కొత్త శకం –కొత్త కొలమానం -2
జాగృత పరచే మేధస్సు –
మానవ మాత్రులమైన నువ్వుకానీ నేనుకానీ,మనతరవాత వచ్చే తరం వాళ్ళు కానీ ఒక విశిష్ట మేధస్సును గ్రహించగలమా అవగాహన చేసుకోగలమా ? గ్రహించటం అంటే ముందుగా ఒకకోత్తదారిని చేరుకోగలమా ?తర్వాత దాన్ని ప్రజలందరికోసం ఉపయోగం లోకి తేగలమా ?ఇది శాంతిఅనే భావనకు చాలా దూరం అని పిస్తుంది .బహుశా యుద్ధం కంటే శాంతి మేధస్సుకు మరో గొప్ప చెందిన పరిస్థితి అనుకొంటే ,అదే శారీరక మానసిక౦గా,పర్యావరణ రీత్యా రోగాలపాలైన మనకు సరైన మందు అని తప్పక నమ్మకం కలిగిస్తుంది .
రాజకీయ తప్పుల తడక కార్యాలతో శాంతి సాధించలేము .దీనికి ఎందరెందరో మేధావులు అధర్మ యుద్ధాలకు వైముఖ్యం చూపిన ప్రేరణాత్మకమైన ,గౌరవప్రదమైన ఉదాహరణలున్నాయి .ఉదాహరణకు నా జనరేషన్ లోనే అమెరికా చేసిన వియత్నాం యుద్ధం పై అంతర్జాతీయ వ్యతిరేకత ఉవ్వెత్తున ఎగసి ఆ భయానక ఘర్షణ ను నివారించ గలిగింది .కానీ ప్రస్తుతం అంతరిక ,అంతర్జాతీయ సంఘర్షణలు అంటే పర్యావరణ ,ఆర్ధిక సంఘర్షణలను ప్రజా ప్రదర్శనలతో లేక రాజకీయ క్రియా కలాపాలతో నివారించలేము అని పిస్తోంది .
పరిష్కార మార్గాలను కనిపెడితే ,అవి సూక్ష్మ౦గా ప్రత్యక్షంగా ఉంటాయి .సంక్లిష్ట సమస్యలు సూక్ష్మ పరిష్కారం ఆశిస్తాయి .వీటికి అత్యున్నతమైన అవగాహన అవసరం .ఇవాళ ఇంటర్ లాకింగ్ గ్లోబల్ సమస్యలనుఅంటే ఒకదానితో ఒకటి కలిసిపోయి జటిలంగా మారిన వాటిని ‘’సూపర్ కాంప్లెక్స్ ‘’అంటున్నారు .కనుక సమస్యా పరిష్కారానికి అత్యంత సూక్షస్పృహ (సటిల్ కాన్షస్)కావాలి .కనుక మనం అధికమౌతున్న మిలిటరీ ఖర్చు పై ,ఏదో ఒక ప్రత్యెక దేశ౦ దాని రాకీయం లపై నిరసన ప్రదర్శన ,విమర్శలపై దృష్టి కేంద్రీకరించ కూడదు .ఇలాంటి విధానాలు ఇదివరకు మనం చాలా చేసి ఉన్నాం .అవి చెడ్డవీ ,పనికి రానివీ కాకపోయినా ,ఇప్పటి సంక్షోభ నివారణకు వీటికి భిన్నమైన ప్రత్యెక మార్గాలను అనుసరించే సమయం ఆసన్నమైంది .
తెలివి తేటలు లేక మేధస్సు పదాన్ని మనం విభిన్న రకాలుగా ఉపయోగిస్తాం .దీనికి ప్రపంచమంతా ఏకగ్రీవంగా అంగీకరించే నిర్వచనం లేదు .స్థూలంగా చెప్పాలంటే బుద్ధియొక్క ఉన్నత మైన స్థితి (హయ్యర్ ఫాకల్టి ఆఫ్ మైండ్ )ఇందులో అవగాహన ,తార్కికత ,నేర్వటం సృజన ,సమస్యా పరిష్కారం ,నమూనాలను గుర్తించట ,విధానం ,నిర్ణయాలుతీసుకోవటం ,అర్ధమయేట్లు వివరించటం ,ప్రజాబాహుళ్య౦తో సత్సంబంధాలు ఏర్పరచుకోవటం వంటివి ఉంటాయి .ఏదైనా ఒకటి విపత్తు అనిపిస్తే ,,అప్పుడుఅది అత్యవసర పరిస్థితి అని భావించి మనలోని ఇంటలిజెన్స్ ను మేల్కొల్పి,ప్రజలను జాగృతం చేసి ,అందరి మనసు బుద్ధి కేంద్రీకరించి అసాధ్యం అన్న దానినుంచి సాధ్యం గా మార్చి ,శూన్యం నుంచి పరిష్కార మార్గం రాబట్టాలి .
ఇప్పుడు ఇవాల్టి గ్లోబల్ పరిస్థితి మన మేధో శక్తి వైఫల్యమే అని గట్టిగా అర్ధమౌతోంది .మనం సాంకేతిక అభి వృద్ధి చాలా సాధించాం .అందులో చాలా మేదాశక్తి ని ఆలోచనపరంగా, క్రియా పరంగా నిక్షిప్తం చేశాం .కాని అది మానవాళికి కానీ మన భూగ్రహ సంక్షేమానికి కానీ ఆశావహ ఫలితాలనివ్వలేకపోయింది .చాలా సందర్భాలలో వ్యతిరేక ఫలితాలనిచ్చింది .ఎందుకిలా జరిగింది ?ఇది తెలియాలంటే నాలుగు ముఖ్య విషయాలను తెలుసుకోవాలి మనం .1-మానవ మెదడు పరిణామం చెందిన దాన్ని బట్టి మానవుని తెలివి తేటలు గందరగోళం లో పడిపోయాయి .2-ప్రజ్ఞ అంటే విజ్డం నుంచి ,నైతిక విలువలనుంచి మానవుని ఇంటలిజెన్స్ అంటే తెలివి తేటలు తప్పు దారిలో పడింది 3.మానవ మేధస్సును ప్రకృతికి అణకువగా మేలు చేసే విధంగా కాకుండా వినాశనం చేసే విధంగా ఉపయోగించం 4-స్థిరమైన అంచనాలలో మానవ తెలివి తేటలను బంధించేశాం.
పరిణామం –మెదడు ,చేతనలయొక్క అధ్యయనంలో తేలింది ఏమిటి అంటే పరిణామం ఇంకా శిశు దశలోనే అంటే ప్రారంభ దశలోనే ఉంది .దీనిపై చైనా గొప్ప రిసెర్చ్ చేసి కొత్త విషయాలు తెలిపింది .కాని ఆల్బర్టో విల్లోల్డో అనే యాన్త్రోపాలాజిస్ట్ ‘’మానవ మెదడు కనీసం నాలుగు క్రియాత్మక స్థాయిలనుంచి పరిణామం చెందింది .అవి 1.సరీ సృపాలు 2-క్షీరదాలు 3-నియో కార్టెక్స్ 4-ప్రి ఫ్ర౦టల్ కార్టెక్స్.సరీ సృపాలుకేవలం బతకటానికి సంరక్షి౦చు కోవటానికి ఎదురుదాడికి ,ఆహారసంపాదనకు ,దాంపత్యానికి తమ శక్తుల్ని ఉపయోగిస్తాయి .లిమ్బోనిక్ లేకమామల్స్ లేక క్షీరదాలు మనపూర్వీకులైన నియండార్తల్స్ పాలిచ్చి తమసంతానాన్ని వృద్ధిచేస్తాయి .వాటిలో సాంఘిక బాంధవ్యం ఉంటుంది .బతకటానికి కావాల్సిన అన్ని లక్షణాలు కలిగి ఉంటాయి.చిన్న చిన్న పరికరాలు చేయటం ,ఆహారం నిలువ చేయటం ,వలస వెళ్ళటం ,పోట్లాడటం ,ఆవాసాల నిర్మాణం చేయటం లో తెలివి తేటలు చూపించాయి .వీటి మెదడు 2లక్షల ఏళ్ళ క్రితపు సరీసృపాల బ్రెయిన్ కంటే వృద్ధి చెందిదన్నమాట .మానవుడు నిప్పు రాజేయటం వండటం నేర్చుకోవటానికి 50వేల సంవత్సరాలు పట్టింది .నియో కార్టెక్స్ స్థాయి కి చేరి పరికరాలు చేయటం సృజనాత్మక కళ లాంటి సంజ్ఞా విధానం ,గణితం వంటి విప్లవాత్మక మార్పులు పొందాడు .ఈ స్థాయినుంచి ప్రి ఫ్రంటల్ కార్టెక్స్ స్థాయికి రావటానికి 6వేల ఏళ్ళు పట్టింది .ఈస్థాయిలో సెటిల్ మెంట్లు ,రాతకోతలు ఖగోళ విజ్ఞానం మొదలైనవి అబ్బాయి .ఇదంతా చాలాపెద్ద టాపిక్ .కానీ జీవులుగా మనం ఇంకా పరిణామ యొక్క సంక్లిష్టత ను జీర్ణం చేసుకోలేక పోయాం .ఒక్కోసారి మనం త్రాచుల్లా విరుచుకు పడతాం .ఒక్కోసారి మనలో మనమే కోతుల గు౦పుల్లా పోట్లాడుకొంటాం .ఒక్కోసారి చాలాఉదారంగా ,సంరక్షణ చేస్తాం .సరీ సృపాల, క్షీరదాల బ్రెయిన్ చర్యలు బాధాకరం బాల్య చేష్టలఅనుభవాలకు ప్రతిబింబాలై ,ఆకలి ,యుద్ధం ను ఎదుర్కోటానికి మనలోని చేతనను తార్కిక భావంతో ము౦చేస్తాం .మనలోని తటస్థ నెట్ వర్క్ లు తీవ్రంగా దెబ్బతిని క్షీణించి పోయి ఉంటాయి .మన ప్రపంచం ప్రమాద భరితంగా భయానక పర్యావరణంగా అనిపిస్తుంది .భయ పెడుతున్నట్లు , మనల్ని తేలికగా నచ్చచేప్పి ఒప్పిస్తున్నట్లు అనిపిస్తుంది .అందుకని మన రక్షణకోసం పోరాడాలని పిస్తుంది .సుదూరమైన గతం లో మన జీవితం లో కొంత ఇరుక్కుపోయాం . అంతర్గతంగా నాడీ మండల స్థాయి లో కూడా మనం సంక్లిష్టం జీవులం .
ఆధారం –అలాన్ హంటర్ వ్యాసం –న్యు ఎరా న్యు డైమెన్షన్
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-5-21-ఉయ్యూరు

