Monthly Archives: August 2020

మనకు తెలియని మహాయోగులు—5

మనకు తెలియని మహాయోగులు—5 9-దాస సాహిత్య మార్గదర్శి మహాయోగి –చిరుమామిళ్ళ సుబ్బదాసు -1802-1882 చిరుమామిళ్ళ సుబ్బదాసు అన౦తపురం జిల్లా ధర్మవరం లో  చిరు మామిళ్ళనరసయ్య ,తిరుమలమ్మ అనే సదాచార కమ్మదంపతులకు 1802లో పుట్టాడు .అసలు పేరు సుబ్రహ్మణ్యం .వాడుకనామం సుబ్బయ్య .వీధిబడిలో చదువుతూ 8వ  ఏట నే కృష్ణ, దాశరథి ,నరసింహ శతక పద్యాలు భాగవత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రేపటినుంచే ”శ్రీలలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం 

రేపటినుంచే ”శ్రీలలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం సాహితీ బంధువులకు శుభకామనలు –రేపు సెప్టెంబర్ 1మంగళవారం ఉదయం 10గంటలనుంచే సరసభారతి ఫేస్ లో ‘’శ్రీ లలితా సహస్రనామస్తోత్ర వైభవం ‘’ప్రత్యక్ష ప్రసారం అవుతుంది .వీక్షించగలరు –మీ –గబ్బిట దుర్గాప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

భూమి లోపల ఉన్న మనకుతెలియని అనంత లోకాలు ,వేలాది సంవత్సరాల వయసున్న యోగులు

భూమి లోపల ఉన్న మనకుతెలియని అనంత లోకాలు ,వేలాది సంవత్సరాల వయసున్న యోగులు   ఆధారం –మా అమ్మాయి శ్రీమతి విలయలక్ష్మి అమెరికా నుంచిపంపిన  కుర్తాళం పీఠాదిపతి శ్రీ ప్రసాద రాయకులపతి వారి వీడియో –యుట్యూబ్ ‘’భూమిలో ఇప్పటికీ లోకాలున్నాయని ,పట్టణాలున్నాయని అనేకమంది నమ్ముతున్నారు ఇప్పటికీ .హిమాలయ సిద్దాయోగులు భూమిగుండా వెళ్లి ఆలోకాలను దర్శిస్తారని నమ్మకం … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియనిమహాయోగులు—47-రాజయోగిబ్రహ్మానంద తీర్థులు-1879-1918

మహారాష్ట్ర కొల్హాపూర్ దగ్గర బ్రాహ్మణాగ్రహారం లో దత్త ఉపాసకుడు  విష్ణుభట్టు అనే ఋక్ శాఖ పురోహితుడికి బ్రహ్మానంద తీర్ధులు 1879లో జన్మించాడు చిన్నప్పటి పేరు గణపతి .అయిదవఏట అక్షరాభ్యాసం చేసినది మొదలు ఆధ్యాత్మిక భావనతో తల్లితో పాటు దత్తస్మరణ చేస్తూ ,సద్గుణాలు అలవరచుకొన్నాడు .ఉపనయనం తర్వాత దగ్గరున్న నదీతీరం లో ఏకాంతం గా భగవధ్యానం చేసేవాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కీ శే బ్రహ్మశ్రీ . కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురు పూజోత్సవం

సాహితీ బంధువులకు శుభకామనలు – సరసభారతి 154వ కార్యక్రమంగా ఉపాధ్యాదినోత్సవం 5-9-20శనివారం నాడు సాయంత్రం 6-30గంటలకు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ కీ శే .కోట సూర్యనారాయణ ,కీ.శే.శ్రీమతి సీతమ్మ దంపతుల గార్ల గురుపూజోత్సవ కార్యక్రమం నిర్వహిస్తోంది . 1-       2020 మార్చి పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన పేద,ప్రతిభగల విద్యార్ధులకు శ్రీ మైనేని … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గుడివాడ సభ పత్రికా కధనం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గుడివాడ తెలుగు భాషా వికాస సమితి వారి గిడుగు రామమూర్తి గారి స్మారక పురస్కార ప్రదానం

గుడివాడ తెలుగు భాషా వికాస సమితి వారి గిడుగు రామమూర్తి గారి స్మారక పురస్కార ప్రదానం నేపధ్యం –  ఈ నెల 21 సోమవారం రాత్రి 9-30కి ఆంధ్రప్రదేశ రచయితలసంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ చలపాక ప్రకాష్ ఫోన్ చేసి ‘’సార్!మన సంఘ అధ్యక్షులు శ్రీ సోమేపల్లి వెంకటసుబ్బయ్య గారు నాకు ఫోన్ చేసి ,గుడివాడలో … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—3

మనకు తెలియని మహాయోగులు—3 5-గోదావరి నదిపై నడచిన గొంగడి స్వామి అనే గోవింద స్వామి -1855-1927 కేరళలోని మలబారు ప్రాంతంలో ఆలపాడ గ్రామం లో 13-1-1885 రాక్షస నామ సంవత్సర పుష్యబహుళ దశమి శనివారం నారాయణస్వామి బ్రాహ్మణ వంశం లో జన్మించాడు .పసితనం నుంచే ‘’గోవింద రా౦ రాం  గోపాలహరి హరి’’అంటూ నిరంతరం పాడుకొంటూ ఉండటం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గిడుకు పురస్కారం రేపు గిడుగు రామమూర్తి స్మారక పురస్కారం అందజేస్తున్న గుడివాడ తెలుగు భాషా వికాస సమితి

వ్యావహారిక భాషోద్యమ మార్గదర్శి శ్రీ గిడుగు వెంకట రామమూర్తిగారి 158వ జయంతి 29-8-20 శనివారం ఉదయం 10గంటలకు  .గుడివాడలో, గుడివాడ తెలుగు భాషా వికాస సమితి వారు  నాకు శ్రీ గిడుగు రామమూర్తి గారి స్మారక సాహితీ పురస్కారం అంద జేస్తున్నందున ,ఆ సంస్థ అధ్యక్షులు శ్రీ ప్రసాద్ గారికీ , ,కార్యవర్గానికి  ,,ఈ విషయం … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు—2

మనకు తెలియని మహాయోగులు—2 3-మహా విష్ణు సాక్షాత్కారం పొందిన జ్ఞానయోగి –రామయోగి -1895-1962  నెల్లూరుజిల్లా వేదాద్రి దగ్గర మోపూరులో చేవూరి రావమ్మ ,పిచ్చి రెడ్డి దంపతులకు 29-7-1895 మన్మథ నామసంవత్సర శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం రామి రెడ్డి జన్మించాడు .పసితనం లోనే తండ్రి చనిపోతే మేనమామ దగ్గర అన్నారెడ్డి పాలెం లో పెరిగి చదువు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం        203-అమెరికాదేశ సాహిత్యం -18

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -18 20వ శతాబ్ది సాహిత్యం -10 01914నుంచి 1945వరకు నవల, చిన్న కధ-రియలిజం,మెటా ఫిక్షన్ -2 ధామస్ పించాన్అబ్సర్డిస్ట్ విధానం లో రాసిన అమెరికన్ రచయితలలో ముఖ్యుడు .అతడి నవలు కధలు చారిత్రిక విషయాలు ,కామిక్ ఫాంటసి ,కౌంటర్ కల్చర్ ల కలగలుపు తో రాసినవి .మృత్యుభయం ఆధారంగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మనకు తెలియని మహాయోగులు 1

మనకు తెలియని మహాయోగులు- 1-ఖండయోగి మహామౌని -ఆదోని తిక్క లక్ష్మమ్మ -1815-1933 ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోని లో తిక్కలక్ష్మమ్మ మహా సమాధి తెలుగు కర్నాటక ప్రజలకు తీర్ధ యాత్రాస్థలం .ఆదోని దగ్గర మూసానపల్లె లో మాదిగ మంగమ్మ ,బండెప్పా దంపతులకు 1815లో జన్మించింది .బాల్యం నుంచే అన్నపానాదులు ఆటలు పై ఆసక్తిలేకుండా మౌనంగా ఉండేది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఫోన్ లో శ్రీ మైలవరపు రామ శేషుగారి సహృదయ స్పందన

ఫోన్ లో శ్రీ మైలవరపు రామ శేషుగారి సహృదయ స్పందన ఈ సాయంత్రం ఒక  అరగంట క్రితం గుంటూరు బ్రాడీ పేటనుంచి డా శ్రీమతి మైలవరపు లలితకుమారి భర్తగారు శ్రీ మైలవరపు రామ శేషుగారు ఫోన్ చేసి ఎంతో ఆత్మీయంగా పావుగంట సేపు మాట్లాడారు .వారికి పంపిన సరసభారతి శ్రీ శార్వరి ఉగాది ఆవిష్కరణ మూడు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

యోగి ఖాదర్షాబాబా

    యోగి ఖాదర్షాబాబా విజయనగరం జిల్లాలో వికారి సంవత్సర కార్తీక శుద్ధ చవితి బుధవారం హజరత్ ఖాజా  ఖాదర్షావలీ  బాబా పాదాలలో శుభాలక్షణాలైన శంఖు  చక్రాలతో జన్మించారు .వీరి పూర్వీకులు తిరుచినాపల్లి రాజవంశానికి చెందినవారు .అక్కడినుంచి విజయనగరం వచ్చి స్థిరపడ్డారు .కైలాసపతి శివుడే జన్మించాడని అందరూ భావించారు .బాల్యం లోనే సాదు సత్పురుషుల బోధలు విని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం                         203-అమెరికాదేశ సాహిత్యం -17

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -17 20వ శతాబ్ది సాహిత్యం -9 01914నుంచి 1945వరకు నవల, చిన్న కధ-రియలిజం,మెటా ఫిక్షన్ సాంస్కృతిక ప్రభావం కలిగించి ప్రపంచయుద్ధ టెక్నలాజికల్ హారర్ నుంచి మళ్లించిన ఇద్దరు రచయితలు  నార్మన్ ,మైలర్-ది నేకేడ్ అండ్ ది డెడ్-1948,ఇర్విన్ షా –ది యంగ్ లయన్స్ -1948 నవలలలు యుద్ధ సంబంధ … Continue reading

Posted in ప్రవచనం | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం )

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-24(చివరి భాగం ) మొహ౦జ దారో- హరప్పా-2  హరప్పా- లాహోర్ –ముల్తాన్ రైలు మార్గం లో ముల్తాన్ కు  ఈశాన్యంగా షాహీ వాల్-చించి వాట్మీరాల్ స్టేషన్ల మధ్య హరప్పా ఉన్నది .హరప్పా రోడ్ రైల్వే స్టేషన్ లో దిగి రెండు మైళ్ళ దూరం లో ఉన్న శిధిలాలను చూడాలి .ఇది పాకిస్తాన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సెప్టెంబర్ 1మంగళవారం నుంచి” శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవం ”ప్రత్యక్ష ప్రసారం

సాహితీ బంధువులకు శుభ కామనలు.గత నెలరోజులుగా సరసభారతి ఫేస్ బుక్ ద్వారా 1-అనంతకాలం లో నేనూ 2-భారతీయ విజ్ఞాన సర్వస్వం- భారతం 3-శ్రీ హనుమత్ కథానిది 4-శ్రీ ఆంజనేయస్వామి మహాత్మ్యం  ప్రత్యక్ష ప్రసారం వీక్షించినందుకు ధన్యవాదాలు .నిన్నటితో ఈ కార్యక్రమాలు పూర్తయ్యాయి .ఒక వారం విశ్రాంతి ఇచ్చాము . మళ్ళీ సెప్టెంబర్ 1 మంగళవారం భాద్రపద పౌర్ణమి … Continue reading

Posted in ఫేస్బుక్ | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-23

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-23 మొహ౦జ దారో- హరప్పా 1922లో మొహంజదారో హరప్పా ల త్రవ్వకాలను గురించిచదివిన రామచంద్ర వాటిని చూడాలని లాహోర్ నుంచి స్నేహితుడితో రైలులో రోహ్రీ లో దిగి అక్కడ సి౦ధు నదిపై ఉన్న రైలు వంతెన బెజవాడ కృష్ణ  రాజమండ్రి గోదారి రైలు వంతెనలకన్నా పెద్దదిగా ఉన్నా ,భయంకరంగా కనిపించింది హైదరాబాద్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-5 శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ కొందరు దివ్య పురుషుల ,నదీమతల్లుల దివ్యాత్మల దర్శన౦ . నిర్మల –ఒకసారి స్వామి గృహస్తాశ్రమం లో ఉండగా వాడీ నుండి ఇంటికి తిరిగి వస్తుంటే ఒక దివ్యలోక మహిళ కనిపించి,’’స్వామీ నాకు పేరు పెట్టకుండా ,ముందుకు వెళ్ళకండి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మచిలీ బందరు యోగి శ్రీ రామావదూత (శ్రీ రంగావధూత)

మచిలీ బందరు యోగి శ్రీ రామావదూత (శ్రీ రంగావధూత) మచిలీ పట్నం అనే బందరులో శ్రీ వామ గోత్రం లో సుబ్బయ్య గారు మహాపుణ్యుడు బుద్ధిమంతుడు .ఆయనకు 1870లో జూన్ నెల ఏకాదశి జయవారం నాడు రంగ అనే శిశువు జన్మించాడు .పుట్టుకతోనే భక్తి అలవడింది .సత్యాహింసలు శాంతి అహింసలు మహామతిత్వం వంటి సుగుణాలు అబ్బాయి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-22

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదా-22             లాహోర్  లావణ్యం లాహోర్ ను   సిటీ  ఆఫ్ గార్డెన్స్ అంటారు ఉద్యాన నగరం అన్నమాట .లక్నో ను సిటీ ఆఫ్ పార్క్స్ లఘు ఉద్యాననగరం అంటారు .లాహోర్ ప్రజలుకూడా  ఆ నగర  లావణ్యాన్ని కళ్ళకు రెప్పలా కాపాడుకొంటారు .అక్కడ లారెన్స్ గార్డెన్స్ విశాలమైనది . .మోఘలాయిలకాలం నాటి శివార్లలో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

22-8-20శనివారం మా ఇంట్లో శ్రీ వినాయక చవితిపూజ మనవడు చరణ్, మనవరాలు రమ్య లతో మేమిద్దరం

22-8-20శనివారం మా ఇంట్లో శ్రీ వినాయక చవితిపూజ మనవడు చరణ్, మనవరాలు రమ్య లతో మేమిద్దరం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-4

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-4 మహా జ్ఞానులతో శ్రీ వాసుదేవానంద సరస్వతి శ్రీ రాజరాజేశ్వర ,శ్రీ అక్కల్ కోట్ మహా రాజ్ వంటి మహాజ్ఞానులతో మనస్వామికి గొప్ప పరిచయమే ఉండేది .  శ్రీ రాజరాజేశ్వర శంకర స్వామి అప్పడు శ్రీ శృంగేరి పీతాదఠాపతులైన  శ్రీ రాజరాజేశ్వర శంకరాచార్య స్వామి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-3

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-3   దుష్ట శక్తులు – పిశాచ దెయ్యాలవంటి దుష్ట శక్తులు మానవ బాధలకు కారణాలౌతాయి .ఇవి తమబందువులను బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి .వాటికున్న అతీంద్రియ శక్తులతో  బాధలు కలిగిస్తాయి .వాటిని గుర్తించటం కష్టం .మహిమాన్విత మహిళలు పురుషులుమాత్రమే వాటిని గుర్తించి బాధపడే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం –లక్కవరం

శ్రీ వేణు గోపాల స్వామి దేవాలయం –లక్కవరం తూర్పు గోదావరి జిల్లా తాటిపాక సీమ అనబడే  రాజోలు మండలం లో లక్కవరం గ్రామం లో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .చుట్టూ ప్రాకారం ,మంచి ధ్వజస్తంభం ,వైభావాత్మక కళలతో అందంగా ఉన్న గర్భాలయం ,కళ్ళను ఆకర్షించే చిత్రాలు ఉంటాయి .ముందు భాగం లో ముఖమంటపం కళ్యాణ … Continue reading

Posted in దేవాలయం | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-21

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-21   మద్రాస్ లో సుభాష్ చంద్ర బోస్ రామచంద్రగారు మద్రాస్ లో గన్నవరపుసుబ్బరామయ్య ‘’రంగనాథ రామాయణం ‘’పరిష్కరణలో తోడుగా ఉన్నారు ..ఎగ్మూర్ లో గదిలో ఉంటున్నారు .అక్కడ హరి హర విలాస్ లో భోంచేసి పదిన్నరకు చి౦తాద్రిపేట శ్రీనివాస పెరుమాళ్ వీధిలో ఉన్న సుబ్బరామయ్యగారింటికి చేరేవారు .సాయంత్రం అయిదున్నారదాకా డ్యూటీ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అశ్వత్ధామ వంటిదివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి-2

 స్వామి సూచింఛి పరిష్కరించిన సమస్యలు శ్రీ వాసు దేవానంద స్వామి చిఖలాడ దీక్షలో ఉండగా ,ఒకాయనవచ్చి తాను  ఏది తిన్నా  జీర్ణించుకోలేకపోతున్నానని ,దానితో నీరసం ఎక్కువైందని విన్నవించాడు .స్వామీజీ ఆయన ఇంటి కులదేవత పట్ల శ్రద్ధ చూపక  ,పూజ  మానేయటమే  దీనికి కారణం అని చెప్పి ,కులదేవతను పూజ చేస్తూ తానూ ఉపదేశించే దత్తమంత్రం,దేవీ మంత్రం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం     203-అమెరికాదేశ సాహిత్యం -16

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -16 20వ శతాబ్ది సాహిత్యం -8 01914నుంచి 1945వరకు సాహిత్య విమర్శ -2 నైతిక –సౌ౦దర్యా రాధక విమర్శకులు విల్సన్ ,బర్క్  లు కౌలీ లాగా మోర్టాన్ డిజేబెల్ ,న్యూటన్ అర్విన్ ,ఎఫ్ ఓమత్తీసన్ లు నైతిక సౌన్దర్యవాదుల ,సాంఘిక విమర్శకుల మధ్య సమతుల్యం సాధించే ప్రయత్నం చేశారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అశ్వత్ధామ వంటి దివ్య పురుషులను దర్శించిన శ్రీ వాసు దేవానంద సరస్వతి

పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ వాసు దేవానంద సరస్వతి 1854శ్రావణ కృష్ణ పంచమినాడు మహారాష్ట్ర,సామంతవాడి దగ్గర మాన్గోన్ గ్రామం లో జన్మించారు .వీరిని తెమ్బేస్వామి అని అంటారు .దత్తాత్రేయస్వామి అవతారంగా భావిస్తారు . చిన్నతనం లో వాసుదేవ అని పిలువబడేవారు విధివిధానంగా అన్నీ చేసేవారు .రెండుపూటలా సంధ్యావందనం ,వెయ్యి సార్లు గాయత్రీ జపం,గురు చరిత్ర పఠనం నిత్యకృత్యం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ వేంకటేశ్వరదేవాలయం –చిత్రాడ

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం లో చిత్రాడ గ్రామ౦ ఉన్నది అక్కడ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ప్రసిద్ధమైనది .ఈ చిత్రాడ వెంకటేశ్వర స్వామిపై సంస్కృతం లో ‘’చిత్రాడ వెంకటేశ్వర శతకం ‘’రాశారు శ్రీ అనంతా చార్యులు .కృష్ణాచార్య గురువు వలన వేదం వేదాంగాలు శాస్త్రాలు కావ్యాలంకారాలు,శ్రౌత స్మార్త కర్మల నిర్వహణ నేర్పు పొంది ,వైఖానస … Continue reading

Posted in దేవాలయం | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం    203-అమెరికాదేశ సాహిత్యం -15

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -15 20వ శతాబ్ది సాహిత్యం -7 01914నుంచి 1945వరకు సాహిత్య విమర్శ 20వ శతాబ్ద౦ను ఒకసారి వెనక్కి తిరిగి చూసిన కొందరు చరిత్రకారులు దానిపై సద్విమర్శ రాస్తే బాగుంటుందని భావించారు .అంతకు ముందు నామమాత్రపు విమర్శ ఉన్నా ,సాహిత్య  విమర్శ రూపుదాల్చలేదు  .నూతనభావాలు అర్ధం చేసుకోవటానికి తప్పనిసరిగా అవసరం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం                203-అమెరికాదేశ సాహిత్యం -14

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -14 20వ శతాబ్ది సాహిత్యం -6 01914నుంచి 1945వరకు లిరిక్ ఫిక్షనలిస్ట్ లు ఆధునికత తో వర్ధిల్లిన ఫిక్షన్ లో మరో తమాషా జరిగి కవిత్వం నేచురలిస్టిక్ నుంచి అసలైన కవిత్వం లోకి దారి మళ్ళింది .వివరాలు ఎంచుకొని ,సింబాలిక్ ఎలిమెంట్ జోడించి ,ఆలోచన ,పాత్రల భావోద్రేకాలతో లయాత్మక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

వీరి రుండ పెరుమాళ్దేవాలయం –తొండమన్నాడు

వీరి రుండ పెరుమాళ్దేవాలయం –తొండమన్నాడు ఆంధ్రప్రదేశ్ కాళహస్తి దగ్గర తొండమన్నాడ గ్రామం లో చిన్న చోళ  వీరిరుండపెరుమాళ్ దేవాలయం ఉన్నది .ఇక్కడి శాసనాలలో ఒక దానిలో చోళరాజు రాజరాజ దేవుడు తన 5వ ఏట పరిపాలనాకాలం లో వేయించిన శాసనం ప్రకారం ఈ గ్రామాన్ని తిరు మేర్కోయిల్ స్వామికి చెట్టి దేవయాదవ రాయ సమర్పించాడు .చోళరాజు … Continue reading

Posted in దేవాలయం | Tagged | Leave a comment

మా బామ్మర్ది ‘’మా౦డూక్యోపనిషత్ ‘’

మా బామ్మర్ది ‘’మా౦డూక్యోపనిషత్ ‘’ పది రోజుల క్రితం మా బామ్మర్ది  బ్రాహ్మి ఆదరాబాదరా పరిగెత్తుకొచ్చి ‘’బావా !మా  ఊళ్ళో ఎక్కడా వర్షాలు పడటం లేదు .పొలాలుదున్ని పంటలు వేసేసమయం మించిపోతోంది  మా రైతులు ఫోన్లమీద ఫోన్లు చేసి గోల చేస్తున్నారు .ఏదైనా ఉపాయం చెప్పుబావా ?అని గోల చేశాడు . ‘’ఒరేయ్ మీది పల్లెటూరు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -13

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -13 20వ శతాబ్ది సాహిత్యం -5 01914నుంచి 1945వరకు సామాజిక విమర్శకులు-2 హెమింగ్వే ,ఫాక్నర్ ,స్టెయిన్ బెక్ నిరాశనుంచి దూరమై రాసిన ముగ్గురు రచయితలలో ఎర్నెస్ట్ హెమింగ్వే ,విలియం ఫాక్నర్ ,జాన్ స్టెయిన్ బెక్ ఉన్నారు .హెమింగ్వే మొదటి కథలు తర్వాత రాసిన నవలలు  ‘’ది సన్ ఆల్సో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పరాశర మహర్షి ప్రతిష్టించిన శ్రీ పరాశరేశ్వర దేవాలయం –జోగిమల్లవరం

పరాశర మహర్షి ప్రతిష్టించిన శ్రీ పరాశరేశ్వర దేవాలయం –జోగిమల్లవరం చిత్తూరు జిల్లా తిరుచానూర్ కు రెండుకిలో మీటర్ల దూరం లో జోగిమల్లవరం అనే చిన్న గ్రామం ఉన్నది .ఇదిఒకప్పుడు తిరుచనూరు లో భాగమే .దీనికి తిరుచుకానూర్ అనీ ,తిరు చోగినూర్ ,శుకగ్రామం అనే పేర్లు కూడా ఉండేవి .శుకమహర్షి పేరు మీద ఏర్పడిన గ్రామం అని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -12

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -12 20వ శతాబ్ది సాహిత్యం -4 01914నుంచి 1945వరకు సామాజిక విమర్శకులు స్కాట్ ఫిట్జరాల్డ్ 1920లో రాసిన ‘’దిస్ సైడాఫ్ పారడైజ్ ‘’లో మొదటిప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో  అనేకులలో పెరిగిన నిరాశా నిస్పృహ ,నైతిక పతనం వర్ణించాడు .1925లో రాసిన ‘’ది గ్రేట్ గాస్బి’’నవలలో అమెరికా ప్రజలకిచ్చిన … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

రు౦గోళేశ్వర దేవాలయం –లద్దిగం

రు౦గోళేశ్వర దేవాలయం –లద్దిగం చిత్తూరు జిల్లా పుంగనూరు కు నాలుగు కిలో మీటర్ల దూరం లో లద్దిగం గ్రామం లో ఒకే ఒక ప్రాకారం తో ఒకే ఒక ముఖ్యమైన ద్వారం ,చిన్న గోపురం తో ఇరుంగోళేశ్వర స్వామి దేవాలయం ఉన్నది .గర్భాగుడి లో  లింగం ,దానికినైరుతిలో ఒకటి ,  ఆగ్నేయంలో మరొకటి  మంటపాలున్నాయి .తూర్పుముఖ … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం203-అమెరికాదేశసాహిత్యం శతాబ్ది సాహిత్యం -3

0వ శతాబ్ది సాహిత్యం -3 01914నుంచి 1945వరకు    కొత్త కవిత్వం  -2 ఎజ్రా పౌండ్ రెండవ ప్రపంచయుద్ధం తర్వాత వాషింగ్టన్ డి.సి.లో సెయింట్ ఎలిజబెత్ హాస్పిటల్ లో బందీ గా ఉన్న కాలం తప్ప ,1908తర్వాత స్వదేశం అమెరికాలోకాక ఇతర దేశాల్లోనే ఉన్నాడు .20వ శతాబ్దం ఇంగ్లీష్ రచనపై పౌండ్ ప్రభావం అత్యధికం కవిత్వం లోనేకాక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అల్లాడు పల్లివీరభద్రస్వామి దేవాలయం

అల్లాడు పల్లివీరభద్రస్వామి దేవాలయం శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మే౦ద్ర  స్వయం గా శిల్పించి ప్రతిష్టించిన దేవాలయం ఇది .కడపజిల్లా చాపాడు మండలం అల్లాడు పల్లి లో ఉన్నది .మైదుకూరుకి 6,ప్రొద్దుటూరుకు 14కిలోమీటర్లదూరం .కుందూ నదీ తీరాన ఉన్న దేవాలయం .ఆ నదికి తరచూ వరదలు వచ్చి ప్రజలు కష్టాలలో అల్లలాడు తుంటే గ్రామానికి ‘’అల్లాడు … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-20

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-20   దయామయుడు డాక్టర్ దాసూరావు డాక్టర్ దాసూరావు 1906 మే 6న పుట్టి ,ఎల్,ఎం.పి.పట్టా పొంది ,కమలాపురం వచ్చారు .అమృతహస్తం ఉన్న వైద్యులుగా కీర్తి పొందారు .82ఏళ్ళ సార్ధక జీవితం గడిపి ఎందరికో ఆయువుపోసి ,పురుళ్ళు  పోసి ,1996మే 23న దివంగతులయ్యారు .ఆయన భార్య రమణమ్మగారు 1996మే 23 చనిపోయారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -10

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -10 20వ శతాబ్ది సాహిత్యం -2 01914నుంచి 1945వరకు    కొత్త కవిత్వం 19వ శతాబ్దపు సుస్థిర పద్దతినుంచి కవిత్వం ప్రయోగాత్మక కవిత్వానికి నడిచింది .న్యు ఇంగ్లాండ్ కవులు ఇద్దరు ఎడ్వర్డ్ ఆర్లి౦గ్టన్ రాబిన్సన్ ,రాబర్ట్ ఫ్రాస్ట్ లు ప్రయోగాత్మక కవిత్వం జోలికిపోకుండా విమర్శకుల మన్ననలు పొందటమేకాక,మంచి ప్రాముఖ్యమూ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -9

ప్రపంచ దేశాల సారస్వతం 203-అమెరికాదేశ సాహిత్యం -9 20 వ శతాబ్ది సాహిత్యం -1 1914నుంచి 1945వరకు మొదటి ప్రపంచ యుద్ధం కాలం లోనూ ఆ తర్వాత నాటకం ,కవిత్వం ,ఫిక్షన్, విమర్శ రంగాలలో ముఖ్య ఉద్యమాలు వచ్చాయి .యుద్ధం అన్నిటిపై గాఢంగాముద్ర వేసింది సాహిత్యరూపాలు అసాధారణంగా మార్పు చెందాయి .రాడికల్ భావాలు ,టెక్నిక్ లు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-19

’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-19  సింహపురి అనే నెల్లూరు విశేషాలు -2(చివరి భాగం ) నెల్లూరులో వదాన్యుడు తిక్కవరపు రామిరెడ్డి కుమారుడు పఠాభి అనే పట్టాభి రామి రెడ్డి 1932కే గొప్పకవిగా ప్రసిద్ధుడు .అతని ‘’ఫిడేలు రాగాల డజన్ ‘’ఆంధ్రదేశం లో ఒక ఊపు ఊపింది .నేలనూతుల పార్వతీ కృష్ణమూర్తి తెలుగు హిందీలలో మహా విద్వాంసురాలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-18

డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా-18  సింహపురి అనే నెల్లూరు విశేషాలు -1 ‘’శ్రీమత్సి౦హపురీ పరాక్రమ కలావైదగ్ధ్యపూర్ణోదరీ –గీర్వాణా౦ధ్రరసజ్న పండిత కవి బ్రహ్మాది భాగేశ్వరీ –చండోన్మత్త గజాన్ యథా స్వబలతఃసింహో తిశేతేతథా-యా సర్వాంద్ర మహాపురీః స్వగుణతో జేజీయతాం సాస్వహం ‘’అని శ్రీమాన్ కాశీ కృష్ణాచార్యులు నెల్లూరు  పై  చెప్పిన శ్లోకం . భావం – నెల్లూరు అనే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment