సుందర కాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం-29
తెల్లని వస్త్రాలు మెరుపుల సమూహం లాంటి పింగళ వర్ణం కల ఆ హనుమను చూసి మొదట భయపడిన సీత ,చాలా వినయంగా ప్రియవచనాలు పలుకుతూ అశోక పుష్ప కాంతి కలవాడై మేలిమి బంగారంలా ప్రకాశి౦చె కళ్ళతో ఉన్న హనుమను దర్శించింది .అతడి భయంకర వానర రూపం చూసి భయపడి ,చూడరానిదేదో చూశానే అనుకొన్నది .తెప్పరిల్లి రామ లక్ష్మణస్మరణ చేసి నెమ్మదిగా ఏడ్చింది .తానూ చూసింది కల అని భావించింది .మళ్ళీ మరోసారి కపి వరాఖ్యుని తేరి పారచూసి ,తెలివి తప్పినట్లు పడిపోయింది .మళ్ళీ తెప్పరిల్లి కోతి కలలో కనిపిస్తే అనిష్టం అ౦టారుపెద్దలు. తనవలన రామ సోదరులకు,తనతండ్రి కి ఆపత్తు ఏమీ రాలేదు కదా అనుకోని ,శుభం కలగాలని కోరుకొన్నది .అంటే ఆపత్తు తనకోచ్చినా పరవాలేదు తనవారికి రాకూడదు అన్నదొడ్డ భావం సీతామాతది.
అసలు తనకు కల రావటం ఏమిటి ?నిద్ర పోయే వారికే కదా కలలు వచ్చేది. రామవిరహంతో తానెప్పుడూ నిద్రే పోలేదు కదా .తనకు కల రావటం అసంభవం తనరాముడినే ప్రతిక్షణం తలచుకొంటూ ,మనో నేత్రాలతో చూస్తూ తానె రాముడిని తలుస్తూ ఉంటె ,ఆయనననే స్మరిస్తున్నాను కదా అనుకొన్నది .-స్వప్నోహి నాయం నహి మే స్తి నిద్రా –శోకేన దుఖేన చ పీడితాయాః-సుఖం హాయ్ మే నాస్తి యతోస్మి హీనా –తేనే౦దు పూర్ణ ప్రతిమాననేన ‘’
ఈ రామనామం పలికేది తన అభిలాష మాత్రమె అను కొన్నది .మళ్ళీ ఆలోచించి అదీ కాదు అనుకోని తనమనసుకు రూపం లేదుకదా అని భావించి ,పైన చెట్టు ఆకులమధ్య కూర్చున్న వానరం తనకి స్పష్టంగా కనిపిస్తోంది ,అతనిమాటలు వినిపిస్తున్నాయి కదా అని ఊరడిల్లి౦ది
‘’రామేతి రామేతి సదివ బుద్ధ్యా –విచి౦త్య వాచాబృవతీ తమేవ –తస్యాను రూపాం చ కథా తమర్ధ –మేవం ప్రపశ్యామి తథా శృనోతి’’
‘’అహం హితస్యాద్య మనోభవేన –సంపీడితా తద్గత సర్వభావా –విచింతయంతీ సతతం తమేవ –తథైవ పశ్యామితథా శృణోమి’’
‘’మనో రథః స్యాదితిచింతయామి –తథాఫై బుధ్యా చ వితర్కయామి –కిం కారణం తస్య హి నాస్తి రూపం –సువ్యక్త రూపశ్చ వదత్యయం మాం’’
,ఇక చేయాల్సింది అంతా దేవతలకే అప్పచెప్పాలి. తాను నిమిత్తమాత్రురాలను అనే ఎరుక కలిగి బ్రహ్మ దేవేంద్ర అగ్ని దేవతలకు నమస్కరించి ఆ వానరుడు పలికింది అంతా యదార్ధమవుగాక ,కల కాకుండు గాక అని గాఢంగా మనసులో భావించింది సీతాదేవి .-‘’నమోస్తు వాచాస్పతయే స వజ్రిణే-స్వయంభువే చైవ హుతాశనాయచ –అనేన చోక్తం యదిదం మమాగ్రతో –వనౌకసా తచ్చ తథాస్తు నాన్యథా’’
ఇది 14శ్లోకాల 32వ సర్గ .
ఇందులో తనకు కలలు రాకపోవటానికి చక్కని కారణాలు పేర్కొనటం విశేషం . ‘’ఈ రామ ‘’మనసంతా ‘’ఆరామ ‘’మయమే ఐతే ,ఆయనుస్మరించని క్షణమే లేకపోతె ఆమె ఉచ్చ్వాస నిస్వాసాలలో రామ శబ్దమే వినిపిస్తుంటే ఇక రాముడు బయట ఎక్కడున్నాడు ?మనసులో స్థిరంగా కొలువై ఉన్నాడు .కానీ మనసులోని తనరామ రూపం భావి౦చటానికే ఉపయుక్తం. అసలురాముడు భౌతికంగా ఇక్కడికి రావాలి ఆమె దుఖానికి ఉపశమనం కల్గించి రావణ దర్ప వినాశనం చేయాలి అప్పుడే తనకూ లోకానికి శాంతి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-20-ఉయ్యూరు

