ప్రపంచ దేశాలసారస్వతం
85-వాటికన్ సిటి సాహిత్యం
వాటికన్ సిటి స్టేట్ ను రోమ్,ఇటలీలు పరివేష్టించి ఉంటాయి .రోమన్ కేధలిక్ చర్చి ప్రధానకేంద్రం .పోప్ నివాసస్థానం. ఆర్కిటెక్చర్ కు కేంద్రం .ప్రాచీన రోమన్ శిల్పాలకు నిలయం .కరెన్సీ –యూరో .జనాభా సుమారు 825.ప్రపంచంలోనే అతి చిన్న దేశం .ఇక్కడ ఎన్నికలు జరగవు వోటింగ్ హక్కు ఉండదు .ప్రపంచంలోనే అతి సంపన్న దేశం .జిడిపి -116,799డాలర్లు .ఏ ఇతర దేశం కంటే 20వేలడాలర్లు ఎక్కువ .ఆయిల్ రిజర్వ్ ఎక్కువ .గ్లోబల్ సప్ప్లై లో 13శాతం దీనిదే .అధికార భాష –ఇటాలియన్ .అన్ని భాషలూ అక్కడ మాట్లాడుతారు .
వాటికన్ సిటి సాహిత్యం వేరుగా ఉండదు ఉన్నదంతా కేధలిక్ సాహిత్యమే .అక్కడి కొన్ని పుస్తకాలు –ఏంజెల్స్ అండ్ డెమన్స్ –రాబర్ట్ లాంగ్డన్,కాంక్లేవ్-కిన్డిల్ ఎడిషన్ ,గాడ్స్ స్పై-ఫాదర్ ఆంటోని ఫ్లోవర్ ,అబ్జల్యూట్ మొనార్క్స్ –ఎ హిస్టరీ ఆఫ్ ది పాపసి ,మైకేలాన్జేలో అండ్ ది పోప్స్ సీలింగ్ ,ది డావిన్సి కోడ్-డాన్ బ్రౌన్ ,వెన్ ఇన్ రోమ్-రాబర్ట్ హచిన్సన్,ది థాట్ ఆఫ్ పాప్ బెనెడిక్ట్-16-ఎయిడన్ నికోలస్
ఇంతకంటే అక్కడ సాహిత్యం లభించలేదు .
విన్నపం –ప్రపంచ దేశాల సారస్వతం పేరిట నేను రాసిన ఈ 85వ దేశం వాటికన్ సిటి తో యూరప్ లోని బ్రిటన్ సాహిత్యం తప్ప అన్ని దేశాల సాహిత్యం రాశాను .
ఆసియా దేశాల సాహిత్యం కూడా కొంతరాశాను .మిగిలిన ఆసియా దేశాల సాహిత్యం లోకి నాతోపాటు ప్రయాణం చేయమని ఆహ్వానిస్తున్నాను .
86-అజర్ బైజాన్ దేశ సాహిత్యం
అజర్ బైజాన్ రిపబ్లిక్ దేశం కాస్పియన్ సముద్రం ,కాకాస్ పర్వతాల దగ్గర ఉన్న ఆసియా దేశం .రాజధాని –బకు.మధ్యయుగ గోడల ఇన్నర్ సిటి.15వ శతాబ్ది రాయల్ రిట్రీట్.శతాబ్దాల నాటి పురాతన రాతి మైడెన్ టవర్ ఆకర్షణ .యానార్ దాగ్అంటే బర్నింగ్ మౌంటేన్ గొప్ప టూరిస్ట్ స్పాట్ . రెన్సీ –అజర్ బైజాన్ మనత్.అధికార భాష –అజర్ బైజాన్ .ఇంగ్లీష్ మాట్లాడరు.జనాభా ఒక కోటి.85శాతం షియా ,మిగిలిన వారు సున్ని మతస్తులు
అజర్ బైజాన్ సాహిత్యం మొదట్లోఅంటే 14వ శతాబ్ది దాకా అనటోనియన్ టర్క్ ల సాహిత్యమే –పెర్సో –అరెబిక్ స్క్రిప్ట్ లో రాసిందే .14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం వరకు ఈదేశ రచయితలు ఆ సాహిత్యాన్ని అభి వృద్ధి చేశారు.17వ శతాబ్దిలో కవిత్వం ప్రాముఖ్యత పొందింది .19వ శతాబ్దిచివరలో వార్తాపత్రిక వచ్చింది .ఇరాన్ ను రెజా షా పాలించే టప్పుడు ఈ దేశ సాహిత్యాన్ని నిషేధించాడు .స్టాలిన్ నియంత పాలన లో ఈ దేశ ఆల్ఫబేట్ ను బలవంతంగా క్రిల్లిక్ ఆల్ఫబేట్ లోకి మార్పించాడు .రిపబ్లిక్ అయ్యాక మళ్ళీ దేశీయ సాహిత్య వ్యాప్తి జరిగింది .
అజర్ బైజాన్ సాహిత్యం రెండు సంప్రదాయాలుగా మారింది .జానపద సాహిత్యమే మొదట్లో పరవళ్ళు తొక్కింది .దీనిలో పాట ప్రాణం పోసుకోన్నది .జానపద సంగీతమూ ఇదే ధోరణిలో ఉన్నది .రెండవ సంప్రదాయం లో పర్షియన్ ,అరెబిక్ సాహిత్య ప్రభావం పడి 11వ శతాబ్దినుంచి ఇప్పటిదాకాకొనసాగుతోంది .అల్లుద్దీన్ కె కుబాద్ -1 రాజాస్తానకవి డేహ్హాని ఉన్నత పెర్షియన్ సాహిత్యం సృష్టించాడు .16వ శతాబ్దిలో సఫావిద్ సామ్రాజ్యం ఏర్పడ్డాక కూడా ఇదే విధానం నడిచింది .తర్వాత అజర్ బైజాన్ ఛందస్సు ‘’అరుజ్ ‘’ను ఉపయోగించుకొని కవిత్వం రాశారు .పర్షియన్ అరెబిక్ పదాలను అజర్ బైజాన్ భాషలోకి ఎరువు తెచ్చుకొని భాషాభి వృద్ధి చేసుకొన్నారు .దీన్ని ‘’దివాన్ సాహిత్యం ‘’అన్నారు .
అజర్ బైజాన్ భాషలో ఎపిక్స్ – ఆల్ఫమికష్, ‘’బుక్ ఆఫ్ డెడే కోర్కట్’’లు .రెండవ దానిలో రూసేన్ అలీ సాహస యాత్రలు వర్ణితం.సఫావిద్ లేక దివాన్ కవిత్వం లో సింబాలిక్ కళ ఎక్కువ .నైటింగేల్, రోజ్ మొదలైనవాటిని సింబాలిక్ గా ప్రయోగించారు .ఫజూలి కవి రెండుభాషల్లోనూ గొప్పకవిత్వం రాశాడు.బాకి ఆలంకారిక కవిత్వం లో దిట్ట .నెఫీ కవి పానేగ్రిక్ లో నిష్ణాతుడు .నయాబి సాంఘిక ఇతివృత్త కవిత్వం చెప్పాడు .టులిప్యుగ విప్లవకవి సాధారణ విషయాలకు కవితా రూపం ఇచ్చాడు .సేయే గాలిబ్ సూఫీ కవి గా సుప్రసిద్ధుడు .
దివాన్ గజల్ సంప్రదాయాన్ని అజర్ బైజాన్ లో ది౦పినవాడు నేసిమి .ఆధునిక యుగం లో నారిమన్ హసన్ జేడె ,ఖలిల్ రాజా ,సఫైర్ నవ్రుజ్ ,అమ్రేలి మొదలైన వారున్నారు .అనరా వచనానికి ప్రాముఖ్యమిచ్చాడు సులేమాన్లి ,రాసుల జేడె వంటివారు వచనంలోనే రాశారు .దిధర్టీంత్ అపోజిల్ నవలను హేన్సిన్ హుసేన్ బెయిల్ రాశాడు .షా అబ్బాస్ ,నాదిర్ షా చారిత్రాత్మక నవలలూ రాశాడు .దేశం స్వాతంత్ర్యం పొందాక ‘’కారబాక్ మౌ౦టెన్స్ కాల్ అజ్ ‘’,ను కారాబాఖ్ రాస్తే ,అజర్ బైజాన్ డైరీ రాశాడు ఎల్బృస్ ఒజేరేవ్ . యుద్ధ ఉన్మాదం పై చాలారచనలు వచ్చాయి .2009లో ఆలి అండ్ నినో పబ్లిషింగ్ హౌస్ ఏర్పడి యువ రచయితలకు ఆసరాగా నిలిచింది .గజాక్ లో లిటరేచర్ మ్యూజియం కూడా ఏర్పడింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-5-20-ఉయ్యూరు
