియన్ కరెన్సీ చెల్లుబాటు అయినా, స్వంత నాణాలు ఆ దేశం ముద్రిస్తుంది ,మతం క్రిస్టియన్ మతం .తువాలు భాష ,ఇంగ్లిష్ జాతీయభాషలు .గుండెపోటు జబ్బులు ఎక్కువ 20వ శతాబ్దిలో చాలామంది దీనితో చనిపోయారు .ఫ్రీ కంపల్సారి విద్య అమలులో ఉంది .కేంబ్రిడ్జి సిలబస్ బోధిస్తారు .అక్షరాస్యతశాత౦ 99.సముద్ర షెల్స్ తో రకరకాల వస్తువులు చేయటం ఇక్కడప్రత్యేకత .చాలారకాల డాన్సులు సంగీతముంటాయి .కుటుంబవ్యవస్థ బలీయం . క్రికెట్ కంటె చిన్నదైన ‘’కిలికిటి’’ఆట ఆడుతారు .వాలీబాల్,ఫుట్బాల్ కూడా ఆడుతారు .వర్షాధార పంటలే .ట్రాపికల్ సైక్లోన్ లు ఎక్కువ బాధిస్తాయి .స్ప్రింగ్ సీజన్ లో సముద్రం మామాలుకంటే చాలా ఎత్తుకు లేస్తుంది .వీటిని కింగ్ టైడ్ లంటారు . ఇవివస్తే ఐలాండ్ లుమునిగిపోతాయి .
తువాలు సాహిత్యం –తువాలు దేశం లో కళలు సాహిత్యం మొదటినుంచి వలసదారులదే.క్లైమేట్ మార్పులను బట్టి వస్త్రధారణ మారుతుంది .అవి తయారు చేసే నేర్పు వీరికి ఎక్కువ వాటిపై పుస్తకాలోచ్చాయి .ఆధునికకాలంలో సెలీనా తులిసిటా మార్ష్ –ఈ దేశం లో సామోన్ లోపుట్టిన కవయత్రి ,లండన్ ఒలింపిక్ పోయెట్రి లో పాల్గొన్నది
ఆస్త్రేలియన్ రచయిత ఆండ్రూ ఓ కొన్నర్ ‘’తువాలు ‘’నవల రాసి అవార్డ్ పొందాడు
ప్రసిద్ధ రచనలు –వేర్ ది హెల్ ఈజ్ తువాలు –ఫిలిప్ ఎలిస్ ,సీపీపుల్ –క్రిస్టియానా ధాంసన్ ,ఫసిఫిక్ దిఓషన్ ఆఫ్ ది ఫ్యూచర్ –సైమన్ విన్ చెస్టర్,దిమెటీరియల్ కల్చర్ ఆఫ్ తువాలు -జేర్డ్ కోచ్ మొదలైనవి .
57-వనౌతు దేశ సాహిత్యం
కరోనా సోకని 16వ దేశం వనౌతు 80ఐలాండ్ ల సముదాయం దక్షిణ ఫసిఫిక్ లో13,00కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉంది .వనౌ అంటే ఇల్లు .ఇల్లున్న దేశం అని భావం .స్కూబా డైవింగ్ ,కోరల్ రీఫ్ ,అండర్ వాటర్ కేవెర్న్స్ఆకర్షణ .పోర్ట్ విటా రాజధాని .కరెన్సీ వానౌతు వతు.3లక్షల జనాభా .ఒంటరిగా ఉండటం తో బీదరికం 13శాతం ఉంటుంది .తుఫాన్ల భీభత్సమూ ఎక్కువే .టూరిస్ట్ లకు భద్రమైన దేశం .3వేల ఏళ్లకుపూర్వమే ఆస్ట్రో నేషియన్లు ఇక్కడ ఉన్నారు .1606లో యూరోపియన్లు వచ్ఛి 1768దాకా ఉన్నారు .1774లో కెప్టెన్ కుక్ వచ్చి ‘’న్యు హైబ్రేడేస్’’పేరు పెట్టగా అది 1980లో స్వతంత్రం పో౦దేదాకా ఉన్నది .వేల్స్ వేటకోసం నౌకలరాక ఎక్కువ .1825లో పీటర్ డిలాన్ నావికుడు ఇక్కడ గంధపు చెట్లను గుర్తించాడు .దీన్నికాజేయటానికి 1830దాకా వచ్చారు .తర్వాత బానిసలవ్యాపారం దానికోసం యుద్దాలుజరిగాయి .19వ శతాబ్దిలో రోమన్ కేధలిక్కులు ,ప్రొటెస్టెంట్ లు వచ్చి ఆక్రమించి ప్రత్తి సాగు చేశారు .ప్రత్తిధర తగ్గటం తో కాఫీ బనానా కోకా కొబ్బరి పంట వేశారు .1947లో కొంత ఉద్రిక్తత ఏర్పడింది .1970లో మొదటి రాజకీయ పార్టీ ఏర్పడి ,ఎన్నికలు జరిగి వాల్టర్ లిని ప్రెసిడెంట్ అయ్యాడు .తర్వాత ‘’కొబ్బరికాయ యుద్ధం ‘’వచ్చి 1980స్వతంత్ర రిపబ్లిక్ అయింది
4వేలరకాల సముద్ర జీవులు ఇక్కడున్నాయి .మెరైన్ ఫిషింగ్ కు అనువైనది .సాల్ట్ వాటర్ క్రోకడైల్స్ నాలుగున్నాయి .వర్షాకాలం బాగా ఎక్కువ .తరచూ భూకంపాలు వస్తాయి .సిటిజన్ షిప్ ను ఒక లక్షాయాభై వేల డాలర్లకు అమ్ముతారు .దీనితో యూరప్ అంతా ఫ్రీగా తిరిగి చూడచ్చు .మాంగనీస్ ఖనిజం ఉన్నది .ప్రజా సౌకర్యాలన్నీ ఉన్న దేశం .జాతీయ భాష బిస్లామా .అధికాభాషలు బిస్లామా ఇంగ్లిష్ ఫ్రెంచ్ .మతం క్రిస్టియానిటి.అక్షరాస్యత శాతం 74.సాంస్కృతిక వైవిధ్యంఎక్కువ .ఫుట్బాల్ బాగా ఆడుతారు
వానౌతు సాహిత్యం –మొదట్లో అంతా మౌఖిక సాహిత్యమే .1973లో యూనివర్సిటి ఏర్పడ్డాక రచనా జిజ్ఞాస పెరిగింది .మొట్టమొదటి కవి ఒకమహిళ-గ్రేస్ మోలీసా స్త్రీవాద కవయిత్రి రచయిత్రి బిస్లామా ఇంగ్లిష్ భాషలలో రాసింది .2007లో ఫ్రాన్కోఫోన్ సింగర్ గీతరచయిత్రి ,ఆధర్ మార్సెల్మేల్తేరోరోంగ్ మొదటి నవల రాశాడు .అతని ‘’టోఘాన్’’నవలలో ఫసిఫిక్ ఐలాండర్ల యువత గమ్యం లేక మలేనేషియాన్ ,వెస్ట్రె న్ విలువలంధ్య ఊగిసలాట చిత్రించాడు .2009లో ఇది పునర్ముద్రణ పొందినపుడు సాహిత్య నోబెల్ పొందిన జీన్ మేరీ క్లేజియో ‘’న్యు అండ్ ఒరిజినల్ ‘’అని ముందుమాటలలో రాశాడు .కమ్యూనిటి దియేటర్ ను 1989లో స్థాపించిన వాన్ స్మోల్ బాగ్ ,ఇతర రచయితలూ సోషల్ అవేర్ నెస్ కోసం ఎయిడ్స్ ,మలేరియా నివారణ తుఫాను లో జాగ్రత్తలు మొదలైనవాటిపై స్కిడ్స్ రాసి ప్రదర్శించారు .అతని నాటకాలు సిడిలుగా దొరుకుతాయి .
కొన్ని ప్రముఖరచనలు –కాలనైజ్డ్ పీపుల్ –గ్రేస్ మేరామోలిసా ,దిషార్క్ గాడ్ –చార్లెస్ మాన్ట్ గోమరి,దికోకోనట్ వార్ –రిచర్డ్ షేర్స్ ,హౌస్ గర్ల్స్ రిమెంబర్ –డొమెస్టిక్ వర్కర్స్ –మార్గరెట్ రోడ్ మాన్,బ్లాక్ స్టోన్-మోలిసా ,ఫిషింగ్ ఫర్ స్టార్స్ –బ్రిస్ కర్టేనరి మొదలైనవి
పైరెండు దేశాలలో పేదరికం వంటరితనం వలన కరోనా వస్తే తట్టుకోవటం కష్టం అని భావించి ఆ దేశాదిపతులు ముందే జాగ్రత్త పడి అన్ని చర్యలు తీసుకోవటం వలన కరోనా ఈ రెండు దేశాలకికి రాలేదు .బిజినెస్ లన్నీ బంద్ చే శారు . బార్డర్లుమూసేశారు .విద్యాలయాలకు సెలవులిచ్చి టూరిస్ట్ లకు పర్మిషన్ లేకుండా చేశారు “We know how the virus spreads and when we look at our culture and how we live, it’s in favour of this virus. If it comes, it would be a disaster. At this point, we have to be strict with our borders – our fear is that if enters Vanuatu, it would spread very quickly and we simply do not have the resources and facilities to manage it. The slightest mistake will impact us very badly.”అని ప్రజలుగాట్టిగా అభిప్రాయపడి ప్రభుత్వాలకు పూర్తిగా సహకరించారు .
ఈ 16కరోనా సోకని దేశాల సాహిత్యం దీనితోపూర్తి.ఇకపై జనజీవన స్రవంతిలో ఉన్న దేశాల సాహిత్యం యధాప్రకారం ప్రారంభిస్తాను .ఇన్ని ఫసిఫిక్ దేశాలు నాతోపాటు చూసి అక్కడి విషయాలు తెలుసుకొన్నందుకు ధన్యవాదాలు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -4-5-20-ఉయ్యూరు


Like my blog
LikeLike