బక దాల్భ్యుడు -3
కేశి దాల్భ్యుని విషయం లో ఇద్దరు యజ మానుల మధ్య వైరం ,లేక అధ్వర్యుల మధ్య స్పర్ధ సామాన్యంగా కనిపిస్తుంది .ఈ కథలలో కేశి ప్రతినాయకుడుగా లేక ,వేరొకరు ఆయనకు ప్రత్యర్ధిగా కనిపిస్తారు .వారిపేర్లు కూడా మనకు తెలుస్తాయి .కొన్ని చోట్ల కేశి దాల్భ్యుని వృత్తాంతాలు ముఖ్యంగా కర్మకాండ ముఖ్యులతో అంటే వ్రాత్యలేక సత్ర బృందాలతో కనిపిస్తాయి .
మైత్రేయని సంహిత లో కేశి దాల్భ్యుని కి అతని ప్రత్యర్దిఖాన్డిక ఔధారి కిమధ్య జరిగిన విషయం ఉన్నది-1.4.12 .. ఈ ఇద్దర్నియజమానులుగా పేర్కొన్నది .ఒక రోజు గంధర్వులు అప్సరసలు కేశి దాల్భ్యుని యజ్ఞం చేసేవాడు అతని ప్రత్యర్ధి స్థాయి పొందటం ఎలాగో తెలుసా అని అడిగారు .అది సర్వం తనకు తెలుసు అన్నాడు .అయినా వారికి సంతృప్తి కలగలేదు కారణం ఆ సత్తా తమకు మాత్రమె ఉన్నదికనుక .చివరికి వారు ఒకయాగం చేసి కేశికి సమర్పించగా ఖా౦డికుడిని ఓడించాడు .ఈ విషయంలో కేసి ప్రత్యర్ధిని ఓడించినా ,గ౦ధర్వ అప్సరసలకున్న విజ్ఞానం ముందు ఓడిపోయాడు .
మరో చోట అంటే బోధాయన శ్రౌత సూత్రం -17.54లో కూడా వీరిద్దరి మధ్య వైరంకనిపిస్తుంది .అది అధర్వవేద విషయం లో .అభిచార అనే కేశి యజ్ఞం లో అంటే భూత ఆవాహన తో కేశి ఖాండికుని మంత్రం ముగ్దుడిని చేశాడు –‘’కేశి హా యత్ర ఖాన్డికం అభిచాచర ‘’.శతపథ బ్రాహ్మణం ఈ ప్రత్యర్దులమధ్య మరో వేరే కథ చెప్పింది 11.8.4.ఇక్కడ కేశి ఒక సత్రయాగం లో గ్రహపతిగా చెప్పింది.సత్రయాగాలు కర్మకాండ తెల్సిన రెండు బృందాల మధ్య జరుగుతాయి కానీ ఇక్కడ కేశి ని క్షత్రియుడుగా పరిచయం చేశారు .కేశి బృందం యొక్క సామ్రాజ గోవు ను పెద్దపులి చంపితే దానికి వారు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చింది .ఇది తెలిసినవాడు ప్రత్యర్ధి బృంద నాయకుడు ఖాన్దిక ఔద్భారి ఒక్కడు మాత్రమె .కేశి ఆయన్నుకలిసి ప్రాయశ్చిత్తం జరిపించమని కోరాడు .ఖాన్డికుడు ధర్మ సంకటం లో పడి పోయాడు .ఆ రహస్యం చెబితే కేశి బృందం ఈ లోక విజేత అవుతాడు తాను మరోలోక విజేత ఔతాడు .చెప్పకపోయినా అంతే.చివరికి ఆ ప్రపంచమే కావాలనుకొని ఖాన్డికుడు కేశి కి ప్రాయశ్చిత్త కార్యం మంత్రాలతో నిర్వహించాడు .11.8.4.6.దీనితో కేశి తనయాగాన్ని కాపాడుకోగలిగాడు.ఈకథ ద్వారా కేశినులు ఇంకా పుట్టాలి అని తెలుస్తోంది –‘’కేశినిర్ ఏవం అప్యేతర్హి ప్రజా జాయంతే’’
వీరిద్దరి వైరం జైమినేయ బ్రాహ్మణం లో రెండు సార్లు వస్తుంది .కేశి దాల్భ్య లేక దార్భ్య మరియు ఖండిక ఔద్భారి లమధ్య పాంచాల భూమి యాజమాన్యం పై తగాదా వచ్చింది -2.122మరియు 2.279.-‘’పాంచాలేషు పస్ప్రధాతే’’.2.279-,280ప్రకారం వీరిద్దరిలో ఖాన్దికుడు బలీయుడు ,శక్తివంతుడు –‘’సహా ఖాన్డికా కేశినం అభి బభూవ ‘’అయినా కేశి వెంటనే మేనమామ కౌరవ ఉచ్చ్రైశ్రవసు ఆశ్రయం పొందాడు.ఇక్కడా వీరిద్దరికీ ఈలోకం పరలోకం పై అధికారం పైనే స్పర్ధ .మేనల్లుడిని దేనిపై పెత్తనం కావాలని అడిగితె ,ఈలోకంపైనే అని చెప్పాడు కేశి .కనుక మూడు రోజుల అంతర్వసు అనే సోమయాగాన్ని మేనల్లుడు కేశితో చేయించి శక్తిమాన్ ను చేసి ఖా౦డికుని బయటికి పంపించేశాడు .
ఇలాంటిదే మరో స్పర్ధ వీరిద్దరి మధ్య జరిగినట్లు జైమినేయ బ్రాహ్మణం 2.122-124తెలిపింది .ఖాన్దికుడు తాను ‘’సద్యాహ్క్రి’’నిర్వహించబోతున్నట్లు ప్రకటించాడు -‘’సహా ఖాన్డికః కేశినం అభి ప్రజిఘాయ-సద్యహ్క్రియయా వై స్యో యక్షతా ఇతి ‘’.కేసి కి ఈసారి బ్రాహ్మణ బృందం సలహా ఇవ్వగా వెంటనే ‘’పరిక్రీ ‘’అనే సోమయాగం చేశాడు .దీనితో మళ్ళీ కేశి విజయం సాధించి ఖాన్డికునికి పుట్టగతులు లేకుండా చేశాడు .కేశి దాల్భ్యుని పక్షాననిలబడిన నలుగురు బ్రాహ్మణులు- కేశి సత్యకామి ,ఆహీనస్ ఆశ్వత్తి,గాన్గినా రహక్షితా,లుసాకపి ఖార్గలి.
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-20-ఉయ్యూరు

