దుంప రాష్ట్రం
అదొక దుంప రాష్ట్రం .కరోనా కోరల్లో నలిగి గిలగిలలాడుతోంది .నాయకుడు ప్రతిపక్షాల ఇళ్ళపై జులుం చేయిస్తున్నాడు .పోలీస్ పెద్దాయన ఎస్ బాసిజం తో లాక్కొస్తున్నాడు .ఇసి అడుగులకు మడుగు లోత్తుతూ కప్పదాటు యవారంలో ఉంది .సినీ ప్రముఖులు అధినాయకుని కి భుజకీర్తులమరుస్తూ ,ప్రక్కరాస్ట్రం విలన్ దాన శూర వీర కర్నుడుగా వెలిగిపోతుంటే ,షూటింగ్ లలో విదేశీ పర్యటనలలో తేలిమునిగిపోతున్నారు .జేబులోంచి పైసా కూడా విడల్చటం లేదు .నెలకు కోట్లాది రూప్యములు పొందుతున్న రెండో౦దలకు పైన ఉన్న సలహాదారులు పని లేక బట్టతల బాదు కొంటున్నారు.ప్రజాప్రతినిధులు ,మంత్రులు ఇసుక భూ, గనుల మట్టి ,దేవాలయం కబ్జా మాయాజాలం ప్రదర్శిస్తూ నాయకునికి నమ్మిన బంటుల్లా వీరనటన ప్రదర్శిస్తున్నారు .కల్లు సారాయి దుకాణాలు ఉదయం అయిదింటికే పోలీసు చేత తెరిపించి అమ్మకాల జోరుతో ఊగిపోతున్నారు .తాగితాగి జనం పరవశులైతందానా ఆట ఆడుతూ మురిపిస్తున్నారు . .అర్చకులు దైవ సేవ కంటే నాయక సేవలో బిరుదప్రదానం లో యధాశక్తి పూజిస్తున్నారు అధి దేవుళ్ళను .బూతులమంత్రులు రెండేళ్లుగా తిట్టినా బూతు తిట్టకుండా ఉన్నవన్నీ వాడేసి ,కొత్తపుస్తకాల కొనుబడిలో బిజీబిజీ .
పాపం నర్సులు డాక్టర్లు క్షణం తీరిక లేక రోగుల సేవలో మదర్ తెరీసాలుగా ఫ్లారెన్స్ నైటిం గేల్స్,లాగా ,మా ఉయ్యూరు సిబిం యం టింపిణి దొరసానిలా ,డా సుశీలమ్మలా అలుపు లేని లేని సేవలందిస్తూ ,ప్రాణాలు కోల్పోతున్నారు. .హాస్పిటల్స్ లో వాక్సిన్లు ,ఆక్సిజన ,టెస్ట్ లకోరత .బెడ్లకు నిమిషానికో రేటు ,శ్మశానాలలో దందా.మార్చురీలలో దగా ,మోసం అంతా డబ్బు మీదే నడుస్తోంది .ఆరోగ్యశ్రీ అదో అందీ అందని దౌర్భాగ్యశ్రీ అయింది లేనివాడికి ..ఉన్నవాడికి ఆస్పత్రిలో చేరి బతికి బయటికొచ్చినా, చనిపోయినా లక్షల మూల్యం చెల్లించుకోవాల్సిందే కనికరం కంటే కారం ఎక్కువైంది .పుండుమీద కారం రాసినట్లు గాస్ ,పెట్రోల్ ధర శరాఘాతం .
మరిప్పుడు ఏం చేయాలో అని అంతా జుట్టు పీక్కుంటున్నారు .ఏ వాక్సిన్ మంచిది అనే రభస .అందుకని కులానికో రకమైన వాక్సిన్ తయారు చేయిస్తే భేష్ అని డబ్బుచ్చుకొని సలహాలు పారేసే మగదీరులన్నారు .వీలయితే ఆడకో రకం ,మగకో రకం ,ముసలీ ముతక కో రకం తయారు చేయిస్తే శుభం కార్డు పడుతుందని తీర్మానించారు మమ్మేలినవారు .శుభం భూయాత్ .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-5-21-ఉయ్యూరు
—

