ప్రపంచ దేశాలసారస్వతం 68-ఎస్టోనియా దేశ సాహిత్యం

ప్రపంచ దేశాలసారస్వతం

68-ఎస్టోనియా దేశ సాహిత్యం

ఎస్టోనియా దేశం ఉత్తర యూరప్ లో బాల్టిక్ సముద్రం ,గల్ఫ్ ఆఫ్ ఫిన్ లాండ్ దగ్గర 1500 దీవులతో ఉన్నది .ప్రాచీన అరణ్యాలు ,ఎన్నో సరస్సులతో ఆకర్షణీయం .రాజధాని టాల్లిన్.కరెన్సీ-యూరో .జనాభా 13లక్షలు .

   ఎస్టోనియా దేశ సాహిత్యాన్ని ఎస్టోనియన్ సాహిత్యం అంటారు .13వ శతాబ్దినుంచి 1918వరకు జర్మని స్వీడెన్ ,రష్యా దేశాలతో ఉత్తర క్రూసేడ్ యుద్దాలతర్వాత మాత్రమె సాహిత్యం వర్ధిల్లింది .13వ శతాబ్దపు క్రానికల్స్ లో దేశం పేరు వాక్యాలముక్కలు కనిపించాయి .మొదటి రాతపుస్తకం వాన్రాడ్ ,కోయిల్ లు లూధరన్ కేటకిజం కు1535లో  జర్మన్ –ఎస్టోనియన్ భాషాను వాదం .ప్రీస్ట్ లకోసం ఎస్టోనియన్ గ్రామర్  జర్మన్ భాషలో1637లో  ప్రింట్ అయింది .1686లో న్యు టెస్టమెంట్ దక్షిణ ఎస్టోనియన్ భాషలోకి అనువాదమైంది .అంటన్  టోర్ హెల్లి రెండుమా౦డలికాలను కలిపి ఎస్టోనియన్ భాషగా మార్చాక సాహిత్యాభి వృద్ధి వేగంగా జరిగింది .

  మొదట్లో సిలబిక్ క్వాంటిటి తో జానపద గీతాలు వచ్చాయి .ఈకాలంలో జాతీయ ఎపిక్ ‘’కేలివిపోయేగ్’’అంటే కలేవ్ కుమారులు ను ఫెడ్రిక్ రీన్ హోల్డ్ క్రెజువాల్డ్-1803-1882 రాశాడు .గుస్టావ్ సూట్ రాసిన బాలడ్’’లాప్సే సుండ్ ‘’అంటే శిశు జననం ,విలెం గ్రీన్ హాల్-రిడాలా -1885-1942 కవిత టూమస్ జా మైఅంటే టూమాస్ మరియు మాయా ,ఆగస్ట్ అన్నిస్ట్ -1899-1972 రాసిన మూడు కవితలు వచ్చాయి .20వ శతాబ్ది చివరిభాగం లో జానపదం కదను తొక్కింది .వేల్జో టార్మిస్ ఇందులో ప్రసిద్ధుడు .

  19,20శతాబ్దాలలో జుహాన్ లివ్ కవి-1864-1913ఒకతరాన్ని ప్రభావితం చేశాడు .ఇతని సమకాలికుడు ఎడ్వర్డ్ విల్డే-1865-1930 వచనరచనలో రియలిస్టిక్ మార్గగామి  .1905లో ‘’నూర్ ఎస్టి’’అంటే య౦గ్ ఎస్టోనియా ఏర్పడి గుస్టావ్ సూట్స్ ,విల్లెం గ్రంధాల్ రిడాలా, భాషా  సంస్కర్త ,జోహాన్నెస్ ఆవిస్ కలిసి సాహిత్యానికి కొత్త దిశా నిర్దేశం చేసి గొప్పరచనలు చేసి యువతకు మార్గదర్శనం చేశారు .వీరిరచనలకు ఇప్పటికీ క్రేజ్ ఉంది .జోన్ ఓక్స్ ,ఆస్కార్ లట్స్లూ గుర్తించదగిన రచయితలే .ఎర్నెస్ట్ ఎన్నో 1875-1934 రాసిన కవిత్వం బాగా ప్రాచుర్యం పొందింది .1917లో ‘’సియురు ‘’ఉద్యమం వచ్చి ,ఆగస్ట్ గైలిట్ ,ఫ్రెడరిక్ టుగ్లాస్,జొహన్నెస్ సేమ్పార్ ,ఆర్టూర్ ఎడిసన్ ,ఆగస్ట్ అలీ ,హెన్రిక్ సనాపు ,పీట్ ఆరెన్ ,అట్టో కృస్టేన్,మేరీ అండర్ లు సియర్రు కవులుగా ప్రసిద్ధమయ్యారు .ఎస్టోనియన్ లిటరేచర్ అనే మేగజైన్ కూడా1906లో  వచ్చింది .1922లో ‘’లూమింగ్ ‘’అంటే క్రియేషన్ అనే సాహిత్యపత్రిక వచ్చి  గొప్ప సేవ చేసింది

  రెండు ప్రపంచయుద్దాల మధ్య వచనరచన వచ్చి రియలిజం ను బుజాన వేసుకొన్నది .ఆ౦ టన్ హాన్సెన్ టమసరే 5భాగాల ఎపిక్ నవల –ట్రూత్ అండ్ జస్టిస్ రాశాడు .ఇదే ఈభాషలో అత్యుత్తమ రచనగా భావిస్తారు.ఆగస్ట్ మాలిక్ ,కార్ల్ రిస్టివికి,ఆగస్స్ట్ గల్లిట్ లు సిర్రు గ్రూప్ లో మర్చిపోలేని రొమాంటిక్ రచయితలు .ఆన్ట్స్ ఒరాస్ కవి ,రచయితా కూడా .కవిత్వ గ్రూపు ఏర్పడి చిరస్మరణీయ రచనలు చేశారు .యుద్ధానంతరం రచయితలు  ఇతర దేశాలకు బలవంతంగా పంపబడ్డారు .1945’’లో ‘’ఎస్టేనియన్ రైటర్స్ యూనియన్ ఇన్ ఎక్సైల్ ‘’స్టాక్ హోమ్ లో ఏర్పడి ,1950  బెన్రాడ్ కాన్గ్రో కల్చరల్ మేగజైన్ ‘’టుల్ముల్డ్ ‘’ ఏర్పరచి పుస్తక ప్రచురణ చేసి .ప్రవాస రచయితలకు అండగా నిలిచాడు .ఇల్మార్ లాబెన్ అనే సర్రియలిస్టిక్ కవి -1921-2000ఇప్పుడున్న మోడర్నిస్ట్ కవి .కన్జర్వేటివ్ రైటర్ కార్ల్ రిస్టికివి’’దినైట్ ఆఫ్ ది సోల్స్ ‘’నవలరాశాడు .అర్వేడ్ విరాల్డే-సెవెన్  డేస్ ఆఫ్  ట్రయల్ రాశాడు .ఇమార్ జాక్స్ ఆధునిక  టెక్నిక్ లతో  లతో నవలలు రాశాడు

  21వ శతాబ్దం ఎస్టేనియన్ సాహిత్యానికి మంచికాలం .నూతనోత్సాహంతో కవులు జుర్జెన్ రుసేట్టి ,ఇవార్ స్లిడ్ ,విమ్బెర్గ్ ,క్రిస్టినా ఎహిన్ మొ దలైన  రచయితలు సృజనతో విజ్ఞానం తో  అంతర్జాతీయ అవగాహనతో సాహిత్య సృష్టి చేశారు .వీరిలో రుసేట్టి ‘’బీట్ లైక్ పెర్సనాలిటి.విమ్బెర్గ్ చైల్డ్ లైక్ భాష.శైలి తో  ‘’ ఎహిన్ పూర్తి సంప్రదాయబద్ధంగా వైవిధ్యంగా రాశారు .రీన్ రాడ్ రాసిన వచనరచనలు దేశ విదేశాలలో చాలా బహుమతులుపొందాయి .అతని ‘’రి కన్స్ట్రక్షన్ ‘’దిబ్రదర్ ,దిమాన్ హు స్పోక్ స్కేకిష్ ‘’చాలా ప్రసిద్ధాలు .ఇండ్రేక్  హర్గ్  ల సైన్స్ ఫిక్షన్ ఫాంటసి ,క్రైంమున్నగు ప్రక్రియల్లో మేటి .ఈయువ కెరటం రచన ‘’ఇండి పెండేన్స్ డే’’కొత్త జనరేషన్ కు స్పూర్తి .2008లో ‘’అవుట్ ఆఫ్ కంట్రోల్ ‘’నవలారచయిత బ్రెట్ ఎస్టేన్ ఎల్లిస్ ,పీటర్ హేల్మ్స్ రెండవనవల’’ సెప్టెంబర్ ‘’-2009 విమర్శక విశ్లేషకుల ప్రశంసలు పొందాయి .ఇలా ఎస్టేల్లన్ సాహిత్యం దినదిన ప్రవర్ధమానమౌతూనే ఉన్నది .

  సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-5-20-ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.