గత శతాబ్ది మేటి ఇండాలజిస్ట్ –ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ (1907-2003)
7-7-1907న నెదర్ లాండ్స్ లోని ది హేగ్ లో జన్మించి 96ఏళ్ళ నిండు జీవితాన్ని గడి,14-12-2003 న జీస్ట్ లో మరణించిన ఫ్రాన్సిస్కస్ బెర్నార్డస్ కూపర్ ఇండాలజీ లో విశిష్ట స్థానం ఉన్నవాడు. గత శతాబ్దపు మేటి ఇండాలజిస్ట్ గా ప్రసిద్ధి చెందినవాడు .సంస్కృతం,లాటిన్ ,గ్రీక్ ,ఇండో యూరోపియన్ లింగ్విస్టిక్స్ లను లైదేన్ యూని వర్సిటి లో అధ్యయనం చేసి ,1934లో సంస్కృత ,ఇతర యూరోపియన్ భాషలలో నాసికా ఉచ్చారణ (నాసల్ ) పత్ర సమర్పణ చేసి ,డాక్టరేట్ సాధించాడు . ఇండొనీషియాలోని జకార్తా లోఉన్న లైసియం ఆఫ్ బటేవియా లో గ్రీక్ ,లాటిన్ బోధించే ఉపాధ్యాయుడిగా అయిదేళ్ళు ఉద్యోగించాడు .1939లో లైదేన్ యూని వర్సిటి లో సంస్కృత ప్రొఫెసర్ అయ్యాడు .
ఇండో –ఇరానియన్ ,ఇండో –ఆర్యన్ ఫైలాజి ,లింగ్విస్టిక్స్ ,మైథాలజి ,దియేటర్ ఆర్ట్ ,ఇండో –యూరోపియన్ ,ద్రవిడియన్ ,ముండా,పాన్ ఇండియన్ లింగ్విస్టిక్స్ లలోని అన్ని శాఖలోనూ జ్ఞాన నిధి .
రాయల్ నెదర్లాండ్స్ అకాడెమి అండ్ ఆర్ట్స్ మెంబర్ గా 1937నుంచి 39వరకు పని చేసి రాజీనామా చేశాడు .ఆర్డర్ ఆఫ్ దినెదర్లాండ్స్ లయన్ కు Knight అయ్యాడు .
కూపర్ రచనలన్నీ ‘’ఇండియన్ లింగ్విస్టిక్స్ అండ్ ఫైలాలజి ‘’గా ముద్రణ పొందాయి .ఇండియన్ మైదాలజి పై రాసినవన్నీ అతని స్నేహితుడు జె.ఇర్విన్ ‘’ఇండియన్ కాస్మాలజి ‘’గా రెండు దశాబ్దాలక్రితం ప్రచురించాడు .1968వరకు కూపర్ బిబ్లియాగ్రఫీ అంతా ఫెస్టాక్రిఫ్ట్ అంటే ‘’ప్రతి దానం’’ గా లభిస్తుంది .తరువాత విషయాలు అనేక చోట్ల నుంచి సంగ్రహించారు .
సంస్కృతం లో కూపర్ అధ్యయనం మొదట వేదం నామవాచకాలతో1942లో ప్రారంభమైంది .యుద్ధం తర్వాత 1947లో ట్రేసేస్ ఆఫ్ లేరేన్జీల్స్(నాసికా ధ్వనులు ) ఇన్ వేదిక్ సాంస్క్రిట్ ‘’ పై అధ్యయనం చేశాడు .ఫైనల్ వొవెల్స్ ఇన్ ఋగ్వేద పై 1955లో పరిశోధించాడు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -28-4-21-ఉయ్యూరు

