అవధూత శ్రీ శేషాద్రి స్వామి చరిత్ర -11
శ్యామా రావు తల్లి వృద్దు .అనారోగ్యం కూడా .ఒకసారి శేషాద్రి స్వామిని ‘అమ్మ వెళ్లి పోతుందా ?అని ఆదుర్దాగా అడిగితె ‘’తిరువన్నామలై కి టికెట్ తీశావు ఇదే తిరువన్నామలై ‘’అంటే అర్ధం కాలేదనగా స్వామి మౌనం వహించారు ఆసాయంత్రమే ఆమె చనిపోయింది .ఇప్పుడు అర్ధమైందా అన్నారట స్వామి .సుందరేశయ్యారు వెలగల రుద్రాక్షమాల ధరించి స్వామిని దర్శించి నమస్కరిస్తే ,’’ఈమాలను అమ్మితే నలుగురికి అన్నం పెట్టచ్చే’’అన్నారు ‘’ఇది అంత విలువై౦ది కాదు రెండుమూడు రూపాయలకంటే ఉండదు ‘అన్నాడు .ఆతర్వాతాయన తిరుచునాపల్లి వెళ్లి నదిలో స్నానం చేస్తుంటే మాల జారిపోయింది నీటిలో .దాసీ కన్నమ్మాల్ ను ఒకసారి స్వామి ‘’దొంగరాబోతున్నాడు దొంగతనం జరుగుతుంది జాగ్రత్త ‘’అని హెచ్చరించ గా ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా రెండువందల రూపాయల నగలు పోయాయి .మంగుళూరు రఘునాధరావు రామభక్తుడు .ఒకసారి స్వామిని దర్శించటానికి వస్తే ,ఒకపెద్ద రాయి తీసుకొని వెంటపడగా ‘’ఇదేమిటి సేతు బంధనమా ,సముద్ర లంఘనమా ??’’అన్నాడు .రాయి దూరంగా పారేసి ఫోరాఫో కోతీ’’అన్నారు స్వామి .ఆ రోజునుంచి ఆయన్ను హనుమంతరావు మారుతి అనే పేర్లతో పిలిచేవారు .ఆయనకు హనుమపై భక్తిపెరిగింది .
పోస్టాఫీసు గుమాస్తా రామారావు తమ్ముడు తిరుపతిలో సంస్కృతం చదువుతున్నాడు .ఒకసారి అతడిని స్వామి దగ్గరకు తీసుకు వెడితే ,’’వీడు ఆరు నెలలలో పోతాడు ‘’అన్నారు .అలాగే చనిపోయాడుపాపం .నటేశయ్యరు ను చూసి స్వామి ‘’నీకు నామాలున్నవాడు పుడతాడు ‘’అన్నారు .కొన్ని నెలలకు నల్లటి రక్తం ప్రవహించే నాళ౦తో కొడుకుపుట్టాడు .వైదిక నిష్టాపరుడు రామశాస్త్రి రామభక్తుడు.స్వామి అతనికి ఒక కొడుకు పుడతాడని ,లలితను వదలక పారాయణ చేయి ‘’అని చెప్పారు .అలాగే స్వామి జన్మ నక్షత్రం హస్తానక్షత్రం లో కొడుకుపుట్టగా శాస్త్రి శేషాద్రి పేరుపెట్టాడు .అప్పాచేట్టి అరుణాచలేశ్వరుని రధం చేయించి ,స్వామిని ఊరేగింపులో కలుసుకోమని కోరగా ‘’స్వామి దీని ఆయుర్దాయం తక్కువే లక్ష్మీ శాపం ఉంది స్వాహా అవుతుంది ‘’అన్నారు .మూడేళ్ళ తర్వాత పిడుగుపడి ఆ రధం కాలి పోయింది .కాలే రధాన్ని చూపించి ‘’చూడు రధం ఎలాకాలిపోతోందో లక్ష్మీ శాపం ‘’అన్నారట ,మెయ్యప్ప చెట్టి అరుణాచలేశ్వర ఆలయం లో ఎలెక్ట్రిక్ దీపాలు ఏర్పాటు చేయింఛి ప్రారంభించటానికి స్వామిని కోరితే ‘’ఫోఫో చక్రం తిరగదు ‘’అన్నారు .దిగులుతో గుడికి వెడితే చక్రం తిప్పలేక పనివాళ్ళు కష్టపడుతున్నారు స్వామి దయ లేకపోతె కుదరదని గ్రహించి వెళ్లి బతిమాలి రమ్మనగా వెళ్లి చక్రాన్ని తడిమి సాష్టాంగ పడగా వెంటనే పని చేయటం ప్రారంభించింది .నారాయణ శాస్త్రిగారితో స్వామి ఒకసారి ‘’ఏకేచాస్మిన్ కులే జాతా ‘’అనే శ్లోకం చదివి ‘’నువ్వు సంతకు వెళ్ళావా ?నూరు తమ్ముళ్ళు అక్కడా నూరు ఇక్కడా నూరు.ఈ దేశం లో వంద మ౦దిజనం అ౦తా కలిపితే ఎంత ? ‘’అన్నారు ఆయనకు అర్ధం కాలేదు .నాలుగు నెలలతర్వాత శాస్త్రిసోదరుడు చని పోయాడు .నూరు తమ్ముళ్ళు అంటే ఆచనిపోయివాడు నీకు ఇష్టమైన తమ్ముడు అని భావం .సంతకు పోతావా అంటే చావుకు జనం బాగా వస్తారని .నూరు మాట చాలా సార్లు వాడటానికి అర్ధం ‘’లోకం లోని వారంతా సహోదరులే ‘’అని .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -6-7-21-ఉయ్యూరు