కేనోపనిషత్ విశేషాలు -5 తృతీయ ఖండం
మొదటి మంత్రం-‘’ఓం బ్రహ్మ హ దేవేభ్యో విజిగ్యే-తస్య హ బ్రాహ్మణోవిజయే దేవా ఆమహీయంత,త ఐక్ష్యం తాస్మాక మే వాయం విజయోస్మాక మే వాయం మహి మేతి’’
భావం –సర్వ జగాలకు శాసకు డైనపరమేశ్వరుని అనుగ్రహం వలన దేవాసుర యుద్ధం లో దేవతలు జయించారు .కాని తమ విజయానికి కారకుడైన మహేశ్వరుడిని మరచిపోయి ,ఆ విజయమంతా తమ శక్తి సామర్ధ్యాల వలననే ,సామర్ధ్యం తోనే సాధించామని విర్రవీగారు .
రెండవ మంత్రం –‘’త ద్ధైషాం విజ ఞౌ తేభ్యో హ ఞౌప్రాతర్బభూవ –తన్న వ్య జానంత కి మిదం యక్ష మితి ‘’
తేగ్ని మబ్రువన్ జాత వేద! ఏత ద్విజా నీహి కి మేత ద్యక్ష మితి’’
భావం-సర్వాంతర్యామి సర్వజ్ఞుడు అయిన పరమేశ్వరుడు వాళ్ళ గర్వాన్ని గమనించి ,యక్ష రూపం లో దేవతల ఎదుట సాక్షాత్కరించాడు .గర్వోన్మత్త మనస్కులైన దేవతలు ఆవచ్చిన ఆయన ఎవరో తెలుసుకో లేకపోయారు .
మూడవ మంత్రం –‘’తేగ్ని మబ్రువన్ జాత వేద! ఏత ద్విజా నీహి కి మేత ద్యక్ష మితి’’
భావం –దేవతలు తర్వాత అగ్ని తో ‘’ఆ వచ్చిన యక్షుని వివరాలేమిటో తెలుసుకొని రా ‘’అని పంపారు .
నాలుగవ మంత్రం –‘’త థేతి త దభ్రద్రవ త్త మభ్యవద త్కో సీతి-అగ్నిర్వా అహ మస్మి త్యబ్రవీజ్జాత వేదా వా హ మస్మీతి’’
భావం –అగ్ని సరే అని చెప్పి యక్షుడి దగ్గరకు వచ్చాడు .యక్షుడు అగ్నిని ‘’నువ్వు ఎవరు ?’’అని అడిగాడు. అగ్ని ‘’నేను అగ్నిని .సర్వ వ్యాపకుడిని .వేదోత్పత్తి స్థానాన్ని’’అని బదులిచ్చాడు
ఐదవ మంత్రం –‘’తస్మిం స్త్వయి కిం వీర్య మిత్య షీదగ్౦-సర్వం దహేయం య దదిదం పృథివ్యా మితి’’
భావం –యక్షుడు ‘’నీ సామర్ధ్యం ఏమిటి ?’’అని అడుగగా ‘’ప్రపంచం లో సర్వాన్నీ దహిస్తాను ‘’అన్నాడు అగ్ని .
ఆరవ మంత్రం –‘’తస్మై తృణం నిదధావేత ద్దహేతి త-దుపప్రేయాయ సర్వ జవేన త న్నశశాక –దగ్ధుం స తత ఏవ వివ వృతే నైత –దశకం విజ్ఞాతుం య దేత ద్యక్ష మితి’’
భావం –యక్షుడు అగ్ని ముందు ఒక గడ్డిపరక పడేసి దాన్నికాల్చ మన్నాడు .తన సర్వ శక్తులు ఉపయోగించి దాన్ని దహనం చేయటానికి ప్రయత్నించి విఫలుడై ,దేవతల దగ్గరకు వెళ్లి ఆ యక్షుడు ఎవరో తెలుసుకోలేక పోయానని చెప్పాడు .
ఏడవ మంత్రం –‘’అధ వాయు మబ్రువన్ వయా వేత –ద్విజానీహి కిమేత ద్యక్షమితి’’
భావం –దేవతలు వాయువుతో ‘’ఆ యక్షుని విషయమేమిటో తెలుసుకొని వచ్చి చెప్పు ‘’అని పంపారు .
ఎనిమిదవ మంత్రం –‘’తథేతి త దభ్యద్రవ త్త మభ్యవద త్కో సీతి వాయుర్వా అహమస్మీత్యబ్రవీ న్మాతరిశ్వా వా అహ మస్మీతి ‘’
భావం –వాయువు సరే అని వేగంగా యక్షుని చేరగా ‘’నువ్వు ఎవరు ‘’?అని అడిగితే ‘’నేను వాయువు .ఆకాశం లో వృద్ధిపొందే మాత రిశ్వుడను ‘’అన్నాడు
తొమ్మిదవ మంత్రం –‘’తస్మిం స్త్వయి కిం వీర్య మిత్య పీదగ్౦ సర్వ మాదదీయం య దిదం పృథివ్యామితి’’
భావం –‘’నీ సత్తా ఏమిటి ?”’అని అడిగిన యక్షుని ప్రశ్నకు వాయువు ‘’భూమి మీద ఉన్న అన్ని పదార్ధాలను గ్రహించ గలను ‘’అన్నాడు .
పదవ మంత్రం –‘’తస్మై తృణం నిదధా వేత దాదత్స్వేతి-త దుప ప్రేయా య సర్వ జవేన త న్న శశా
కాదాతుం స తత ఏవ నివ వృతేనైత –దశకం విజ్ఞాతుం య దేత ద్యక్ష మితి’’
భావం –వాయువు ముందు ఒక గడ్డిపరక పడేసి ‘’దీన్ని గ్రహించు ‘’అన్నాడు వాయువుతో .శక్తులన్నీ ఉపయోగించినా వాయువు దాన్ని గ్రహించలేక పోయాడు .దేవతలను చేరి తానూ యక్షుని విషయం లో ఆశక్తుడను అయ్యానని చెప్పుకొన్నాడు .
పదకొండవ మంత్రం –‘’అ ధే౦ద్ర మబ్రువన్ మఘవన్నేత ద్విజానీహి కి మేతద్యక్ష మితి తథేతి దభ్యద్రవ త్తస్మాత్తిరోదధే’’
భావం –దేవతలు ఇంద్రునితో ‘’నువ్వే వెళ్లి ఆ యక్ష వివరం కనుక్కొని రా ‘’అని చెప్పి ప౦పారు ..అలాగే అని ఇంద్రుడు వెళ్ళగా యక్షుడు కనపడకుండా అంతర్ధానమయ్యాడు .
పన్నెండవ మంత్రం –‘’స తస్మి న్నాకాశే స్త్రియ మా జగామ బహు శోభామానా ముమాం హైమవతీం తాగ్౦ హో వాచ కి మేతద్యక్షమితి’’
భావం –ఇంద్రుడు ఆకాశం లో బ్రహ్మ విద్యా రూపిణి అయిన ఉమాహైమవతీ స్వరూపమైన పార్వతీదేవిని చూసి ‘’ఆ యక్షుడు ఎవరు తల్లీ ‘’అని అడిగాడు .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -22-10-20-ఉయ్యూరు