ప్రపంచ దేశాలసారస్వతం 61-బల్గేరియన్ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

61-బల్గేరియన్ సాహిత్యం

స్లావిక్ ప్రజల ప్రాచీన సాహిత్యమే బల్గేరియన్ సాహిత్యం .9వ శతాబ్దిలోనే మొదటి బల్గేరియన్ సామ్రాజ్యం  చక్రవర్తి మొదటి సైమన్ కాలం లో వర్ధిల్లి౦ది .మధ్యయుగం లో గ్రేట్ మొరేవియా నుంచి సిరిల్ ,మేతోడియస్ లను బహిష్కరించాక ,వారిని బల్గేరియన్ సామ్రాజ్యం ఆహ్వానించటం తో సాహిత్యానికి కేంద్రమై సాహిత్యానికి స్వర్ణయుగం అయింది .11వ శతాబ్ది దాకా సాహిత్యం అన౦త౦  గా మూడుపూలు ఆరుకాయలులాగా విస్తరించి,బైజా౦టిక్ గ్రీకునుంచి  అనేకపుస్తకాలు అనువాదం పొందాయి  .చాలామంది విద్యావేత్తలు ప్రేస్లావ్ ,ఒవ్రిడ్ సాహిత్య విద్యాలయాలలో సిరిల్లిక్ స్క్రిప్ట్ సృష్టించి  రచనలు చేశారు .చెర్నో రిజేట్స్ హర్బార్ ‘’యాన్ అకౌంట్ ఆఫ్ లెటర్స్ ‘’ను ,క్లెమెంట్ ఆఫ్ ఒహ్రిడ్ గ్రీకు అనువాదాలూ చేశాడు .జాన్ ఎక్సార్క్ షెస్టోడ్ నెవ్,ఆర్ధడాక్స్ క్రిష్టియానిటి అనువాదాన్ని ,నౌమ్ ఆఫ్ ప్రేస్లావ్ మరింత సాహిత్య సృష్టి చేశారు .ఈరచనలు స్లావిక్ ప్రపంచంపై గొప్ప ప్రభావం కలిగించాయి .1018లో బల్గేరియన్ సామ్రాజ్యాన్ని బైజాన్టియన్లు ఆక్రమించాక సాహిత్య వేగం తగ్గి ,రెండవ బల్గేరియన్ సామ్రాజ్య కాలం లో మళ్ళీ పు౦జుకొన్నది .14వశతాబ్దం లో పెట్రియర్క్ ఎవిటిమ్లి బాగా ప్రోత్సహించాడు .ఇతడు టార్ణోవ్ లిటరరీ స్కూల్ స్థాపించి సెర్బియా మస్కోవైట్ రష్యా సాహిత్యాలను ప్రభావితం చేశాడు .ఓట్టోమాన్ దాడి తర్వాత రచయితలూ చాలామంది ఇతరదేశాలకుపారిపోయారు .ఈకాలపు రచయితలలలో కాన్స్టా౦టిన్  కోస్టే నెట్స్-1380,గ్రెగరీ స్లామ్బ్లాంక్ -1365-1420 ముఖ్యులు .మధ్యయుగ సాహిత్యం మతరచనల కే ప్రాధాన్యం .

  ఓట్టోమాన్ యుగం -1396లో రెండవ బల్గేరియన్ సామ్రాజ్య౦ అంతరించాక బల్గేరియన్ సాహిత్య సంస్కృతులకు పెద్ద విఘాతమే కలిగింది .17,18శతాబ్దాలలో పైవారి ఆదేశాను సారమే రచనలు చెయ్యాల్సివచ్చింది .కాని సాహిత్య సంప్రదాయం కొనసాగింది .17వ శతాబ్దిలో కేధలిక్కుల ప్రాభవం పెరిగి బల్గేరియన్ ,చర్చి స్లోవానిక్ ,సేర్బో-క్రోషియన్ అనే మిశ్రమభాషలో రచనలువచ్చాయి ఈ భాషను ‘’ఇల్లిరిక్ ‘’అన్నారు  .ఇందులో వచ్చిన మొదటిపుస్తకం ‘’అబాగర్ ‘’1651లో రోమ్ లో ఫిలిప్ ట్రాన్సిలోవ్ అనే బిషప్ ముద్రించాడు  .ఇల్లిరిక్ ఉద్యమం సౌత్ స్లావిక్ ఐక్యతకు భంగం కలిగించి ,18,19శతాబ్దుల బల్గేరియన్ సాహిత్యాన్ని దెబ్బతీసింది .1741లో స్టెమ్మటో గ్రాఫియా అనే మొదటి ఆధునిక బల్గేరియన్ కవిత్వం ను హిస్టోఫర్ జేఫరోవిచ్ రాశాడు.  ఇది నాలుగు పాదాల పద్యాల కావ్యం .

  ఐరోపా రినైసేన్స్ నుంచి వేరుపడి బల్గేరియన్ సాహిత్యం జానపద సాహిత్యానికి ప్రాముఖ్యమిచ్చింది .అద్భుత కథాజాలం సృష్టి౦పబడింది .పేసియస్ ఆఫ్ హిఫెందార్ ,ఇస్టో  రియా స్లావనోబో ల్గార్కస్యచరిత్రరచనలు చేశారు .సోఫ్రోనియస్’’లైఫ్ అండ్ సఫరింగ్స్ ఆఫ్ సోఫ్రోనియస్ ‘’రాశాడు .1840-75మధ్య విప్లవాత్మక టర్కీ వ్యతిరేక సాహిత్య సృజన జరిగింది .ఇందులో వాసిల్ డ్రుమేవ్,రేకోజింజిఫోక్,దొబ్రి చింతులోవ్ మొదలైనవారున్నారు .విప్లవీరుడైనకవి హ్రిస్టో బొటేవ్-1848-1876 19వ శాతాబ్దిలోకూడా రచనలు చేస్తూ బల్గేరియన్ అత్యంత ప్రతిభాశాలి ఐనకవిగా గుర్తి౦పు పొందాడు .కొద్దిగారాసినా పవర్ ఫుల్ గా భావోద్వేగ సందేశంతో రాశాడు .లుబెన్ కరవేలోక్ ,గోర్గి సావా రక్సోస్కి లుకూడా విప్లవకవులే .గోర్గి రాసిన ‘’గోర్స్కి పాత్నిక్ ‘’అంటే అడవిలో యాత్రికుడు ‘’క్రిమియన్ యుద్ధకాలం లో -1853-56టర్కిష్ సైన్యానికి దొరకకుండా కోటేల్ నగరంలో ఉండి రాసింది .దీనినే మొట్టమొదటి బల్గేరియన్ కవితా సంపుటిగా భావిస్తారు .ఇది 1857లో మాత్రమె పబ్లిష్ అయింది .

  రష్యా –టర్కి యుద్ధం తర్వాత బల్గేరియాకు పాక్షిక స్వాతంత్ర్యం వచ్చింది .ఇవాన్ వాన్జోవ్ ను మొదటి సాహితీ వేత్త అంటారు .1893లో ఇతనురాసిన ‘’అండర్ దియోక్’’అంటే కాడి కింద క్లాసిక్ రచనగా గుర్తి౦పు పొందింది .ఒట్టోవాన్ ల క్రూరత్వం అణచివేత ఇందులో ఇతివృత్తం .ఇది 30కి పైగా భాషలలోకి అనువాదం పొందింది .నేమిల్లి నేద్రగి ,చిచోవ్జి అనే చిన్ననవలలు, చాలా చిన్నకథలూ రాశాడు ‘’ఎపోపి ఆఫ్ది ఫర్గాట్టెన్’’ అనే 12ఓడ్స్ ల కవితా సంకలనం బల్గేరియన్ చారిత్రాత్మక వీరులకు అంకితం చేశారు .

   ఆధునికకాలం లో ప్లేంచో స్లావెంకోవ్ అనే ప్రముఖ రినైసేన్స్ కవికొడుకు పెట్కో స్లావెంకోవ్ బాగా ప్రసిద్ధకవి .యూరోపియన్ ఫిలసాఫికల్ మెటాఫిలసాఫికల్ భావాలను బల్గేరియన్ కవిత్వం లో చొప్పించాడు .ఇతని డ్రీం ఆఫ్ హాపినెస్ మంచిపపేరుపొందింది .కవులచరిత్రను ‘’’’ఆన్ దిఐలాండ్ ఆఫ్ ది బ్లిస్ఫుల్ ‘’గారాశాడు .ఇతని సాంగ్ ఆఫ్ బ్లడ్ అనే అసంపూర్తికావ్యం టర్కులతో పోరాట గాథ.వచనరచనలో అలెకో కాన్ స్టాంటి నోవ్ హాస్యాత్మక యాత్రాసాహిత్యం –‘’గో బాన్యో  అంటే చికాగో కు రాశాడు .పెట్కో  టేడరోవ్ క్రాస్త్యోకాస్టేవ్,పెయోఎవరోవ్ లు ‘’మోడర్నిస్ట్ సర్కిల్ ‘’ఏర్పరచారు .మిసై అంటే ఆలోచన మొదలైనవి ప్రచురించారు .పెయో యవ రోవ్ సింబలిస్ట్ కవి .గోప్పప్రభావంచూపాడు కవిత్వం తో.

  రెండు ప్రపంచ యుద్దాలమధ్య నికోలా కవి మోటార్ సాంగ్స్ కవితా సంపుటి ప్రచురిస్తే ,ఎలిన్ పెలిన్, యోర్డాన్ యువకోవ్  చాలా చిన్నకథలు, నవలలు రాశారు .ఇవి వాస్తవికతకు దగ్గర గాఉంటాయి. గ్రామీణ జీవన విషయాలే ఎక్కువ .ఫాని పోపోవా ముటాఫోవా శిఖరాగ్ర౦ చేరిన రచయిత్రి .1944తర్వాత రచయితలపై కమ్యూనిస్ట్ పార్టీ పెత్తనం వచ్చింది .సోషలిస్ట్ రియలిజం వచ్చింది .డిమిటార్ డిర్మోవ్ రాసిన ప్రసిద్ధ ‘’టొబాకో’’నవలను కమ్యూనిస్ట్ భావాలతోమారిస్తే  మారిస్తే సినిమా తీశారు .క్రైం ఫిక్షన్ ,సైన్స్ ఫిక్షన్ చలాతక్కువే .సర్రియలిజం వంటివీ వచ్చాయి .1989లో’’ఈస్ట్రన్ బ్లాక్ ‘’కొలాప్స్ అయ్యాక ప్రైవేట్ పబ్లికేషన్స్ ,సాహిత్య అవార్డ్ లు ఊపు అందుకొన్నా స్థాయి గలరచనలు ,జాతీయత ఉన్న కవిత్వం రాలేదు .చారిత్రకదృక్పధం దూరమైంది .పాతతరం రచయితలు పావ్లోవ్, హ్రిస్టోవ్, ఎడ్విన్ సుగారేవ్ వంటివారు ఇంకా ప్రాభవం లో ఉన్నారు  .

బల్గేరియన్ రచయితలో అయిదుగురు ప్రముఖులు –కవిత్వం లో –ఇవాన్ హ్రిస్టోవ్ ,డిమిటర్ కేనెరోవ్ లు ,  ఫిక్షన్ లో గోర్గి టేనోవ్,కన్సేర్టో ఫర్ సెంటెన్స్ –ఏమిలియా డోర్నోవా ,ఫిజిక్స్ ఆఫ్ సారో-గోర్గి గోస్పెరినోవ్.

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-5-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.