స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -3
1-స్వతంత్ర రాజ్యాలతో అఖండ భారత్ ఉండాలి .2-కేంద్ర ప్రభుత్వమే దేశ రక్షణ విదేశీ వ్యవహారాలూ ,నాణాలముద్రణ వగైరాది అధికారాలు కలిగి ఉండాలి 3-హిందువులు అధికసంఖ్యాకులుగా ఉన్న రాష్ట్రాల్లో ముస్లిం లకు సంపూర్ణ మత స్వేచ్చ ,అందరితో సమానావకాశాలు ,గౌరవ రాజకీయ ప్రతి పత్తితో రాజ్యపద్దతి ఉండాలని ,పాకిస్తాన్ ఏర్పాటు తమకిస్టం లేదని,ఐకమత్యమే బలమని ,ఐకమత్యంలేకపోతే మరో ‘’బాల్కని రాజ్య ‘’అవుతుందని హెచ్చరించారు .కనుక భూలాభాయ్ ,ఆలీఖాన్ కలిసి కల్సి ఉండే ప్రణాళిక తయారు చేసి వైశ్రాయికి అందజేశారు .ఇందులో ముఖ్యసూత్రాలు -1-కేంద్రంలో తాత్కాలికంగా హిందూ ముస్లిం ల ప్రభుత్వం ఏర్పరచి ,అల్పసంఖ్యాకులకు తిన ప్రాతినిధ్యమివ్వటం .2.ఈప్రభుత్వం ఇండియాచట్టానికి లోబడి పని చేయటం .తర్వాత ,కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను విడుదల చేయటం మెజార్టీ సభ్యుల నిర్ణయాన్ని బట్టి వైస్రాయి నడుచుకోవటం .1945జూన్ 10న పంచగనిలో విశ్రాంతిలో ఉన్న గాంధీజీ ని ఈ ఇద్దరు కలిసి ప్రణాళికకు ఆయన ఆశీస్సులు పొందారు.
వైస్రాయి వేవెల్ లండన్ వెళ్లి ,అక్కడి బ్రిటిష్ మంత్రులతో సంప్రదించి ,తిరిగివచ్చి ,1945జూన్ 15వర్కింగ్ కమిటీ సభ్యులను విడుదల చేశాడు .ప్రణాళికపై చర్చించటానికి సిమ్లాలో కాంగ్రెస్ ముస్లిం లీగ్ మొదలైనపార్టీ ల సభ జరిగింది .అన్నిపార్టీల వారూ వేవెల్ నే నాయకుడుగా అంగీకరించారు .వేవెల్ జూన్ 29నుంచి జులై 14వరకు సమావేశం సాగించి సాగించి చివరికి సంప్రదింపులు భగ్నమయ్యాయనే ఆశ్చర్యవార్త ఆశగా ఎదురు చూస్తున్న వారికి తెలియ జేసి వైఫల్యానికి కారణం తానే అంటూ వేవెల్ ప్రకటించాడు .సిమ్లా సభ విఫలమయ్యాకు భూలాభాయ్ ని జాతీయ వాదులు నిందించారు.వర్కింగ్ కమిటీ సభ్యులంతా జైల్లో ఉంటె స్వతంత్రించి ప్రతిపక్షాలతో ఒడంబడిక చేసుకోవటం ఏమిటని దూషించారు .దేశాయ్ పై చేసిన ఆరోపణలను ఖండిస్తూ కాంగ్రెస్ కార్య దర్శి శ్రీప్రకాశ’’నిర్బంధంలో ఉన్న కమిటీ సభ్యులను విడుదల చేయించటానికే భూలాభాయ్ చొరవ తీసుకొన్నాడు .ఆయన చేసింది నూటికి నూరుపాళ్ళు చట్టబద్ధమే .కమిటీ సభ్యులను విడుదల చేయటానికి వైస్రాయి విముఖత చూపటం వలననే ఈ ఆలోచన చేశాడు భాయ్ లేకపోతె మనవాళ్ళ విడుదలకు ఆశలే ఉండేవికావు .విడుదలైనవారికి జరుగుతున్న స్వాగతాలు ,వాక్ స్వాతంత్రం ,వ్రాసే స్వాతంత్రం వచ్చాయి ఇప్పుడు ఇవన్నీ ఆజంట సాధించిన విజయాలే .సిమ్లాసభ వైఫల్యానికి వైస్రాయేకారణం .జిన్నా వైఖరి మంకుపట్టుకూడా కలిశాయి .జిన్నా ముసల్మానులకు లు ద్రోహం చేశాడు,అతనిలో ముస్లిం అంశ,సంస్కృతీ లేవు ఇన్నాళ్ళూ బూకరిస్తున్న జిన్నాను వైస్రాయి నొక్కాల్సిన చోట నొక్కాడు .’’అని డాక్టర్ సయ్యద్ యార్జంగ్ ఒక ప్రకటన చేశాడు .కనుక భూలాభాయ్ తప్పేమీలేదు .అతడు ప్రశంస నీయుడే ‘’అని ప్రకటించాడుశ్రీప్రకాశ.
స్వాతంత్రం కోసం కృషి చేసే యువకులను చూస్తే భూలాభాయ్ కి ఎంతో సరదా .కాంగ్రెస్ వాళ్ళు జైళ్లలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ లు ఉద్యమ చేయటం చూసి వారిపై సానుభూతికలిగింది భాయ్ కి .సామ్రాజ్యవాదుల మధ్య జరిగిన యుద్ధం ప్రజాయుద్ధమన్నారని ఆగస్ట్ విప్లవాన్ని వెన్నుపోటు పొడిచారని కమ్మీలపై ప్రజలకు కోపం .గాంధీ విడుదలయ్యాక ,కమ్యూనిస్ట్ కార్యదర్శి పిసి జోషి ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు .గాంధీ వారికి అయిదు ప్రశ్నలు వేశాడు –ప్రజాయుద్ధం అన్న మాటలో ప్రజ అంటే ఎవరు 2-మీ పార్టీ ఆడిట్ కు ఎవరైనా ఒప్పుకుంటారా?3-రెండేళ్లుగా కార్మికులతో సమ్మె చేయించి వారి నాయకుల అరెస్ట్ కు మీరుతోడ్డారని అంటారు నిజమేనా ?4-కాంగ్రెస్ లో చొరబడటం ఒక విధంగా మీ కుటిల నీతి కాదా 5-మీపార్టీ పై ఇతర దేశాల పెత్తనం ఉందికదా ?
తనపై ఆరోపణలను భూలాభాయి సరోజినీ నాయుడు ,రాజాజీ వంటి వారి తో కమిటీ వేసి విచారించమని జోషి గాంధీని కోరాడు .తాను చెప్పాల్సిందంతా గాంధీకి చెప్పానని రాజాజీ అన్నాడు .అనారోగ్యం వలన భాయ్ వెంటనే చెప్పలేకపోయినా తర్వాత పరిశీలించి గాంధీకి తన అభిప్రాయం తెలిపాడు .రెండుపార్టీలుభాయ్ ని మధ్యవర్తి గా ఉండ మనటం మాయన నిష్పక్షపాతానికి నిదర్శనం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-10-20-ఉయ్యూరు